Wednesday, 23 July 2014

Samveda - 20

ఇప్పటికే వేద తో మాట్లాడి చాల రోజులయినట్టు అనిపించి కైలాష్ కి. ఒకసారి ఎదురు పడితే మాట్లాడదామని చూస్తున్నాడు కైలాష్. రాత్రంతా హాస్పిటల్ లో వేద ని గురించి ఆలొచిస్తూ ఉండడంతో ఎందుకో వేదని చూద్దామన్న కోరిక చాలా బలం గా కలిగింది. ఆ రోజు ఇంటికొచ్చేసరికి పొద్దున్న 4 అయ్యింది ఎలాగైనా వేద తో మరుసటి రోజు మాట్లడదామనుకున్నాడు , మాట్లాడడం కుదరకపోతే కనీసం గిల్లికజ్జా అయిన పెట్టుకున్దామనుకున్నాడు. అలా అయిన కనీసం ఒక అరగంట వేదని చూసి మాట్లాడినట్టు ఉంటుందని.  మంచం మీద వాలగానే నిద్ర పట్టేసింది కైలాష్ కి. నిద్ర లో వేద మొహం కనిపించింది. మళ్ళి అదే సంఘటన కనిపించింది. ఉలిక్కిపడి లేచాడు. బాత్రూం కి వెళ్లి కళ్ళు కడుక్కొని వచ్చాడు. ఈ మధ్య రాత్రిళ్ళు కైలాష్ కి సరిగ్గా నిద్ర పట్టడం లేదు. ఎప్పుడు వేద మొహం ఆ రోజు తను తాళి కట్టేటప్పుడు తను చూసిన చూపె పదే పదే గుర్తు వస్తోంది. అది గుర్తు వచినప్పుడల్లా తనని తను సంభాలిన్చుకోలేకపోతున్నాడు. తను వేదని తన తప్పు తెలియ చేసి వాళ్ళ ఇంటికి కోడలిగా తీసుకొని రావలనుకునప్పుడు ఆ పని సులభంగా కాకపోయినా తను ఆ పని చేయగలడనే నమ్మకం ఉండేది అతనికి. ఎలాగైనా తను వేద కి నచ్చచేప్పవచుననుకున్నాడు. దానికి తోడూ వేద వాళ్ళ ఇంట్లోనే ఉండేసరికి అతని నమ్మకం ఇంకా బలపడింది . కాని రోజులు గడుస్తున్న కొద్ది అతనికి తన నమ్మకం సడలిపోసాగింది. వేద  ని ఒప్పించడం కాదు కదా కనీసం తనతో మాట్లాడలేకపోతున్నాడు. ఒక మనిషికి ఎదుటిమనిషి మీద ఎలాంటి అభిప్రాయం లేనప్పుడు ఆ మనిషితో స్నేహం చేయడం తేలికవుతుంది . కాని నిలువునా ద్వేషించే  మనిషితో స్నేహం చేయడం కాదు కదా కనీసం మాట్లాడాలంటేనే, మాట్లాడడం దాక ఎందుకు చూడాలంటేనే మనసు అంగీకరించదు . ఆ విషయం కైలాష్ కి వేద ని చూస్తుంటే చాలా బాగా అర్ధం అవుతుంది. ఎంత ఆలోచించిన వేద తో పరిచయానికి దారి దొరకడం లేదు. వేద మనసులో ఏముందో ఇప్పటిదాకా బయటపడలేదు . కాని తనని అసహ్యించుకున్తోందని మాత్రం తెలుసు.అది ఎంత వరకు ఉంది అంటే వేద లో ఒక నిర్లిప్తత ఏర్పదిపోయిందేమో అన్న సందేహం వస్తుంది కైలాష్ కి ఒక్కొకసారి వేద ని చూస్తుంటే. ఆ నిర్లిప్తత తన మీద ఏర్పడిందో, లేకపోతే జీవితం మీద ఏర్పడిందో ఎంత ఆలోచించిన అర్ధం కావట్లేదు కైలాష్ కి. వేద మనసులో ఉన్న భావం ఏదో తెలిస్తే బావుండునని అనిపిస్తోంది.ఒకవేళ తను అనుకున్నది నిజమే అయితే ఆ భావం లోనుంచి వేదని బయటకి తీసుకొని రావడం చాలా కష్టం . తెల్లవారుఝాము నుంచి అలా వేద గురించి ఆలొచిస్తూనె ఉన్నాడు. మరుసటి రోజు ఎలాగైనా వేద తో ఒకసారి వీలు కలిపించుకొని మాట్లాడాలనే నిర్ణయానికి వచాక కాని అతని మనసు కుదుట పడలేదు. ఎప్పుడో ఉదయం 7 గంటలకి నిద్ర పట్టింది కైలాష్ కి.

