Tuesday, 29 July 2014

Samveda - 21

మర్నాడు ఉదయం వేద కి మేలుకు వచ్చేసరికి ఉదయం 10 దాటింది. బెడ్ మీద ఇంకా పడుకునే ఉంది. లేద్దామనుకుంది కాని ఓపిక లేకపోయింది. రెండు రోజుల నుంచి సరిగ్గా తినకపోవడం తో చాల ఆకలి గా, నీరసం గా ఉంది. లేచి స్నానం చేసి ఏమైనా టిఫిన్ బయట నుండి తెచుకొని తిన్దామనుకుంది. సోమవారం నుండి గౌరమ్మ వాళ్ళ కొడుక్కు ఒంట్లో బాలేదని రెండు రోజుల నుండి సెలవు పెట్టింది అందుకే బయటనుండి ఏమైనా తెచుకుందామనుకుంది. బెడ్ పైనుండి లేచేసరికి కళ్ళు తిరిగినట్టు అయ్యింది. లేవలేకపోయింది. కాళ్ళు, చేతులు లాగేస్తునట్టు అనిపించింది.చాలా నీరసంగా అనిపించింది. లేవడానికి ఓపిక లేకపోయింది. కళ్ళు మూసుకొని పడుకుంది. ఎప్పుడు నిద్దర పట్టిందో ఏమో అలానే నిద్ర పోయింది.

      ఆ రోజు ఉదయం చందన ఆఫీసు కి బయలుదేరేసరికి 9 అయ్యింది. కైలాష్ చందన ని దింపడానికి బండి తీస్తునప్పుడు వేద బండి అక్కడే ఉండడం చూసాడు. చందనని తీసుకొని బయలుదేరాడు. దారిలో చందన తో అన్నాడు "చందన వేద బండి ఇంకా ఇంట్లోనే ఉంది. తను ఇవాళ ఇంకా ఆఫీసు కి స్టార్ట్ అయినట్టు లేదు. తను ఇవాళ ఆఫీసు కి వస్తే నాకు ఒకసారి కాల్ చేసి చెప్పు".

"అదేంటన్నయ్య ఇవ్వాళ కొత్తగా చెప్తున్నావ్"

"ఏం లేదు మొన్న రెండు రోజుల నుండి సరిగ్గా తిండి తినలేదు, నిద్ర కుడా పోలేదు కదా. ఎలా ఉందొ అని. అది కాక ఇంకా ఆఫీసు కి కూడా స్టార్ట్ అవ్వలేదు . అసలు లేచిందో లేదో అర్ధం కావట్లేదు అందుకే తను వస్తే ఒకసారి నాకు కాల్ చేయి"

"సరే అన్నయ్య"

చందన ని దింపేసి హాస్పిటల్ కి వెళ్ళిపోయాడు కైలాష్. చందన ఆఫీసు కి వెళ్లేసరికి 10 దాటింది. ఆ రోజు ఇంకా కస్తూరి, వేద ఇద్దరు ఆఫీసు కి రాలేదు. చందన కి అంత పని కూడా లేదు. సరళ తో కలిసి కాంటీన్ కి వెళ్ళింది. సరళ, చందన ఒకే సారి జాయిన్ అయ్యారు కంపెనీ లో. కాని ఇద్దరు వేరు, వేరు ప్రాజెక్ట్స్ లో చేస్తున్నారు. కాంటీన్ నుంచి వచేసరికి 11 దాటింది. అప్పటికి వేద ఇంకా రాలేదు.కస్తూరి అప్పుడే వచినట్టుంది. బాగ్ సీట్ దగ్గర పెట్టి వాష్ రూం కి వెళ్లినట్టు ఉంది. డెస్క్ దగ్గర బాగ్ ఉంది కాని కస్తూరి లేదు. గిరి చందన డెస్క్ దగ్గరికి వచ్చాడు. చందన తో అన్నాడు

"చందన వేద ఇంకా ఆఫీసు కి రాలేదు. నీకేమైనా తెలుసా?"

"లేదు గిరి. నాకు అంత తెలిదు"

"సరేలే ఇవ్వాళ వర్క్ ఎక్కువ లేదు నిన్న రెండు రోజుల నుండి చాలా వర్క్ ఉండే కదా సో ఇవాళ లీవ్ పెట్టిన ప్రాబ్లం లేదు. ఏదైనా కొంచం వర్క్ వచ్చిన కస్తూరి వచేసింది కాబట్టి ప్రాబ్లం లేదు. నేను కస్తూరి తో మాట్లాడతాను."

