Saturday, 7 June 2014

Samveda - 10

ఆ మరుసటి రోజు ఉదయం వేద, కస్తూరి ఆఫీసు కి వెళ్లారు. ఆఫీసు లో  పని చూసుకొని సాయంత్రం  అక్కడనుండి అంతకుముందు రోజు బండి పెట్టిన హోటల్ కి వెళ్లి బండి తెచ్చుకొని సరాసరి కస్తూరి వాళ్ళ ఇంటికి వెళ్లారు. వాళ్ళు కస్తూరి వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి రాత్రి పది అయ్యింది. రాత్రి భోజనాలు ముగించుకొని పడుకోనేసరికి పన్నెండు అయ్యింది. శనివారం రోజు ఇద్దరు కలిసి బ్యూటీ పార్లర్ కి వెళ్లారు. మెహింది పెట్టుకొని, ఫేసుపాక్ పెట్టుకొని ఇంటికోచేసరికి సాయత్రం అయ్యింది. ఇంటికొచ్చి కొంచం సేపు కబుర్లు చెప్పి భోజనం చేసి తొందరగా పడుకున్నారు మరుసటి రోజు తొందరగా లేవాలని.

                       ఆ రోజు ఆదివారం . నిశితార్దానికి ఉదయం పదకొండు తర్వాత ముహూర్తం కుదిరింది. కస్తూరి వాళ్ళ అమ్మ నాన్న నిశ్చితార్దానికి ఫంక్షన్ హాల్ బుక్ చేసారు . అది వాళ్ళ ఇంటి నుండి ఒక గంట దూరము లో ఉంది. అందుకని ఉదయం పదిగంటలకి అందరు బయలు దేరి వెళ్లారు. కస్తూరి వాళ్ళకి ఒక కార్ ఉంది, అది కాకుండా ఇంకొక కార్ అద్దెకి తెచ్చారు నిశ్చితార్ధం పనులు చేయడానికి. కస్తూరి లో అప్పుడే పెళ్లి కాళ్ళ వచ్చేసింది . వేద తను కొన్న గాగ్రా వేసుకుంది. ఆ గాగ్ర లో వేద అచ్చు భువికి వచ్చిన దేవకన్య లా ఉంది. చేతులకి, కళ్ళకి మెహింది తో చాల అందంగా మెరిసిపోతోంది.మనీష్ వచ్చి తొందర పెట్టడం తో ఇద్దరు అలంకరణ ముగించుకొని బయటకి వచ్చారు .

వాళ్ళు హాల్ కి వెళ్లేసరికి ఉదయం పదకొండు అయ్యింది . కస్తూరి, వాళ్ళ అమ్మ నాన్న నిశ్చితార్ధంలో ఉన్నారు. వేద, మనీష్ కస్తూరి వాళ్ళకి సర్ప్రైస్ చేయడానికి కేకు తీసుకొని రావడానికి వెళ్లారు. వాళ్ళు షాప్ లో వెయిట్ చేస్తుండగా మనీష్ కి ఫోన్ వచ్చింది వాళ్ళ నాన్నగారి నుండి ఎవరో బంధువులని పిక్ అప్ చేసుకొమ్మని.

వేద అడిగింది మనీష్ ని "ఏంటి ఏమైంది?"

"ఏం లేదు నాన్న ఫోన్ చేసారు బండి కావాలంట పికప్ చేసుకోడానికి. ఇక్కడ కేకు రెడీ అవడానికి ఇంకా అరగంట పట్టేటు ఉంది.అదే ఏం చేద్దాం అని ఆలోచిస్తున్న . పోనీ ఈ బండి ని పంపిద్దామ ఎలాగో డ్రైవర్ ఉన్నాడు గా"

"ఆ పంపిద్దాం అన్నయ్య ఎలాగో ఇక్కడ నుండి మన ఇల్లు దగ్గరే గా నా బైక్ ఇంట్లోనే ఉంది బండి ని పంపించేసిన మనం ఇంటికెళ్ళి బైక్క్క తీసుకొని వెళ్లిపోవచ్చు " అంది వేద.

