Monday, 30 June 2014

Samveda - 17

ఆ రోజు హోటల్ నుండి హరి వాళ్ళ ఇంటికి వెళ్ళింది వేద. కొంచం సేపు విశ్రాంతి తీసుకున్నాక హరి వేద ని పిలిచాడు ప్రదీప్ గురించి మాట్లాడడానికి . ఇంతలో మాలతీ కూడా వచ్చింది అక్కడికి.

"రా వేద కూర్చో .నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి" అన్నాడు హరి

"చెప్పు అన్నయ్య "

"ఇందాక రెస్టారెంట్ లో నువ్వు ప్రదీప్ ని చూసావ్ కదా . అతని మీద నీ అభిప్రాయం ఏంటి ?"

"అభిప్రాయమా ఎం లేదే"

"అలా కాదు వేద అసలు నువ్వు రెస్టారెంట్ లో ఎందుకో బాగా డల్ అయిపోయావ్ ఎవరితో ఏం మాట్లాడలేదు. మరి ఎందుకో నాకు తెలీదు. ప్రదీప్ ని మేమే రమన్నాం రెస్టారెంట్ కి నిన్ను పరిచయం చేయడానికి " అంది మాలతీ

వేద కి వాళ్ళు చెప్పేదేమిటో అర్ధం కావట్లేదు. "నన్ను పరిచయం చేయడానికా ? ఏందుకు ?"

"ఏందుకంటే ప్రదీప్ ని నువ్వు పెళ్ళిచేసుకుంటే బాగుంటుంది అని నాకనిపించింది . ఆ అబ్బాయి చాల మంచి వాడు , యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు , ఏ దురలవాట్లు లేని వాడు .అతన్ని పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుందని అనిపించింది. అందుకే నీకు ప్రదీప్ ని ప్రదీప్ కి నిన్ను చుబిద్దామని తీసుకెళ్ళాను " అన్నాడు హరి

వాళ్ళ మాటలు వింటుంటే వేద కు మతి పోయినట్లయ్యింది. రెండు నిమిషాల వరకు ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు నాకు పెళ్లి చేయడానికి వీళ్ళు ఆలోచిస్తున్నారా , ఏమని చెప్పాలి వీళ్ళకి, నాకు ఇదివరకే నా ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా కైలాష్ బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని చెప్పాలా? పెళ్లి చేసుకున్న వెంటనే  అక్కడే కోపంతో తనకేం పట్టనట్టు వదిలేసి వెళ్లిపోయాడని చెప్పాలా? మళ్ళి అంతలోనే వాళ్ళే వచ్చి క్షమించమంటూ అడుగుతున్నారని చెప్పాలా?   ఏం చెప్పాలి?ఇంకా తను జరిగిన విషయం నుండి కోలుకొనే లేదు, దాన్ని ఏ విధం గా స్వికరించాలో ఇంకా అర్ధం కాలేదు, ఈలోపు  ఒకవైపు రోజు కైలాష్ వాళ్ళ ఇంట్లోనే ఉండాలి, వాళ్ళ ముందే తిరగాలి అది ఇంకో బాధ, కైలాష్ ని చూసినప్పుడల్లా మానిన గాయం రెగుతూనె ఉంటోంది , దాన్ని భరించడమే కష్టంగా ఉందంటే ఇప్పుడు వీళ్ళు నాకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు . ఏం చేయాలి భగవాన్ వీళ్ళ మనసులు బాధ పడకుండా ఎలా ఈ ప్రయత్నాన్ని ఆపాలి.ఎలా వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పాలి అనుకుంది .

"వేద ఏంటి ఏం మాట్లాడావ్. ఏమయింది నీకు ఇవాళ" అన్నాడు హరి.

దాంతో ఈ లోకం లోకి వచ్చింది వేద.

"ఏం లేదు. వొదిన మీతో ఒక విషయం చెప్పాలి . నన్ను తప్పు గా అర్ధం చేసుకోకండి .నాకు పెళ్లి చేసుకోవాలని లేదు . ఎందుకు ఏంటి అని వివరాలు మాత్రం నేను చెప్పలేను .ఈ విషయం ఇక్కడితో వదిలేద్దాం ప్లీజ్" అని చెప్పి అక్కడనుండి వెళ్ళిపోయింది.

వేద అలా మాట్లాడేసరికి మాలతి కి ఏం చేయాలో ఏం అర్ధం కాలేదు . ఏం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అకడినుంది వెళ్ళిపోయింది వేద. ఏమనుకున్నాడో ఏమో గాని హరి అన్నాడు  మాలతీ తో

 "పోనిలే తనకి ఇష్టం లేకపోతే బలవంతం ఏమి లేదు నేను ప్రదీప్ కి ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్తాను .వేద తో తరువాత వివరంగా మాట్లాడొచు దీని గురించి "

"సరే మీ ఇష్టం " అంది మాలతి

 వేద వాళ్ళ ఇంట్లోంచి బయటకి వచ్చాక సరా సరి వెళ్లి ఒక పార్క్ లో కూర్చుంది. ఎందుకో ఇంటికి వెళ్ళాలనిపించలేదు. ఎక్కడికైనా వెళ్లి కొంచం సేపు ఒంటరి గా కుర్చోవాలనిపించింది అందుకే పార్క్ కి వచ్చింది. ఇందాక హరి వాళ్ళ ఇంట్లో జరిగిన విషయం ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. తనకి కూడా పెళ్లి మీద చాల ఆశలు ఉన్నాయి, తనకి కాబోయే వాడి మీద, పెళ్లి తరువాత తను జీవించబోయే జీవితం మీద చాలా ఆశలు పెట్టుకొంది. కాని అవి అన్ని తన కాళ్ళ ముందే కూలిపొతూ ఉంటె ఏం చేయలేకుండా ఉంది. కైలాష్ మీద చాలా కోపం గా ఉంది. తన జీవితానికి ఒక గమ్యం లేకుండా చేసినందుకు అతడంటే అసహ్యం గా ఉంది . ఇంతా చేసి ఏం జరిగింది ఏదో చిన్న విషయం అనట్టు ఇప్పుడు క్షమించమని అడుగుతుంటే ఏం చెయ్యలేకుండా ఉంది. తను తన జీవితాన్ని ఎలా మలుపు తిప్పుకోవలో కుడా అర్ధం కావట్లేదు ఇలాంటి సమయం లో హరి తెచ్చిన పెళ్లి ప్రస్తావన తన మనసుని చాలా కలచి వేసింది. అలా ఎంత సేపు కుర్చుందో తనకే తెలీదు తన చేతిలో ఉన్న ఫోన్ మోగడంతో ఈ లోకం లోకి వచ్చింది. ఫోన్ చేసింది కస్తూరి

"చెప్పవే " అంది ఎత్తుతూనె

"ఎక్కడున్నావ్ ?"

"పార్క్ లో "

"పార్క్ లో నా అక్కడేం చేస్తున్నావ్?"

"ఏం లేదు ఊరికనే వచ్చాను."

"ఏమైందే చాలా డల్ గ ఉన్నావ్"

"ఎం లేదు ఏదో ఆలోచిస్తున్న అంటే ఈలోపు నీ ఫోన్ వచ్చింది"

"ఔన చాలా దీర్ఘంగానే ఆలోచిస్తునట్టు ఉన్నావ్ గా . సరే గాని ఇంటికి వస్తావా "

"లేదే మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. రేపు వస్తాలే"

"సరే మరి నీ ఇష్టం రేపు మాట్లాడుకుందాం ఉంటాను ."

"సరే బై" అంటూ ఫోన్ పెట్టేసి ఇంటికి బయలుదేరింది

                హోటల్ నుండి చాహ్నవి ని వాళ్ళ ఇంట్లో దింపేసి హాస్పిటల్ కి వెళ్లి అటునుండి ఇంటికి వచేసరికి రాత్రి ఎనిమిది దాటింది కైలాష్ కి .

వస్తూనే రాధా అడిగింది "ఏంట్రా ఇంట ఆలస్యమయ్యింది "

"ఎం లేదు అమ్మ హాస్పిటల్ కి వెళ్లి వస్తున్నాను అందుకే "

"సరే లే లేచి స్నానం చేసి రా భోజనం చేద్దాం"

"సరే" అంటూ రూం కి వెళ్ళాడు

భోజనాల సమయం లో అడిగాడు చందన ని "ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తా అన్నావ్. ఇచ్చావా?"

"హ అన్నయ్య ఇచ్చాను అందరు చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యారు . అంత మంచి కంపెనీ లో వచ్చినందుకు కంగ్రాట్స్ చెప్పారు " అంది సంతోషంగా

"నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి ఇవాళ చహ్నవి కి పార్టీ ఇవ్వడానికి వెళ్ళాను కదా అక్కడ వేద కనిపించింది .. "అంటూ జరిగిన విషయం చెప్పాడు

"తను కూడా అదే కంపెనీ అని తెలిసింది మాటల మధ్యలో కుదిరితే తనతో పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నించు.ఇక్కడ అంటే మాట్లాడదేమో గాని ఆఫీసు లో ఖచితంగా మాట్లాడుతుంది"

"అవునా వొదిన కూడా అదే ఆఫీసు ఆ ?"

"అవును."

"అయితే చూడు ఎలాగైనా వొదిన తో మాట్లాడడానికి ట్రై చేస్తా.కాని ఒకే క్యాంపస్ లో ఇస్తే బాగుండు "

"చూద్దాం. రేపు ఏ విషయం తెలుస్తుంది గా.ఔను ఇంతకీ వేద వచ్చిందా అమ్మాఇంటికి "

"లేదనుకుంట రా వాళ్ళ ఇంట్లో లైట్ వెలగడం అయితే నేను చూడలేదు " అని రాధా అంటూండగానే వచ్చింది వేద ఇంట్లోకి .

"అదిగో ఇప్పుడే వచినట్లు ఉంది" అంటూండగానే పైకి వెళ్ళిపోయింది వేద .

"ఏమైనా తినిందో లేదో. చాలా డల్ గ ఉన్నట్లు ఉంది గమనించావా" అంది రాధా

"అవును నేను వెళ్లి చూసి వస్తాను ఒకసారి " అంటూ పైకి వెళ్లి డోర్ బెల్ కొట్టాడు .

వేద తలుపు తీసి కైలాష్ ని చూడంగానే తలుపు వేయబోయింది. కాని కైలాష్ ఎలోపే వేద కి అవకాశం ఇవ్వకుండా లోపలి వచ్చేసాడు.

"ఏందుకు వచ్చావ్. బయటకి వెళ్ళు " అంది కోపం గా గుమ్మం వైపు వేలు చూపిస్తూ.

"వెళ్తా గాని ఏంటి డల్ గ ఉన్నావ్ ఇవాళ ఏమైనా అయ్యిందా ?" అంటూ అక్కడ హాల్ లో సోఫా ఉంటె అందులో కూర్చున్నాడు

"నీకనవసరం. నీకెవ్వరు ఇక్కడ మర్యాదలు చెయ్యట్లేదు ముందు బయటకి వెళ్ళు"

"అబ్బ ఎన్ని సార్లు చెప్పిందే చెప్తావ్. వెళ్తాలే . ఏమైనా తిన్నావా ?"

"ఎన్నిసార్లు చెప్పను నా విషయాలు నీకు అనవసరం అని "

"ఏమో మరి నేను ఎప్పుడు లేక్కపెట్టనే లేదు. నువ్వు అడుగుతావని నాకేం తెలుసు. ఈసారి కౌంట్ చేసి గుర్తు పెట్టుకున్టానులే" అంటూ వేద కళ్ళలోకి చూసి చిన్నగా నవ్వాడు

ఆ సమాధానానికి వెదకి తిక్క రేగింది.

