Tuesday, 17 June 2014

Samveda - 14

వేద స్నానం చేసి బయటకి వచ్చింది, నిన్న కైలాష్ ఇచ్చిన నైట్ డ్రెస్ వేసుకుంది. అప్పటికి ఉదయం తోమ్మిదవుతోంది . ఇంతలో కైలాష్ వచ్చాడు.

"గుడ్ రెడీ అయిపోయావా పద టిఫిన్ తినేసి వేల్దువు గాని" అన్నాడు కైలాష్

అబ్బ ఇప్పుడు ఇక్కడ టిఫిన్ కూదా తినాలా అనుకుంది వేద. వొద్దని చెప్దామనుకుంది కాని దాని వల్ల ప్రయోజనం ఉండదని నిన్న రాత్రి నుండి జరిగిన సంఘటనల వల్ల తెలిసింది. అది కాకుండా అప్పుడే తొమ్మిది అయిపొయింది ఆఫీసు కి కూడా వెళ్ళాలి దాని కన్నా ముందర కస్తూరి వల్ల ఇంటికెళ్ళి తన హ్యాండ్ బాగ్ తెచ్చుకోవాలి. మళ్ళి ఇంటికి వచ్చి డ్రెస్ మార్చుకొని వెళ్ళాలి. అసలే బండి పంచర్ అయ్యింది .ఇప్పుడు కాదు కూడదు అంటూ కూర్చుంటే టైం అయిపోతుందనిపించింది అందుకే ఏం మాట్లాడకుండా కైలాష్ వెనకే నడిచింది.

వేద డైనింగ్ టేబుల్ దగ్గరకి రాగానే చూసింది అప్పటికే టిఫిన్ తినడానికి అందరు కుర్చోవడాన్ని. వేద రాగానే అందరు పలకరింపుగా నవ్వారు. వేద నుండి ఎలాంటి స్పందన లేదు. తిన్నగా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీ లాక్కుని కూర్చుంది . తన పక్కన కైలాష్ వచ్చి కూర్చున్నాడు. ఆ రోజు టిఫిన్ లోకి ఇడ్లీలు చేసారు. వేద టిఫిన్ చేసింది ఇంకా బయలదేరబోతుండగా కైలాష్ పిలిచాడు

"వేద నీ బండి పంచర్ అయ్యింది గా నిన్న రాత్రి ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి నీకు కష్టమవుతుంది నేను ఎలాగో హాస్పిటల్ దాక వెళ్తున్నాను నువ్వు వచావంటే నిన్ను కస్తూరి వల్ల ఇంట్లో దింపేసి వెళ్ళిపోతాను " అన్నాడు కైలాష్

"అవసరం లేదు నేను ఆటో లో వెళ్ళిపోతాను"

"పోనీ వెళ్ళు వేద ఇప్పుడు ఆటో లు దొరికి నువ్వు వెళ్ళడానికి చాల టైం పడుతుంది . ఆటో దొరకాలంటే రోడ్ మీద దాక నడవాలి .పైగా నువ్వు నైట్ డ్రెస్ లో ఉన్నావ్ ఇలా వెళ్లి ఆటో ఎక్కవంటే పరిస్థితి ఏంటో నువ్వే అర్ధం చేసుకో. కైలాష్ దిమ్పెస్తా అంటున్నాడు గా తనతో వెళ్ళు" అంది హంస.

"అవసరం లేదండి నేను వెళిపోగలను. అది కాకుండా నాకు కైలాష్ తో వెళ్ళడం ఇష్టం లేదు. " అంది వేద . అనడమైతే అంది గాని ఇప్పుడు నైట్ డ్రెస్ లో రోడ్ మీద దాక ఎలా నడవాలి అనుకుంది వేద. పొనీ వీళ్ళని ఫోన్ అడిగి ఒక ఫోన్ చేసి కస్తూరి ని ఇక్కడికి రమ్మంటే బావుంటుంది . కాని వీళ సహాయం తీసుకోవాల్సి వస్తుంది.అది నాకు ఇష్టం లేదే ఏం చేద్దాం . కైలాష్ దిమ్పుతా అంటున్నాడు దిమ్పున్చుకుంటే సహాయం తీసుకునట్టే గా దాని కన్నా ఫోన్ అడిగి తీసుకోవడమే బెటర్ అనుకుంది.తను ఫోన్ అడిగేలోగానే కైలాష్ అన్నాడు

