ఆ రోజు వాళ్ళు షాపింగ్ కి వెళ్లేసరికి పన్నెండు దాటింది . రెండింటివరకూ చీరలు చూస్తూనే ఉన్నారు. అక్కడ ఆ షాప్ లో వాళ్ళకి నచ్చిన చీరలు రెండే దొరికాయి. ఆ రెండు చీరలు ప్యాక్ చేయించుకొని బయటకి వచ్చారు.ఇంక లంచ్ టైం అవ్వడంతో భోజనానికి హోటల్ కి వెళ్లారు. తిరిగి షాపింగ్ కి వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 3 దాటింది. అక్కడ మిగితా చీరలు అవి తీసుకున్నారు. కస్తూరి తో బాటు వేద కూడా 2 చీరలు తీసుకుంది.చీరాల షాపింగ్ అయిపోగానే అక్కడ నుండి సరా సరి కస్తూరి వాళ్ళ ఇంటికి వెళ్లారు. అక్కడికి వెళ్లేసరికి రాత్రి 10 అయ్యింది. కస్తూరి తో పాటు వేద కూడా అక్కడే భోజనం చేసింది. అక్కడ నుండి బయలుదేరేసరికి రాత్రి 11:30 అయ్యింది. ఎలాగో రాత్రి అయ్యింది కాబట్టి కస్తూరి వేద ని వాళ్ళ ఇంట్లోనే ఉండిపోమ్మంది. కాని వేద ఒప్పుకోకపోయేసరికి వేద బండి అక్కడ వాళ్ళ ఇంట్లోనే ఉంచేసి మనీష్ వేదని డ్రాప్ చేయడానికి వచ్చాడు. ఎలాగో వచ్చేది కార్ లోనే కాబట్టి మనీష్ తో పాటు కస్తూరి కూడా వస్తానంది.రాత్రికి వేద వల్ల ఇంట్లోనే ఉంటానంది. సరే అని ఇంక అందరు బయలుదేరారు.వేద ని, కస్తూరి ని వేద వాళ్ళ ఇంట్లో దింపేసి మనీష్ వెనక్కి వచ్చేసాడు. ఇంటికొచ్చేసరికి ఇద్దరు బాగా అలసిపోయింది. పొద్దున్న నుండి ఎండలో షాపింగ్ కి తిరుగుతూ ఉండడం వల్ల చాల అలసట వచ్చేసింది. ఇంటికి రాగానే అలానే బెడ్ మీద పడుకున్నారు.
కైలాష్ పేషెంట్ నాడి చూసాడు. చూసి అనుకున్నాడు పర్వాలేదు ఇప్పుడు బాగానే ఉంది . మళ్ళి ఇంకో రెండు గంటల తరువాత ఇందాక ఇచిన ఇంజక్షన్ ఇంకోసారి ఇస్తే సరిపోతుంది. ఇదే విషయం నర్స్ తో చెప్పాడు.ఇంక ఇంటికి వచేద్దమనుకున్నాడు కాని మళ్ళి ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే కష్టం అందుకే ఇంకో రెండు గంటలయ్యాక ఆ ఇంజక్షన్ ఇచ్చి దాని వల్ల ఏమి రియాక్షన్ రాకపోతే ఇంటికి వెళ్దాం అనుకున్నాడు . అప్పటికే సమయం 12 దాటింది. అతనికి చాల అలసటగా ఉంది. అంతకు ముందే మూడు రోజుల నుండి పని విపరీతంగా ఉంది. అసలు ఆ రోజు హాస్పిటల్ కి రావద్దనుకున్నాడు.మధ్యాహ్నం పన్నెండింటికి అన్నం తినేసి పడుకున్నాడు. లేచేసరికి సాయంత్రం 7 అయ్యింది. లేవగానే చాల ప్రశాంతంగా అనిపించింది. చాల వరకు అలసట తగ్గింది.హాల్ లో కూర్చొని చందన తో, రాధా తో కబుర్లు చెప్తున్నాడు. ఇంతలో హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. నిన్న ఆపరేషన్ చేసిన పేషెంట్ కి ఏవో కాంప్లికేషన్స్ వచ్చాయని. ఆ మాట వినగానే హాస్పిటల్ కి పరిగెత్తాడు. పేషెంట్ ని మమూలు స్థితికి తీసుకొని రావడానికి చాల సమయం పట్టింది. ఇప్పుడు బాగానే ఉన్నాడు.