"ఏమైనా తిన్నావా?"

"నీక.." అంటూ ఉండగానే

"నీకనవసరం అంతే గా అదే మాట పది సార్లు బట్టి పట్టావ ఏంటి లేక పొతే నన్ను చూస్తూ మాటలు మర్చిపోయి అదోక్కమాటే గుర్తు పెట్టుకున్నావా?" అన్నాడు .

వేద ని చుస్తూనె ఎందుకో కైలాష్ మొహం లో అదో లాంటి ఆనందం , మనసులో అదో లాంటి ప్రశాంతత, తను ఎదురుగా ఉంటే చాలు అనిపిస్తుంది. అందుకే తనతో మాట్లాడానికి దొరికే ఏ చిన్న అవకాశాన్ని పోగొట్టుకోవడం కైలాష్ కి ఇష్టం లేదు .

"ఏంటి ఎం మాట్లాడావ్. ఎంత సేపు చూస్తావ్ చెప్పు నన్ను . ఏమైనా మాట్లాడు.?"

"నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు ఈ విషయం నీకు ఎలా చెప్తే అర్ధం అవుతుందో నాకు అర్ధం కావట్లేదు."

"ఏం చేస్తాం నువ్వు చెప్పేది నా చెవులకే తప్ప నీ మనసుకి వినిపించదు. అది సరే గాని ఇంద ఈ చపాతీ తెచ్చాను తిను"

"వద్దు నేను ఇంతకుముందే తినేసాను. ఇంకా వెళ్తావా నాకు నిద్ర వస్తోంది "

"నిన్ను చుస్తే నువ్వు తిన్నావంటే ఎవ్వరు నమ్మరు "

"దానికి నేనేం చేయలేను."

"సరేలే నా ముందు తినడానికి మొహమాతమైతే ఇక్కడ పెట్టి వెళ్తాను తిను" అంటూ అక్కడ బాక్స్ పెట్టేసి కిందకి వచ్చాడు.


              సోమవారం ఉదయం 8:30 అయ్యింది. చందన హడావిడిగా రెడీ అవుతోంది. ఆ రోజు తన మొదటి రోజు ఆఫీసు లో . ఎట్టి పరిస్థితుల్లోను ఆలస్యం అవకూడదని ఉదయమే బయలుదేరింది. కైలాష్ తనని ఆఫీసు లో దింపి తను హాస్పిటల్ కి వెళ్తా అన్నాడు. శైలేష్ కి ఆ రోజు కేసు లెం లేకపోవడం తో ఇంట్లోనే ఉన్నాడు. అంతకు ముందు రోజే చందన కి మెయిల్ వచ్చింది తను ఎక్కడ, ఎవరికీ రిపోర్ట్ చెయ్యాలో. ఆ మెయిల్, మిగితావి కావాల్సిన పేపర్స్ తీసుకొని బయలుదేరింది. కైలాష్ చాలా సేపటినుండి వేద వాళ్ళ ఇంటి వైపు చూస్తున్నాడు. ఎలాగో చందానని దింపాలి కాబట్టి వేద కనిపిస్తే తనని కూడా తనతో పాటు తీసుకొని వెళ్దామని కైలాష్ ఆలోచన. కాని ఎంత సేపు చుసిన వేద బయటకి రాలేదు. ఇంక చందనకి లేట్ అవుతుండడం తో తనని తీసుకొని బయలుదేరాడు .కైలాష్ వాళ్ళు బయలుదేరిన తరువాత ఒక గంట కి వచ్చింది కస్తూరి వేద వాళ్ళ ఇంటికి . చందన ఫ్రెషర్ కాబట్టి అందులోను అప్పుడే కొత్తగా చేరింది కాబట్టి తను ముందుగానే ఆఫీసు కి వెళ్ళాల్సి ఉంటుంది. కాని వేద, కస్తూరి వాళ్ళకి అలా కాదు వాళ్ళు అప్పటికే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అందుకే వాళ్ళకి తొందర లేదు పైగా పని అంతగా లేకపోతె లేట్ గా వెళ్ళిన ఎవ్వరు పట్టించుకోరు. వాళ్ళకి క్లైంట్ కాల్ పదిన్నరకి ఉంటుంది అప్పటికి వెళితే సరిపోతుంది . వాళ్ళ మేనేజర్ కి పని అయిపోవడం కావాలి అంతే. కైలాష్ చందన ని దింపేసి హాస్పిటల్ కి వెళ్ళిపోయాడు . చందన రిపోర్ట్ చేసాక తనకి ఇంటరాక్షన్ ప్రోగం కండక్ట్ చేసారు అది మధ్యాహ్నం దాక ఉంది. చందన అక్కడికి వెళ్ళింది. వేద వాళ్ళు ఆఫీసు కి వెళ్లేసరికి పది అయ్యింది. కాల్ అయిపోయాక వేద తో అంది కస్తూరి

 "ఏంటే మేనేజర్ ఎమన్నా చెప్పాడా . ఇంక 3 వారాలే ఉంది పెళ్ళికి . మళ్ళి నేను లీవ్ నుంచి వచేసరికి ఒక నెల అన్నా పడుతుంది. ఈలోపు ఎవరో కొత్త రిసోర్స్ ని ఇస్తా అన్నాడు ఇప్పటి దాక మళ్ళి ఏం మాట్లాడలేదు. ఆ రిసోర్స్ కి మళ్ళి ట్రైనింగ్ ఇవ్వడానికి కనీసం 2 వారలైన పడుతుంది గాఏం చేద్దమంతావ్ ఇంకోసారి అడిగి చూద్దామా?"

"వోద్దె ఇవ్వాళా కొంత మంది ఫ్రేషేర్స్ జాయిన్ అవుతున్నారంట చూద్దాం ఇవాళ సాయంత్రం దాక చూసి రేపు మాట్లాడదాం."

"సరే" అంది కస్తూరి. లంచ్ వరకు వర్క్ చేసాక లంచ్ కి 2 గంటలకి బయటకి వచ్చారు .

చందన కి ఇంటరాక్షన్ ప్రోగ్రాం అయిపోగానే తను రిపోర్ట్ అవ్వాల్సిన మేనేజర్ దగ్గరికి పంపించారు. అప్పుడు వచ్చిన ఫ్రేషేర్స్ అందరికి డైరెక్ట్ గా ప్రాజెక్ట్ లోకి తీసేసుకున్నారు అర్జెంటు రిక్రూట్మెంట్ ఉంది కాబట్టి. అందుకే ఆశలు అంత తొందరగా ఇంటర్వ్యూ చేసింది. అర్జెంటు రిక్రూట్మెంట్ ఉండడం తో ముందు ఒక 20 మంది కి జొఇనింగ్ ఒర్దెర్స్ ఇచెసారు అందులో చందన కూడా ఉంది .

చందన మేనేజర్ కి రిపోర్ట్ చెయ్యగానే తనని వేద వాళ్ళ డెస్క్ దగ్గరికి తీసుకొని వచాడు. అక్కడ వేద కస్తూరి కనిపించకపోయేసరికి పక్కన వాళ్ళని అడిగారు .వాళ్ళు లించ్ కి వెళ్ళారని చెప్పగానే వేద సీట్ పక్కన సిస్టం దగ్గర కూర్చోమని చెప్పి తన సీట్ కి వెళ్ళిపోయాడు . వాళ్ళ ఆఫీసు లో సీట్స్ అన్ని క్యుబికల్స్ లాగ ఉంటాయి. ఒక క్యుబికల్ లో నలుగురు కూర్చుంటారు ఇద్దరిద్దరి చొప్పున . ఆ తరువాత మరో క్యుబికల్ ఉంటుంది . ఈ క్యుబికల్ కి ఆ క్యుబికల్ కి మధ్య గోడ లాంటిది ఒకటి ఉంటుంది . వేద వాళ్ళ క్యుబికల్ లో వేద, కస్తూరి ఉండేవారు . ఇంకో రెండు ఖాళి గానే ఉండేవి . ఇప్పుడు అక్కడ ఒకదాంట్లో చాహ్నవి కి సీట్ అల్లోకేట్ చేసారు.

 వేద వాళ్ళు లంచ్ నుంచి వచ్చేసరికి పక్కన చందన ని చూసి వేద షాక్ తింది. ఈ అమ్మాయి ఏంటి  ఇక్కడ ఉంది అనుకుంది . కాని చందన  వేద ని చూడగానే చాలా సంతోషం గా ఉంది . వొదిన తన ఆఫీసు అనుకుంది గాని తన పక్క సీట్ లోనే ఉంటుందని అనుకోలేదు అందుకే అంట ఆనందంగా ఉంది . వేద ని పలకరించబోయింది  గాని ఈలోపే కస్తూరి అంది

 "హాయ్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది. బట్ ఎక్కడ అనేది ఎంత ఆలోచించిన గుర్తు రావట్లేదు" అంది చందన తో. వేద తో కూడా ఆ విషయమే అనింది. ఒక్క నిమిషం తరువ్వత మళ్ళి కస్తూరె అంది

"ఆ గుర్తోచింది మీరు వేద వాళ్ళ ఇంటి ఓనర్స్ కదూ."

"అవును " అంది చందన

"వాట్ ఎ ప్లేసంట్ సర్ప్రైస్. మీరేంటి ఇక్కడ"

"నన్ను మీరు అనకండి ఐ యాం చందన . ఇవ్వలే జాయిన్ అయ్యాను" అంది

"ఓహ్ ఫ్రేషేరా" అంది కస్తూరి

"అవును "

"ఓకే నేను కస్తూరి తను వేద నీకు తెలుసనుకో"

"హాయ్" అంది చందన

తప్పదనట్టు వేద కూడా హాయ్ చెప్పింది

"ఏ ప్రాజెక్ట్" అంది కస్తూరి

"ఇంక తెలీదు . మేనేజర్ గారు ఇక్కడ కూర్చోమన్నారు "

"మేనేజర్ గారా. అలా పిలవకు ఇది కార్పొరేట్ వరల్డ్ మేనేజర్ పేరు గిరిధర్ గిరి అని పిలు సరిపోతుంది "

"ఓకే"

ఇంతలో గిరిధర్ వచ్చాడు అక్కడికి

"వేద తను చందన. షి ఈస్ యువర్ న్యూ టీం మెంబెర్. కస్తూరి ప్లేస్ ని ప్రస్తుతానికి తను రీప్లేస్ చేస్తుంది . కస్తూరి ప్లీజ్ ట్రైన్ హర్. షి విల్ రీప్లేస్ యు వెన్ యు ఆర్ ఇన్ లీవ్" అని చెప్పి పరిచయం చేసి వెళ్ళిపోయాడు.

వేద కి ఏం మాట్లాడాలో అర్ధం కావట్లేదు . చందన ని చూడగానే బాగా అప్సెట్ అయ్యింది . బట్ ఇక్కడ తను చందన తో మాట్లాడక పొతే బాగోదు ఎంతైనా తన టీం మెంబెర్ , తనతో కలిసి పనిచేయాలి .అది కాక తన సొంత గొడవల వల ఆఫీసు విషయాలు ఎఫెక్ట్ అవ్వడం తనకి ఇష్టం లేదు. తనని తను సంభాల్లిన్చుకునేసరికి కొంత సమయం పట్టింది.

కస్తూరి అనింది "ఇవాళ ఆల్రెడీ సగం రోజు అయిపొయింది రేపటినుండి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తా. ఒక రెండు వారాలు పడుతుంది . ఆ తరువాత ఒక వారం శాంపిల్ గా కొంచం వర్క్ ఇస్తాం అది చేయాలి . ఆ తరువాత నాకు వచ్చే వర్క్ ఐటమ్స్ అన్ని నువ్వు తీసుకోవాలి. ఏం పర్వాలేదు ఏం భయం లేదు ఎలాగో వేద ఉంటుంది కాబట్టి పర్వలేదు. ఏమైనా డౌట్స్ వస్తే తను హెల్ప్ చేస్తుంది . సరేనా"

"సరే" అంది చందన.