         ఆ రోజు ఆదివారం. వేద, కస్తూరి వాళ్ళు కొన్న చీరలకి బ్లౌసెస్ కుట్టించడానికి టైలర్ దగ్గరకి వెళ్దాం అనుకున్నారు. అందుకే పొద్దున్నే లేచి రెడీ అయ్యారు. వాళ్ళు బయటకి వెళ్తాం అని చెప్పారు కాబట్టి గౌరమ్మ పొద్దునే వాళ్ళిద్దరికీ టిఫిన్ చేసేసి వెళ్ళింది. టైలర్ దగ్గర పని అయిపోగానే బంగారం షాపింగ్ చేద్దాం అనుకున్నారు. పొద్దునే టిఫిన్ చేసేసి బయలుదేరారు. వాళ్ళు టైలర్ షాప్ కి వెళ్లి బట్టలు ఇచ్చేసరికి మధ్యాహ్నం 1 అయింది. ఇంక భోజనం చేసి బంగారం షాపింగ్ కి వెళ్దాం అనుకుంటుండగా కస్తూరి వాళ్ళ అమ్మగారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. బంగారం కొనడానికి పెళ్ళికొడుకు వాళ్ళు ఈ సోమవారం, మంగళవారం వెళ్తున్నారని కస్తూరి వాళ్ళని కుడా వాళ్ళతోనే రమ్మని చెప్పారని చెప్పారు కస్తూరి వాళ్ళ అమ్మగారు ఇంక బంగారం షాపింగ్ మానుకొని ఇంటికి వెల్లిపోదాం అనుకున్నారు.


"వేద ఎలాగో ఇప్పుడు షాపింగ్ ఏమి లేదు గా ఇంటికి వెళ్ళిపోదాం. నిన్నటి నుండి తిరిగి తిరిగి అలసిపోయినట్టు ఉంది. కొంచంసేపు ఇంటికెళ్ళి పడుకుంటే ఫ్రెష్ గా ఉంటుంది ఏమంటావ్?"


"సరే నీ ఇష్టం రేపు, ఎల్లుండి షాపింగ్ కి వెళ్లేటట్టు అయితే ఒకసారి గిరికి ఫోన్ చేసి విషయం చెప్పి లీవ్ తీసుకో లేకపోతె అయిపోతావ్" అంది చిన్నగా నవ్వుతూ.


"సరేలే నేను రేపు ఫోన్ చేసి చెప్తాను. పద ఇంటికి వెళ్దాం"


"లేదు లే నువ్వు వెళ్ళు నేను హరి అన్నయ వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడనుండి రాత్రికి ఇంటికి వెళ్తాను. అన్నయ్యని చూసి ఇప్పటికే వారం అయింది ఒకసారి అటు వెళేసి వెళ్తా"


"సరే నీ ఇష్టం. మరి నేను వెళ్తున్న బై"


"బై"


      ఆ రోజు కైలాష్ నిద్ర లేచేసరికి మధ్యాహ్నం 2 దాటింది. లేచి ఫ్రెష్ అయ్యి హాల్ లో కి వచ్చాడు.హాల్ లో కి రాగానే రాధా అడిగింది.

"ఏరా ఎలా ఉంది బడలిక తగ్గింది"


"ఆ ఇప్పుడు కొంచం పర్వాలేదు. అమ్మా ఆకలేస్తోంది"


"నీకోసమే ఎదురు చూస్తున్నాం ఇప్పటిదాకా లేవకపోతే ఇంకో అరగంటలో నేనే వచ్చి లేపుదామనుకున్న. చందనకి కుడా బాగా ఆకలేస్తోందంట. రండి వడ్డిన్చేస్తా"


వాళందరి భోజనాలయ్యేసరికి 3 దాటింది. కొంచంసేపు టి.వి చూసాక కైలాష్ అన్నాడు రాధా తో


"అమ్మా నేను ఒకసారి పైకి వెళేసి వస్తాను."


"సరే"


"అన్నయ్య వొదిన ఇంట్లో లేదనుకుంటా పొద్దున్న కస్తూరి తో బయటకి వెళ్ళడం చూసాను ఇంకా వచినట్టు లేదు" అంది చందన.


ఆ మాట వినగానే సోఫా లో కుర్చుండిపోయాడు. ఒక్కసారిగా అతనికి నిరాశ కలిగింది. రాత్రి నుండి ఎప్పుడెప్పుడు వేద ని చూద్దామా అని అనుకుంటున్నాడు కాని చివరికి కుదరనే లేదు.


       వేద అటునుండి అటు హరి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్కడే సాయంత్రం దాక ఉంది. వేద మనసుని నొప్పించడం ఇష్టం లేక హరి వేద దగ్గర పెళ్లి ప్రసక్తి ఇంక ఎత్తలేదు సరైన సమయం కోసం చూస్తున్నాడు.వేద వెళ్ళేటప్పటికి హరి వాళ్ళు భోజనాలకి కూర్చుంటున్నారు. వేద కూడా భోజనాలకి కూర్చున్ది. భోజనాలు అయిపోయాక హరి సూపర్ మార్కెట్ కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు.

"అన్నయ్య నేను కూడా వస్తాను స్టోర్స్ కి " అంది వేద


"నేను కూడా" అంది రెవ


"ఇంక అయినట్టే. ఇవాళ మీకు బేరాలు దొరికినట్టే" అంది మాలతి.


