వేద వాళ్ళ భోజనం అయ్యేసరికి రాటి పదకొండు దాటింది. మామూలుగా అనుకున్న దానికన్నా చాల ఆలస్యం అయ్యేసరికి కస్తూరి వాళ్ళ అన్నయకు ఫోన్ చేస్తానంది వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి
"ఎందుకే మనం వెళ్ళిపోదాం. ఎందుకు అనవసరంగా అన్నయ్యని కంగారు పెడతావ్ ఇప్పుడు " అంది వేద.
"ఎం కంగారు లేదు. ఇప్పుడు మనం ఫోన్ చేసి పిలవకపోతేనే కంగారు పడతారు ఎలా వస్తారో అని అయిన ఇక్కడనుండి మనం వెళ్ళడానికి అరగంట పడ్తుంది ఇంత రాత్రి పూట ఎందుకు చెప్పు రిస్క్ చేయడం . పైగా మన దగ్గర నగలు కూడా ఉన్నాయి. అందుకే అన్నయ్యని పిలుస్తాను. అన్నయ్య వచ్చే వరకు ఇక్కడ కూర్చుందాం కొంచం సేపు"
"సరే కాని మరి బండి పరిస్థితి ఏంటి"
"ఇక్కడ ఈ హోటల్ వాళ్ళని అడిగి ఇక్కడ పార్క్ చేద్దాం రేపు ఆఫీసు అయిపోయాక వచ్చి తీసుకోవచ్చు"
"సరే అయితే నువ్వు అన్నయ్యకి ఫోన్ చేయి ఈలోపు నేను హోటల్ వాళ్ళతో మాట్లాడతాను " అంది వేద.
ఇప్పటికే రాత్రి పది దాటిందని కైలాష్ వాళ్ళని పడుకోమన్నాడు. వేద వచేవరకు వెయిట్ చేసి రాగానే వచేస్త అన్నాడు. అప్పటికే చందన కి నిద్ర రావటం తో చందన వెళ్లి పడుకుంది. హంస కూడా పని వాళ్ళ బాగా అలిసి ఉండడం వల్ల పడుకోనిది వెళ్ళింది.
"అమ్మ అన్నయ్య మీరు కూడా వెళ్ళండి నేను చూసి వస్తాను" అన్నాడు కైలాష్.
సరే అని చెప్పి వాళ్ళు కూడా పాడుకోడానికి వెళ్లారు. కైలాష్ వేద కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఏదో ఫోన్ వచ్చింది హాస్పిటల్ నుండి వాళ్ళతో మాట్లాడి పేషెంట్ కి తీస్కోవాల్సిన జాగ్రతలు చెప్పి ఫోన్ పెట్టేసి టైం చూసుకున్నాడు కైలాష్. అప్పటికే పదకొండు అయ్యింది.
కైలాష్ కి చాలా కంగారు గా ఉంది రాత్రి పదకొండు దాటింది వేద ఇంకా ఇంటికి రాలేదు. ఏమైందో తెలిదు. పోనీ ఆఫీసు లో పని ఎక్కువ ఉందని సరిపెట్టుకున్దామన్న సరిపెట్టుకోలేకపోతున్నాడు ఎందుకంటే ఎప్పుడు ఇంట ఆలస్యం అవ్వలేదు . మహా అంటే రాత్రి పది వరకు వచ్చేసేది కాని ఇంత రాత్రి ఎప్పుడు అవలేదు అందుకే తనకి చాలా కంగారుగా ఉంది. పోనీ ఎకడికి అన్న వెళ్లి కనుకున్డమంటే అసలు తను ఎక్కడికి వెళ్లిందో అంచనా వేయలేకపోతున్నాడు. కానీ ఒక్కటే అనుకుంటున్నాడు ఎక్కడికి వెళ్ళిన ఆ అమ్మాయితో కలిసి వెళ్లి ఉంటుందని అదొకటే ధైర్యం. అసహనంగా వాచీ చూసుకున్నాడు . అప్పటికే పదకొండు దాటి అరగంట అయ్యింది.