"మీరు లీవ్ కి వెళ్తున్నార ?" అంది చందన

"అవును ఇంకో 3 వీక్స్ లో నాకు పెళ్లి సో అప్పుడు ఒక 1 మంత్ లీవ్ లో ఉంటాను"

"ఓహ్ కంగ్రాట్స్ "

"థాంక్స్ "

సాయంత్రం 5 అవ్వగానే వేద అడిగింది కస్తూరిని "కస్తూరి వెళ్దామా నా వర్క్ అయిపొయింది "

"హా ఒక 10 నిమిషాలు ఈ ఒక మెయిల్ పంపేసి వెల్లిపోదాం" అని మెయిల్ పంపింది కస్తూరి పంపడం అయిపోగానే చందనతో అనింది.

"ఈ రోజు ఎక్కువ వర్క్ ఏం లేదు అయిపొయింది . నీకు ఎలాగో వర్క్ లేదు కాబట్టి నువ్వు కూడా వెళ్లి పొవచు ఏం కాదు ఎలాగో వేద మీ ఇంటికే వెళ్తుంది కాబట్టి నిన్ను డ్రాప్ చేసేస్తుంది" అంది

ఆ మాట వినగానే సర్రున ఇటు తిరిగింది వేద . కస్తూరి మీద కోపం వచ్చింది అయిన తమాయించుకొని అంది "లేదు కస్తూరి ఇప్పుడు ఇంటికి వెళ్ళట్లేదు. నాకు వేరే పని ఉంది బయట అక్కడికి వెళ్తున్నాను అని చెప్పి చందన వైపు తిరిగి సారీ డోనట్ మైండ్" అని చెప్పింది.

"పర్వాలేదు మీరు వెళ్ళండి మా అన్నయ్య ఎలాగో ఇంకో గంటలో వస్తాడు "

"వెళ్దామా " అంది కస్తూరి వైపు తిరిగి

"సరే పద"



     



Thursday, 26 June 2014

Kudirithe Kappu Coffee Movie Song Lyrics

Andarlaaga Song

Andarlaga nenu anthe anukovalaa
thondarapette thovala vente vellipovalaa
andarlaga nenu anthe anukovalaa
thondarapette thovala vente vellipovalaa
anukonidaina alochana
bagundi ananaa ee bhavana
ninnadagalanukuntunnaa
nindinchalaa anandinchalaa

no no atu povaddu
manasa enta mathu
anna munde enno cheppi
edo sarada leddu
vere emi ledu
thappa andi kattu dappi
veelaithe kaasini kaburlu
kudirithe kappu coffee
antune chejarindi
itte kannu kappi
maata maata kalipi
atupaina maya golipi
intha hayi ante
ee thiyyanaina noppi
ninnadagalanukuntunna
nindinchalaa anandinchalaa

andarlaga nenu anthe anukovalaa
thondarapette thovala vente vellipovalaa

thaane nammetattu
thanapai thane otte
vesthu andinchindi haami
ponle papam antu
twaraga vachey antu
chusthu pampinchaanu madini
gudantha kaali chesthu
vellipooyina guvvalla
naa kannullo kalalanni
nee vallo chikkaala
evari neramantuu
nishturamendukante
kalisi oppukuntee
adi kuda manchi maate
ninnadagalanukuntunna
nindinchalaa anandinchalaa

andarlaga nenu anthe anukovalaa
thondarapette thovala vente vellipovalaa
anukonidaina alochana
bagundi ananaa ee bhavana
ninnadagalanukuntunnaa

nindinchalaa anandinchalaa 



Srikaram Song

Srikaram chuduthunnattu
kammani kalani ahwanisthu
nee kanulu etu chustunnayee
maakkuda chupinchamma
praakaram kaduthunnattu
raboye pandaga chuttu
nee guppita edo guttu
daakkunde bangaru bomma

srikaram chuduthunnattu
kammani kalanahwanisthu
nee kanulaki chupinnayi
em maakkuda chupinchamma
praakaram kaduthunnattu
raboye pandaga chuttu
nee guppita edo guttu
daakkunde bangaru bomma

jala jala jala jajula vaana
kila kila kila kinnera veena
mila mila minnanchula paina
meli thirigina chenchlayana
madhurohala lahirilona
madhinoope madhi radhajaana

nee nadkalu neevena
chusavaa enadaina
nee methhani adugula kinda
padi naligina pranalenno
gamaninchavu kasthaina
nee venakalemavuthunna
nee veepuni mullayi guchhe
kulukerugani chupulu enno
lasyam puttina ooru
lavanyam pettani peru
lalana theluso ledo
nee kaina ee theeru
nee gaale sokina varu
galib ghazal aipotharu
nee vele thakina varu
niluvella veenavutharu
kavithavoo yuvathivoo
yevathivoo gurthinchedettagamma

nakshathralu ennattu
lekkedithe emainattu
nee mansuku rekkalu kattu
chukkallo viharinchettu
ekkada naa velugantu
eppudu edurosthundantu
chikkati cheekatine chusthu
niddurane veli veyoddu
vekuvane lakkochettu
vennelatho daram kattu
idigoo vachanantu
thakshaname haajarayettu
andaka maaram maani
jokottave aaratanni
pondigga padukorani
jaagaram enduggani
lalinivoo harinivoo
tharunivoo muripinche muddula gummaa

By Lyndon B. Johnson

I have learned that only two things are necessary to keep one's wife happy. First, let her think she's having her own way. And second, let her have it.

Samveda - 16

మాలతి హరి కి ఫోన్ చేసి వేద వచ్చిన విషయం చెప్పింది. హరి అడిగాడు

"చెప్పావా విషయం వేద కి "

"లేదు. కుదరలేదు "

"సరేలే అయితే హోటల్ లో కూడా వేద ముందు విషయం బయట పెట్టకు నాకు తెలిసిన అబ్బాయి లాగే పరిచయం చేద్దాం . ఇంటికి వాచక విషయం అడగవచ్చు"

"సరే అలాగే" అంటూ ఫోన్ పెట్టేసింది .

హరి ప్రదీప్ కి ఫోన్ చేసి హోటల్ పేరు చెప్పాడు ఎక్కడ కలవాలనుకుంటునారో. అప్పుడు అడిగాడు ప్రదీప్ వేద కి విషయం చెప్పారా అని "లేదు ప్రదీప్ కుదరలేదు హోటల్ లో మాములుగా మాట్లాడుకుందాం ఇంటికి వెళ్ళాక విషయం చెప్తాను "

"సరే అలాగే.నేను ఇప్పుడు బయలదేరుతున్నాను "

"సరే అయితే నేను కూడా ఇంకో 10 నిమిషాలలో ఇంటికి బయలుదేరి అక్కడ  నుంచి డైరెక్ట్ గా ఒక గంట లో వచ్చేస్తాను"

"సరే మరి ఉంటాను" అని ఫోన్ పెట్టేసి బయలుదేరాడు ప్రదీప్.

ప్రదీప్ హోటల్ కి చేరుకొన్నాడు. కార్ ని పార్క్ చేయడానికి పార్కింగ్ లాట్ కి వెళ్ళాడు. పార్క్ చేసి వస్తుండగా "హాయ్ ప్రదీప్" అని వినిపించి వెనక్కి తిరిగి చూసాడు.

"హాయ్ కైలాష్" అన్నాడు సంతోషంగా

"హాయ్ ఎలా ఉన్నావ్"

"బావున్న నువెలా ఉన్నావ్ "

"బావున్నాను . బై ది బై తను నా  కొలీగ్  చహ్నవి "

"ఓహ్ హాయ్ "

"హాయ్ " అంది చహ్నవి

"ఏంటి ఒక్కడివే వచ్చావా " అన్నాడు కైలాష్

"హ రావడం అయితే ఒక్కడినే బట్ తెలిసిన వాళ్ళు వస్తున్నారు "

"ఓహ్ అవునా నీకు అబ్యంతరం లేకపోతె మీరు కూడా మాతో జాయిన్ అవ్వచు " అన్నాడు కైలాష్

ఆ మాటతో చహ్నవి డల్ గా ఐపోయింది . కైలాష్ లంచ్ పార్టీ ఇస్తా అన్నప్పుడు వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి లంచ్ లో తన ప్రేమ విషయం చెప్దమనుకున్ది చాహ్నవి కాని ఇప్పుడు కైలాష్ ప్రదీప్ వాళ్ళని కూడా తమతో జాయిన్ అవ్వమనడం తో ఈసారి కూడా తన ప్రేమ గురించి చెప్పే అవకాశం పోయింది అనుకుంది . తన భావాలను బయటకి కనపడకుండా జాగ్రత్త పడింది . ఇంకో సారి అవకాశం దొరికినప్పుడు మాట్లాడదామనుకుంది. వెంటనే తేరుకొని మామూలు మూడ్ లో కి వచ్చేసింది.

"నాకేం అభ్యంతరం లేదు బట్ మీకు ఏమైనా ప్రాబ్లం ఏమో " అన్నాడు ప్రదీప్

"చ అలాంటిదేం లేదు.  వెళ్దాం రా అయితే." అన్నాడు కైలాష్ .

ప్రదీప్, కైలాష్ చినప్పటినుండి ఫ్రెండ్స్, ఇంటర్ దాక కలిసి చదువుకున్నారు ఆ తరువాత ఎవరి ప్రొఫెషన్ లోకి వాళ్ళు వెళ్ళిపోయారు అయిన ఫోన్, పేస్ బుక్ ద్వార పరిచయం లోనే ఉన్నారు.

"అవును నీ తరపున ఎంత మంది ఉన్నారో చెప్తే దానికి తగినట్టు టేబుల్ చూసుకుందాం " అన్నాడు కైలాష్

"ఒక నలుగురు ఉన్నారు . మాకు దూరపు బంధువు అవుతాడు నాకు బావ వరస అవుతాడు తను , వాళ్ళ మిస్సెస్, కూతురు, చెల్లెలు వస్తున్నారు"

"ఓహ్ అయితే మొత్తం ఏడుగురు మంది కాబట్టి పెద్ద టేబుల్ తీసుకుందాం ఇటు నలుగురు అటు నలుగురు కుర్చోవచ్చు." అని చెప్పి వెయిటర్ కి మొత్తం 7 మంది అని చెప్పాడు.

వెయిటర్ చూపించిన టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చున్నారు . ఆర్డర్ అడిగినప్పుడు ఇంకోక పది నిమిషాల తర్వాత రమ్మని చెప్పాడు

"అవును ఏంటి ఏమైనా స్పెషల్ ఆ ఇవాళ " అని అడిగాడు ప్రదీప్

"స్పెషల్ కాదండి . పార్టీ ఇస్తున్నాడు " అంది చహ్నవి.

"ఓహ్ పార్టీ నా ఏంటి విశేషం " అన్నాడు ప్రదీప్

"చందన కి జాబు వచ్చింది కదా అందుకని పార్టీ. మీకు చందన తెలుసా " అంది చాహ్నవి

"అవునా ఎందుకు తెలిదు  వీడి చెల్లెలే గా తెలుసు. ఎప్పుడు వచ్చింది జాబు .?"

" మొన్ననే ఇంకా జాయిన్ అవ్వలేదు. మండే నుండి జాయిన్ అవ్వమన్నారు. ఎక్కడ రిపోర్ట్ చెయ్యాలి, ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని రేపు మెయిల్ వస్తుందని చెప్పారు. సో ఆ మెయిల్ ని బట్టి మండే మార్నింగ్ వాళ్ళు చెప్పిన బ్రాంచ్ కి వెళ్లి జాయిన్ అవ్వాలి" అన్నాడు కైలాష్ .

