Wednesday, 2 July 2014

Samveda - 18

 వేద తన బ్రాంచే అని, తన ప్రాజెక్టే అని కైలాష్ కి ఎంత తొందరగా చెప్దామ అని వెయిట్ చేస్తోంది చందన .ఆ రోజు కైలాష్ కి హాస్పిటల్ లో లేట్ అవుతంది ఫోన్ చేయడం తో చందన ని తీసుకొని వెళ్ళడానికి శైలేష్ వచ్చాడు. చందన కి ఫోన్ చేసి తను వాళ్ళ ఆఫీసు కి వచినట్టు తన కోసం కింద వెయిట్ చేస్తునట్టు చెప్పాడు. చందన కిందకి వచ్చింది. వస్తూనే శైలేష్ ని అడిగింది 

"చిన్నన్నయ్య ఏడి?"

"వాడికి హాస్పిటల్ లో ఏదో పని ఉందంట రావడానికి కొంచం లేట్ అవుతుందని చెప్పాడు . డైరెక్ట్ గా ఇంటికి వచేస్తా అని చెప్పాడు. రా ఎక్కు "

చందన ఎక్కగానే శైలేష్ కార్ స్టార్ట్ చేసాడు 

"అన్నయ్య నీకో విషయం తెలుసా"

"ఏంటది " అంటూండగానే శైలేష్ కి ఫోన్ వచ్చింది. అది ఒక ఇంపార్టెంట్ కాల్ తన క్లైంట్ దగ్గరనుండి వచ్చింది. అది అటెండ్ చేసాడు .

ఆ కాల్ అయిపోయేసరికి ఇల్లు కూడా వచేసింది.అందుకే ఏం చెప్పడానికి కుదరలేదు చందన కి . సరేలే భోజనం చేసేటప్పుడే అందరికి కలిసి ఒకేసారి ఈ న్యూస్ చెప్దామని ఊరుకుంది.

కైలాష్ వచేసరికి రాత్రి తొమ్మిది దాటింది. తనకి హాస్పిటల్ లో పని ఉండడం వాళ్ళ చందన ని తీసుకొని  రావడం కుదరదని చెప్పినప్పుడు శైలేష్ కైలాష్ వాళ్ళ హాస్పిటల్ కి బండి లో వెళ్లి బండిని కైలాష్ కి ఉంచేసి తను కార్ తీసుకొని వచాడు చందన దగ్గరికి . అందుకే ఇప్పుడు కైలాష్ బండి మీద వచాడు . వస్తూనె పైకి చూసాడు వేద వచ్చిందా లేదా అని . మెడ మీద లైట్స్ వెలిగే సరికి వేద వచ్చిందని గ్రహించాడు. ఆ రోజు శనివారం రాత్రి చూడడమే వేద ని మళ్ళి ఇప్పటిదాకా చూడడం కుదరలేదు అందుకే ఒకసారి పైకి వెళ్లి చూద్దాం అనుకున్నాడు. కాని ఈలోపు  చందన వచ్చింది బయటకి "హాయ్ అన్నయ్య ఇప్పుడే వచ్చావ ?"

"అవును "

"సరే రా అందరం నీకోసమే వెయిట్ చేస్తున్నాం . తొందరగా స్నానం చేసి రా భోజనం చేద్దాం. ఆకలి వేస్తోంది."

చందన అల అనేసరికి వేద ని చూడడానికి వెళ్లాలనుకునే తన ఆలోచన ని మానుకొన్నాడు కైలాష్ "సరే పద" అంటూ లోపలికి వెళ్లి స్నానం చేసి వచ్చాడు.

భోజనాల దగ్గర అడిగాడు శైలేష్ చందన  ని "ఇవాళ ఎలా గడిచింది చందన ఆఫీసు లొ మొదటి రోజు?"

"చాల బాగా .మీకందరికీ ఒక విషయం చెప్పాలి" అంది. 

"ఏంటది ?" అన్నాడు శైలేష్ 

"చందన నీకు ఏమైనా తెలిసిందా వేద గురించి అదే తను ఏ బ్రాంచ్, ఏంటి అలా ఏమైనా విషయాలు తెలిసాయా?"