కైలాష్ తన రూం కి వచ్చాడు . బాయ్ తో ఒక కప్ టీ తెప్పించుకున్నాడు. టీ తాగగానే కొంచం అలసట తగ్గింది. కుర్చీ వెనక తల అనుకోని కళ్ళు మూసుకొని పడుకున్నాడు. కళ్ళు మూసుకోగానే కళ్ళ ముందు వేద కనిపించింది. ఆ అందమైన మొహం, ఆ ముగ్ధ మనోహర రూపం పదే పదే గుర్తు వస్తోంది. తను వేదని మొదటి సారిగా చూసినప్పుడు ఎంత అసహ్యిన్చుకున్నాడో ఇప్పుడు అంత అభిమానిస్తునాడు. ఒక్కసారిగా కళ్ళ ముందు గతం కదిలింది. ఆ రోజు అప్పుడు సమయం రాత్రి పది దాటింది. తను ఆ ఊరికి వెళ్ళాడు. ఎలాగైనా ఆ రోజు అంజలిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అంజలి తనకు చేసిన మోసానికి అదే తను అంజలి కి వేసే పెద్ద శిక్ష అనుకున్నాడు. ఒక మనిషి మనసుని గాయపరిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో రుచి చూపించాలనుకున్నాడు. ఇంకోసారి మనిషి మనసులతో ఆడుకోకుండా పెద్ద గుణపాఠం నేర్పించాలనుకున్నాడు. కాని ఆ సమయం లో తెలియలేదు అతనికి తను ఈ విషయాలతో సంబంధమే లేని అమ్మాయి జీవితం తో ఆడుకుంటున్నాడని. ఆ రోజు రాత్రికి అంజలిని ఆ ఊళ్ళో ఉన్న పాడు బడిన బంగ్లా కి తెసుకొని వెళ్లి అక్కడ పెళ్లి జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. నెమ్మదిగా వాళ్ళ ఇంటి వెనక పెరడు నుంచి ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ ఇంట్లో అంజలి, వాళ్ళ అమ్మోమ్మే ఉంటారని తెలుసు కైలాష్ కి. వేద గురించి కైలాష్ కి తెలిదు. తనకి, అంజలికి మధ్య జరిగిన సంభాషణ లో వేద గురించి అంజలి ఎప్పుడు చెప్పలేదు.ఆ రోజు అంజలి ఆ ఇంట్లో లేదని వేద ఆ రోజు ఉదయమే ఊరు నుండి వచ్చిందని కైలాష్ కి తెలిదు. ఇంట్లో ఉండే పని వాళ్ళు అంత ఇంటి బయటే చిన్న పాకలో పడుకుంటారు . నెమ్మదిగా వాళ్ళ కళ్ళు కప్పి ఇంట్లోకి ప్రవేశించాడు . అంజలి వాళ్ళ ఇల్లు తెలుసు గాని ఆ ఇంట్లోకి తను ఎప్పుడు వెళ్ళలేదు. అంజలి రూం ఎక్కడో తనకి తెలిదు. అందుకే అన్ని రూమ్స్ కి వెళ్లి వెతికాడు. అక్కడ వేద కనిపించగానే తనే అంజలి అనుకోని స్పృహ తప్పించి తీసుకొని వచ్చాడు. అప్పుడు తనకి తెలిదు తను తీసుకొని వచ్చింది అంజలిని కాదు వేదని అని. ఒక గంట అయ్యాక వేద కి స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి చూసెసరికి అంత అయోమయంగా ఉంది. తను ఎక్కడుందో ఏంటో కూడా ఏమి అర్ధం అవ్వలేదు. చుట్టూరా చూసింది అన్ని పాడు బడిన గోడలు ఉన్నాయి. తను చూస్తొన్ది కాలో నిజమో తనకే అర్ధం కాలేదు. కళ్ళు నులుపుకొని మరీ చూసింది. పాత గోడలు , గోడల నుండి పెచులు ఊడి పడిపోయి ఉన్నాయి.నెమ్మదిగా లేచి నిలుచోవడానికి ప్రయత్నించింది. ఇంక మత్తు పూర్తిగా వదలలేదేమో సరిగ్గా నిలబడలేకపోయింది. గోడల సహాయం తీసుకోవాల్సి వచ్చింది. ఇంతలో ఎదురుకుండా ఎవరో కనిపించారు.
"ఎవరు" అంది.
"ఆ మాత్రం గుర్తు పట్టలేకుండా మారిపోయిందా నా రూపం" అన్నాడు. ఆ అనటం లోనే అతని లో ఉన్న కోపం , అసహ్యం అన్ని తెలుస్తున్నాయి.
"సారీ మీరెవరో నాకు తెలిదు. అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను?" వేద కి అంతా అయోమయం గా ఉంది ఏమి అర్ధం కావట్లేదు. అది కాకుండా తన ఎదురుగ ఎవరో ఉండడం ఇంకా అయోమయానికి గురి చేసింది .
