Tuesday, 24 June 2014

Samveda - 15

ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళగానే ఇంటర్వ్యూ విషయం చందనకి చెప్పాడు కైలాష్ . చాహ్నవి మెయిల్ ఐడి చెప్పి రెస్యుమ్ పంపించమని చెప్పాడు. ఆ మరుసటి రోజు కాకుండా తరువాత రోజు చందన ఇంటర్వ్యూ కి బయలుదేరింది . కైలాష్ చందన ని ఇంటర్వ్యూ జరిగే చోట దింపేసి తను హాస్పిటల్ కి వెళ్ళిపోయాడు .
         
                ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర అడిగాడు కైలాష్ చందన ని ఇంటర్వ్యూ ఏమైంది అని "చాలా బాగా చేసాను అన్నయ్య . ఖచ్చితంగా జాబు వస్తుంది" అంది.
"ఓహ్ అయితే ఇంటర్వ్యూ చాలా బాగా జరిగిందన్నమాట . ఇంతకీ రిసుల్ట్  ఎప్పుడు చెప్తారంట"
"ఇంకో రెండు రోజులలో చెప్తారు " అంది .
"పోనిలే ఇది కనక వచ్చేస్తే దాని లైఫ్ సెటిల్ అయిపోతుంది" అంది రాధా.

ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక ఆరు బయట కూర్చున్నారు వాళ్ళంతా.అప్పుడు గేటు చప్పుడవడంతో వెనకకి తిరిగి చూసారు అంత. వేద, కస్తూరి వస్తూ కనిపించారు . వేద బండి ఇంకా సర్వీస్ సెంటర్ లోనే ఉంది. అందుకే కస్తూరి వేద ని డ్రాప్ చేయడానికి వచ్చింది. ఎలాగో రాత్రి అయిపొయింది కాబట్టి వేద కస్తూరిని వాళ్ళ ఇంట్లోనే ఉండిపొమ్మని చెప్పింది. మొన్న ఎంగేజ్మెంట్ అప్పుడు తీసిన ఫొటోస్ ని ఫోటోగ్రాఫర్ దగ్గర నుంచి తెచుకొని సరా సరి వేద వాళ్ళ ఇంటికి వచ్చారు. అందులో ఉన్న ఫొటోస్ అన్ని చూసి ఏవి బావున్నాయో ఫోటో గ్రఫేర్ కి చెప్తే ఆల్బం చేసి ఇస్తా అన్నాడు ఫోటోగ్రాఫర్ ఆ పని మీదే ఫొటోస్ తెచుకున్నారు రాత్రికి, అన్ని ఫొటోస్ తెచుకొని చూసి అందులో నచ్చినవి ఇవ్వడానికి  . ఆ పని చేసి పడుకోనేసరికి రాత్రి ఒంటి గంట అయ్యింది . ఆ మరుసటి రోజు ఉదయం ఆఫీసు కి వెళ్లేముందు ఫోటోగ్రాఫర్ కి వాళ్ళు సెలెక్ట్ చేసిన ఫొటోస్ ఇచ్చి వెళ్లారు. ఆ మరుసటి రోజే చందన రిసుల్ట్ వస్తుంది అందుకే చాలా ఆత్రంగా ఎదురుచూస్తోంది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకి తన ఫోన్ కి మెసేజ్ వచ్చింది తను సెలెక్ట్ అయినట్టు. ఇంట్లో రాధకి, హంస కి చెప్పింది తను సెలెక్ట్చా అయ్యినట్టు. వాళ్ళు చాలా సంతోషించారు. వెంటనే మీ అన్నయ్యలకి ఫోన్ చేసి విషయం చెప్పు అంది. ఆనందంగా వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి విషయం చెప్పింది తను సెలెక్ట్ అయ్యినట్టు. "ఓహ్ కంగ్రాట్స్ రాత్రి ఇంటికి వచ్చాక మిగితా విషయాలు మాట్లాడుకుందాం" అన్నాడు కైలాష్.కైలాష్ చాలా ఆనందంగా కనిపించడంతో చాహ్నవి అడిగింది కైలాష్ ని విషయం ఏంటని. చందన సెలెక్ట్ అయ్యినట్టు చెప్పి థాంక్స్ చెప్పాడు కైలాష్ చాహ్నవి కి. "చ ఇంత చిన్నదానికి థాంక్స్ ఎందుకు. నాకు తెలిసిన విషయం నీకు చెప్పాను తను సొంతంగా జాబు తెచ్చుకుంది. అది సరే మరి పార్టీ ఎప్పుడు ఇస్తున్నావ్ ?"