"అదే నేను చెప్పబోయేది" అంది చందన 

"ఏంటది?" అన్నాడు ఎంతో ఉద్వేగంగా.

"ఉండరా దాన్ని చెప్పని " అంది రాధ

"అమ్మా ఇవాళ నేను వదిన ని చూసాను తెలుసా"

"అవునా అంటే తనది కూడా నీ బ్రాంచే న?" అడిగాడు కైలాష్ 

"ఒక బ్రాంచే కాదు, ప్రాజెక్ట్ కూడా, వొదిన చేసే ప్రాజెక్టే, తన కిందే నేను పని చేసేది కూడా " అంది 

"అవునా"

"అవును అన్నయ్య ఐ అం సో హ్యాపీ ఇప్పుడు కనీసం మాట్లాడుతుందనే అనుకుంటున్నా"

"ఇప్పుడు కొంచమైన తనతో మాట్లాడే అవకాశం దొరుకుతుంది. ఔను ఏమైనా నీతో మాట్లాడిందా అసలు "

"చాల తక్కువ అన్నయ్య అయిన నేను తనని చూసింది మధ్యాహ్నం 3 గంటలకి. తను ఇంకో రెండు గంటలలో తన పని అయిపోయిందని వెళ్ళిపోయింది అందుకే కుదరలేదు బహుశా రేపటినుండి ఆ అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకో తెలుసా వొదిన , ఇంకా వొదిన ఫ్రెండ్ ఇద్దరే చేస్తున్నారు ఆ ప్రాజెక్ట్ లో ఇప్పుడు నేను కూడా అదే ప్రాజెక్ట్, అది కాకుండా ఇప్పుడు వొదిన ఫ్రెండ్ పెళ్ళికి లీవ్ పెట్టింది సో ఇంకా మేమిద్దరమే చెయ్యాలి అప్పుడు, అప్పుడు నాకేమైనా డౌట్స్ ఉంటె వొదిన నే అడగాలి ఇంకెవరు లేరు అడగడానికి అలా మా ఇద్దరికీ మాట్లాడే అవకాశం దొరుకుతుందని అనుకుంటున్నా"

"అవును నువ్వు చెప్పిన దాన్ని బట్టి చుస్తే అప్పుడు మీ ఇద్దరికీ మాట్లాడుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది." అన్నాడు కైలాష్

వారి భోజనాలు పూర్తీ అయ్యి అన్ని ఎక్కడివి అక్కడ సర్దేసరికి రాత్రి పదకొండు అయ్యింది .

  ఆ మరుసటి రోజు ఉదయం చందన ఆఫీసు కి బయలుదేరడానికి రెడీ అవుతోంది. కైలాష్ కూడా రెడీ అవుతున్నాడు. ఇప్పుడు చందన ని ఆఫీసు లో దిమ్పాల్సి ఉండడంతో శైలేష్ బండి మీద ఆఫీసు కి వెళ్ళిపోతున్నాడు కార్ కైలాష్ కి ఇచ్చి. చందన రెడీ అయ్యి బయటకి వచ్చింది. టిఫిన్ తిన్నాక అడిగింది వాళ్ళ అన్నయ్య ని 

"అన్నయ్య వెళ్దామా?"

"ఆ పద. నువ్వు ఇక్కడే ఉండు నేను కార్ తీసుకొని వస్తాను" అని కార్ పార్క్ చేసిన చోటకి వెళ్ళాడు.

ఇంతలో అప్పుడే వేద కూడా ఆఫీసు కి వెళ్ళడానికి బయటకి వచ్చింది. తన బండి తీస్తుండగా చందన వచ్చింది వేద దగ్గరికి 

"వొదిన..నువ్వు అదే ఆఫీసు గా నన్ను ఎలాగో అన్నయ్య డ్రాప్ చేస్తున్నాడు. నువ్వు కూడా వస్తే ఇద్దరం కలిసి వెళ్లిపోవచ్చు " అంది 