"ఓకే గిరి"

" "మీ ట్రైనింగ్ ఎక్కడదాక వచ్చింది"

"ఒక 25% పెర్సెంట్ అయ్యింది గిరి"

"ఓకే.. మేక్ ఇట్ ఫాస్ట్. కస్తూరి ఇంకో 1 వీక్ లో లీవ్ లో ఉంటుంది. ఈలోపు మీరు పికప్ అవ్వాలి"

"ఓకే గిరి"

ఇంతలో కస్తూరి వచ్చింది డెస్క్ దగ్గరికి

"హాయ్ గిరి. గుడ్ మార్నింగ్'

"మార్నింగ్ కస్తూరి. ఎలా జరిగింది షాపింగ్"

"ఫైన్ బాగా జరిగింది"

"ఓకే . కస్తూరి మే బి వేద ఇవ్వాళ లీవ్ లో ఉందేమో నిన్న రెండు రోజుల నుండి హెవీ వర్క్ వచ్చింది ఆ వర్క్ అయ్యేసరికి ఇవ్వాళ మార్నింగ్ 4 అయినట్టుంది . సో మే బి ఇవ్వాళ వేద లీవ్ లో ఉండచ్చు. ఇవ్వాళ వచ్చే వర్క్ మీరు హేండిల్ చేయండి. ఇవ్వాళ ఎక్కువ వర్క్ ఏం లేదు . ఆల్రెడీ మెయిల్స్ వచాయి ఒకసారి చూడండి. చాలా వరకు మధ్యాహ్నం వరకు వర్క్ అయిపోతుంది అది అయిపొంగానే చందన కి ట్రైనింగ్ ఇవ్వండి.ఇంకా ఎక్కువ టైం లేదు వన్ వీకే ఉంది కదా సో మేక్ ఇట్ ఫాస్ట్"

"ఓకే గిరి"

"ఓకే థెన్ ఐ విల్ మేక్ అ మూవ్(సరే మరి నేను వెళ్తాను).

"ఓకే"

                     కైలాష్ హాస్పిటల్ కి వెళ్లేసరికి 10:30 అయ్యింది. పేషన్ట్స్ అందిరిని చూసి ఒక రౌండ్ వేసి తన రూం కి వచ్చాడు. అప్పటికి మధ్యాహ్నం 2 అయ్యింది. ఈలోపు రూం డోర్ టక్ టక్ మని చప్పుడయినిది. " హలో కైలాష్ మే ఐ కం ఇన్" అని వినబడేసరికి తలెత్తి చూసాడు ఎదురుగా చాహ్నవి కనిపించింది.

"హాయ్ ప్లీజ్ కం "

"హాయ్ లంచ్ అయ్యిందా?"

"ఇంకా లేదు.మీది "

"లేదు ఇప్పుడే రౌండ్స్ ఫినిష్ అయ్యాయి. ఉండండి నేను కూడా నా లంచ్ బాక్స్ ఇక్కడికి తీసుకొని వస్తాను. కలిసి లంచ్ చేద్దాం"

"ఓకే"

చాహ్నవి తన స్టేత్ అక్కడ పెట్టి లంచ్ బాక్స్ తీసుకొని రావడానికి రూం కి వెళ్లి వచ్చింది. అక్కడ ఉన్న టేబుల్ పైన బాక్స్ సద్దారు. ఇద్దరు భోజనానికి కూర్చున్నారు.

"అవును చందన జాబు ఎలా ఉంది "

"బానే ఉంది. గోయింగ్ గుడ్"

"అబ్బ రోజు ఒకే హాస్పిటల్ కి వస్తున్నామన్న మాటే గాని అసలు మాట్లాడడానికే టైం దొరకడం లేదు"

"అవును. హాస్పిటల్ లో ఈమధ్య వర్క్ ఎక్కువ అయ్యింది. పేషన్ట్స్ ఎక్కువ మంది ఉన్నారు"

"అవును. అరె మీరు ఇవ్వాళ ఆలూ కర్రీ తెచినట్టు ఉన్నారు. ఇఫ్ యు డోంట్ మైండ్ నేను షేర్ చేసుకోవచ్చా"

"తప్పకుండా"

"మీరు కూడా కొంచం నా కర్రీ టేస్ట్ చేయండి ఇవ్వాళ"

"పర్వాలేదు"

"పర్వాలేదండి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో" అంటూ చాహ్నవి తను తెచ్చిన వంకాయ కూరని కైలాష్ ప్లేట్ లో వేసింది.

ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే చాల నచ్చింది కైలాష్ కి ఆ కూర. అదే అన్నాడు చాహ్నవి తో

"సూపర్ కూర నిజంగా చాల బాగుంది. ఎవరు చేసారు"

"నేనే చేసానండి."

"అవునా మీరు వంటలు ఇంత బాగా చేస్తారని నాకు తెలియదు. ఒక విషయం  చెప్తే ఏమనుకోరు కదా"

"పర్వాలేదు  చెప్పండి"

"మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారో గాని వాళు నిజంగా చాలా అద్రుష్టవంతులు"

కైలాష్ అలా అనడం చహ్నవి కి బాగా నచ్చింది. కాని ఆ మార్పు మొహం లో కనిపించకుండా జాగ్రత్త పడింది.

"మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు" అంది

"అదేం లేదండి ఈ కూర ఎవ్వరు తిన్న అదే చెప్తారు. అలా చెప్పకపోతే వాళకి అభిరుచి లేదని చెప్పాలి"

"థాంక్స్ అండి నాకు అంత మంచి కంప్లిమేంట్ ఇచ్చినందుకు"

"మీకు కూడా థాంక్స్ నాకు ఇంత మంచి కూర తినిపించినందుకు" ఇద్దరు భోజనం చేసి కొంచం సేపు కబుర్లు చెప్తూ కూర్చున్నారు..

"మీరేమనుకోకపోతే నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుదామనుకుంటున్న"

"అడగండి అందులో అనుకునేదేముంది"

"అంటే అది కొంచం పర్సనల్ అందుకని"

"చెప్పండి"

"పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటి"

ఆ మాట వినిపించేసరికి తలెత్తి సూటిగా చూసాడు

"అదేంటి అలా అడుగుతున్నారు " అన్నాడు

"ఏం లేదు. ఊరికే మీ అభిప్రాయం ఏంటో తెలుసుకుందామని"

"మామూలు అభిప్రాయమే అంత ప్రత్యేకమైనదేమి లేదు"

"అలా కాదండి ఎలా అడగాలో నాకు తెలియట్లేదు. సాధారణంగా చాలా మందికి పెళ్లి గురించి , కాబోయే వాళ్ళ గురించి కొన్ని ఊహలు ఉంటాయి కదా అలా పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏంటి?

కైలాష్ ఎం చెప్పేవాడో ఏమో గాని ఈలోపు నర్స్  వచ్చింది కైలాష్ రూం లోకి.

"చాహ్నవి గారు  మిమ్మల్ని డాక్టర్ శారద ఒకసారి రమ్మంటున్నారు"

"సరే పద వస్తున్నా. వస్తానండి బై"

"బై" చాహ్నవి వెళ్లేసరికి ఒక్కసారి గట్టిగ ఊపిరి వదిలాడు.

అప్పటికే సమయం 3:30 దాటింది ఇంతవరకు కైలాష్ కి చందన దగ్గర నుండి ఫోన్ రాలేదు. అసలు వేద ఆఫీసు కి వచిందో లేదో తెలియలేదు. అందుకే తనే ఒకసారి చందన కి ఫోన్ చేద్దామనుకున్నాడు.

"హలో చందన"

"చెప్పనయ్య"

"వేద వచ్చిందా ఆఫీసు కి"

"లేదన్నయ్య ఇంకా రాలేదు. ఇవ్వాళ ఇంక రాదేమో నిన్న మొన్న హెవీ వర్క్ ఉండే కదా అందుకే ఇవ్వాళ లీవ్ తీసుకునట్టు ఉంది"

"అవునా సరేలే ఉంటాను"

"ఓకే అన్నయ్య బై"

ఫోన్ పెట్టేసాక ఆలోచనలో పడ్డాడు. ఎందుకో ఒకసారి వేద ని చూడాలనిపిస్తోంది అతనికి. ఇంక వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు ఎలాగో ఆ రోజు అంత ముఖ్యమైన కేసులు ఏమి లేవు కాబట్టి.