"ఓహ్ అయితే నా తరపున కూడా కంగ్రాట్స్ చెప్పు "

"తప్పకుండా"

వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే కైలాష్ కి ఫోన్ వచ్చింది హాస్పిటల్ నుండి .ఫోన్ లిఫ్ట్ చేసి "హలో  .. అన్నాడు "

అక్కడ నుండి సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడం తో ఫోన్ సరిగ్గా వినిపించలేదు. అందుకని బయటకి వచ్చాడు. తను బయటకి వచ్చిన రెండు నిమిషాలకి హరి ఫోన్ చేసాడు ప్రదీప్ కి ఎక్కడ ఉన్నారు అని. ప్రదీప్ వాళ్ళు కూర్చున్న టేబుల్ గురించి చెప్పగానే శర సరి అక్కడకి వచ్చాడు హరి .

"హాయ్ "

"హాయ్ బావ రండి కూర్చోండి బై ది బై తను చాహ్నవి అని నా క్లోజ్ ఫ్రెండ్ కొలీగ్. ఇప్పుడే ఫోన్ వస్తే సిగ్నల్స్ దొరకడం లేదని నా ఫ్రెండ్ బయటకి వెళ్ళాడు. సో మీకు అబ్యంతరం లేకపోతె మనం కూడా వీళ్ళతో జాయిన్ అవ్వచు."

"నాకేం అబ్యంతరం లేదు .హలో చాహ్నవి గారు తను మా మిస్సెస్ మాలతి " అన్నాడు హరి .

"హలో" అంది మాలతి

"హలో" అంటూ విష్ చేసింది చాహ్నవి .

"ఔను రెవ ఏది " అన్నాడు ప్రదీప్ .

"వస్తోంది ఇక్కడ దాక వచ్చాక పక్కన ఉన్న బొమ్మల షాప్ లో బార్బీ బొమ్మ చూసింది అది కావాలని పట్టు పట్టింది . అందుకే వేద వెళ్ళింది తనతో పాటు బొమ్మ కొనడానికి . వచేస్తారు ఒక 5 నిమిషాలలో "

"అలాగ "

వేద, రేవ బొమ్మ కొనుకొని హోటల్ వైపు వస్తున్నారు . ఇంతలో కైలాష్ ఫోన్ పెట్టేసి ఇటు వైపు తిరుగుతూ చూసుకోకుండా  డాష్ కొట్టాడు వేద కి . తను ఎవరికో డాష్ కొట్టాడని తెలియగానే అప్రయత్నం గా "సారి" అని చెప్పేసాడు .

కాని తను సారీ చెప్పేలోపే వేద తిట్టేసింది "కళ్ళు కనిపించట్లేదా " అని.

ఆ గొంతు వినేసరికి తల పైకి ఎత్తి చూసాడు . ఆ కళ్ళలో ఒక మెరుపు కనిపించింది . ఓహ్ హాయ్ నువ్వా అన్నాడు ఆనందంగా "ఛ అనవసరం గా సారీ చెప్పాను ఎవరినో గుద్దా అనుకోని. చూసావా ఇవాళ నా రోజు ఎంత బావుందో"

"ఏమన్నావ్"

"ఏమన్నాను అనవసరం గా సారీ చెప్పను అన్నాను. అసలు నువ్వే అని చూసుంటే ఇంకో సారి గుద్దే వాడిని అన్నాను. అంతే. నువ్వు మళ్ళి గుద్ద మన్న నాకేం అభ్యంతరం లేదు నేను ఎమన్నా అనుకుంటా  అని భయపడకు నీకు అడగడానికి  మొహమాటమైతే చెప్పు నాకేం లేదు " అన్నాడు కొంచం గడుసు గా

"చ నీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ రా రేవ వెళ్దాం అంది " కాని కైలాష్ దారిలో అడ్డంగా నిల్చునేసరికి వెళ్ళడానికి దారి కనిపించలేదు . వాళ్ళు హోటల్ ఎంట్రీ పాయింట్ దగ్గర నిలబడ్డారు. అక్కడ ఒకళ్ళ తరువాత ఒకళ్ళు వెళ్ళడానికే ప్లేస్ ఉంటుంది . తలుపు కి దగ్గరగా కైలాష్ ఇటు తిరిగి  నిల్చున్నాడు అతనికి ఎదురుగా వేద ఉంది.

"కొంచం అడ్డు తప్పుకుంటావా "

"అరే ఏందుకు అంత తొందర . కొంచం సేపు మాట్లాడొచ్చుగా. అయిన మాట్లాడితే ముత్యాలు రాలిపోయినట్టు అంత బెట్టు ఎందుకో. "

వేద ఏం అనలేక తిట్టుకుంటూ నిలుచుంది.

"సరే తప్పుకుంటాలే గాని ఒక షరతు మీరిద్దరూ ఇవ్వాళా నాతొ పాటు లంచ్ చేస్తే " అన్నాడు

"నీతోనా చస్తే చేయను దానికన్నా వెనక్కి వెళ్ళిపోవడం బెటర్ "

"అబ్బ అదంతా కోపమే సరేలే నన్ను నువ్వు కూర్చునే చోటకి రామన్నా వస్తా. ఏమంటావ్? "

ఇంతలో రేవ అడిగింది "ఎవరక్కా ఈ అంకుల్ "

"హాయ్ నా పేరు కైలాష్. నీ పేరేంటి " అని అడిగాడు రేవ ని

"నా పేరు రేవతి. అందరు రేవ అని పిలుస్తారు మీరు కూడా అలాగే పిలవచ్చు "

"రేవ రా వెళ్దాం " అంది వేద

"రా రేవ అని రేవ ని ఎత్తుకొని లోపలి వెళ్ళాడు "

కైలాష్ రేవ ని ఎత్తుకొని వెళ్ళగానే వేద పిలిచింది కైలాష్ ని

"కైలాష్ " అని

ఆ పిలుపు  వినగానే వెనక్కి తిరిగాడు

"ఎంత బాగా పిలిచావో తెలుసు. నువ్వు పిలిస్తే నా పేరు ఇంత బావుంటుందని ఇప్పుడే తెలిసింది. మళ్ళి పిలు "

"పాపని దిమ్పుతావా "

"నేను పాపని ఎత్తుకున్నానని కోపమా లేకపోతె నిన్ను ఎత్తుకోలేదని కోపమా. నాకు అర్ధం కావట్లేదు"

"పిచ్చిగా మాట్లాడకు పాపని దింపు"

"నేనేం ఎత్తుకొని పారిపోవట్లేదు అని రేవ తో  అన్నాడు రేవ ఇవ్వాళా అంకుల్ తో కలిసి భోజనం చేద్దాం. సరేనా "

"మరి అమ్మ నాన్న మా కోసం వెయిట్ చేస్తారుగా " అంది రేవ

"మీ అమ్మ నాన్న వచ్చారా ఎకడున్నారు "

ఒకసారి హోటల్ మొత్తం చూసి కైలాష్ కూర్చున్న టేబుల్ వైపు చేయి పెట్టి చూపించింది అక్కడ ఉన్నారని. రేవ ఆ టేబుల్ వైపు చూపించేసరికి కైలాష్ మొహం వెలిగిపోయింది . వేద వైపు తిరిగి అన్నాడు .

"అవును ఇందాక నాతో చస్తే భోజనం చేయనన్నావ్ . బట్ నీ బాడ్ లక్ ఇవాళ నువ్వు నాతోనే భోజనం చేస్తున్నావ్ "

"నేవ్వేర్ "

"నువ్వు నేవ్వేర్ అన్న ఎమన్నా జరిగేది అదే .కావాలంటే చూడు" అంటూ రేవ ని తీసుకొని టేబుల్ వైపు నడిచాడు.

"హాయ్ రేవ " అన్నాడు ప్రదీప్

"హాయ్ "

"రా ర ఏంటి ఇంట సేపు అయింది ఇంపార్టెంట్ కాల్ ఆ." అన్నాడు ప్రదీప్

"హా అవును"

"కైలాష్ తను హరి అని నేను చెప్పనే మా బావ అవుతాడు , వాళ్ళ మిస్సెస్ మాలతి , వాళ్ళ కూతురు రేవ ఇంకా వాళ్ళ చెల్లెలు వేద"

"ఓహ్ హాయ్. ప్రదీప్ మీ గురించి చాల చెప్పాడు నా పేరు కైలాష్. నేను ప్రదీప్ చిన్నపటినుండి ఫ్రెండ్స్. తను నా కొలీగ్ చాహ్నవి." అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు.

"నమస్తే అన్నారు హరి, మాలతి మీకు రేవ ఎలా తెలుసు" అడిగాడు హరి కైలాష్ రేవ ని ఎత్తుకొని రావడం తో

"ఫోన్ మాట్లాడి వస్తుంటే తలుపు దగ్గర పరిచయం అయ్యింది " అని చెప్పాడు

"ఓహ్ .. అలాగ .. రండి కూర్చోండి. హరి మాలతి రేవ వేద ఒక వైపు కూర్చున్నారు . ప్రదీప్, కైలాష్ చహ్నవి ఇంకో వైపు. వాళ్ళ భోజనం అయ్యేసరికి మధ్యాహ్నం 3 అయ్యింది. వేద భోజనం చేస్తున్నంత సేపు ఏం మాట్లాడలేదు. ప్రదీప్ మాట్లాడదామని ప్రయత్నించిన ముభావం గా సమాధానాలు చెప్పేసరికి మాట్లాడించలేకపోయాడు. వేద ముభావం గా ఉండడం తో కైలాష్ అడిగాడు హరి ని

 "ఏంటి మీ చెల్లెలు అసలు మాట్లాడడం లేదు ఒంట్లో బాలేదా? " అన్నాడు వేద వైపు చూస్తు

ఆ మాటకి తలెత్తి సూటిగా కైలాష్ వైపు చూసిన్ది వేద.

"అదేం లేదు కొత్తవాళ్ళతో కలవడానికి కొంచం టైం పడుతుంది అంతే "

"ఓహ్ అలాగా"

అయితే వేదని మాట్లాడించడానికి ఇదే మంచి అవకాశం అనిపించింది కైలాష్ కి "మీరేం చేస్తుంటారు ?" అని అడిగాడు వేదని.