"ఎలా వస్తావ్ నేను తీసుకొని వస్తే వస్తావ్"
"నువ్వా? నువ్వెందుకు తీసుకొని వచ్చావ్? అసలు ఎవరు నువ్వు ?"
"బాగానే నటిస్తున్నావే. అయిన నీ నటన గురించి తెలియకే ఒకసారి మోసపోయాను అలాంటి తప్పు ఇంకోసారి జరగదు.ఒక మనిషిని ఎవరైనా ఒకసారే మోసం చేయగలరు. ఇంకో సారి నీ దగ్గర మోసపోతే అది నా చాతకానితనమే అవుతుంది"
"నువ్వు మాట్లాడేదేంటో నాకేం అర్ధం కావట్లేదు. నేను నిన్ను చూడడం కూడా ఇదే మొదటిసారి. నేను నిన్ను ఎపుడు మోసం చేసాను?"
కైలాష్ కి చాల అసహనంగా ఉంది. అతనికి ఏమి అర్ధం కావట్లేదు అంత అమాయకమైన మొహం చూసి నిజంగానే రెండు నిమిషాలు భ్రమ పడ్డాడు.అతను చేస్తున్న పని ఉచితం కాదనే ఊహ వచ్చింది. కాని అతనికి అంజలి గురించి బాగా తెలుసు తన మాటల గారడీ లో పడితే ఎదుటివాళ్ళు ఎంతటి వాళ్లైన చాల తేలిక గా మోసం చేయగలదు. అందుకే ఇంకా ఎక్కువ తర్కిన్చుకోదలుచుకోలేదు.
"నిన్నే అడుగుతున్నది" అంది వేద. ఇంక వేద లో ఓపిక, సహనం చచ్చిపోయాయి. అసలు అతనెవరో తెలియక ఒకపక్క తికమక పడుతుంటే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇంత పొగరుగా మాట్లాడతాడేంటి. ఒక మంచి మర్యాద లేకుండా తనని ఇంత రాత్రి వేళ, ఇంత పాడు పడిన ఇంట్లోకి ఎందుకు తీసుకోచినట్టు. స్పృహ తప్పించి తీసుకోనిరావడమే కాకుండా ఏంటి తలా తోక లేని పనులు.అసలు ఏంటి ఇతని ఉద్దేశ్యం.వేద లో రాను రాను కోపం పెరగ సాగింది.
"నేనెవరో నీకు ఇంకొక రెండు నిమిషాలలో చాల బాగా అర్ధం అవుతుంది.కొంచం ఓపిక పట్టు." అంటూ జేబులో ఉన్న తాళి బొట్టు తీసి వేద వైపు వస్తున్నాడు.
అది చూస్తూనె వేద భయపడిపోయింది. ఏంటిది ఏం చేస్తున్నాడు ఇతను. అసలు ఎవరు ఇతను ఏం జరుగుతోంది.నెమ్మదిగా అడుగులు వెనకకి వేసుకుంటూ వెళుతోంది ఎలాగైనా అక్కడ నుండి బయటపడాలని చూస్తోంది.అది గ్రహించిన కైలాష్ ఒక్కసారిగా వేదకు ఎదురుగా వచ్చాడు.ముందుకు వచ్చిన కైలాష్ ని గట్టిగా ఒక్క తోపు తోసింది వేద. ఆ వేగానికి కొంచం తడబడ్డాడు కాని ఈలోగానే నిలదొక్కుకున్నాడు. అతనిని తోసేసి వేద తలుపు వైపు పరిగెత్తింది ఎలాగైనా అక్కడనుండి తప్పించుకోవాలని చూస్తోంది అసలు ఏం జరుగుతోందో తనకి ఏమి అర్ధం కావట్లేదు. వేద ప్రయత్నం గమనించిన కైలాష్ వేగంగా వెళ్లి తలుపుకి అడ్డు నిలబడ్డాడు. తాళిని చేతిలోకి తీసుకొని వేద దగ్గరగా వచ్చాడు.
"నీకసలు మతిపోయింది నువెం చేస్తున్నావో నీకేమైనా అర్ధం అవుతోందా?"
"అవును మతి పోయింది ఇప్పుడు కాదు ఎప్పుడో పోయింది. ఎప్పుడైతే నిన్ను ప్రేమించానో అప్పుడే నన్ను నేను మర్చిపోయాను కాని నువ్వు చేసిన మోసానికి నిజంగానే నా మతి పోయింది. అసలు ఆడవాళ్ళలో నీ లాంటి వాళ్ళు ఉంటే ఆడ జాతికే కళంకం వస్తుంది. నీ లాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. వదిలితే ఎంత మందినైన మోసం చేస్తారు. ఇప్పుడు నీ మేడలో తాళి కడతాను. చూస్తాను ఆ తర్వాత నువ్వు ఎవరిని మోసం చేస్తావో, ఎలా మోసం చేస్తావో. "
"నేను నిన్ను ప్రేమిన్చడమేంటి. నువ్వెవరో నాకు తెలీదని చెప్తుంటే అర్ధం కావట్లేదా?"
