Thursday, 5 June 2014

Samveda - 9


వేద వెళ్ళంగానే కార్  వైపు నడవబోయిన మనీష్ కైలాష్ ని చూసి వచ్చాడక్కడికి

"నమస్తే బావున్నారా?" అని అడిగాడు మనీష్ కైలాష్ ని

కైలాష్ కి అతనెవరో అర్ధం కాలేదు. తనని ఎక్కడో చుసిన గుర్తు వస్తోంది కాని ఎక్కడ అనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు . అలానే సందిగ్ధం గా చూస్తున్నాడు.

"క్షమించండి మీరెవరో నాకు తెలిదు ఎక్కడో చూసినట్టే ఉంది గాని ఎక్కడ అనేది గుర్తు రావట్లేదు" అన్నాడు కైలాష్.

"మీరు మా ఫ్రెండ్ కి ఒక 3 నెలల క్రితం హార్ట్ ఆపరేషన్ చేసారు అప్పుడే మీతో పరిచయం "

"ఓహ్ అలాగా క్షమించండి గుర్తు రాలేదు"

"పర్వాలేదు మీరు ఇక్కడ" అన్నాడు మనీష్.

"ఇది మా ఇల్లే నండి"

"ఓహ్ ఆన అంటే మా వేద మీ ఇంట్లో పై పోర్షన్ లో ఉంటోంది అన్నమాట"

"మీకు వేద తెలుసా?"

"తెలుసా అని అంత చిన్నగా అంటారెంటండి. బాగా తెలుసు మా చెల్లెలి బెస్ట్ ఫ్రెండ్. ఒక సంవత్సరం నుంచి తెలుసు. చాలా మంచి అమ్మయ్యి చాలా తొందర కలిసిపోయింది మా ఇంట్లో వాళ్ళతో "

"ఓహ్ అలాగ"

"ఔనండి ఔను మీరేంటి ఇంట రాత్రి వేళ ఇలా బయట కూర్చున్నారు నిద్ర రావట్లేద?"

"ఒక విధం గా అంతే నండి చాల రాత్రి అయ్యింది కదా ఇంకా వేద రాకపోయేసరికి కొంచం కొంగారు వేసింది అందుకే చూస్తున్న "

"ఓహ్. మా చెల్లెలికి పెళ్లి కుదిరిందండి ఎల్లుండి ఆదివారం నిశితార్ధం . ఇదిగో వీళ్ళిద్దరూ ఆ పనుల మీదే షాపింగ్ కి తిరుగుతున్నారు. ఆఫీసు నుండి వెళ్లి వచేసరికి ఆలస్యం అవుతోంది ఎం చేతం చెప్పండి ఎక్కువ టైం కూడా లేదు అందుకే"

"అలాగా నా తరపున కూడా కంగ్రాట్స్ చెప్పండి మీ చెల్లెలికి"

"మీరు తప్పకుండ రావాలి నిశితర్ధం కి "

"చుస్తానండి కుదిరితే వస్తాను ఆ రోజు నాకు ఆపరేషన్ ఉంది ఏ విషయం మీకు చెప్పలేను వచెది రానిది కాని ఆపరేషన్ తొందర ఐపోతే మాత్రం కచితంగా వస్తాను"

"అలాగే నంది చాల సంతోషం. ఆ ఇంకో విషయం రేపు, ఎల్లుండి వేద ఇంటికి రాదు రేపు సాయంత్రమే మా ఇంటికి వస్తుంది   మళ్ళి ఆదివరం సాయిన్తనికే ఇక్కడికి వచ్చేది. మీరు కంగారు పడుతుంటారని చెప్తున్నా "

ఆ మాటకి చిన్నగా నవ్వాడు కైలాష్.

No comments:

Post a Comment