"పోనిలే రానీ సరదాగా. వెళ్లి తయారవండి మరి"


"రెండు నిమిషాలు . రా రెవ" అంది వేద


ఇద్దరు తయారయ్యి బయటకి వచారు. అప్పుడప్పుడు వేద కి హరి వాళ్ళ స్టోర్స్హ కి వెళ్ళడం అలవాటే. రొటీన్ లైఫ్ తో బోర్ కొడితే సరదాగా స్టోర్స్ కి వెళ్లి అక్కడ వచ్చిపోయే జనాలని వాళ్ళ వేశభాషలని , వాళ్ళు  షాపింగ్ చేసే విధానాన్ని చూడడం గొప్ప సరదా. ఎక్కువగా ఆడవాళ్ళు కొనే కాస్మెటిక్స్ స్టాల్ దగ్గరే టైం పాస్ చేస్తుంది. వచ్చే రకరకాల మనస్తత్వం గలవాళ్ళలో గొప్పలు చెప్పే వాళ్ళు, ఏది కొనాలో తెలియక తికమక పడేవాళ్ళు  వచినప్పుడు, అక్కడ అమ్మే వాళ్ళని చాలా తక్కువగా మాట్లాడినప్పుడు  వాళ్ళతో సరదాగా చాలా వరకు కాస్మెటిక్స్ కొనేలా చేస్తుంది . ఇది వాడితే అందం పెరుగుతుంది, అది వాడితే కళ్ళు బావుంటాయి, ఈ క్రీం వాడితే మొహం మీద మొటిమలు పోతే , ఈ లిప్స్టిక్ వాడితే పెదాలు బాగుంటాయి అలా చెప్తూ చాలా వరకు వాళ్ళని చొన్ఫుసె చేసేసి వాళ్ళ చేత అన్ని కొనిపిస్తుంది. అలా వివిధ మనస్తత్వాల మనుషులని చూసేసరికి తనకి కూడా కొంచం ఉల్లాసంగా ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు ఆదివారం వస్తే సరదాగా హరి తో పాటు తను కూడా  స్టోర్స్ కి వెళ్తుంది. హరికి మొత్తం హైదరాబాద్ లో మూడు చోట్ల డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉన్నాయి. అందులో ఒకటి జుబ్లీ హిల్స్ లో ఉంది, ఇంకోటి దిల్షుకనగర్లో , ఇంకోటి కోటి దగ్గరలో మొత్తం మూడు చోట్ల ఉన్నాయి . అందులో జుబ్లీ హిల్స్ లో ఉన్నది హరి చూసుకుంటాడు. అక్కడ మనిషికి కావాల్సిన నిత్య అవసర సరుకులు నుంచి కూరగాయల వరకు అన్ని ఉంటాయి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల దాక ఉంటుంది . మళ్ళి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10, ఒక్కొక్కసారి 11 గంటల దాక ఉంటుంది. రోజుకు దాదాపు 100 మందికి పైగానే వస్తారు . చాలా లాభాల లోనే నడుస్తోంది.  వాళ్ళు వచ్చి స్టోర్స్ ఓపెన్ చేసేసరికి 4 అయ్యింది. స్టోర్స్ ఓపెన్ చేయగానే రెవ పరిగెత్తుకున్తూ వెళ్ళింది.రెవ వెనకే వేద కూడా వెళ్ళింది.


"రెవ ఆగు. ఏంటా తొందర."


"అక్క దా మనం చాక్లేట్స్, అయిస్క్రీమ్స్ తెచుకుందాం"


"రెవ ఒకటో రెండో తీస్కోండి. వేద కొంచం చూస్తుండు"


"సరే అన్నయ్య"


ఇంతలో కస్టమర్స్ రావడం మొదలవడం తో స్టోర్స్ కొంచం బిజీ అయ్యింది. రెవ తిరిగి తిరిగి అలసిపోయి హరి దగ్గరకి వెళ్ళిపోయింది. వేద స్టోర్స్ కి ఆ మూల ఉన్న కాస్మెటిక్స్ సెక్షన్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఎవరో ఒక పెద్దవిది సుమారు నలభై ఏళ్ళు ఉంటాయేమో. ఆ కట్టు వేషం అవి అన్ని చుస్తే ఆమె అందంగా కనపడాలనే ఆమె తాపత్రయం తెలిసిపోతూనే ఉంది. స్టోర్స్ కి రావడానికి కూడా మొహానికి అంత మేర మేకప్ వేసుకుంది,కాని మొహం మీద ఉన్న మొటిమలు దాచలేకపోయింది. ఐ షేడ్స్ దిద్దుకుంది, పెదాలకి అంత లిప్స్టిక్ వేసుకుంది. ఆవిడని చూడగానే తన వయసు తక్కువ కనిపించాలని ఆమె తాపత్రయం ఎదుటివాళ్ళకి తెలిసిపోతుంది. ఆవిడ అమ్మే వాళ్ళ తో ఏదో ఘర్షణ పడుతోంది. వేద ఆవిడ దగ్గరికి వెళ్ళింది.


"ఏంటండి ఏమయింది" అంటూ ఎంతో మృదువుగా అడిగింది.


"ఏమయ్యిందని అంత నెమ్మదిగా అడుగుతున్నావేంటి. ఈ అమ్మాయి నేను పోయిన సారి వచినప్పుడు నాకొక క్రీం అమ్మింది. అది వాడితే మొటిమలు పోతాయని మొహం తెల్లబడుతుందని చెప్పింది. ఇప్పుడు చూడు నా మొహం లోకి మొహం తెల్లబడడం మాట దేవుడెరుగు ఎన్ని మొటిమలు ఉన్నాయో చూడు. అసలు నాకు తెలియక అడుగుతాను అమ్మడం రానివాళ్ళని అందరిని ఇక్కడే నిలబెట్టినట్టు ఉంది. దీనికి ఆ అమ్మాయి ఏం చెప్తుందో చెప్పమను."