"అవును నాకు ఆ విషయం తరువాత తెలిసింది నువ్వు నన్ను ప్రేమించట్లేదని. ప్రేమించినట్టు నాటకమాడావని. నన్ను దారుణంగా మోసం చేసావని. అంజలి నువ్వు చేసిన పనికి నిన్నేం చేసిన పాపం లేదు. కాని నిన్ను ప్రేమించిన పాపానికి నిన్నేం చేయలేకపోతున్నా. ఈ తాళి కూడా ఎందుకు కడుతున్ననో తెలుసా. ఏదో నిన్ను నా భార్యగా స్వీకరిద్ధామని కాదు ఇంక నువ్వు ఎవరిని ప్రేమ పేరుతో మోసం చేయకుండా ఉండడానికి"
వేద కి విషయం నెమ్మదిగా అర్ధం అవుతోంది. తన ఎదురుగా ఉన్నది ఎవరో కాని తనని అంజలి అని భ్రమ పడుతున్నాడు. అయిన ఇదేంటి అక్క తనని మోసం చేసింది అంటాడేన్టి. అక్క ప్రేమించింది ఇతనినా కాని అమ్మొమ్మ ఇంకేదో వేరే ఫోటో చుపించిందే. ఆ ఫోటో లో ఉన్న అబ్బాయిని రెండు రోజుల క్రితం పెళ్లి చుసుకుందని బాధ పడుతోంది. మరి ఇతనేంటి ఇలా అంటున్నాడు.
వేద ఆలోచిస్తూ ఉండగానే కైలాష్ వేద ని సమీపించాడు. వేద తప్పించుకోవాలని చూసింది కాని కుదరటం లేదు.రెండు చేతులతో వేద ని గట్టిగా కదలనీయకుండా పట్టుకున్నాడు.
"ఒక్క నిమిషం నేను చెప్పేది విను. నేను అంజలి కాదు వేద ని. అంజలి మా అక్క. మేమిద్దరం కవల పిల్లలం నువ్వు పొరపాటు పడుతున్నావ్. ఒక్కసారి మా అక్కతో మాట్లాడితే అన్ని విషయాలు తెలుస్తాయి"
"ఇంక నువ్వేం చెప్పిన నేను వినను. మళ్ళి ఇది ఇంకో కట్టు కధ. అంటే ఇప్పుడు మీరిద్దరనమాట కవల పిల్లలన్నమాట.ఇంకా ఊరుకుంటే ఇంక ఏదైనా చెప్తూనే ఉంటావ్. నీ మాటలు విని మోసపోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధం గా లేరు"
వేద కి కోపం వస్తోంది తను ఎంత చెప్పిన వినిపించుకోకుండా ప్రవర్తిస్తున్న తీరు చిరాకు కలిగిస్తోంది.అతనిని దూరంగా తూసేయ్యడానికి ప్రయత్నిస్తోంది.చాల సేపు పెనుగులాడింది. కాని తన ప్రయత్నం ఫలించట్లేదు. కైలాష్ చేతులు వేద మెడ వెనకాలకి వెళ్ళాయి. వేద గట్టిగా కైలాష్ చేతిని కొరికింది. ఆ నొప్పికి ఒక్కసారిగా అతని పట్టు సడిలింది. ఇదే అవకాశం అని వేద తపుకుంది కైలాష్ చేతుల మధ్య నుంచి. వేగంగా తలుపుకి ఉన్న గొల్లం తీసింది. ఇంతలో కైలాష్ వచ్చి వేద ని విసురుగా దూరం గా లాగేసాడు.ఆ విసురుకు వేద కింద పడింది. తిరిగి తలుపు ఘడియ వేసాడు. వేగంగా వెళ్లి కింద పడి ఉన్న వేదని లేపాడు. కోపం గా చంప మీద కొట్టాడు. ఆ దెబ్బకి వేద నిషేస్టురాలయ్యింది.కళ్ళ లోంచి నీళు వస్తున్నాయి. ఆ సమయం లో కైలాష్ తన చేతిలో ఉన్న తాళి బొట్టుని వేద మేడలో కట్టాడు. వేద కి దూరంగా జరిగి "ఇంక ఇప్పుడు నువ్వు ఎవరిని మోసం చేస్తావో చూస్తాను.ఇంకెవరి దగ్గరకి వెళ్లి ప్రేమ పేరుతో మోసం చేస్తావో చూస్తాను.. తాళి కట్టేసాను కదా వదిలేస్తాననుకోకు నిన్ను ప్రతిక్షణం గమనిస్తూనే ఉంటాను. ఇంకో సారి ప్రేమ పేరుతో ఎవరి వెంటన్న పడ్డావో నాలో ఉన్న రాక్షసుడిని చూస్తావ్" అని చెప్పి వేదని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు.అలా వచేసిన తరువాత మనసుకి ప్రశాంతంగా ఉంది. తను అంజలి మీద సాధించిన గెలుపుకి ఆనందం గా ఉంది. కాని అది ఎంతో కాలం నిలవలేదు. తను చేసిన పొరపాటు గురించి తెలిసాక చాల బాధపడ్డాడు. ఇంట్లో వాళ్ళకి ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక సతమత పడ్డాడు. ఇంతలో ఇంట్లో వాళు అతనికి పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎన్ని సంబంధాలు చుసిన కాదంటూనే ఉన్నాడు. వాటికి అతను చెప్పే కారణాలు అసలు కారణాలు గానే కనిపించట్లేదు రాధకి, శైలేష్ కి. అతను పెళ్లి తప్పించుకోవడానికి సాకులు చెప్తున్నాడని అర్ధం అయింది. ఇంక ఇలా కాదని రాధ ఆవిడ స్నేహితురాలికి ఫోన్ చేసింది. ఆవిడ విషయం విని రాధ కి అభ్యంతరం లేకపోతే తన కూతురు కోమలిని వాళ్ళ ఇంటి కోడలిగా ఇవ్వలనుకున్తునట్టు చెప్పింది.దానికి రాధ చాలా సంతోష పడింది. కాని కైలాష్ ఏ సంబంధానికి ఇక పట్టాన ఒప్పుకోవట్లేదని చెప్పింది. అప్పుడు తన స్నహితురాలు ఒక సలహా ఇచింది కోమలి ని అప్పుడప్పుడు మీ ఇంటికి పంపిస్తాను, దాంతో కొత్త పోయి అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది అప్పుడు పెళ్లి విషయం చెప్తే వోద్దనదని చెప్పింది. ఈ సలహా రాధ కి నచ్చింది. తను కుడా ఒప్పుకుంది . అప్పటినుండి కోమలి రాకపోకలు ఎక్కువ అయ్యాయి. కోమలితో మాములుగానే మాట్లాడేవాడు.దాంతో కోమలికి కైలాష్ తనని ఇష్టపడుతున్నదనుకోంది. ఒక రోజు అడిగింది కైలాష్ ని
"నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి"
"చెప్పు"
"నీకెప్పుడు వీలవుతుందో చెప్తే మనం ముహూర్తాలు పెట్టుకొవచు"
కైలాష్ కి ఏమి అర్ధం అవలేదు.
"ముహూర్థాలెన్దుకు"
"నిశ్చితార్దానికి"
"నిస్చితార్ధమా. ఎవరికీ"
"ఇంకెవరికి నాకు నీకు"
"వాట్ ఏం మాట్లాడుతున్నావ్?"
"అదేంటి ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావ్. నన్ను ఆటపట్టిన్చాలనే కదు. నాకు తెలుసు నీకు ముహూర్తం ఎప్పుడైనా ఓకే అని నేను అత్తయకి చెప్పేస్తాను" అనుకుంటూ కైలాష్ చెప్పేది వినిపించుకోకుండా వెళ్ళిపోయింది.
దాంతో కైలాష్ కి మతి పోయినట్టయింది. వెంటనే రాధ దగ్గరికి వెళ్ళాడు.
"అమ్మా"
"ఎంటిరా"
"ఆ అమ్మాయి కోమలి నిశ్చితార్ధం అంటూ ఏదేదో మాట్లడుతోందేంటి"
"ఏం మాట్లాడింది"
"అదే నేను ఒప్పుకుంటే నిశ్చితార్ధం పెట్టిద్దమన్నవని చేబుతోన్దేంటి"
"అవును రా ఆ అమ్మాయి తో నీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నా"
"నాకు ఇష్టముందక్కర్లేదా" అన్నాడు కోపం గా
"నన్నేం చేయమంటావ్ చెప్పు. ఎన్ని సార్లు అడిగిన ఏదో ఒక విధంగా తప్పించుకున్తూనె ఉన్నావ్. పోనీ నీ మనసులో ఎవరైనా ఉన్నారా అంటే లేదన్తావ్. మరి ఇంక ఎందుకు ఆగుతున్నవో నాకేం అర్ధం కావట్లేదు రా."
అతనికి విషయం ఎలా చెప్పాలో అర్ధం కావట్లేదు.