కైలాష్ వేదని పెళ్ళైతే చేసుకున్నాడు గాని వేద గురించి మొదటనుండి తనకు ఏమి తెలిదు తను ఏం చేస్తుంది, ఏం చదువుకుంది, తన ఇష్టా ఇష్టాలేంటి ఇవేవి తెలియదు. ఎందుకంటే  తను చేసిన అతి పెద్ద పొరపాటు అదే.ఆ రోజు ఆ సమయం లో ఉచితానుచితాలు మరచిపోయి అంజలి తనను ప్రేమ పేరుతో చేసిన మోసంతో, తనకి చేసిన ద్రోహం తో అంజలి
 మీద కోపంతో వేదే అంజలి అనుకోని వేద చెప్తున్నా వినిపించుకోకుండా బలవంతంగా వేద మెడ లో తాళి కట్టాడు.ఏందుకంటే వేద, అంజలి ఇద్దరు చూడడానికి ఒకేలా ఉంటారు. అక్క చెల్లెళ్ళు, కవల  పిల్లలు. ఒక విధంగా అది రాక్షస వివాహమనే చెప్పాలి. తరువాత తప్పు తెలుసుకొని వేద క్యారెక్టర్ గురించి తెలుసుకొని పశ్చాతాప పడేసరికి సమయం మించిపోయింది. వేద గురించి, తన స్వభావం గురించి, తన విభిన్నత గురించి, తన ఇష్టా ఇష్టాల గురించి  తెలిసుకున్న తరువాత వేద అంటే ఇష్టం పెరిగింది. అది ఎప్పుడు ప్రేమ లోకి మారిందో తెలియలేదు కైలాష్ కి.  ఇప్పుడు వేదని ఆ ఇంటి కోడలిగా తీసుకొనిరావడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు.కాని వేద వాళ్ళని చూస్తేనే అసహ్యించుకుంటోంది. ఎంత ప్రయత్నిచిన వేద తో కనీసం మాట్లాడానికి , కనీసం మనస్పూర్తిగా క్షమాపణలు చెప్పడానికి కూడా కుదరడం లేదు. తను చెప్పేది వినాలంటే ముందు వేద కి తన పైన ప్రేమ కలగకపోయినా తన మీద కోపం అయితే పోగొట్టాలని నిర్ణయించుకున్నాడు దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాడు . ఇప్పటకి రెండు నెలలయ్యింది కాని కొంచం కూడా తన ప్రయత్నం ఫలించలేదని తనకు తెలుసు అందుకే నిరాశ పడకుండా ఇంకా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. పాత ఆలోచనలన్నీ ఒక్కసారిగా అతని చుట్టుముట్టేసాయి . వేద ఒక 6 నెలల ముందు వరకు చెన్నై లో పని చేసింది ఆ తరువాత హైదరాబాద్ వచ్చింది .వేద పాత కంపెనీ వివరాల గురించి తెలుసు కాని కొత్త కంపెనీ వివరాలు, హైదరాబాద్ లో వేద ఫోన్ నెంబర్ అంత పూర్తిగా తెలియదు. అందుకే అడిగాడు "మీరేం చేస్తుంటారు ?" అని

"భోజనం " అంది కోపంగా


"వేద. ఏంటి ఆ చెప్పడం"  అని మందలించాడు హరి


"తను ఒక సాఫ్ట్  వేర్ ఇంజనీర్ " అన్నాడు హరి


"ఎక్కడ "


దానికి సమాధానం కూడా వేద చెప్పకపోవడంతో హరి ఏ చెప్పాడు.హరి వేద వాళ్ళ కంపెనీ పేరు చెప్పగానే కైలాష్ ఆశ్చర్యపోయాడు మొదట కాని తరువాత ఆనందమనిపించింది ఎందుకంటే చందన కి కుడా అదే కంపెనీ లో జాబు వచ్చింది.ఈ విషయం ఒకసారో చందన తో మాట్లాడదాం అనుకున్నాడు .


"ఏంటండి ఇవాళ మీ చెల్లెలు మౌన వ్రతం లో ఉండ ఏం మాట్లాడడం లేదు." అన్నాడు హరి తో .


హరికి కూడా ఆ విషయం అర్ధం కాలేదు ఇందాక వచ్చే ముందు దాక బానే ఉంది. సడన్ గా ఏమైందో ఏమో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు అనిపించింది కాని పైకి మాత్రం అన్నాడు


"అదేం లేదు లెండి ఇంకో రెండు మూడు  సార్లు మీరు కనిపడితే కొత్త పోయి మాములుగానే మాట్లాడుతుంది."



బిల్ మొత్తం కైలాష్ పి చేసాడు "ఎందుకు రా అంత తొందర షేర్ చేసుకునే వాళ్ళం గా "


"ఎం పర్వాలేదు ఇది నా ట్రీట్ అనుకో" అన్నాడు కైలాష్


హోటల్ నుండి బయటకి వస్తూ ఎవరికీ వినిపించకుండా అన్నాడు వేదతో "చూసావా ఇవ్వాళా నువ్వు నాతోనే భోజనం చేసావ్. పోనిలే నేను అడిగినందుకు నా కోరిక మన్నించినందుకు చాల థాంక్స్" అని చెప్పి బయటకి వచేసాడు.


వేద కైలాష్ వేల్లినవైపే చూస్తూ నిలుచుంది


ఇంతలో హరి వచ్చి అన్నాడు "ఏంటి ఇక్కడే నిలబడిపోయావ్ రా " అని


రేవ ని తీసుకొని హోటల్ బయటకి వెళ్ళింది . వేద ని , రేవ ని , మాలతి ని, చాహ్నవి ని అక్కడే ఆగమని చెప్పి కార్ తీసుకొని రావడానికి వెళ్లారు కైలాష్, ప్రదీప్, హరి ముగ్గురు. కార్ తీసుకొని రావడానికి వెళ్ళేటప్పుడు అడిగాడు ప్రదీప్ హరి ని "ఏంటి వేద అంత డల్ గా ఉంది ఏమైనా అయ్యిందా అని "


"అదే నాకు అర్ధం కావట్లేదు నాకు పరిచయం అయినప్పటినుండి ఇలా ఎప్పుడు చూడలేదు వేద ని " అన్నాడు హరి


"అవును వేద నీకు ఎలా పరిచయం బావ"


"రేవ ద్వారా పరిచయం అయ్యింది వేద వాళ్ళ ఆఫీసు నుండి రేవ వాళ్ళ స్కూల్ లో ఏదో ఈవెంట్ ప్రతి వారం ఒక రెండు నెలలు చేసారంట అలా రేవ ద్వారా పరిచయం అయ్యింది . పరిచయం అయినప్పటినుండి అన్నయ్య అంటూ నాకు నిజంగానే చెల్లెలు లేని లోటుని తీర్చింది. చాలా మంచి అమ్మాయి. తనకి కుదిరినప్పుడు శనివారం, ఆదివారం ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటుంది "  అన్నాడు హరి.


"ఓహ్ అలాగ" అన్నాడు ప్రదీప్.


"కాని వేద ని, మిమ్మల్ని చుస్తే ఎవరినా సొంత అన్నచెల్లెళ్ళు అనుకుంటారు. అంత బావుంది మీ రిలేషన్  షిప్" అన్నాడు కైలాష్


"అవునండి చెప్పానుగా తను నాకు చెల్లెలు లేని లోటు తీరుస్తుంది" అన్నాడు హరి . వాళ్ళు మాటలలోనే పార్కింగ్ లాట్ దాక వెళ్ళిపోయారు . కార్స్ తీసుకొని బయటకి వచ్చారు.


కైలాష్, చాహ్నవి ఒక కార్ లో, ప్రదీప్ ఒక కార్ లో, వేద వాళ్ళు ఒక కార్ లో వెళ్ళిపోయారు






Tuesday, 24 June 2014

Samveda - 15

ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళగానే ఇంటర్వ్యూ విషయం చందనకి చెప్పాడు కైలాష్ . చాహ్నవి మెయిల్ ఐడి చెప్పి రెస్యుమ్ పంపించమని చెప్పాడు. ఆ మరుసటి రోజు కాకుండా తరువాత రోజు చందన ఇంటర్వ్యూ కి బయలుదేరింది . కైలాష్ చందన ని ఇంటర్వ్యూ జరిగే చోట దింపేసి తను హాస్పిటల్ కి వెళ్ళిపోయాడు .
         
                ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర అడిగాడు కైలాష్ చందన ని ఇంటర్వ్యూ ఏమైంది అని "చాలా బాగా చేసాను అన్నయ్య . ఖచ్చితంగా జాబు వస్తుంది" అంది.
"ఓహ్ అయితే ఇంటర్వ్యూ చాలా బాగా జరిగిందన్నమాట . ఇంతకీ రిసుల్ట్  ఎప్పుడు చెప్తారంట"
"ఇంకో రెండు రోజులలో చెప్తారు " అంది .
"పోనిలే ఇది కనక వచ్చేస్తే దాని లైఫ్ సెటిల్ అయిపోతుంది" అంది రాధా.

ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక ఆరు బయట కూర్చున్నారు వాళ్ళంతా.అప్పుడు గేటు చప్పుడవడంతో వెనకకి తిరిగి చూసారు అంత. వేద, కస్తూరి వస్తూ కనిపించారు . వేద బండి ఇంకా సర్వీస్ సెంటర్ లోనే ఉంది. అందుకే కస్తూరి వేద ని డ్రాప్ చేయడానికి వచ్చింది. ఎలాగో రాత్రి అయిపొయింది కాబట్టి వేద కస్తూరిని వాళ్ళ ఇంట్లోనే ఉండిపొమ్మని చెప్పింది. మొన్న ఎంగేజ్మెంట్ అప్పుడు తీసిన ఫొటోస్ ని ఫోటోగ్రాఫర్ దగ్గర నుంచి తెచుకొని సరా సరి వేద వాళ్ళ ఇంటికి వచ్చారు. అందులో ఉన్న ఫొటోస్ అన్ని చూసి ఏవి బావున్నాయో ఫోటో గ్రఫేర్ కి చెప్తే ఆల్బం చేసి ఇస్తా అన్నాడు ఫోటోగ్రాఫర్ ఆ పని మీదే ఫొటోస్ తెచుకున్నారు రాత్రికి, అన్ని ఫొటోస్ తెచుకొని చూసి అందులో నచ్చినవి ఇవ్వడానికి  . ఆ పని చేసి పడుకోనేసరికి రాత్రి ఒంటి గంట అయ్యింది . ఆ మరుసటి రోజు ఉదయం ఆఫీసు కి వెళ్లేముందు ఫోటోగ్రాఫర్ కి వాళ్ళు సెలెక్ట్ చేసిన ఫొటోస్ ఇచ్చి వెళ్లారు. ఆ మరుసటి రోజే చందన రిసుల్ట్ వస్తుంది అందుకే చాలా ఆత్రంగా ఎదురుచూస్తోంది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకి తన ఫోన్ కి మెసేజ్ వచ్చింది తను సెలెక్ట్ అయినట్టు. ఇంట్లో రాధకి, హంస కి చెప్పింది తను సెలెక్ట్చా అయ్యినట్టు. వాళ్ళు చాలా సంతోషించారు. వెంటనే మీ అన్నయ్యలకి ఫోన్ చేసి విషయం చెప్పు అంది. ఆనందంగా వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి విషయం చెప్పింది తను సెలెక్ట్ అయ్యినట్టు. "ఓహ్ కంగ్రాట్స్ రాత్రి ఇంటికి వచ్చాక మిగితా విషయాలు మాట్లాడుకుందాం" అన్నాడు కైలాష్.కైలాష్ చాలా ఆనందంగా కనిపించడంతో చాహ్నవి అడిగింది కైలాష్ ని విషయం ఏంటని. చందన సెలెక్ట్ అయ్యినట్టు చెప్పి థాంక్స్ చెప్పాడు కైలాష్ చాహ్నవి కి. "చ ఇంత చిన్నదానికి థాంక్స్ ఎందుకు. నాకు తెలిసిన విషయం నీకు చెప్పాను తను సొంతంగా జాబు తెచ్చుకుంది. అది సరే మరి పార్టీ ఎప్పుడు ఇస్తున్నావ్ ?"

"తప్పకుండా ఇస్తాను ఈ శనివారం లంచ్ కి వెళ్దాం సరేనా ?"

"సరే" అంది చాహ్నవి.ఇంకా పేషెంట్స్ ని చూడాల్సి రావడంతో  బాయ్ చెప్పి వెళ్ళింది చాహ్నవి .

ఆ రోజు భోజనాలు అయిపోయాక లాన్ లో కుర్చునప్పుడు అడిగాడు శైలేష్ చందన ని "ఎప్పుడు జాయిన్ అవ్వమన్నారు "?

"సోమవారం నుండి ."