"అయ్యో ఔనా ఉండండి నేను ఇప్పుడే విషయం ఏంటో కనుక్కుంటాను"


"ఏంటి గంగా ఏంటిది ఆవిడ చెప్తోంది నిజమేనా" అంది పూర్తిగా గంగ వైపు తిరిగి కొంచం కోపం నటిస్తూ. గంగకి వేద బాగా పరిచయమే, తన కోపం కూడా పరిచయమే. అందుకే అంది


"పోయిన సారి ఆవిడ వచినప్పుడు అది వాళ్ళ అమ్మయికని చెప్పారు అది కాకుండా ఆ అమ్మాయిది నార్మల్ స్కిన్ అని చెప్పారు" అంది నెమ్మదిగా


వేద కి విషయం అర్ధం అయ్యింది ఆ అమ్మయికని ఇచిన క్రీం  ఆమె వాడిందని, అది ఆవిడ చర్మానికి సరిపోదని  ఇప్పుడు ఇంకేదైనా సజెస్ట్ చేస్తే దాని వాడడం రాక మళ్ళి ప్రాబ్లం వస్తుందని అందుకే తెలివిగా అంది


"ఓహ్ సారీ మా గంగ వాళ్ళ చాల పొరపాటే జరిగింది. క్షమించండి .మీరు ఇటు నాతో రండి నేను మీకు వేరే క్రీమ్స్ చూపిస్తాను. అందులో మీకు సరిపోయేవి మీరే తీసుకుందురు గాని. ఇది ఈ క్రీం ఉంది చుడండి ఇది వాడితే  మొటిమలు పోతాయి, ఈ క్రీం ఉందే ఇది వాడితే తెల్లగా అవుతారు, ఈ క్రీం ఉందే ఇది వాడితే మీ చర్మం స్మూత్ గా ఉంటుంది , ఈ క్రీం ఉందే ఇది వాడితే మొహం లో ముడతలు పోతాయి.. అలా చెప్పుకుంటూ పోతోంది"


"అమ్మాయి ఆగాగు ఒక్క నిమిషం. నాకేం అర్ధం  కాలేదు. ఏంటి ఇన్ని క్రీం లు ఉన్నాయా. మళ్ళి చెప్పు "


"అయ్యో అవునా ఉండండి చెప్తాను అని మళ్ళి మొదలు పెట్టింది ఈ క్రీం ఉందీ అనుకుంటూ.."


ఆవిడకి ఏమి అర్ధం కాలేదు ఆ విషయం ఆవిడ బయటపడలేదు అన్ని అర్ధం అయినట్టే గంభీరంగా మొహం పెట్టి అయితే ఆ క్రీం ఇవ్వండి అని చెప్పి ఒకటి తీసుకెళ్ళింది. ఆమె వెళ్తుంటే గంగ, వేద ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నవ్వుకున్నారు. ఇంతలో వేద మళ్ళి ఆవిడని పిలిచింది


"ఆంటీ ఆ క్రీం కనీసం 6 నెలలు వాడాలి అప్పుడే రిసుల్ట్ తెలుస్తుంది" అంది


వెళ్ళబోతున్న ఆవిడ తిరిగి వచ్చి "ఏవిటి ఆరు నెలలు వాడాల. నా చెవిలో పూలు పెడుతున్నావా టి.వి లో వారం రోజులు చాలని చెప్పారు"


"టి.వి లో అలాగే చెప్తారు. మనం అది నమ్మకూడదు. మీరు ఈ క్రీం ఆరు నెలలు వాడండి మీ మొహం తెల్లగా అయిపోతుంది"


"సరే ఆరు నెలలు వాడి చూస్తాను. అప్పుడు కూడా నా మొహం మార్పు రాకపోతే మాత్రం నేను ఊరుకోను "


"లేదాంటి ఆరు నెలలు వాడితే ఖచితంగా మార్పు వస్తుంది. రాలేదనుకోండి ఇంకో ఆరు నెలలు వాడి చుడండి అప్పుడు ఖచితంగా వస్తుంది" ఈ మాటలు వింటున్న గంగ చిన్నగా నవ్వుతోంది. వేద కి నవ్వు దాచుకోవడం చాలా కష్టం అయ్యింది. ఆవిడ వెళ్ళిపోయినా తరువాత పగలుబడి నవ్వింది.


"పాపం అక్క " అంది గంగ


"పాపం లేదు ఏం లేదు లేకపోతే ఇష్టం వచినట్టు, తన కింద పని చేసే నౌకరు లయినట్టు అలా అరుస్తూ ఉంటె చుస్తూ ఊరుకుంటామ ఏంటి నువ్వేం బాధపడకు" అంది వేద.


     "హాయ్ మీ నవ్వు చాలా బాగుంది" అని వినిపించేసరికి వెనక్కి తిరిగి చూసింది. తన వెనక కైలాష్ నిలబడి ఉన్నాడు. ఎప్పటినుండి ఉన్నాడో తెలిదు గాని అతని వరస చూస్తుంటే చాలా సేపటినుండి ఉన్నడనిపిస్తోంది.అతన్ని చూడగానే నవ్వు ఆపేసింది.ఇంతలో ఎవరో కస్టమర్స్ రావడంతో గంగ వాళ్ళని అటెండ్ చేయడానికి వెళ్ళింది.