"తప్పకుండా ఇస్తాను ఈ శనివారం లంచ్ కి వెళ్దాం సరేనా ?"

"సరే" అంది చాహ్నవి.ఇంకా పేషెంట్స్ ని చూడాల్సి రావడంతో  బాయ్ చెప్పి వెళ్ళింది చాహ్నవి .

ఆ రోజు భోజనాలు అయిపోయాక లాన్ లో కుర్చునప్పుడు అడిగాడు శైలేష్ చందన ని "ఎప్పుడు జాయిన్ అవ్వమన్నారు "?

"సోమవారం నుండి ."

"ఓహ్ అయితే ఈ ఆదివారం వరకే ఫ్రీ అన్నమాట"

"అవును. సోమవారం ఉదయం 9 గంటలకి రిపోర్ట్ చేయమన్నారు ఆఫీసు లో. అన్నయ్య రేపు శనివారం మా ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇద్దామనుకుంటున్నాను. ఏమంటావ్ ?"

"నీ ఇష్టం రా. ఇవ్వు" అన్నాడు శైలేష్ .

కొంచం సేపు కబుర్లు చెప్పుకున్నాక వెళ్లి పడుకున్నారు"

                   ఆ రోజు శనివారం . వేద ఉదయమే బయలుదేరింది అబిడ్స్ లో ఉన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళింటికి . వాళ్ళ అన్నయ్య పేరు హరి, అతనికి పెళ్ళయ్యి ఏడు సంవత్సరాలయ్యింది . వాళ్ళ ఆవిడ పేరు మాలతి .వాళ్లకి ఒక పాప ఉంది. ఆ అమ్మాయి పేరు రేవతి. వాళ్ళకి మూడు డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉంది. అందులో హరి ఒకటి చూసుకుంటాడు మిగితా రెండు అతని కింద పని చేసేవాళ్ళు చూసుకుంటారు .వేద వాళ్ళ ఇంటి గేటు తీయగానే రేవతి పరిగెత్తుకుంటూ వచ్చింది "అక్కా" అంటూ.

"హాయ్ రేవ. ఎలా ఉన్నావ్ ?"

"బావున్నాను అక్క". ఇంతలో మాలతి వచ్చింది .

"ఎలా ఉన్నావమ్మ?" అంది మాలతి .

"బావున్న వొదిన నువెల్ల ఉన్నావ్?"

"బావున్న రా లోపలకి".

"వొదిన అన్నయ్య ఏడి"?

"స్టోర్స్ కి వెళ్లారు. అది సరే గాని టిఫిన్ చేస్తావా"?

"హ ఆకలేస్తోంది చేస్తాను. ఏంటి వొదిన టిఫిన్ ఇవాళ?"

"ఇడ్లి . ఉండు తీసుకొని వస్తా? అంది

టిఫిన్ చేసాక కొంచం సేపు వాళ్ళ వొదిన తో కబుర్లు చెప్పింది . కస్తూరి ఎంగేజ్మెంట్ గురించి చెప్పింది .

"వొదిన మొన్న కస్తూరి ఎంగేజ్మెంట్  జరింగింది. ఎంత బాగా జరిగిందో తెలుసా. కనీసం రెండు వందల  మంది వచ్చారు ఎంగేజ్మెంట్ కె. పెళ్ళికి కనీసం ఏడు వందల మంది దాక వస్తారంట. ఆంటీ చెప్పారు. పెళ్ళికొడుకు వాళ్ళు ఎంగేజ్మెంట్ కి పెట్టిన చీర చాలా బావుంది. అది కట్టుగో గానే కస్తూరి ఎంత బావుందో .అసలు దానికోసం అని ఆ చీర ని అబ్బాయ్యే సెలెక్ట్ చేసాడంట. చాలా మంచి టేస్ట్ ఉంది ఆ అబ్బాయి కి "

"ఔను మరి మీ కస్తూరి లాంటి అమ్మాయి ని ఎంచుకునప్పుడే ఆ అబ్బాయి టేస్ట్ గురించి తెలిసిపోయింది ఇంకా ప్రత్యేకంగా చెప్పేదేముంది చెప్పు."