"అది నాకు తెలుసు కాని ఇప్పుడు నిన్ను ఇలా వదిలేసి నేను వెళ్ళాను నిన్ను రాత్రి నేను తీసుకొచ కాబట్టి నా బాధ్యత గా మీ కస్తూరి వాళ్ళ ఇంట్లో దింపుతాను అక్కడ నుండి నీ ఇష్టం " అంటూ కార్ కీస్ తీసుకోవడానికి వెళ్ళాడు. కీస్ తీసుకొని బయటకి రాగానే వేద అంది.

"డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు ఒకసారి ఫోన్ ఇస్తే చాలు.ఒక కాల్ చేసుకొని ఇస్తా"

కైలాష్ బాగా ఆలోచించాడు ఇపుడు ఫోన్ ఇస్తే ఖచితంగా కస్తూరి కి ఫోన్ చేసి రమ్మంటుంది ఇంక అప్పుడు తను డ్రాప్ చేయడానికి వీలు ఉండదు . దానితో తనతో మాట్లాడే అవకాశం కూడా మళ్ళి ఇప్పట్లో రాదు. అప్పుడు తను రాత్రి అనుకున్నదంతా వృధా అయిపోతుంది. అందుకే ఇంట్లో అందరి వైపు తిరిగి ఫోన్ ఇవ్వద్దు అన్నట్టు గా సైగ చేసాడు . వేద తో అన్నాడు

 "ఇప్పుడెందుకు ఫోన్ నీకు కస్తూరి కి ఫోన్ చేసి ఇక్కడికి పిలవడానికే కదా. నిన్నంత తను ఎంగేజ్మెంట్ లో అలసిపోయింది . మళ్ళి ఇవాళ ఆఫీసు కి వెళ్ళాలి నువ్వు ఇంక ఇక్కడకి పిలిచి తనని ఇబ్బంది పెడతావా. అవసరం లేదు నేను దిమ్పెస్తాను బయలదేరు"

ఒకసారి గా వేద కి ఆశ్చర్యం వేసింది తన మనసులో విషయం అతడికెల తెలిసిందా అని, అతడు చెప్పింది కూడా నిజమే అనిపించింది నిన్నంత అలసి పోయి ఉంటుంది మళ్ళి రమ్మంటే బాగుండదేమో అనుకుంటూ ఉండగా కైలాష్ కార్ తీసుకొచి వేద పక్కన ఆపాడు  కార్ డోర్ తీసి "రా ఎక్కు " అన్నాడు

వేద కార్ వెనక డోర్ తీసింది ఎక్కడానికి .

"నేనేమన్నా నీ డ్రైవర్ ని అనుకుంటున్నావా ముందు కూర్చో "

వెనక డోర్ వేసేసి ముందుకి వచ్చింది . ముందు డోర్ ఓపెన్ చేసి కూర్చున్ది . కైలాష్ బయలదెరబోతు ఉండగా కస్తూరి వచ్చింది వాళ్ళ ఇంటికి .