"ఓహ్ అయితే ఈ ఆదివారం వరకే ఫ్రీ అన్నమాట"

"అవును. సోమవారం ఉదయం 9 గంటలకి రిపోర్ట్ చేయమన్నారు ఆఫీసు లో. అన్నయ్య రేపు శనివారం మా ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇద్దామనుకుంటున్నాను. ఏమంటావ్ ?"

"నీ ఇష్టం రా. ఇవ్వు" అన్నాడు శైలేష్ .

కొంచం సేపు కబుర్లు చెప్పుకున్నాక వెళ్లి పడుకున్నారు"

                   ఆ రోజు శనివారం . వేద ఉదయమే బయలుదేరింది అబిడ్స్ లో ఉన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళింటికి . వాళ్ళ అన్నయ్య పేరు హరి, అతనికి పెళ్ళయ్యి ఏడు సంవత్సరాలయ్యింది . వాళ్ళ ఆవిడ పేరు మాలతి .వాళ్లకి ఒక పాప ఉంది. ఆ అమ్మాయి పేరు రేవతి. వాళ్ళకి మూడు డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉంది. అందులో హరి ఒకటి చూసుకుంటాడు మిగితా రెండు అతని కింద పని చేసేవాళ్ళు చూసుకుంటారు .వేద వాళ్ళ ఇంటి గేటు తీయగానే రేవతి పరిగెత్తుకుంటూ వచ్చింది "అక్కా" అంటూ.

"హాయ్ రేవ. ఎలా ఉన్నావ్ ?"

"బావున్నాను అక్క". ఇంతలో మాలతి వచ్చింది .

"ఎలా ఉన్నావమ్మ?" అంది మాలతి .

"బావున్న వొదిన నువెల్ల ఉన్నావ్?"

"బావున్న రా లోపలకి".

"వొదిన అన్నయ్య ఏడి"?

"స్టోర్స్ కి వెళ్లారు. అది సరే గాని టిఫిన్ చేస్తావా"?

"హ ఆకలేస్తోంది చేస్తాను. ఏంటి వొదిన టిఫిన్ ఇవాళ?"

"ఇడ్లి . ఉండు తీసుకొని వస్తా? అంది

టిఫిన్ చేసాక కొంచం సేపు వాళ్ళ వొదిన తో కబుర్లు చెప్పింది . కస్తూరి ఎంగేజ్మెంట్ గురించి చెప్పింది .

"వొదిన మొన్న కస్తూరి ఎంగేజ్మెంట్  జరింగింది. ఎంత బాగా జరిగిందో తెలుసా. కనీసం రెండు వందల  మంది వచ్చారు ఎంగేజ్మెంట్ కె. పెళ్ళికి కనీసం ఏడు వందల మంది దాక వస్తారంట. ఆంటీ చెప్పారు. పెళ్ళికొడుకు వాళ్ళు ఎంగేజ్మెంట్ కి పెట్టిన చీర చాలా బావుంది. అది కట్టుగో గానే కస్తూరి ఎంత బావుందో .అసలు దానికోసం అని ఆ చీర ని అబ్బాయ్యే సెలెక్ట్ చేసాడంట. చాలా మంచి టేస్ట్ ఉంది ఆ అబ్బాయి కి "

"ఔను మరి మీ కస్తూరి లాంటి అమ్మాయి ని ఎంచుకునప్పుడే ఆ అబ్బాయి టేస్ట్ గురించి తెలిసిపోయింది ఇంకా ప్రత్యేకంగా చెప్పేదేముంది చెప్పు."

"ఔననుకొ"

అసలు ఇవాళ వేద ని మాలతే అడుగుదామనుకుంది పెళ్లి గురించి తన అభిప్రాయం ఏంటని ఏందుకంటే హరి తనకి తెలిసిన వాళ్ళ అబ్బాయి కోసం . గురించి చెప్పాడు. తను చాలా మంచి వాడని ఆ అబ్బాయికి వేద ని ఇస్తే బావుంటుందని చెప్పాడు .ఆ అబ్బాయి పేరు ప్రదీప్.ఒక యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా పని చేస్తాడు  వేద కి ఇంకా ఆ విషయం చెప్పలేదు. ప్రదీప్ కి  మాత్రం చెప్పాడు  ఇలా తనకి చెల్లెలి వరస ఒక అమ్మాయి ఉందని . ఆ అమ్మాయి చాలా మంచిదని. ఇవాళ మధ్యాహ్నం లంచ్ కి తీస్కొని వస్తా అని అక్కడ కలిసి మాట్లాడుకొని అభిప్రాయాలు తెలుసుకోవచని ప్రదీప్ కి  చెప్పి ఒప్పించాడు. ప్రదీప్ కూడా దానికి ఒప్పుకున్నాడు ఇంకా ఆ విషయం వేద కి చెప్పలేదు. మాలతీ తో చెప్పి వెదకి చెప్పమన్నాడు . అందుకే మాలతీ వేద ని పొద్దునే రమ్మంది వాళ్ళ ఇంటికి .అసలు విషయం ఎలా మాట్లడాలా  అని ఆలోచిస్తున్న సమయం లో వేద కస్తూరి ఎంగేజ్మెంట్ విషయం చెప్పడం తో ఆ అవకాసం జారవిడుచుకోవలనుకోలేదు. వేద కు జరిగిన పెళ్లి గురించి వాళ్ళకి తెలియదు . వాళ్ళకే కాదు కస్తూరికి , వాళ్ళ ఆఫీసు లో పని చేసేవాళ్ళకి ఎవరికీ తెలిదు .అందుకే అడిగింది

"అది సరే గాని నీ ఫ్రెండ్ పెళ్లి కూడా అయిపోతోంది మరి నువేప్పుడు చెసుకుంటావ్ పెళ్లి ?"

ఆ మాట వినగానే వేద డల్ గ అయిపొయింది . ఎం మాట్లాడకుండా చూస్తోంది .

"ఏంటి ఏం మాట్లాడావ్?"

"ఆ.. ఏం లేదు ఏదో ఆలోచిస్తున్న "

"ఏంటి పెళ్లి గురించి అడగంగానే ఆలోచనలా. నీకెలాంటి వాడు కావాలో చెప్పు అలంటి వాడినే చూద్దాం. ఎలాగో రేపు మీ కస్తూరి పెళ్లి జరుగుతుంది గా అప్పుడు నీ కిష్టమైన వాడిని, నీకు నచ్చిన వాడిని చూసుకున్నావనుకో  హ్యాపీ గా నీ పెళ్లి కూడా జరిపెచేయొచ్చు . ఏమంటావ్?" అంది అసలు ఏం చెప్తుందా అని

"...."

"ఏంటి ఏం మాట్లాడావ్ . ఇంతకీ నీకు నచిన వాడు ఎలా ఉండాలి "

"ఆ ... ఇంకా ఏం ఆలోచించలేదు వొదిన. అయిన ఆ విషయం మనం తరువాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం"

ఇంక లాభం లేదని అసలు విషయం లోకి వచ్చింది

"ఇంకెప్పుడు తర్వాత. ఎప్పుడడిగిన ఇలాగే మాట దాటవెస్తున్నావ్ ఇదేం బాలేదు.ఇవ్వాళ చెప్పాల్సిందే."

ఇంకా బెట్టు చేస్తే వొదినకి అనుమానం వస్తుందేమో అని భయపడింది వేద . అందుకే నోటికోచిందేదో చెప్పేసింది.

"ఏముంది వొదిన మాములుగా అందురు కోరుకునేదే. చూడడానికి బాగుండాలి. మంచి జాబు చేస్తూ ఉండాలి . మంచి వాడై ఉండాలి "

"అంతేనా . ఇంకేం అక్కరలేదా?"

"అంతే. చాలు " అంది

వేద అంత ముభావంగా చెప్పేసరికి అసలు విషయం చెప్పలేకపోయింది మాలతి.

"సరే గాని ఇవాళ మధ్యాహ్నం లంచ్ కి బయటకి వెళ్తునాం."

"బయటకా ఎక్కడికి "

"అది వేల్లెతప్పుడే చెప్పేది "

"సరేలే" .ఇంతలో రేవతి వచ్చింది అక్క అంటూ

"అక్కా నిన్న మా స్కూల్ లో ఏం జరిగిందో తెలుసా" అంటూ స్కూల్ విషయాలు చెప్పడం మొదలు పెట్టింది



Tuesday, 17 June 2014

Samveda - 14

వేద స్నానం చేసి బయటకి వచ్చింది, నిన్న కైలాష్ ఇచ్చిన నైట్ డ్రెస్ వేసుకుంది. అప్పటికి ఉదయం తోమ్మిదవుతోంది . ఇంతలో కైలాష్ వచ్చాడు.

"గుడ్ రెడీ అయిపోయావా పద టిఫిన్ తినేసి వేల్దువు గాని" అన్నాడు కైలాష్

అబ్బ ఇప్పుడు ఇక్కడ టిఫిన్ కూదా తినాలా అనుకుంది వేద. వొద్దని చెప్దామనుకుంది కాని దాని వల్ల ప్రయోజనం ఉండదని నిన్న రాత్రి నుండి జరిగిన సంఘటనల వల్ల తెలిసింది. అది కాకుండా అప్పుడే తొమ్మిది అయిపొయింది ఆఫీసు కి కూడా వెళ్ళాలి దాని కన్నా ముందర కస్తూరి వల్ల ఇంటికెళ్ళి తన హ్యాండ్ బాగ్ తెచ్చుకోవాలి. మళ్ళి ఇంటికి వచ్చి డ్రెస్ మార్చుకొని వెళ్ళాలి. అసలే బండి పంచర్ అయ్యింది .ఇప్పుడు కాదు కూడదు అంటూ కూర్చుంటే టైం అయిపోతుందనిపించింది అందుకే ఏం మాట్లాడకుండా కైలాష్ వెనకే నడిచింది.

వేద డైనింగ్ టేబుల్ దగ్గరకి రాగానే చూసింది అప్పటికే టిఫిన్ తినడానికి అందరు కుర్చోవడాన్ని. వేద రాగానే అందరు పలకరింపుగా నవ్వారు. వేద నుండి ఎలాంటి స్పందన లేదు. తిన్నగా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీ లాక్కుని కూర్చుంది . తన పక్కన కైలాష్ వచ్చి కూర్చున్నాడు. ఆ రోజు టిఫిన్ లోకి ఇడ్లీలు చేసారు. వేద టిఫిన్ చేసింది ఇంకా బయలదేరబోతుండగా కైలాష్ పిలిచాడు

"వేద నీ బండి పంచర్ అయ్యింది గా నిన్న రాత్రి ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి నీకు కష్టమవుతుంది నేను ఎలాగో హాస్పిటల్ దాక వెళ్తున్నాను నువ్వు వచావంటే నిన్ను కస్తూరి వల్ల ఇంట్లో దింపేసి వెళ్ళిపోతాను " అన్నాడు కైలాష్

"అవసరం లేదు నేను ఆటో లో వెళ్ళిపోతాను"

"పోనీ వెళ్ళు వేద ఇప్పుడు ఆటో లు దొరికి నువ్వు వెళ్ళడానికి చాల టైం పడుతుంది . ఆటో దొరకాలంటే రోడ్ మీద దాక నడవాలి .పైగా నువ్వు నైట్ డ్రెస్ లో ఉన్నావ్ ఇలా వెళ్లి ఆటో ఎక్కవంటే పరిస్థితి ఏంటో నువ్వే అర్ధం చేసుకో. కైలాష్ దిమ్పెస్తా అంటున్నాడు గా తనతో వెళ్ళు" అంది హంస.