                వేద కి మేలుకు వచ్చేసరికి సాయంత్రం 4 అయ్యింది. ఒళ్ళంతా నొప్పులుగా అనిపిస్తోంది. కాళ్ళు చేతులు లాగేస్తునట్టు ఉన్నాయి. ఇలా ఎందుకుందో వేద కి అర్ధం కాలేదు. రెండు రోజుల నుండి అన్నం సరిగ్గా తినకపోవడం వాళ్ళ, నిద్ర సరిగ్గా లేకపోవడం వాళ్ళ నీరసం గా మాత్రమే ఉంటుందనుకుంది. కాని ఈ చేతులు కాళ్ళు లాగేయటం ఏంటో, కళ్ళు తిరగటం ఏంటో వేద కి ఏం అర్ధం కాలేదు. ఏమైనా తింటే తగ్గుతుందేమో అనుకుంది. స్నానం చేసి రెండు రోజులయ్యింది చాలా చికాకుగా ఉంది. ముందు స్నానం చేసి ఏమైనా తిన్దామనుకుంది. గిరి కి మెసేజ్ పెట్టింది ఆ రోజు తను ఆఫీసు కి రావట్లేదని. లేవడానికి ఓపిక లేకపోయినా ఎలాగో నెమ్మదిగా లేచి బాత్రూం కి వెళ్ళింది. గీసర్ ఆన్ చేసి వేడి నీళ్ళు పెట్టుకుంది. వేడి నీళ్ళు వంటి మీద పడుతుంటే చలి వేస్తోందనిపించింది. అయిన ఎలాగో స్నానం అయ్యిన్దనిపినిచింది. స్నానం చేసి బయటకి వచ్చిన ఇంకా చలి తగ్గలేదు. కళ్ళు తిరుగుతున్నా ఆకలి వేస్తున్దడంతో తాళం తీసుకొని బయటకి వచ్చింది.డోర్ లాక్ చేస్తోంది.

          వేద డోర్ లాక్ చేస్తుండగా కైలాష్ గేటు తీసుకొని లోపలి వస్తున్నాడు. వస్తూనే మెడ పైకి చూసాడు . అక్కడ తలుపుకి తాళం పెడుతూ వేద కనిపించింది. వేద ని చూసేసరికి అతని మనసు కుదుట పడింది .కార్ పార్క్ చేసి ఇంటి వైపు వస్తున్నాడు. ఇంతలో ఏదో చప్పుడు వినిపించడం తో వెనక్కి తిరిగి చూసాడు. చూస్తూనె కొయ్యబారి పొయ్యాడు. వేద మెట్ల మీద నుండి కింద పడుతూ కనిపించింది. ఒక్కంగలో వేద దగ్గరికి వెళ్ళాడు. కింద ఒక కాలి పై కూర్చుని "వేద" అని పిలిచాడు. వేద నుండి ఎటువంటి జవాబు రాలేదు. రెండు మూడు సార్లు పిలిచినా లాభం లేకపోయింది అప్పటికే ఆమెకి స్పృహ తప్పింది. కైలాష్ ఇంకేం ఆలోచించకుండా వేద ని రెండు చేతుల మధ్య ఎత్తి పైకి తీసుకెళ్ళాడు. అప్పుడే డోర్ లాక్ చేయడం తో కీస్ ఇంకా వేద చేతిలోనే ఉన్నాయి. అవి చేతిలోకి తీసుకొని వేద ని భుజం మీద వేసుకొని డోర్ ఓపెన్ చేసాడు. అప్పటికే వేద ఒళ్ళు వేడిగా ఉండడం అతనికి తెలుస్తోంది. తీసుకెళ్ళి బెడ్ రూమ్ లో బెడ్ పైన పడుకోపెట్టాడు.కిందనే తీసుకొని వెళోచు కాని తనకి తెలుసు వేద కి కింద ఉండడం ఇష్టం లేదని. ఇలాంటి సమయం లో వేద మనసు బాధ పెట్టాలనిపించలేదు అతనికి అందుకే పైకి తీసుకొని వచ్చాడు. వేద ని పడుకోబెట్టి కిందకి వెళ్లి ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ధర్మోమీటార్ తీసుకొని వచ్చాడు. మేడ మీద నుండి కిందికి పడినప్పుడు తగిలిన దెబ్బలకి ఫస్ట్ ఎయిడ్ చేసాడు. ఒళ్ళు వేడిగా ఉండడంతో టెంపరేచర్ చూసాడు.104 చూపిస్తోంది టెంపరేచర్. చాలా నీరసంగా ఉండడంతో హాస్పిటల్ కి ఫోన్ చేసి కంపౌందర్ చేత సెలైన్ బాటిల్స్ తెప్పించాడు. అతనికి వేద పరిస్థితి చూడగానే అనుమానమోచింది తనకొచ్చింది వైరల్ ఫీవర్ ఏమో అని అందుకే వేద బ్లడ్ శాంపిల్ తీసుకొని కంపౌందర్ కిచ్చి చాహ్నవికిమ్మనాడు టెస్ట్ చేయడానికి. నుదుటి మీద తడి గుడ్డ అద్దాడు.సెలైన్ ఎక్కించాడు. ఒక గంట వరకు అక్కడ ఉంది పరిస్థితి చూసాడు.  ఇంకా అలానే ఉంది. ఏదో ఫోన్ వస్తే మాట్లాడడానికి హాల్ లోకి వచ్చాడు. ఈలోగా రాధ పైకి వచ్చింది. తలుపులు తీసే ఉండడంతో హాల్ లోకి వచ్చింది.  అక్కడ కైలాష్ కనిపించాడు. ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రాధ ఉంది. 