కైలాష్ వాళ్ళ భోజనాలు అయిపోయాకు రాధా కొన్ని సరుకులు ఇంట్లో లేవని కావాలని చెప్పింది. సరే ఎలాగో తేవాలి కదా అని ఇంటికి కావాల్సిన అన్ని సరుకుల లిస్టు రాసిచ్చింది రాధా. ఎలాగో వెళ్తున్నాడు కదా అని చందన కుడా తనకి కావాల్సిన కాస్మెటిక్స్ అవి రాసిచ్చింది. అందుకే స్టోర్స్ కి వచాడు కైలాష్. సరుకుల షాపింగ్ అయిపొయింది ఇంకా కాస్మెటిక్స్, ఇంకా సబ్బులు, పేస్టులు అవి కూడా షాప్ చేద్దామని ఇటు వైపుకు వచ్చాడు. ఇంతలో వేద గొంతు వినేసరికి తను పొరపాటు పద్దదేమో అని అనుకున్నాడు మొదట. కాని మళ్ళి వినిపించేసరికి తిరిగి చూసాడు అక్కడ వేద ఆవిడకి ఎవరికో ఒక క్రీం అమ్ముతూ కనిపించింది . మొదట ఆశ్చర్యపడ్డాడు. నిన్న రాత్రి నుండి చుదాలనుకున్తున్నాడు అనుకోకుండా కనిపించేసరికి   చాల ఆనందంగా అనిపించింది.

"ఏంటండి మీరు నా వెంట పడుతున్నారా ఏంటి నేను ఎక్కడికి వెళితే అక్కడ మీరే కనిపిస్తున్నారు" అన్నాడు. ఆ అనడం కూడా చాలా ఆశ్చర్యంగా మొహం పెట్టి అన్నాడు.


వేద అదేం పట్టించుకోకుండా "గంగ ఇక్కడేం కావాలో చూడు" అని చెప్పి వెనక్కి తిరిగింది వెళ్ళిపోవడానికి.


ఇంతలో ఫోన్ రావడంతో వేద ఫోన్ మాట్లాడానికి పక్కకి వెళ్ళింది.


వేద అలా చెప్పేసరికి బాధ అనిపించింది. అసలు తనకి ఏమి పట్టనట్టు ఉండేసరికి మళ్ళి అదే భావం మొలకెత్తింది కైలాష్ లో ఎందుకు ఇంత నిర్లిప్తంగా అయిపొయింది.కనీసం ఆ మొహం లో కోపం కూడా లేదే అనిపించింది. ఇంతలో రెవ పరిగెత్తుకుంటూ వచ్చింది "అక్కా" అంటూ.


"అక్క ఫోన్ మాట్లాడుతోంది" అంది గంగ 


"ఓహ్ సరే" 


ఇంతలో వెనక ఉన్న కైలాష్ ని చూసింది "హాయ్ అంకుల్ " అంది 


"హాయ్ ఎలా ఉన్నావ్"


"బావున్నాను. షాపింగ్ చేయడానికి వచ్చారా?" 


"అవును. మరి నువ్వు"


"ఊరికే వచ్చాను"


"ఊరికే వచ్చావా?"


"ఆవును ఈ స్టోర్స్ మా నాన్నదే గా అందుకే నేను అక్కా ఇంట్లో బోర్ కొడుతుంటే వచ్చాం"


"అలాగ."


"మీ షాపింగ్ అయిపోయిందా"


"ఇంకా లేదు."


"అయ్యో." అని కైలాష్ చెయ్యిపట్టి లాగింది.


"ఏంటి"


"అంకుల్ నేను అక్క ఐస్ క్రీం తినడానికి వెళ్తున్నాం. మీరు కూడా వస్తారేమో అడుగుదామనుకున్న" 


"నేనా "


"ఔను అక్క నాకు ఒకే ఐస్ క్రీం ఇప్పిస్తా అంది. మరి నాకేమో రెండు తినాలనిపోస్తుంది అందుకే మీరు కూడా వస్తే మీరు ఒకటి, అక్క ఒకటి ఇప్పించచు అప్పుడు రెండు ఐస్ క్రీంస్ తినొచ్చు కదా మీరు కూడా రండి అంకుల్" 


"పోనీ మీ అక్కనే రెండు ఐస్ క్రేంస్ కొనివ్వమను" అన్నాడు 


"ఒహు అక్క ఒప్పుకోదు. అంతకు ముందే అడిగానే వొద్దు పళ్ళు పాడైపోతాయి అని అంటుంది"


"మరి"


"ప్లీజ్ అంకుల్. మీరు కొనిస్తే కాదని చెప్పదు గా అందుకే. ప్లీజ్." అని అడిగింది. ఆ అడిగే తీరుకి కైలాష్ కాదనలేకపోయాడు.


"సరే వస్తా గాని ఐస్ క్రీం షాప్ ఎక్కడ"


"అదిగో ఆ ఎదురుకుండానే ఉందిగా"


కైలాష్ అటు వైపు చూసాడు. రెవ చెప్పినట్టు అది ఎదురుకుండానే ఉంది రోడ్ క్రాస్ చేసి వెళ్తే సరిపోతుంది.  


"సరే ఉండైతే ఈ సరుకులు అక్కడ కౌంటర్ దగ్గర పెట్టి వస్తా వచ్చాక మళ్ళి షాపింగ్ చేసుకుందాం" అన్నాడు.

"సరే"


"నువ్వికడే ఉండు" అని చెప్పి కైలాష్ సరుకులు పెట్టేయడానికి వెళ్ళాడు.


ఇంతలో వేద వచ్చింది.