కస్తూరి వాళ్ళ అన్నయ్యకు ఫోన్ చేసి తను వచేసరికి పదకొండున్నర అవుతోంది. వాళ్ళ అన్నయ్య రాగానే షాపింగ్ చేసిన వస్తువులు కారులో పెట్టి బయలు దేరారు అందరు . కస్తూరి వాళ్ళ అన్నయ్య పేరు మనీష్. తను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో పనిచేస్తున్నాడు.
"ఐపోయింద మీ షాపింగ్ ఐన ఇంత లేట్ అయ్యిందేంటి. కొంపతీసి షాప్ మత్తం కొన్నార ఏంటి " అన్నాడు మనీష్
"ఎక్కడ ఏదో రెండు చీరలు కొన్ని నగలు కొన్నాం అంతే షాప్ మొత్తం కోనేయడానికి ఇవాళ అవుతుందా ఏంటి " అంది వేద అదే ప్రాసలో
ఆ మాటకి అందరు చిన్నగా నవ్వారు.
" సరేలే వేద నిన్ను దింపేసి మేము ఇంటికి వెళ్తాం సరేనా" అన్నాడు మనీష్.
"అదేన్తన్నయ్య ముందు మీ ఇల్లే వస్తుందిగా ముందు దాన్ని దిమ్పేయి ఇంట్లో తర్వాత మనం వెళ్దాం ఇప్పతుఇప్పతికె దానికి సగం నిద్ర వస్తోంది ఇంకా నన్ను దిమ్పాక మీరు ఇంటికి వెళ్తే అది ఇక్కడే కారు లోనే పడుకుంటుంది " అంది వేద.
"ఔను అన్నయ్య నాకు నిద్ర వస్తోంది నన్ను ముందు దిమ్పెస్యి తర్వాత దాన్ని దింపు ప్లీజ్" అంది కస్తూరి
"చూసావా ఇది దీని వరస"
"పోనిలే అన్నయ్య" అంది వేద
దారిలో కస్తూరి ని దింపేసి వేద ని దింపడానికి వెళ్ళాడు మనీష్.
వేద వాళ్ళ ఇంట్లోకి కార్ వెళ్లేసరి రాత్రి పన్నెండు దాటింది కార్ చప్పుడు వినగానే అటు తిరిగి చూసాడు కైలాష్ కార్ లోనుండి వేద దిగిసరికి మనసు తేలిక పడింది.
వేద తో పాటు మనీష్ కూడా కార్ దిగాడు. వేల్లపోతున్న వేదని పిలిచి
"వేద చెప్పడం మర్చిపోయ నువ్వు రేపు సాయంత్రం ఆఫీసు అయిపోగానే ఇంటికి వచేసేయి అమ్మ నీతో ఈ విషయం చెప్పమంది".
"అలాగే అన్నయ్య వస్తాను ఇందాక కస్తూరి కూడా అదే అనింది రేపు సాయంత్రమే వచ్చేయమని " అంది వేద
వేద వచినందుకు ఆనందంగానే ఉన్న తను అతనేవరితోనో అంట క్లోజ్ గా మాట్లాడం చూసి కైలాష్ కి ఏదోలా అయ్యింది. కొంపతీసి వేద తనకి దూరం కావట్లేదు కదా అనిపించింది. అతనెవరో వేదని అడుగుదామనుకున్నాడు కాని వెంటనే అతని సంస్కారం మేల్కొంది. వేద గురించి తప్పు గా అనుకొందుకు అతనికి తనపై తనకే కోపం వచ్చింది. తనకి వేద పైన నమ్మకం ఉంది. అసలు నమ్మకమే లేకపోతె ప్రేమ అనే పదానికి అర్ధమే లేదు. తను వేద ని ప్రేమిస్తున్నాడు ఎట్టిపరిస్థితుల్లోను వేద గురించి తప్పుగా ఆలోచించడు . ఇప్పుడు తన మనసు తేలిక పడింది.
వేద మనీష్ కి బాయ్ చెప్పి తను మెడ మీదకి వెళ్ళింది
No comments:
Post a Comment