"కింద కార్ కనిపించేసరికి నువ్వు వచ్చావని అనుకున్నా. అవును నువ్వేంటి ఇక్కడ. వేద ఇంట్లో లేదా?"
వేద వాళ్ళేవరిని  పైకి రానీయదని రాధకి తెలుసు.

"ఉందిమా"

"మరి నువ్వేంటి ఇక్కడ? ఇందాక నీ కంపౌందర్ వాచినట్టు ఉన్నాడు సెలైన్ బాటిల్స్ తో ఏమైంది?"

"ఏం లేదమ్మా. వేద కి ఒంట్లో బాలేదు. హై ఫీవర్ వచ్చింది. వైరల్ ఫీవర్ అని అనుమానంగా ఉంటె ల్యాబ్ కి బ్లడ్ పంపించాను టెస్ట్ చేయమని."

"ఫివరా ఇప్పుడెలా ఉంది"

"అలాగే ఉందమ్మా. రెండు రోజుల నుండి ఏం తినలేదేమో చాలా నీరసం గా ఉంది. మందులు ఏమైనా ఇస్తే పని చేయడానికి టైం పడుతుంది. ప్రస్తుతానికి సెలైన్ పెట్టాను. ఇంకా స్పృహ లో లేదు."

"అవునా. పద చూద్దాం"  

రాధ వేద దగ్గరకి వచ్చి పక్కన బెడ్ పైన కూర్చుంది.వేద నుదుటి మీద చెయ్యి వేసి చూసింది. నిజమే ఒళ్ళు కాలిపోతోంది జ్వరం కూడా ఉన్నట్టు ఉంది అనుకుంది. వచినప్పటి నుండి కనీసం బట్టలు కూడా మార్చుకోకుండా అక్కడే ఉన్నాడేమో రాధ అంది కైలాష్ తో "నువ్వు కిందకి వెళ్లి ఫ్రెష్ అయ్యి రా ఈలోపు నేను ఉంటాను ఇక్కడ"

"పర్వాలేదు లేమ్మా"

"ఎంత సేపని ఇలా ఉంటావ్ వెళ్లి ఫ్రెష్ అయ్యి రా నేను ఉంటాను గా ఇక్కడ నేను చుస్తానులే నువ్వెళ్ళు"

"సరే నుదుటి మీద ఆ బట్ట మళ్ళి తడిపి పెట్టాలి"

"నేను పెడతాను రా నువ్వు వెళేసి రా" అంది.

రాధ పడే పడే చెప్పగా కిందకి వెళ్ళాడు బట్టలు మార్చుకోవడానికి.

పోద్దుటినుండి  జడ కుడా వేసుకోలేదేమో జుట్టంత రేగిపోయి ఎలా పడితే అలా ఉంది. రాధ నెమ్మదిగా మునివేళ్ళతో జుట్టంతా సవరించింది. నుదిటి మీద తడిబట్ట మార్చింది. వేద చేతిని తన చేతిలోకి తీసుకొని నెమ్మదిగా చెంపలు నిమురుతోంది. బాధ గా అనుకోసాగింది వాడు చేసిన పొరపాటు వల్ల ఈ అమ్మాయి బాధపడుతోంది. ఒకొక్కసారి ఉచితానుచితాలు మర్చిపోయి కైలాష్ చేసిన పని మీద ఆమెకు చాలా కోపం వస్తుంది కాని ఇంక ఆ విషయం లో కోప్పడి లాభం లేదు జరగాల్సింది జరిగిపోయింది దాన్ని గురించి తలచుకొని బాధ పడేకంటే పరిస్థితిని అర్ధం చేసుకోవడమే ఉత్తమం అనుకుంది. కాని ఆ అమ్మాయిని చూస్తేనే బాధ అనిపిస్తుంది. పెళ్లి గురించి ఎన్ని ఆసలు పెట్టుకుందో ఏమో, అసలు జరిగిన సంఘటనని ఆ అమ్మాయి ఎలా జీర్ణం చేసుకుందో ఎంత ఆలోచించిన అర్ధం కాలేదు రాధకి. ఇంతలో కైలాష్ ఫ్రెష్ అయ్యి వచ్చాడు. 