"రెవ వెళ్దామా"


"అక్క ఒక నిమిషం అంకుల్ కూడా వస్తున్నారు కలిసి వెళ్దాం"


"అంకులా ఏ అంకుల్"


"అదే అక్క ఆ రోజు హోటల్ లో కనిపించారు ఆయన. సరుకులు కౌంటర్ లో పెట్టి వస్తా అన్నారు" ఆ మాట వినగానే వేద కి ఎలాగో అనిపించింది.


"ఎందుకు ఏం వద్దు మనం వెళ్దాం రా" 


ఇంతలో కైలాష్ వస్తూ కనిపించాడు.


"వెళ్దామా" అన్నాడు రెవ ని చూసి.

కైలాష్ తో  వెళ్ళడం వేద కి ఇష్టం లేదు. అందుకే అంది "మీరు వెళ్ళండి నేను రాను నాకు కొంచం పని ఉంది. రెవ అంకుల్ తో వెళ్లి తొందరగా వచ్చేయి" అని చెప్పింది.

"అదేంటి మీరు రారా. రెవ మన ఇద్దరితో వెళ్దామని సరదా పడుతోంది" అన్నాడు ఎలాగైనా వేద ని రప్పించాలని.


ఆ మాటకి వేద కి కోపం వచ్చింది. 


"రెవ ఐస్ క్రీం తినాలని సరదా పడుతోంది. మీరు వెళ్తున్నారు గా మళ్ళి ఇంత చిన్న పనికి ఇద్దరం ఎందుకు మీరు వేల్లేసి రండి" అంది ఆ మాట ఎంత నెమ్మదిగా  చెప్దామనుకున్న ఆ గొంతులో కోపం తెలుస్తోంది.


"సరే మీ ఇష్టం రా రెవ మనం వెళ్దాం" అన్నాడు 


కాని రెవ వేద ని కూడా రమ్మని పట్టు పట్టింది.


"నువ్వు కూడా రా అక్క"


"లేదు వేద మీరు వెళ్ళండి"


"అక్క ప్లీజ్" అని బతిమిలాడుతుమట్టుగా మొహం పెట్టింది. అది చూసేసరికి వేద కి కోపం పోయింది రెవ కోసం వెళ్దామనిపించింది.


"సరే పద " 



ముగ్గురు ఐస్ క్రీం షాప్ కి వెళ్లారు.అక్కడ ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు.


"రెవ నీకు ఏ ఐస్ క్రీం కావాలో చెప్పు" అన్నాడు కైలాష్.


రెవ చెప్పిన ఐస్ క్రీం ని ఆర్డర్ చేసాడు


ఇంతలో రెవ వేద తో అంది "అక్క నేనిప్పుడే వాష్ రూం కి వేల్లేసి వస్తాను"


"సరే తొందరగా రా"


"సరే"


అక్కడ కైలాష్, వేద మిగిలిపోయారు. ఎలాంటి అవకాశం కోసమే కైలాష్ ఎదురుచూస్తున్నాడు.


"వేద నేను నీతో పర్సనల్ గా మాట్లాడాలి"


"మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు" చాలా దురుసుగా వచ్చింది సమాధానం.


"వేద ఒక్కసారి నేను చెప్పింది విను అప్పుడు కూడా తప్పు నాదే అనిపిస్తే నీ ఇష్టం నువ్వే శిక్ష వేసిన ఓకే. నాకు తెలుసు నేను చేసింది చాలా తప్పని కాని అది నేను తెలిసి చేసింది కాదు.అసలేం జరిగిందంటే "


"నాకనవసరం. చూడండి రెవ వస్తోంది దాని ముందు  ఇదేం మాట్లాడవద్దు. మీరు చెప్పేది వినాలన్న కోరిక నాకేం లేదు"


ఇంతలో రెవ వచ్చింది. రెవ వచ్చిన రెండు నిమిషాలకి బేరర్ ఐస్ క్రీం తీసుకోచాడు.


కైలాష్ ఎదురు చూసినట్టుగా వేద తో ఒంటరి గా మాట్లాడే అవకాశం వచ్చింది కాని తను చెప్పాలనుకున్నది చెప్పలేకపోయాడు. అవకాశం వచినట్టే వచ్చి చేయి జారిపోయింది అసలు రెవ రమ్మన్ గానే తను వచ్చింది కూడా వేద తో మాట్లాడదామని కాని కుదరలేదు.


రెవ ఐస్ క్రీం తినంగానే బిల్ చెల్లించి బయటకి వచ్చారు.


స్టోర్స్ కి రాగానే హరికి రెవ ని అప్పచెప్పి వేద ఇంటికెళ్ళిపోయింది.


ఆ మరుసటి రోజు ఉదయమే వేద కి గిరి నుండి కాల్ వచ్చింది. ఆఫీసు కి వీలైనంత తొందరగా రమ్మని. అందుకే పొద్దున్న 8 గంటలకే ఆఫీసు కి బయల్దేరి వెళ్ళిపోయింది. 

"హాయ్ గిరి"

"హాయ్ వేద . వేద ఇవాళ చాల వర్క్ వచ్చింది. డెలివరబుల్స్  ఉన్నాయి అన్ని రేపటి కలా అయిపోవాలి. మాములుగా అయితే మీ ఇద్దరు చేస్తే అయిపోతుంది కాని ఇందాక పొద్దున్న కస్తూరి ఫోన్ చేసింది తనకి లీవ్ కావాలని. సో ఇప్పుడు ఇదంతా నువ్వే చూసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోను రేపటి కల్ల పనంతా అయిపోవాలి."