డ్రైవర్ కి అడ్రస్ చెప్పి పంపించాడు మనీష్. మనీష్ వేదని బేకారి లోనే ఉండమని చెప్పి తను ఇంటికి వెళ్ళాడు వేద బైక్ తీసుకొనిరావడానికి. అక్కడ నుండి ఫుంచ్రిఒన్ హాల్ కి వెళ్లేసరికి నిశ్చితార్ధం అవ్వటానికి ఇంకా అరగంట ఉంది. నిశ్చితార్ధం అయిపోయిన వెంటనే వేద వాళ్ళు తెచ్చిన కేక్ ని కట్ చేసారు . ఆ తరువాత ఫోటోలు అవి అయ్యేసరికి  మధ్యాహ్నం రెండు దాటింది. అప్పుడు అందరు కలిసి భోజనానికి వెళ్లారు . ముందుగా పెళ్లి కూతురికి,పెళ్లి కొడుకుకి బంధువులకి, బయట వాళ్లకి భోజనాలు పెట్టారు. వాళ్ళ భోజనాలు అయ్యి వాళ్ళు వెళ్లేసరికి నాలుగు అయ్యింది. అప్పుడు మిగిలిన వాళ్ళు భోజనాలు చేసారు. వాళ్ళ భోజనాలు అవి అయ్యేసరికి సాయంత్రం 5 దాటింది . ఇంకా సమానులు అవి సర్ధవలిసిన పనులు ఉండడం తో మిన్డుగా కస్తూరి ని ఇంటికి పంపించేసారు . వేద ని కూడా కస్తూరి తో వెళ్ళమన్నారు గాని పనులు ఉండడం వాళ్ళ తను ఉండిపోయింది . కస్తూరి వాళ్ళ పిన్ని కూతురిని  తోడు ఇచ్చి పంపించారు . సమానులు అన్ని సర్ది అందరిని కాబ్ లో  పంపించేసరికి రాత్రి పది అయ్యింది. ఇంకా కస్తూరి వాళ్ళ అమ్మ, నాన్న, మనీష్ వేద మిగిలారు.

"వేద అమ్మ వాళ్ళు కాబ్ లో వెళ్ళిపోతారు . మనం నీ బండి మీద వెల్లిపోదాం " అన్నాడు మనీష్

"లేదన్నయ్య నేను ఇంటికి వెళ్ళిపోతాను. రేపు పొద్దున్న మల్లి ఆఫీసు కి వెళ్ళాలి. ఇంటికేల్లిపోతాను మల్లి వస్తాను ఇంటికి."

"సరే పద నేను డ్రాప్ చేస్తాను "

"వొద్దు . ఇప్పుడు నువ్వు డ్రాప్ చేస్తే మల్లి ఒక్కడివే రావాల్సి వస్తుంది .నేను వేల్లిపోతానులే ఇంకా పడే కదా అయ్యింది ఒక గంటలో వెళ్ళిపోతాను.మ పర్వాలేదు "

"సరే జాగ్రత్త. వెళ్ళంగానే ఫోన్ చేయి "

"సరే అన్నయ్య ఉంటాను వెళ్ళంగానే ఫోన్ చేస్తాను ."

వేద కస్తూరి వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పి ఇంటికి బయలుదేరింది .

కొంత దూరం బానే వచ్చింది గాని బండి పంచరు అవ్వడంతో ఎం చేయాలో తెలియలేదు . చాల సేపటినుండి ఆటో కోసం చూస్తోంది కాని ఒక్కటి రావట్లేదు.

                           కైలేష్ ఆ రోజు ఆపరేషన్ పూర్తి చేసేసరికి రాత్రి తొమ్మిది అయ్యింది . ఆపరేషన్ చేసి తీసుకోవాల్సిన జాగ్రతలు అన్ని చెప్పి పేషెంట్ వాళ్ళ బంధువుల దగ్గర సెలవు తీసుకొన్నాడు . అక్కడినుండి ఇంటికి వెళ్ళుతున్నాడు . తను ఇంటికి వెళ్లేదారి లో నే వేద కనిపించింది .ఒకసారి తన కళ్ళని తానె నమ్మలేకపోయాడు . 

No comments:

Post a Comment