"ఔననుకొ"

అసలు ఇవాళ వేద ని మాలతే అడుగుదామనుకుంది పెళ్లి గురించి తన అభిప్రాయం ఏంటని ఏందుకంటే హరి తనకి తెలిసిన వాళ్ళ అబ్బాయి కోసం . గురించి చెప్పాడు. తను చాలా మంచి వాడని ఆ అబ్బాయికి వేద ని ఇస్తే బావుంటుందని చెప్పాడు .ఆ అబ్బాయి పేరు ప్రదీప్.ఒక యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా పని చేస్తాడు  వేద కి ఇంకా ఆ విషయం చెప్పలేదు. ప్రదీప్ కి  మాత్రం చెప్పాడు  ఇలా తనకి చెల్లెలి వరస ఒక అమ్మాయి ఉందని . ఆ అమ్మాయి చాలా మంచిదని. ఇవాళ మధ్యాహ్నం లంచ్ కి తీస్కొని వస్తా అని అక్కడ కలిసి మాట్లాడుకొని అభిప్రాయాలు తెలుసుకోవచని ప్రదీప్ కి  చెప్పి ఒప్పించాడు. ప్రదీప్ కూడా దానికి ఒప్పుకున్నాడు ఇంకా ఆ విషయం వేద కి చెప్పలేదు. మాలతీ తో చెప్పి వెదకి చెప్పమన్నాడు . అందుకే మాలతీ వేద ని పొద్దునే రమ్మంది వాళ్ళ ఇంటికి .అసలు విషయం ఎలా మాట్లడాలా  అని ఆలోచిస్తున్న సమయం లో వేద కస్తూరి ఎంగేజ్మెంట్ విషయం చెప్పడం తో ఆ అవకాసం జారవిడుచుకోవలనుకోలేదు. వేద కు జరిగిన పెళ్లి గురించి వాళ్ళకి తెలియదు . వాళ్ళకే కాదు కస్తూరికి , వాళ్ళ ఆఫీసు లో పని చేసేవాళ్ళకి ఎవరికీ తెలిదు .అందుకే అడిగింది

"అది సరే గాని నీ ఫ్రెండ్ పెళ్లి కూడా అయిపోతోంది మరి నువేప్పుడు చెసుకుంటావ్ పెళ్లి ?"

ఆ మాట వినగానే వేద డల్ గ అయిపొయింది . ఎం మాట్లాడకుండా చూస్తోంది .

"ఏంటి ఏం మాట్లాడావ్?"

"ఆ.. ఏం లేదు ఏదో ఆలోచిస్తున్న "

"ఏంటి పెళ్లి గురించి అడగంగానే ఆలోచనలా. నీకెలాంటి వాడు కావాలో చెప్పు అలంటి వాడినే చూద్దాం. ఎలాగో రేపు మీ కస్తూరి పెళ్లి జరుగుతుంది గా అప్పుడు నీ కిష్టమైన వాడిని, నీకు నచ్చిన వాడిని చూసుకున్నావనుకో  హ్యాపీ గా నీ పెళ్లి కూడా జరిపెచేయొచ్చు . ఏమంటావ్?" అంది అసలు ఏం చెప్తుందా అని

"...."

"ఏంటి ఏం మాట్లాడావ్ . ఇంతకీ నీకు నచిన వాడు ఎలా ఉండాలి "

"ఆ ... ఇంకా ఏం ఆలోచించలేదు వొదిన. అయిన ఆ విషయం మనం తరువాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం"

ఇంక లాభం లేదని అసలు విషయం లోకి వచ్చింది

"ఇంకెప్పుడు తర్వాత. ఎప్పుడడిగిన ఇలాగే మాట దాటవెస్తున్నావ్ ఇదేం బాలేదు.ఇవ్వాళ చెప్పాల్సిందే."

ఇంకా బెట్టు చేస్తే వొదినకి అనుమానం వస్తుందేమో అని భయపడింది వేద . అందుకే నోటికోచిందేదో చెప్పేసింది.

"ఏముంది వొదిన మాములుగా అందురు కోరుకునేదే. చూడడానికి బాగుండాలి. మంచి జాబు చేస్తూ ఉండాలి . మంచి వాడై ఉండాలి "

"అంతేనా . ఇంకేం అక్కరలేదా?"

"అంతే. చాలు " అంది

వేద అంత ముభావంగా చెప్పేసరికి అసలు విషయం చెప్పలేకపోయింది మాలతి.

"సరే గాని ఇవాళ మధ్యాహ్నం లంచ్ కి బయటకి వెళ్తునాం."

"బయటకా ఎక్కడికి "

"అది వేల్లెతప్పుడే చెప్పేది "

"సరేలే" .ఇంతలో రేవతి వచ్చింది అక్క అంటూ

"అక్కా నిన్న మా స్కూల్ లో ఏం జరిగిందో తెలుసా" అంటూ స్కూల్ విషయాలు చెప్పడం మొదలు పెట్టింది



No comments:

Post a Comment