"సరే గిరి నేను చేస్తాను "

"కావాలంటే ఆ కొత్త అమ్మాయి .. ఔను పేరేంటి ఆ అమ్మాయిది"

"చందన"

"ఆ చందన. చందన హెల్ప్ తీసుకో తనకి ఎక్ష్ప్లైన్ చేయి ఏం చేయాలో ఎలా చేయాలో."

"సరే గిరి నేను చుస్తానులే"

"ఇంకో అరగంటలో కాల్ ఉంది అది నువ్వు కూడా అటెండ్ అవ్వు రిక్వైర్మెంట్స్ తెలుస్తాయి దాన్ని బట్టి ప్రొచీద్ అవ్వచు."

"సరే" అని చెప్పి డెస్క్ దగ్గరికి వచ్చి సిస్టం ఆన్ చేసింది 


గిరి చెప్పాడని కాదుకాని నిజంగానే ఆ రోజు చాల వర్క్ వచ్చింది తన ఇన్బాక్స్ లో 20 కి పైగా మెయిల్స్ ఉన్నాయి. ఎంత తొందరగా చేసినా ఖచితంగా చాలా టైం పడుతుంది. అప్పటికే 9:30 అయ్యింది చందన ఇంకా రాలేదు. ఫ్రెషర్ అయ్యుంది ఆ అమ్మాయి ఇంకా రాకపోవడం వెదకి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంకో 15 నిమిషాలలో కాల్ ఉంది అది చందన కూడా అటెండ్ అయితే బాగుంటుంది లేకపోతే తను మల్లి మొత్తం అంతా చెప్పాల్సి ఉంటుంది అనవసరం గా టైం వెస్ట్. వాళ్ళ ఆఫీసు పోర్టల్ లో నెంబర్ చూసి చందన కి కాల్ చేసింది 

చందన అప్పుడే ఇంటి నుండి బయల్దేరింది. ఆ రోజు లేవడం లేట్ అవ్వడం తో కొంచం ఆలస్యమైపోయింది.

"అన్నయ్య తొందరగా రా ఇప్పటికే లేట్ అయిపొయింది."

"ఇది బాగుండే పొద్దు పోయేవరకు టి.వి చూస్తావు లేట్ గా పడుకున్తావ్ లేట్ గా లేస్తావ్ ఇప్పుడు అన్నయ్యని తొందర పెడుతున్నావా" అంది రాధా 

ఇంతలో కైలాష్ రెడీ అయి వచ్చాడు "వెళ్దామా"

"ఆ పద"

బయటకి వచ్చి కార్ తీసాడు. వేద బండి కోసం చూసాడు కాని అది కనిపించలేదు. ఏంటి వేద అప్పుడే వెళ్లిపోయిందా అనుకున్నాడు.

చందన వచ్చి కార్ లో కూర్చుంది.

"అన్నయ్య వొదిన బండి ఉందా?"

"లేదు నాకు కనిపించలేదు అప్పుడే వెళ్లిపోయిందా ఏంటి?"

"వేల్లిపోయిన్దనుకుంటా ఇవాళ అసలే లేట్ అయ్యింది. పోయిన వారమే చెప్పారు లేట్ చేయద్దని. ఎట్టి పరిస్థితులలో 9:30 కల్ల ఆఫీసు లో ఉండాలని చెప్పారు"

"మరి రాత్రంతా టి.వి ఎందుకు చూసావ్"

"నాకేం తెలుసు పొద్దున్నే మేలుకు రాదనీ అయిన అలారం పెట్టుకున్న అదేమో మొగనే లేదు అసలు" అని చందన అన్తోన్ద గానే ఫోన్ మోగింది.

"ఎవరు" అన్నాడు కైలాష్.

"ఆఫీసు నుండి"

సరే లిఫ్ట్ చేయి. స్పీకర్ పెట్టు.

"హలో" అంది చందన 

"హలో చందన . వేర్ ఆర్ యు"  అంది వేద 

ఆ గొంతు వినగానే కైలాష్ చందన వైపు తిరిగాడు.

"రోజు కాల్ ఉంటుందని తెలుసు కదా ఇంకా ఎందుకు రాలేదు?"

"సారీ వేద. ఐ ఆం ఆన్ ది వే. ఒక 10 మినిట్స్ లో వచేస్తాను"

"మేక్ ఇట్ ఫాస్ట్" అని చెప్పి ఫోన్ పెట్టేసింది వేద.

"అన్నయ్య తొందరగా పోనీ"

"ఉండు ట్రాఫిక్ కదలాల వొద్దా. ఇంతకీ కాల్ ఎప్పుడు?"

"10 నిమిషాలలో"

"సరే. నువ్వు మాట్లాడకుండా కూర్చో నేను తీసుకొని వెళ్తాను"

కైలాష్ చందన ని ఆఫీసు దగ్గర దింపి హాస్పిటల్ కి వెళ్ళాడు. చందన పైకి వచేసరికి పది అయింది. రాగానే కాల్ కి జాయిన్ అవ్వమని చెప్పింది వేద. అనట్టుగానే జాయిన్ అయ్యింది కాని వాళ్ళు చెప్పేది ఎమిఅర్ధమ్ కావట్లేదు అయిన ఏం మాట్లాడకుండా వింటూ ఉంది. 

కాల్ అయిపోగానే వేద పిలిచింది చందానని "ఇవాళ తెలియదు కాబటి ఓకే ఇంకెప్పుడు కాల్ కి లేట్ గా రావొద్దని చెప్పింది. ఆ రోజు చేయాల్సిన పనిలో చందన కి కొంచం ఇచ్చింది అది ఎలా చేయాలో చెప్పింది.