"అమ్మా ఇవ్వాళా నా మనసులో ఉన్నదీ మొత్తం నీకు చెప్పేస్తాను అది అంటా విన్నాక నువ్వేం చేయమని చెప్తే అదే చేస్తాను"
"ఏంటి రా ఏదైనా ముఖ్యమైన విషయమా"
"అవునమ్మ "
"సరే చెప్పు "
కైలాష్ చెప్పింది విన్నాక రాధకి కైలాష్ మీద చాల కోపం వచ్చింది. రాధ ఉన్న ఆ స్థితిని కోపం అంటే అది చాల చిన్న మాటే అవుతుంది. అప్పటివరకు తన పెంపకం మీద తనకి చాల గర్వం గా ఉండేది ఎప్పుడైతే కైలాష్ ఇలాంటి పని చేసాడో ఆమె నమ్మకానికి అది పెద్ద గొడ్డలి పెట్టు అయ్యింది. తన ఆశలన్నీ రాలిపోయినట్టు అనిపించింది.మంచం మీద కూలబడింది.ఆమెని చూస్తున్తె కైలాష్ కి భయం వేసింది.
"అమ్మా " అని పిలిచాడు. ఏమి సమాధానం రాలేదు. మళ్ళి పిలిచాడు అయిన పలకలేదు.
"అమ్మా క్షమించమ్మ .నేను చేసింది తప్పని నాకు తెలుసు కాని ఆ క్షణం లో ఉన్న కోపం లో ఏం ఆలోచించలేకపోయాను"
"క్షమించాలా ఎలా అడుగుతున్నావు రా ఆ మాటని. నువ్వు చేసింది ఏమైనా చిన్న తప్పు అనుకున్నావా క్షమించడానికి. ఒక ఆడపిల్ల జీవితం తో ఆడుకున్నావ్. నువ్వు చేసిన దానికి క్షమాపనే లేదు రా.నువ్వు చేసిన దానికి ఆ అమ్మాయి ఎంత బాధ పడుతోందో ఆలోచించావా. జీవితం గురించి ఆ అమ్మాయి కనే కల లన్ని నాశనం చేసావ్ కదరా. ఎంత గర్వంగా ఉండేది నాకు నా పిల్లల పైన, నా పెంపకం పైన. నా గర్వం అంత అణిచావురా. నా కొడుకు కూడా కోపం లో ఉచితానుచితాలు మరిచిపోతాడనే సత్యం నాకు తెలిసేలే చేసావ్. నువ్వు ఎంతో అభివృధి లోకి వచావనుకున్నాను, ఒక మంచి వ్యక్తిత్వం గల వాడిగా ఎదిగావని అభిప్రాయ పడ్డాను. కాని నా అభిప్రాయాలన్నీ తప్పు అని రుజువు చేసావ్.జీవితం చివరి దశలో ఉన్న నాకు ఇంత అశాంతిని ఇస్తావని నేను తలెత్తుకోకుండా చేస్తావని ఎప్పుడు అనుకోలేదు."
"అలా అనకమ్మా ఎలాగైనా ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకుంటాను, ఆ అమ్మాయికి జరిగిందంతా వివరిస్తాను. నేను చేసిన తప్పుని ఒప్పుకొని ఆ అమ్మాయిని క్షమించమని అడుగుతాను"
"దాని వల జరిగేదేంటి. ఆ అమ్మాయి నిన్ను క్షమించినంత మాత్రామ ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నావా. నీకు ఇంట్లో కూడా ఒక చేల్లెలుందే ఆ అమ్మాయికి ఇలాంటి పరిస్థితే ఎదురైతే ఏం చేస్తావు రా."
"అమ్మా" అని గట్టిగా అరిచాడు. రాధ అడిగిన ప్రశ్న అతని హృదయాన్ని చలించింది. రాధ మనసంత అల్లకల్లోలమైపోయింది. రాధ సూటిగా అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయాడు. అసలు అలాంటి పరిస్థితిని ఊహించలేకపోయాడు . ఇప్పుడిప్పుడే అతనికి అతను చేసిన పని ఎంత దారుణమో తెలుస్తోంది. చాలా సిగ్గుగా అనిపిస్తోంది. కాని తన నిర్ణయం ఇప్పుడే వాళ్ళ అమ్మకు చెప్పాలనుకున్నాడు. లేకపోతె ఇంక సమయం మించిపోతుందని అర్ధం అయ్యింది.
"అమ్మా నిజమే ఇలాంటి పరిస్థితి ఎదురైతే తట్టుకోవడం చాలా కష్టం.కాని ఒక్కసారి నా నిర్ణయం విను. ఆ అమ్మాయిని ఈ ఇంటికి కోడలి గా తీసుకొద్దామని అనుకుంటున్నాను . ఎలాగైనా ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకుంటాను..."