"అమ్మ నువ్వు కిందకి వెళ్ళు నేను ఉంటాను"

"పర్వాలేదు రా కింద పని ఏం లేదు రాత్రికి వంట పని ఎలాగో హంస చూసుకున్తున్ది కొంచం సేపు ఉంది వెళ్తాను."

ఇంతలో ఏవో కలవరింతలు వినిపించాయి. ఇంతా ఐ చూసేసరికి వేద కలవరిస్తోంది "అమ్మొమ్మ అమ్మొమ్మ" అని 

రాధ చేతి స్పర్శ వేద కి వల్ల అమ్మొమ్మ ని గుర్తుకు తెస్తోంది. 

"అమ్మొమ్మ వచ్చేసావా. ఇన్ని రోజులు చెప్పకుండా ఎక్కడికి వెళ్లిపోయావ్. నా మీద కోపం వచ్చిందా. నన్ను నమ్ము అమ్మొమ్మ నేను చెప్పేది నిజం. నిజంగా అతనెవరో నాకు తెలీదు. నేనెవరిని ప్రేమించలేదు . నన్ను నమ్మవు." అంటోంది వేద. ఆమె కలవరించేదేన్టో రాధ కి అర్ధం అయ్యింది. కైలాష్ వైపు తిరిగింది. కైలాష్ ఏం చెప్పలేనివాడిలా మొహం దించుకున్నాడు.