చందన పని అయ్యేసరికి సాయంత్రం నాలుగయ్యింది. పని అయిపోయిన విషయం వచ్చి వెదకి చెప్పింది. ఆ డాకుమెంట్స్ అన్ని మెయిల్ కి పంపించింది. సాయంత్రం 6 అయ్యేసరికి వేద ని అడిగింది ఇంకేమైనా పని ఉందా అని.

"ఇంకేం లేదు నువ్వెళ్ళు" అంది వేద.

వేదకి ఆ రోజు చాల పని ఉంది భోజనానికి వెళ్ళడానికి కూడా టైం సరిపోలేదు. చందన వెళ్ళేటప్పటికి ఆ పని లో సగం కుడా కాలేదు. 

ఇంటికి వెళ్తూ వెళ్తూ కైలాష్ చందన ని పికప్ చేసుకున్నాడు. వాళ్ళు ఇంటికి వెళ్లేసరికి రాత్రి 7 అయ్యింది. రాగానే చందన, కైలాష్ స్నానాలు చేసారు. వచ్చి కొంచం సేపు టి.వి ముందు కూర్చున్నారు.

రాత్రి 9 గంటలకి హంస భోజనానికి  పిలిచింది. వాళ్ళ భోజనం అయ్యేసరికి రాత్రి పది అయ్యింది. కైలాష్ బయటకి వచ్చి చూసాడు వేద వచిందేమో అని. వేద బండి కోసం చూసాడు అది కనిపించలేదు, మెడ మీద లైట్ కూడా వెలగటం లేదు.చందన తో అన్నాడు

"చందన వేద ఇంకా రాలేదేంటి"

"అయ్యో నేను చెప్పడం మర్చిపోయా అన్నయ్య. ఇవ్వాళ్ళ ఆఫీసు లో చాల పని వచ్చింది. పైగా కస్తూరి కూడా లీవ్ లో ఉంది కదా అందుకే ఆ పనంతా వోదినే చేస్తోంది. నేను వచెటప్పటికి తను ఇంకా అన్నం కూడా తినలేదు. అది అయ్యేటప్పటికి చాల లేట్ అవుతుందని చెప్పింది. నేను హెల్ప్ చేస్తా అని చెప్పను గాని నేను చేసేది ఏం లేదంట అందుకే నన్ను వేల్లిపోమనింది. ఆ పనంతా అయ్యేసరికి అర్ధ రాత్రి రెండన్నా అవుతుంది నాకు తెలిసి"

"ఔన మరి ఎలా అప్పటిదాకా అంటే చాల కష్టం కదా. కనీసం నువోచ్చాకైన ఏమైనా తినిందో లేదో. అంత రాత్రైతే ఎలా వస్తుంది"

"ఆఫీసు కాబ్ ఉంది వాళ్ళు డ్రాప్ చేస్తారు"

"ఔనా సరేలే. కాని ఏమైనా తినిందో లేదో."

రాత్రి రెండింటికి పని అయిపోతుంది అనుకుంది కాని అది ఆ రోజు పూర్తి అవ్వలేదు. క్లైంట్ రిక్వైర్మెంట్స్ దగ్గర కాన్ఫ్యుసే అవ్వడం తో  మల్లి రివర్క్ చేయాల్సి వచ్చింది. ఆ పనంతా అయ్యేసరికి మరుసటి రోజు ఉదయం 9 అయిపొయింది. ఇంకా ఎలాగో 45 నిమిషాలలో కాల్ ఉందని వేద ఇంటికి వెళ్ళలేదు. ఆ రోజు కూడా చాల వర్క్ ఉందని చెప్పడం తో ఆగిపోయింది . కాల్ అయ్యాక అన్ని డీటెయిల్స్ వస్తాయి. అందుకే ఈలోపు ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేద్దాం అని వెళ్ళింది . అసలే నిన్నంత ఏమి తినలేదేమో చాలా ఆకలి గా ఉంది. ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినేసరికి కాల్ టైం అయ్యింది. కాల్ అటెండ్ అయ్యి వర్క్ స్టార్ట్ చేసింది . 

ఆ రోజు సాయంత్రం చందన ఇంటికి వెళ్ళాక అన్నయ్య తో చెప్పింది "అసలు వొదిన రాత్రంతా ఇంటికి రాలేదు ఫుల్ వర్క్ ఉంది ఆఫీసు లోనే ఉండిపోయింది."

"అవునా"

"అవును. ఇవాళ కుడా అంతే చాల వర్క్ ఉంది అది ఎప్పుడు అయిపోతుందో మరి"

ఆ రోజు కుడా అదే పరిస్థితి.ఆ రోజు వర్క్ అయ్యేసరికి అర్ధ రాత్రి 3 దాటింది. చేసిన వర్క్ అంత మెయిల్స్ పంపించి కాబ్ లో ఇంటికి బయల్దేరింది. ఇంటికోచేసరికి 4 అయ్యింది . ఆ రోజు కూడా అంతే పోద్దుటినుంది ఏమి తినడానికి వీలు అవ్వలేదు. చాల ఆకలి వేస్తోంది గాని తినే ఓపిక లేదు నిద్దర ముంచుకొని వస్తోంది. పైకి వెళ్ళగానే కళ్ళు మూసుకొని పడుకొంది.

No comments:

Post a Comment