"ఆగు. ఏమ్మన్నావ్ ఆ అమ్మాయిని ఈ ఇంటికి కోడలిగా తీసుకొని వస్తావా. ఎందుకు ఆ అమ్మాయి మీద జాలి తో నా?"
"కాదమ్మా ఇది జాలి కాదు"
"జాలి కాకపొతే మరేంటి నువ్వు నీ ఇష్టమోచినట్టు వెళ్లి ఆ అమ్మాయి మేడలో బలవంతంగా తాళి కట్టావ్. ఇంకా అది చాలనట్టు ఇప్పుడు ఆ అమ్మాయి అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఇంటికి కోడలిగా తీసుకొస్తా అంటున్నావ్.కనీసం ఆ అమ్మాయికి ఒక మనసనేది ఉందని గ్రహించావా. లేకపోతె నువ్వు తాళి కట్టావ్ కాబట్టి ఇంకా చచినట్టు నీ భార్యగా పడుండాలి అంటావా"
"కాదమ్మా నా ఉద్దేశ్యం అది కాదు. ఆ అమ్మాయి నిజంగానే నాకు నచ్చింది.ఎప్పుడైతే నేను తాళి కట్టింది అంజలికి కాదన్న విషయం నాకు తెలిసిందో,నేను చేసిన తప్పు తెలుసుకున్నానో అప్పుడే నేను ఆ అమ్మాయికి కనీసం క్షమాపనలైన చెప్పాలనుకున్నాను. నేను చేసిన పనికి క్షమించమన పదం సరిపోదని నాకు తెలుసు. అయిన నాకు ఆ సమయం లో ప్రాయశ్చితం గా ఏం చేయాలో అర్ధం కాలేదు. అందుకే ఆ అమ్మాయిని క్షమించమని అడిగి ఆ అమ్మాయి ఏ శిక్ష విధిస్తే అది మనస్పూర్తిగా అంగీకరిదామని ఆ అమ్మాయి కోసం వాళ్ళ ఊరు వెళ్ళాను. కాని అక్కడ ఆ అమ్మాయి కనిపించలేదు. వాళ్ళ అమ్మొమ్మ చనిపోయారని తెలిసింది. ఆ అమ్మాయి ఆ ఊరు వొదిలి వెళ్ళిపోయిందని తెలిసింది.ఆ చుట్టుపక్కల వాళని అడిగాను ఆ అమ్మాయి గురించి. వాళు ఆ అమ్మాయి గురించి చెప్తుంటే నిజంగానే నేను చేసిన పనికి కుచిన్చుకుపోయాను. ఆ అమ్మాయి అంజలికి పూర్తిగా వ్యతిరేకం. ఆ అమ్మాయి వ్యక్తిత్వం, మంచితనం గురించి తెలిసాక నాకు తెలియకుండానే ఆ అమ్మాయి గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. ఆ రోజు నుంచి ఆ అమ్మాయి ప్రతిక్షణం నా ఆలోచనలో ఉంది. ఎప్పుడు ఆ అమ్మాయి నా ఆలోచనలని పూర్తిగా అక్రమించుకుందో, నా మనసులో చెదరని ముద్ర వేసుకుందో నాకే తెలియదు. ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకుందామని ఎప్పటినుండో ప్రయత్నం చేస్తున్నాను.ఆ అమ్మాయి కోసం ఒక మూడు నెలలు వరకు ఆ ఊరిలోనే ఉండిపోయాను.ఎప్పుడైనా ఆ ఊరికి వస్తుందేమో అని చూసాను ఎందుకంటే ఆ ఊరిలో ఆ అమ్మాయికి ఒక ఇల్లు ఉంది. దాన్ని అల వేదిలేయ్యలేక ఎప్పుడైనా వస్తుందేమో అప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడదామని చాలా రోజులు చూసాను.అమ్మా నీకు గుర్తుందా నేను మూడు నెలల వరకు ఇంటికి రాలేదు ఒకసారి .ఊరిలో మా హాస్పిటల్ డాక్టర్స్ అందరు ఒక క్యాంపు పెట్టామని చెప్పి వెళ్ళాను.అప్పుడు నేను వెళ్ళింది వాళ్ళ ఊరికే.మూడు నెలల వరకు చూసాను ఆ అమ్మాయి వస్తుందేమో అని కాని రాలేదు. ఆ ఇంటిని ఎవరికైనా అద్దేకిమ్మని ఆ ఊరి ప్రెసిడెంట్ కి ఒక లెటర్ రాసిందని తెలిసింది. ఆ లెటర్ ద్వారా ఆ అమ్మాయి గురించి తెలుసుకుందామని వెళ్ళాను . ఎలాగో ఆ ప్రెసిడెంట్ ని అడిగి ఆ ఉత్తరం సంపాదించాను. అందులో ఆ ఉత్తరం చెన్నై ఉంది వచినట్టు ఉంది. నేను వెంటనే చెన్నై వెళ్లాను కాని నేను వెళ్లేసరికి ఆ అమ్మాయి అక్కడ ఆ అడ్రస్ లో లేదు హాస్టల్ మారిందని తెలిసింది. అప్పటినుండి ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నాను. ఈ మధ్యనే హైదరాబాద్ వచిందని తెలుసుకున్నాను. కాని ఎక్కడ ఉందొ ఏంటో ఇంక వివరాలు తెలియలేదు. ఎలాగైనా ఆ అమ్మాయి వివరాలు తెలుసుకుంటాను. అప్పుడు నాకు అలాగే తనకి ఇష్టం ఉంటేనే తీసుకొని వస్తాను లేకపోతె లేదు. ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం గా నేను మళ్ళి పెళ్లి చేసుకోను."