"అవసరం లేదండి నేను వెళిపోగలను. అది కాకుండా నాకు కైలాష్ తో వెళ్ళడం ఇష్టం లేదు. " అంది వేద . అనడమైతే అంది గాని ఇప్పుడు నైట్ డ్రెస్ లో రోడ్ మీద దాక ఎలా నడవాలి అనుకుంది వేద. పొనీ వీళ్ళని ఫోన్ అడిగి ఒక ఫోన్ చేసి కస్తూరి ని ఇక్కడికి రమ్మంటే బావుంటుంది . కాని వీళ సహాయం తీసుకోవాల్సి వస్తుంది.అది నాకు ఇష్టం లేదే ఏం చేద్దాం . కైలాష్ దిమ్పుతా అంటున్నాడు దిమ్పున్చుకుంటే సహాయం తీసుకునట్టే గా దాని కన్నా ఫోన్ అడిగి తీసుకోవడమే బెటర్ అనుకుంది.తను ఫోన్ అడిగేలోగానే కైలాష్ అన్నాడు

"అది నాకు తెలుసు కాని ఇప్పుడు నిన్ను ఇలా వదిలేసి నేను వెళ్ళాను నిన్ను రాత్రి నేను తీసుకొచ కాబట్టి నా బాధ్యత గా మీ కస్తూరి వాళ్ళ ఇంట్లో దింపుతాను అక్కడ నుండి నీ ఇష్టం " అంటూ కార్ కీస్ తీసుకోవడానికి వెళ్ళాడు. కీస్ తీసుకొని బయటకి రాగానే వేద అంది.

"డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు ఒకసారి ఫోన్ ఇస్తే చాలు.ఒక కాల్ చేసుకొని ఇస్తా"

కైలాష్ బాగా ఆలోచించాడు ఇపుడు ఫోన్ ఇస్తే ఖచితంగా కస్తూరి కి ఫోన్ చేసి రమ్మంటుంది ఇంక అప్పుడు తను డ్రాప్ చేయడానికి వీలు ఉండదు . దానితో తనతో మాట్లాడే అవకాశం కూడా మళ్ళి ఇప్పట్లో రాదు. అప్పుడు తను రాత్రి అనుకున్నదంతా వృధా అయిపోతుంది. అందుకే ఇంట్లో అందరి వైపు తిరిగి ఫోన్ ఇవ్వద్దు అన్నట్టు గా సైగ చేసాడు . వేద తో అన్నాడు

 "ఇప్పుడెందుకు ఫోన్ నీకు కస్తూరి కి ఫోన్ చేసి ఇక్కడికి పిలవడానికే కదా. నిన్నంత తను ఎంగేజ్మెంట్ లో అలసిపోయింది . మళ్ళి ఇవాళ ఆఫీసు కి వెళ్ళాలి నువ్వు ఇంక ఇక్కడకి పిలిచి తనని ఇబ్బంది పెడతావా. అవసరం లేదు నేను దిమ్పెస్తాను బయలదేరు"

ఒకసారి గా వేద కి ఆశ్చర్యం వేసింది తన మనసులో విషయం అతడికెల తెలిసిందా అని, అతడు చెప్పింది కూడా నిజమే అనిపించింది నిన్నంత అలసి పోయి ఉంటుంది మళ్ళి రమ్మంటే బాగుండదేమో అనుకుంటూ ఉండగా కైలాష్ కార్ తీసుకొచి వేద పక్కన ఆపాడు  కార్ డోర్ తీసి "రా ఎక్కు " అన్నాడు

వేద కార్ వెనక డోర్ తీసింది ఎక్కడానికి .

"నేనేమన్నా నీ డ్రైవర్ ని అనుకుంటున్నావా ముందు కూర్చో "

వెనక డోర్ వేసేసి ముందుకి వచ్చింది . ముందు డోర్ ఓపెన్ చేసి కూర్చున్ది . కైలాష్ బయలదెరబోతు ఉండగా కస్తూరి వచ్చింది వాళ్ళ ఇంటికి .

కస్తూరిని చూడగానే వేద కైలాష్ బండి దిగేసింది. కైలాష్ కి కస్తూరి ని చూడగానే ఆ క్షణం లో చాల బాధ కలిగిందనే చెప్పాలి. తను రాత్రంతా బాగా ఆలోచించాడు ఎలాగైనా వేద తో ఒంటరిగా మాట్లాడాలని.ఎలాగో తన బండి పంచర్ అయ్యింది కాబట్టి పొద్దున్న తను వేద ని ఆఫీసు లో దింపడానికి తీసుకొని వేల్దామనుకున్నాడు .అప్పుడు వేద తో ఒంటరిగా మాట్లాడదామనుకున్నాడు. కాని ఆ అవకాశం వస్తుందో రాదో అనుకున్నాడు . కాని అనుకోకుండా పొద్దున్న ఆ అవకాశం వచేసరికి చాల ఆనందపడ్డాడు .. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం అనుకున్నాడు అందుకే వేద ని కస్తూరి వాళ్ళ ఇంటికి తీసికేల్లెముందు ఎక్కడికైనా తీసుకెళ్ళి కొంచం సేపు మాట్లాడి అసలు ఆ రోజు జరిగిన విషయం, తను వేద ని అపార్ధం చేసుకున్న విషయం  పూర్తిగా చెప్దామనుకున్నాడు . ఆ రోజు తను చాల తొందర పడ్డాడని, దానికి క్షమించమని అడుగు దామనుకున్నాడు. అంత తొందరగా వేద తనని క్షమిస్తుందన్న నమ్మకం కైలాష్ కి లేదు, కాని కనీసం జరిగిన విషయం ఇది అని , దానికి తను చాల పశ్చాత్తపపడుతున్నాడని చెబుదామనుకున్నాడు కాని ఈలోపు కస్తూరి రావడంతో అంత తారు మారు అయిందనే చెప్పాలి. మళ్ళి ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు .వేద కస్తూరి దగ్గరకి వెళ్ళడం తో ఇంక చేసేదేం లేక హాస్పిటల్ కి వెళ్ళిపోయాడు

"హాయ్ కస్తూరి " అంది ఆశ్చర్యంగా

"హాయ్ ఏంటే ఇది నిన్న నువ్వు నీ హ్యాండ్ బాగ్ మా ఇంట్లో నే మర్చిపోయావు పొద్దున్న నీకు ఫోన్ చేద్దాం అని చుస్తే నీ ఫోన్ మా ఇంట్లోనే రింగ్ అవుతోంది. తీరా చూస్తే నీ హ్యాండ్ బాగ్ మా ఇంట్లోనే ఉంది . అందులో ఇంటి తాళం, వాలెట్ కూడా ఉన్నట్టు ఉన్నాయి. అల ఎలా మర్చిపోయావు ?

"ఇది బావుందే ఎలా మరిచిపోయావంటే తొందరలో మరిచిపోయుంటాను. తీసుకొచ్చి మంచి పని చేసావ్ నేనే ఇప్పుడు మీ ఇంటికి వద్దమనుకుంటున్న ఆఫీసు కి వెళ్ళడానికి డ్రెస్ కుడా లేదు. దా పైకి వెళ్దాం . డ్రెస్ మార్చుకొని ఆఫీసు వెళ్దాం . మర్చిపోయాను ఇవాళ నీ బైక్ మీదే నేను కూడా నా బండి పంచర్ అయింది . దాన్ని సర్వీస్ సెంటర్ లో ఇచ్చి వెళ్దాం " అంటూ పైకి వెళ్లారు ఇద్దరు .

"దా కూర్చొ నేను ఇప్పుడే వస్తాను" అని లోపలి వెళ్లి డ్రెస్ మార్చుకొని వచ్చింది వేద.

"అవును బండి ఎప్పుడు పంచర్ అయింది . నిన్న సాయంత్రం దాక బానే ఉంది గా "

"నిన్న రాత్రి అయ్యిందే ఇంటికొచేటప్పుడు  ఏదో గాజు పెంక గుచుకునట్టు ఉంది "

"మరి ఎలా వచావ్?"

"కింద ఇంట్లో వాళ్ళ అబ్బాయి లిఫ్ట్ ఇచ్చాడు"

"అవునా  మరి రాత్రంతా కిందే ఉన్నావా ?"

"హ అవును. అది సరే గాని ఆంటీ వాళ్ళు ఎలా ఉన్నారు అలసట తగ్గిందా?" అంటూ మాట మార్చింది వేద ప్రసంగం పొడిగించకుండా

"ఆ బానే ఉంది . ఇంకా కొంచం బడలిక గా ఉంది కాని పర్వాలేదు. వెళ్దామా "

"ఆ పద ." అంటూ ఇద్దరు బయలుదేరారు ఆఫీసు కి .

దారిలో వేద బండి రిపేర్ చేయడానికి సర్వీస్ సెంటర్ లో ఇచ్చింది .

 
                    కైలాష్ హాస్పిటల్ కి వెళ్ళాడన్నమాటే గాని అతని మనసు మనసులో లేదు . నిన్న రాత్రి నుంచి జరిగిన సంఘటనలు ఒకదాని తరువాత ఒకటి గుర్తోచి మనసుని కలవరపెడుతున్నాయి . తను అనుకునట్టు పొద్దున్న వేద తో మాట్లాడి ఉంటె బావుండు నని పదే పదే అనిపిస్తోంది. ఇప్పటి దాక ఏమో కాని నిన్న రాత్రి వేద వాళ్ళ ఇంటికి వచినప్పటినుంది తనని వాళ్ళ ఇంట్లో ఉంచుకోవాలనే కోరిక బల పడుతోంది.

"హాయ్ కైలాష్ " అంటూ చాహ్నవి వచ్చింది కైలాష్ రూం లో కి .

కైలాష్ నుంచి ఏమి సమాధానం రాకపొయెటప్పడికి తన రెండు చేతులు కైలాష్ కాళ్ళ ముందు ఆడించింది
"హాయ్ ..." అంటూ

"ఓహ్ హాయ్ ఎప్పుడు వచ్చావ్ "

"హా ఎప్పుడు వచ్చావా నేను రూం లో కోచింది కూడా చూడకుండా ఎం ఆలోచిస్తున్నావ్ ఇంతసేపు "

"ఏం లేదులే నీ రౌండ్స్ అయిపోయాయ?" అన్నాడు కైలాష్

"ఆ అయిపోయాయి నీవి "

"ఇంకా వెళ్ళలేదు వెళ్ళాలి . ఇందాకే వచ్చా "

"వస్తూనే ఆలోచనలో కూరుకుపోయావ్ అంతేనా " అంది చాహ్నవి.

కైలాష్ చిన్నగా నవ్వాడు "అదేం లేదులే" అన్నాడు.

           చాహ్నవి ఆ హాస్పిటల్ లో కొత్తగా ఆరు నెలల ముందు వచ్చి చేరింది . కైలాష్ కన్నా రెండు సంవత్సరాలు చిన్నది . జనరల్ చేకప్స్ అవి ఎక్కువ గా చూసుకుంటుంది. తనకి ఒక అన్నయ్య ఉన్నాడు . అతను ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ లో చేస్తాడు చాహ్నవి కి కైలాష్ అంటే చాల ఇష్టం కాని ఆ విషయం ఇప్పటిదాకా కైలాష్ కి చెప్పలేదు . ఎలా చెప్దామా అని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తోంది గాని అవకాశం దొరకడం లేదు .