కస్తూరిని చూడగానే వేద కైలాష్ బండి దిగేసింది. కైలాష్ కి కస్తూరి ని చూడగానే ఆ క్షణం లో చాల బాధ కలిగిందనే చెప్పాలి. తను రాత్రంతా బాగా ఆలోచించాడు ఎలాగైనా వేద తో ఒంటరిగా మాట్లాడాలని.ఎలాగో తన బండి పంచర్ అయ్యింది కాబట్టి పొద్దున్న తను వేద ని ఆఫీసు లో దింపడానికి తీసుకొని వేల్దామనుకున్నాడు .అప్పుడు వేద తో ఒంటరిగా మాట్లాడదామనుకున్నాడు. కాని ఆ అవకాశం వస్తుందో రాదో అనుకున్నాడు . కాని అనుకోకుండా పొద్దున్న ఆ అవకాశం వచేసరికి చాల ఆనందపడ్డాడు .. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం అనుకున్నాడు అందుకే వేద ని కస్తూరి వాళ్ళ ఇంటికి తీసికేల్లెముందు ఎక్కడికైనా తీసుకెళ్ళి కొంచం సేపు మాట్లాడి అసలు ఆ రోజు జరిగిన విషయం, తను వేద ని అపార్ధం చేసుకున్న విషయం  పూర్తిగా చెప్దామనుకున్నాడు . ఆ రోజు తను చాల తొందర పడ్డాడని, దానికి క్షమించమని అడుగు దామనుకున్నాడు. అంత తొందరగా వేద తనని క్షమిస్తుందన్న నమ్మకం కైలాష్ కి లేదు, కాని కనీసం జరిగిన విషయం ఇది అని , దానికి తను చాల పశ్చాత్తపపడుతున్నాడని చెబుదామనుకున్నాడు కాని ఈలోపు కస్తూరి రావడంతో అంత తారు మారు అయిందనే చెప్పాలి. మళ్ళి ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు .వేద కస్తూరి దగ్గరకి వెళ్ళడం తో ఇంక చేసేదేం లేక హాస్పిటల్ కి వెళ్ళిపోయాడు

"హాయ్ కస్తూరి " అంది ఆశ్చర్యంగా

"హాయ్ ఏంటే ఇది నిన్న నువ్వు నీ హ్యాండ్ బాగ్ మా ఇంట్లో నే మర్చిపోయావు పొద్దున్న నీకు ఫోన్ చేద్దాం అని చుస్తే నీ ఫోన్ మా ఇంట్లోనే రింగ్ అవుతోంది. తీరా చూస్తే నీ హ్యాండ్ బాగ్ మా ఇంట్లోనే ఉంది . అందులో ఇంటి తాళం, వాలెట్ కూడా ఉన్నట్టు ఉన్నాయి. అల ఎలా మర్చిపోయావు ?

"ఇది బావుందే ఎలా మరిచిపోయావంటే తొందరలో మరిచిపోయుంటాను. తీసుకొచ్చి మంచి పని చేసావ్ నేనే ఇప్పుడు మీ ఇంటికి వద్దమనుకుంటున్న ఆఫీసు కి వెళ్ళడానికి డ్రెస్ కుడా లేదు. దా పైకి వెళ్దాం . డ్రెస్ మార్చుకొని ఆఫీసు వెళ్దాం . మర్చిపోయాను ఇవాళ నీ బైక్ మీదే నేను కూడా నా బండి పంచర్ అయింది . దాన్ని సర్వీస్ సెంటర్ లో ఇచ్చి వెళ్దాం " అంటూ పైకి వెళ్లారు ఇద్దరు .

"దా కూర్చొ నేను ఇప్పుడే వస్తాను" అని లోపలి వెళ్లి డ్రెస్ మార్చుకొని వచ్చింది వేద.

"అవును బండి ఎప్పుడు పంచర్ అయింది . నిన్న సాయంత్రం దాక బానే ఉంది గా "

"నిన్న రాత్రి అయ్యిందే ఇంటికొచేటప్పుడు  ఏదో గాజు పెంక గుచుకునట్టు ఉంది "

"మరి ఎలా వచావ్?"

"కింద ఇంట్లో వాళ్ళ అబ్బాయి లిఫ్ట్ ఇచ్చాడు"

"అవునా  మరి రాత్రంతా కిందే ఉన్నావా ?"

"హ అవును. అది సరే గాని ఆంటీ వాళ్ళు ఎలా ఉన్నారు అలసట తగ్గిందా?" అంటూ మాట మార్చింది వేద ప్రసంగం పొడిగించకుండా

"ఆ బానే ఉంది . ఇంకా కొంచం బడలిక గా ఉంది కాని పర్వాలేదు. వెళ్దామా "

"ఆ పద ." అంటూ ఇద్దరు బయలుదేరారు ఆఫీసు కి .