"ఇంత దుర్మార్గం చేసిన నిన్ను ఆ అమ్మాయి ఇష్టపడుతుందనే అనుకుంటున్నావా."
"తెలుసమ్మ ఆ అమ్మాయి నన్ను ఇష్టపడదని తెలుసు కాని అది ఎంత కష్టమైనా ఆ అమ్మాయి మనసులో చోటు సంపాదిస్తాను. నీ కొడుకు గా మళ్ళి నీ ముందు తల ఎత్తుకొని నిలబదతాను. నాకు దీనికి నీ సహాయం కావలి. నీ సహకారం కావాలి. చెప్పమ్మా నాకు సహాయం చేస్తావా"
"చూదు కైలాష్ నీ తప్పు నువ్వు తెలుసుకుంటే నాకు సంతోషమే. కోమలి ఈ ఇంటి కోడలిగా రావాలని అనుకున్నాను కాని నువ్వు జరిగింది చెప్పక ఇంక ఆ ఊహ నా మనసులోనుంచి తొలగించేసాను. నువ్వు ఆ అమ్మాయిని ఈ ఇంటికి తీసుకోస్తానంటే నాకు సంతోషమే, ఆ అమ్మాయి కులం గోత్రం గురించి నాకు పట్టింపు లేదు ఆ అమ్మాయి మంచి మనసున్న అమ్మయితే చాలు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ అమ్మాయి నీ కన్నా మంచిదనే నాకనిపిస్తోంది . నువ్వు ఆ అమ్మాయిని తన ఇష్టప్రకారం ఈ ఇంటికి తీసుకోనివస్తే నాకు సంతోషమే. కాని బలవంతంగా మాత్రం తీసుకొని రావాలని ప్రయత్నించకు"
"లేదమ్మా లేదు ఎత్తి పరిస్థితుల్లోను బలవంతంగా తీసుకొని రాను."
కైలాష్ కి రాధ తో మాట్లాడాక తన మనసు లోని భారాన్ని దిమ్పుకునట్టయింది. ఈ విషయం ఇంట్లో శైలేష్కి, హంస కి , చందన కి వివరించి చెప్పింది రాధ. శైలేష్ తన సహకారాన్ని అందిచాడు కైలాష్ కి. అప్పటినుండి ఆ అమ్మాయి కోసం కైలాష్, శైలేష్ వెతుకుతూనె ఉన్నారు. శైలేష్ తన కున్న పలుకుబడితో పోలీసుల ద్వారా ఆ అమ్మాయి గురించి వెతికించాడు. ఒక నెల రోజులలో ఆ అమ్మాయి గురించి తెలిసింది వాళ్ళకి.
ఇంతలో గుమ్మం లో అలికిడి అయ్యింది. కైలాష్ ఆలోచనలు ఒక్కసారిగా చెదిరిపోయాయి.
"ఎవరు " అన్నాడు
"డాక్టర్. ఆ పేషెంట్ కి 2 గంటల తరువాత ఇంజక్షన్ ఇస్తా అన్నారు. మీరింకా రాకపోయేసరికి..."
"ఓహ్ అవును కదు మర్చిపోయాను. పదండి వెళ్దాం"
నర్స్ అతని వెనకాలే నడిచింది.
ఇంజక్షన్ ఇచ్చాక ఒక గంట వరకు ఉన్నాడు. పేషెంట్ పరిస్థితి నార్మల్ గానే ఉంది ఎటువంటి రియాక్షన్ లేదు. ఇంక ఆ పేషెంట్ ని నర్స్ కి అప్పచెప్పి ఇంటికి బయలుదేరాడు.

Nice
ReplyDeleteHey post the other parts yar....
ReplyDelete