"కైలాష్ చెప్పడం మర్చిపోయాను మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ కంపెనీ లో వాక్-ఇన్స్ ఉన్నాయంట . మొన్న చందన కోసం జాబు సెర్చ్ చేస్తున్న అన్నావు గా . ఇది ఏమైనా పనికి వస్తుందేమో చూడు కావాలంటే మా అన్నయ్య రిఫరెన్స్ ఇస్తాడు " అంది

"ఓహ్ అవునా చాల థాంక్స్ నీకు చందన ది రెస్యుమ్ పంపిస్తాను దాని మీ అన్నయకి పంపించి రెఫెర్ చేయమను . ఎప్పుడు ఉంది వాక్-ఇన్ " అని అడిగాడు

"థాంక్స్ ఎందుకు లే గాని జాబు వస్తే మంచి పార్టీ ఇవ్వాలి .ఇంకో రెండు రోజులలో ఉదయం తొమ్మిదింటి ఉండి ఉన్నాయి "

"పార్టీ ఎందుకు ఏకంగా డిన్నర్ ఇస్తాను . చందన కి చెప్తాను   ప్రిపేర్ అవ్వమని . సరే నేను రౌండ్స్ కి వెళేసి వస్తాను" అంటూ బయలదేరాడు

వెళ్తున్న కైలాష్ ని చూస్తూ కూర్చుంది చహ్నవి .

Monday, 16 June 2014

By Marilyn Monroe

The real lover is the man who can thrill you just by touching your head or smiling into your eyes - or just by staring into space.

Meal Maker - Tomato Curry


Required Ingrediants:


  • Meal Maker - 1 cup.
  • Tomato - 4.
  • Onions. - required qunatity
  • aavaalu (mustard seeds). - 1/2 tea spoon
  • chillis - 4.
  • pasupu (Turmeric powder). - 1/2 tea spoon
  • Salt - required qunatity
  • Oil - required qunatity
  • karivepaaku (curry leaves).
  • Ginger Garlic . - required qunatity
  • Dhaniyaala podi (coriander powder).- required qunatity
  • jeelakarra (jeera) - 1 spoon
  • milk - required qunatity
  • pacchi kobbari - required quantity.
  • kotthimeera (coriender leaves)

Procedure:

Take a bowl and fill the bowl with some hot water and some amount milk. Take the meal maker and let the meal maker soak for 10 min. Switch it off and take off the liquid form the meal maker and keep it a side. Take a pan heat some oil in it, in that add onion and tomato, cook it well until the raw smell of tomato and onion leaves. Once it is done take it out from the pan and keep it aside till the heat in that goes and then grind this along with pacchi kobbari and keep the paste aside. Take another pan and add some oil in it.Add some mustard seeds, jeera, green chilli, curry leaves, turmeric powder fry it for 1 min and then add garlic paste, grinded onion tomato paste, along with chilli powder(in required quantity as we added chillies), coriander powder, and garam masala powder - stir it well for 1 to 2 min. Now add meal maker, salt and mix it well, add some water(in required quantity),milk(optional) and simmer the stove and leave it until it is cooked.Once it is cooked garnish it with some coriender leaves. 


Thats it meal maker curry is ready to serve. This can be served with pulka / roti / butter naan




Sunday, 15 June 2014

H. Jackson Brown, Jr.

Love is when the other person's happiness is more important than your own.

Samveda - 13

ఒక అరగంట వరకు చూసాడు కైలాష్. గది లో నుండి ఏమి శబ్దాలు రాకపోయేసరికి గది దగ్గరికి వెళ్లి తలుపు తీసి చూసాడు. గదిలో వేద పడుకుని ఉంది. వేద కి దగ్గరగా వెళ్ళాడు .ఆ మొహం లో చాలా అలసట కనిపిస్తోంది. అలా వేద తన గదిలో తన మంచం లో పడుకోవడం కైలాష్ కి ఒక మధురమైన అనుభూతి లాగ ఉంది. నెమ్మదిగా మంచం దగ్గరికి వెళ్లి వేద నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ సందర్భం ఆ అనుభూతి తన గుండెల్లో పదిలపరుచుకున్నాడు. నెమ్మదిగా బయటికి వచ్చి తలుపు దగ్గరికి వేసాడు.తను వచ్చి బయట హాల్ లో సోఫా లో పడుకున్నాడు.

                     మరునాడు ఉదయం ఆరు గంటలకు రాధ నిద్ర లేచి మొహం కడుకోంది . పాల ప్యాకెట్ తీసుకోవడానికి బయటకి వచ్చి తలుపు తీయబోయింది .తలుపుకి తాళం ఉండడం వాళ్ళ తెరుచుకోలేదు. ఏమైందా అని చూసేసరికి తలుపుకి తాళం వేసి ఉండడం గమనించింది. వాళ్లకి తాళం వేసే అలవాటు లేదు అందుకే తాళం వేసి ఉండడం ఆశ్చర్యం గా అనిపించింది రాధ కి అప్పుడు చూసింది కైలాష్ హాల్ లో పడుకొని ఉండడాన్ని. "ఇదేంటి వీడు బయట పడుకున్నాడు " అనుకుంది. దగ్గరగా వెళ్లి లేపింది కైలాష్ ని.

"గుడ్ మార్నింగ్ అమ్మ" అన్నాడు కైలాష్

"గుడ్ మార్నింగ్ రా ఏంటి ఇలా బయట హాల్ లో పడుకున్నావ్" అంది రాధ

రాత్రి జరిగిన విషయం చెప్పి వేద తన గది లో పడుకున్న విషయం చెప్పాడు.

అది వినగానే రాధా ఆశ్చర్యపోయింది "ఏంటి రా నిజంగానే అమ్మాయి వచ్చిందా " అని అడిగింది

"అవునమ్మ రాత్రి ఇంటికోచేసరికి బాగా ఆలస్యమైపోయింది దానికి తోడూ తను పైన గది తాళం మరిచిపోయింది అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను " అన్నాడు

"చాల మంచి పని చేసావ్"

"కాని ఇక్కడికి రావడానికి తను అసలు ఇష్ట పడలేదు చాల బలవంతం మీద తీసుకొని వచ్చా "

"అదే నాకు ఆశ్చర్యం గా ఉంది, నువ్వు చెప్పగానే నమ్మలేకపోయా.. ఇష్టపడకపోయినా రావాల్సిన చోటికి ఇన్ని రోజులకి వచ్చింది.ఇంక ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది అనిపిస్తోంది రా"

"ఆ రోజు కుడా వస్తుందమ్మ నువ్వేం దిగులు పడకు ఎలాగైనా తనని ఈ ఇంటి కోడలిగా తీసుకొచ్చే బాధ్యత నాది " అన్నాడు.

ఆ మాటలలో ధృడ సంకల్పానికి రాధ మనస్సు ఉప్పొంగిపోయింది .ఇంతలో హంస, చందన లేచి వచ్చారు. రాధ ద్వారా విషయం లుసుకొన్న హంసకి, చందన కి చాలా ఆశ్చర్యం, ఆనందం ఒకసారే వచ్చాయి.

"నిజంగానా అన్నయ్యా" అంది చందన ఆనందంగా.

"నిజంగానే "అన్నాడు కైలాష్.

"అయితే నేను వెళ్లి చూసి పలకరించనా"

"ఇప్పుడు వద్దు రాత్రి ఎప్పుడో వచ్చి పడుకుంది ఇప్పుడు లేపద్దులే తనే లేస్తుంది కొంచంసేపైనా తరువాత. ఈలోపు మీరిద్దరూ స్నానం చేసి రండి తీఫిన్ చేద్దాం " అంది రాధ.

కైలాష్ కి ఒకసారి వేద ని చూడాలనిపించింది. నెమ్మదిగా గది తలుపు తీసి లోపలి వెళ్ళాడు. మంచి నిద్రలో ఉన్నట్టు  ఉంది. తనని  చస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవలనిపిస్తోంది. ఇంతలో వేద కి మెలకువ వచ్చింది.కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా కైలాష్ కనిపించాడు. అంతే తను ఎక్కడుందో కూడా మర్చిపోయి గట్టిగా అరిచింది "ఆ ఆ ......." అని.

"ఉష్ అరవకు " అన్నాడు కైలాష్

"నువ్వు .. నువ్వేంటి ఇక్కడ నా రూం లో" అంది వేద .

కైలాష్ వేద ని కొంచం సేపు ఏడిపిదాం అనిపించింది.

"నీ రూం ఏంటి మర్చిపోయావా రాత్రి నిన్ను నేను ఇక్కడికి తీసుకొని వచాను ఇది నీ రూం కాదు మన రూం" అన్నాడు

"మన రూం ఏంటి పిచ్చి పిచ్చి గా ఉందా?"

"నాకు బానే ఉంది కావాలంటే నాడి పట్టుకొని చూడు "

"అవసరం లేదు. అసలు నువ్వు ఇక్కడికెందుకు వచ్చావ్ " అంది

"అదేంటి ఇది నా రూం అని చెప్పానుగా. నేనెక్కడికి వెళ్ళలేదు రాత్రి అంత ఇక్కడే ఉన్నా" అన్నాడు

"ఏంటి రాత్రంతా ఇక్కడే ఉన్నావా." అంది కోపం గా

"అరె ఇందులో అంత ఆశ్చర్యపోవడానికి ఏముంది. నువ్వు నా భార్యవేగా . అయిన భార్య భర్తలు ఒక రూం లో ఉండడం తప్పని నేనెక్కడ వినలేదే " అన్నాడు కైలాష్ కొంటెగా .

అంతే ఆ మాటలకి వేద కి చాల కోపం వచ్చింది మంచం మీద ఉన్న దిండు తీసి కైలాష్ పైకి విసిరేసింది.

తన దాక వచ్చిన దిండుని తనకి తగలకుండా పక్కకి తప్పుకున్నాడు కైలాష్.

"పిచ్చి పిచ్చి గా ఉందా నేను ఇక్కడ ఈ ఇంట్లో ఉండేది ఇంకో 9 నెలలే ఆ విషయం గుర్తు పెట్టుకో . మళ్ళి ఇలా పిచ్చి పిచ్చి గా మాట్లాడితే బాగుండదు " అంది  వేలు చూపిస్తూ.

"అబ్భ్హ అంత కోపం గా మాట్లాడకు . అంత కోపంలో ఎంత ముద్దోస్తున్నవో తెలుసా అల ఇంకొక క్షణం బుంగ మూతి పెట్టావంటే వచ్చి ముద్దు పెట్టేసుకుంటా తరువాత నీ ఇష్టం" అన్నాడు కైలాష్.

అంతే ఆ మాటకు ఏం మాట్లాడాలో వేద కి అర్ధం కాలే తిట్టుకుంటూ మొహం పక్కకి తిప్పుకుంది.

"సరే వెళ్లి తొందరగా స్నానం చేసి వస్తే టిఫిన్ తిని మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లి తాళం తెచుకున్డువు గాని "
అన్నాడు కైలాష్.

"ఏంటి ఇక్కడ స్నానం చేసి టిఫిన్ తినాల అంత లేదు నేను వెళ్తున్నా ఇప్పుడే."

"ఏంటి ఇలాగ. ఇలా వెళ్ళావంటే బయట అందరు నీ వెంటే పడతారు కావాలంటే అద్దం లో నీ మొహం ఒకసారి చూసుకో" అన్నాడు

"అవసరం లేదు నేను వెళ్తున్నా "

"సరే ఐతే మరి నువ్వు ఇల్లాగే చేస్తే నిన్నటి లాగ ఎత్తుకొని బాత్రూం దాక తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది ఆ తరువాత నీ ఇష్టం " అన్నాడు

"ఏంటి అసలు అంత నీ ఇష్టమేనా. ఏమనుకున్తున్నావు  నీ గురించి నువ్వు "

వేద అలా మాట్లాడుతూ ఉండగానే కైలాష్ వేద దగ్గరకి రావడం మొదలుపెట్టాడు

అంతే ఏం మాట్లాడకుండా వేద బాత్రూం లో కి వెళ్లి తలుపు వేసుకుంది.

కైలాష్ నవ్వుకుంటూ గది బయటకి వెళ్లి తలుపు దగ్గరకి వేసాడు