వేద స్పృహ లో లేకపోయినా తను వాళ్ల అమ్మొమ్మ ని కలవరిస్తోంది.  వాళ్ల అమ్మొమ్మ రూపమే అమకు కనిపిస్తోంది. ఆమె చాలా బాధపడుతోంది. వేద కూడా అంజలి లాగ తనని మోసం చేసి ఎవరినో ప్రేమించి తనకి చెప్పకుండా పెళ్లి చేసుకుందని బాధపడుతోంది. వేద తనకి ఏం తెలీదని ఎంత నచాచేప్తున్న ఆమె వేద మాటలు వినిపించుకోవట్లేదు. వేద ఆమెకి నచ చెప్పలేకపోతోంది. మేడలో తాళి కనిపిస్తూ ఉండి అది ఎవరు కట్టారో తెలిదంటూ, వాళ్ల అమ్మోమ్మని నమ్మ మంటే అది ఎంత హాస్యాస్పదం గా ఉంటుందో వేద కి తెలుసు కాని అంతకు మించి ఇంకేం చెప్పలేకపోతోంది. ఆవిడ వేద తనని మోసం చేసింది అనుకుంటోంది.తల్లి తండ్రి లేరని ఇద్దరు మనవరాల్లని అపురూపమ్గా పెంచినందుకు వాళ్ళు ఇద్దరు తనని మోసం చేసారని నమ్ముతోంది. వేద కి ఎలా నచాచేప్పాలో తెలియట్లేదు. నేను ఇంక ఇక్కడ ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను నువ్వు మీ అక్క మీ ఇష్టమోచిన వాళని కట్టుకొని సుఖం గా ఉండండి అంటూ పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతోంది. వేద ఆమెను ఆపలేకపోతోంది. ఆమె వెంటనే వేద కుడా వెళ్ళింది. ఆవిడ చాలా తొందరగా నడుస్తోంది అసలే 70 దాటినా వయసు ఆ నడక వేగానికి తట్టుకోలేక ఆయాసం వస్తోంది అయిన ఆమె ఆగట్లేదు అలా నడుస్తూనే ఉంది. నడుస్తూ నడుస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. వేద "అమ్మొమ్మ" అని గట్టిగా అరిచి లేచి కూర్చున్ది. ఆమె అలా అరిచేసరికి రాధ, కైలాష్ కంగారు పడ్డారు.తను ఎక్కడుందో ఏంటో ఏం అర్ధం కాలేదు. రాధ ని పట్టుకొని అడిగింది "అమ్మొమ్మ..అమ్మొమ్మ ఏది" చుట్టూ చూస్తూ అంది "అమ్మొమ్మ.. అమ్మొమ్మ" అని బెడ్ మీద నుండి దిగబోయింది. కైలాష్ వేద ని పట్టుకోబోయాడు. కాని ఆ సమయం లో వేద దేన్నీ లెక్క చేసేట్టు లేదు. తన ముందు ఎవరున్నారో కూడా పట్టించుకోలేదు. అమ్మొమ్మ వెళ్ళిపోతోంది ఆమెని ఆపాలి అదొక్కటే ధ్యాసగా ఉంది అందుకే మంచం దిగింది.కైలాష్ ఎంత వారించిన లాభం లేకపోయింది. కైలాష్ చేతిని విదిలించి కొట్టింది.చేతికున్న సెలైన్ బాటిల్ ని తీసేసింది. అమ్మొమ్మ అమ్మొమ్మ అంటూ రెండు అడుగులు వేసిందో లేదో మళ్ళి స్పృహ తప్పి పడిపోయింది. రాధ ఏమి మాట్లాడలేకపోయింది. కైలాష్ వేద ని ఎత్తుకొని మళ్ళి మంచం మీద పడుకోపెట్టాడు.  చేతికి సెలైన్ పెట్టి, ఇంజక్షన్ ఇచ్చి దుప్పటి కప్పి పడుకోబెట్టాడు. అతనికి మనసంతా బాధగా అయిపొయింది. రాధ కి అర్ధం అయ్యింది వేద ఇంక ఆ సంఘటనని జీర్నిన్చుకోలేకపోతోందని. పైకి మాత్రం ఏమి పట్టనట్టు ఉంటోంది గాని మనసులో చాలా బాధ పడుతోంది. కైలాష్ కి ఇప్పుడు చాలా బలంగా అనిపిస్తోంది వాళ్ల అమ్మొమ్మ చనిపోవడానికి తను చేసిన పొరపాటే కారణమని. వేద దాని నుండి ఇంక బయటకి రాలేదని. కైలాష్, రాధ ఎవరికీ వారే వాళ్ల ఆలోచనలలో మునిగిపోయారు.

   ఇంతలో చందన వచ్చింది అక్కడికి "అన్నయ్య" అంటూ.
కైలాష్ తేరుకున్నాడు "రా చందన"

"ఎలా ఉంది ఇప్పుడు వొదిన కి. రాగానే పెద్దొదిన చెప్పింది. అందుకే చూద్దామని వచ్చాను. ఎలా ఉంది ఇప్పుడు"

"ఫీవర్ ఉంది. వైరల్ ఫీవర్ అనుకుంట రిపోర్ట్స్ వస్తే తెలుస్తుంది. చాలా నీరసంగా కూడా ఉంది. సెలైన్ ఎక్కిస్తున్నాం. ఇంక స్పృహ లోకి రాలేదు." అన్నాడు.

"ఇవ్వాళ ఆఫీసు లో కూడా కస్తూరి అంటూనే ఉంది ఏదో అయ్యింది వేద కి, నేను చాలా సార్లు ఫోన్ చేసాను తను ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయలేదు ఏదో అయ్యింది నువ్వు ఇంటికి వెళ్ళగానే చూసి నాకు చెప్పు అవసరం అయితే నేను వస్తాను అని చెప్పింది" 

చందన అలా అందో లేదో ఈలోపు ఫోన్ రింగ్ అయ్యింది. కస్తూరి చేసింది

"హలో"

"హలో చందన. వేద ఎలా ఉంది?"

కైలాష్ చెప్పింది కస్తూరికి చెప్పింది చందన. అది విన్న వెంటనే కస్తూరి ఉండలేకపోయింది వెంటనే బయలుదేరి వచ్చింది. సరా సరి వేద బెడ్ రూమ్ లోకి వెళ్ళింది. అక్కడ కైలాష్, రాధ కనిపించారు. కైలాష్ ని అడిగింది ఎలా ఉందని. చెప్పాడు కైలాష్. 