దారిలో వేద బండి రిపేర్ చేయడానికి సర్వీస్ సెంటర్ లో ఇచ్చింది .

 
                    కైలాష్ హాస్పిటల్ కి వెళ్ళాడన్నమాటే గాని అతని మనసు మనసులో లేదు . నిన్న రాత్రి నుంచి జరిగిన సంఘటనలు ఒకదాని తరువాత ఒకటి గుర్తోచి మనసుని కలవరపెడుతున్నాయి . తను అనుకునట్టు పొద్దున్న వేద తో మాట్లాడి ఉంటె బావుండు నని పదే పదే అనిపిస్తోంది. ఇప్పటి దాక ఏమో కాని నిన్న రాత్రి వేద వాళ్ళ ఇంటికి వచినప్పటినుంది తనని వాళ్ళ ఇంట్లో ఉంచుకోవాలనే కోరిక బల పడుతోంది.

"హాయ్ కైలాష్ " అంటూ చాహ్నవి వచ్చింది కైలాష్ రూం లో కి .

కైలాష్ నుంచి ఏమి సమాధానం రాకపొయెటప్పడికి తన రెండు చేతులు కైలాష్ కాళ్ళ ముందు ఆడించింది
"హాయ్ ..." అంటూ

"ఓహ్ హాయ్ ఎప్పుడు వచ్చావ్ "

"హా ఎప్పుడు వచ్చావా నేను రూం లో కోచింది కూడా చూడకుండా ఎం ఆలోచిస్తున్నావ్ ఇంతసేపు "

"ఏం లేదులే నీ రౌండ్స్ అయిపోయాయ?" అన్నాడు కైలాష్

"ఆ అయిపోయాయి నీవి "

"ఇంకా వెళ్ళలేదు వెళ్ళాలి . ఇందాకే వచ్చా "

"వస్తూనే ఆలోచనలో కూరుకుపోయావ్ అంతేనా " అంది చాహ్నవి.

కైలాష్ చిన్నగా నవ్వాడు "అదేం లేదులే" అన్నాడు.

           చాహ్నవి ఆ హాస్పిటల్ లో కొత్తగా ఆరు నెలల ముందు వచ్చి చేరింది . కైలాష్ కన్నా రెండు సంవత్సరాలు చిన్నది . జనరల్ చేకప్స్ అవి ఎక్కువ గా చూసుకుంటుంది. తనకి ఒక అన్నయ్య ఉన్నాడు . అతను ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ లో చేస్తాడు చాహ్నవి కి కైలాష్ అంటే చాల ఇష్టం కాని ఆ విషయం ఇప్పటిదాకా కైలాష్ కి చెప్పలేదు . ఎలా చెప్దామా అని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తోంది గాని అవకాశం దొరకడం లేదు .

"కైలాష్ చెప్పడం మర్చిపోయాను మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ కంపెనీ లో వాక్-ఇన్స్ ఉన్నాయంట . మొన్న చందన కోసం జాబు సెర్చ్ చేస్తున్న అన్నావు గా . ఇది ఏమైనా పనికి వస్తుందేమో చూడు కావాలంటే మా అన్నయ్య రిఫరెన్స్ ఇస్తాడు " అంది

"ఓహ్ అవునా చాల థాంక్స్ నీకు చందన ది రెస్యుమ్ పంపిస్తాను దాని మీ అన్నయకి పంపించి రెఫెర్ చేయమను . ఎప్పుడు ఉంది వాక్-ఇన్ " అని అడిగాడు

"థాంక్స్ ఎందుకు లే గాని జాబు వస్తే మంచి పార్టీ ఇవ్వాలి .ఇంకో రెండు రోజులలో ఉదయం తొమ్మిదింటి ఉండి ఉన్నాయి "

"పార్టీ ఎందుకు ఏకంగా డిన్నర్ ఇస్తాను . చందన కి చెప్తాను   ప్రిపేర్ అవ్వమని . సరే నేను రౌండ్స్ కి వెళేసి వస్తాను" అంటూ బయలదేరాడు

వెళ్తున్న కైలాష్ ని చూస్తూ కూర్చుంది చహ్నవి .

No comments:

Post a Comment