"ఎప్పటినుండి ఇలా ఉంది"

"సాయంత్రం నుండి అనుకుంటా. అయిన పర్వాలేదు తగ్గిపోతుంది. రెండు రోజుల నుండి ఏం తినలేదేమో అందుకే కొంచం నీరసం గా ఉంది"

కస్తూరి వేద దగ్గరికి వచ్చింది. నుదుటి మీద చెయ్యేసి చూసిన్ది . ఒళ్ళు కాలిపోతోంది. చాలా బాధేసింది. తనకి ఇలా ఉనప్పుడు నేను దగ్గర లేనే అనుకుంది. ఇంతలో రాధ అంది

"నువ్వేం బాధ పడకమ్మ తగ్గిపోతుందిలే"

"శనివారం నుండి పెళ్లి షాపింగ్ అని బాగా తిరిగాం అంటి దానికి తోడు నిన్న మొన్న చాలా వర్క్ వచిందంట. వర్క్ చేస్తుంటే చాలు అన్ని మర్చిపోతుంది. కనీసం టైం కి కూడా తినదు చెప్పడానికి నేను కూడా లేను గా. రెండు రోజుల ముందు వరకు ఎంత హుషారుగా ఉందొ"


"చ నువ్విలా బాధ పడితే ఎలా చెప్పు. ఇంకో వారం రోజులలో పెళ్లి కూతురివి అవుతున్నావు. ఇలా బాధ పదకూదదు. వేద కి ఏం కాదు మేమంతా లేము"

"నేను డాక్టర్ నని మర్చిపోయినట్టు ఉన్నారు.నేను చెప్తున్నాను నమ్మండి. వేద కి ఏం కాదండి మీరు అనవసరంగా బాధ పడకండి.మీ పెళ్లి టైం కల చంగు చంగు మని లేచి తిరుగుతుంది చూడండి"

ఆ మాటలతో కస్తూరి కళ్ళు తుడుచుకుంది. "క్షమించండి నేను కంగారు పది మిమ్మల్ని కంగారు పెట్టేసాను .మీరు వెళ్ళండి నేను ఉంటాను."

"పర్వాలేదమ్మ ఇక్కడ ఇంత మందిమి ఉన్నాం కదా మేము ఉంటాము లే నువ్వెళ్ళు. ఇప్పటికే 9 అయ్యింది ఇంకా నువ్విక్కడుంటే ఆలస్యం అవుతుంది. అది కాక రాత్రి ఏదైనా మళ్ళి సెలైన్ పెట్టాల్సి వచ్చిన, ఇంజక్షన్ ఇవ్వాల్సి వచ్చిన వాడు ఉండాల్సిందే. నువ్వు వాడు ఇద్దరు మేలుకోవడం ఎందుకు నా మాట విని నువ్వెళ్ళు. రేపు పొద్దున్న ఆఫీసు కి వెళ్లేముందు వచ్చి చూసి వెళ్దువుగాని"  

కస్తూరి కి రాధ చెప్పింది నిజమే అనిపించింది. వేద ని వదల్లేక, వదల్లేక వదిలింది. మళ్ళి రేపు పొద్దునే వస్తానని వాళ్ళకి చెప్పి ఇంటికేల్లింది. 

ఇంకో రెండు రోజులు గడిచిపోయాయి. వేద కి స్పృహ రాలేదు . వేద కి వచ్చింది వైరల్ ఫీవర్ అని చహ్నవి బ్లడ్ రిపోర్ట్స్ చూసి కన్ఫరం చేసింది. అందుకే తగ్గడానికి టైం పడుతోంది. రెండు రోజుల నుంచి కస్తూరి పొద్దున్న రాత్రి వచ్చి వేదని చూసి వెళ్తోంది. రెండు రోజుల నుండి వేద అమ్మొమ్మ అమ్మొమ్మ అంటూ ఒకటే కలవరింతలు.ఆ కలవరింతలు వినప్పుడల్లా కైలాష్ కి సిగ్గు తో ప్రాణం చచిపోయినట్టు ఉంటుంది. రెండు రోజుల నుండి హాస్పిటల్ కి శలవు పెట్టి కైలాష్ వేద పక్కనే కూర్చున్నాడు. ఏమైనా ముఖ్యమైన కేసులు వస్తే వేరే డాక్టర్ ని రెఫెర్ చేయమని హాస్పిటల్ లో చెప్పాడు. మూడో రోజు కి జ్వరం కొంచం తగ్గు మొఖం పట్టింది.  



No comments:

Post a Comment