కైలాష్ కార్ తీసుకొని వస్తూనే చూసాడు చందన వేద తో మాట్లుడుతూ ఉండడాన్ని కార్ తీసుకొని వెళ్లి వాళ్ళ దగ్గరగా ఆపాడు. వేద ఆ రోజు ఎర్ర రంగు పంజాబీ డ్రెస్ వేసుకుంది. ఆ కలర్ తనకి బాగా నప్పింది. ఎంత సేపు చుసిన అల చూడాలి అనిపించేలా ఉంది. తనని చూసి రెండు రోజులయ్యిందేమో చూడగానే రెండు నిమిషాలు అలానే ఉండిపోయాడు. ఇంతలో 

"అవసరం లేదు నేను బండి మీద వెళ్ళిపోతాను" అని వేద అనడం విన్నాడు.

"మీరు వెళ్లలేరని కాదు ఎలాగో మేము ఆటే వెళ్తున్నాం డ్రాప్ చేద్దాం అని అంతే. అది గాక ఇద్దరు ఒకే చోటకి ఒకే చోటు నుండి వెళ్ళేటప్పుడు వేరు వేరు గా వెళ్ళడం ఎందుకు చెప్పండి " అన్నాడు కార్ దిగి వస్తూ. కార్ దిగే ముందు వేద బండికి ఆ కార్ ని కొంచం అడ్డంగా పెట్టాడు.లేకపోతె వేద మాట్లాడకుండానే తన బండి మీద వెళ్ళిపోతుందని తనకి తెలుసు. అందుకే ఆ అవకాశం ఇవ్వకుండా కార్ తేచి అడ్డంగా పెట్టాడు.

ఇంతలో రాధ హడావిడిగా పిలిచింది చందన ని . ఆ పిలుపు విన్న చందన 

"అన్నయ్య ఇప్పుడే వస్తా అమ్మా పిలుస్తోంది" అంటూ లోపలి వెళ్ళింది. 

"కొంచం కార్ పక్కకి జరిపితే నేను వెళ్తాను"

"జరుపుతా గాని. ఈ డ్రెస్ లో నువ్వు చాల బాగున్నావ్ తెలుసా. చూడగానే ముద్దోస్తున్నావ్ తెలుసా" అన్నాడు 

"షట్ అప్ పిచి పిచి గా ఉందా?" అంది ఎర్రబడే కళ్ళతో.

"మొగుడిని షట్ అప్ అన్న పెళ్ళాని నేను ఎక్కడ చూడలేదు. ఇవ్వాళే మొదటి సారి తెలుసా చూడడం. ఎం చేస్తాం. నిన్ను ఇలా చూస్తుంటే నిజంగానే పిచి పిచి గా ఉంది" అన్నాడు అల అనేటప్పుడు ఆ స్వరం గమత్తుగా పలికింది.

"నీకు ఇంతకు ముందే చాల సార్లు చెప్పాను నాతో మాట్లాడడానికి ప్రయత్నించవద్దు అని. నీకు ఎందుకు అర్ధం కాదు"

"నువ్వు నాతొ మాట్లాడితే నేను ఎందుకు ప్రయత్నిస్తాను చెప్పు నిన్ను మాట్లాడించడానికి "

"నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు."

"కాని నాకు నీతో మాట్లాడితేనే చాల ఆనందంగా ఉంటుంది తెలుసా"

"అవును ఎదుటి మనిషి ఇష్టా ఇష్టాలతో నీకేం సంబంధం నీకు ఏది తోచితే అది చేయడం తప్ప. దాన్ని వల ఎదుటివాళ్ళు బాధ పడ్డ నీకు అనవసరం. వెనకా ముందు ఆలోచించకుండా పనులు చేయడం నీకు బాగా అలవాటు."

"వేద ప్లీజ్ అలా అనకు నిన్ను బాధ పెట్టాలని కాదు. ఒకసారి నీతో మాట్లాడే అవకాశం కావలి. అందుకే నా ప్రయత్నం."

"అది జరగని పని. నేను నీతో మాట్లాడాలి అని అనుకోవడం లేదు."

"నాకు తెలుసు. కాని నా కోసం ఒకసారి"

"నీకోసం అయితే నేనెందుకు మాట్లాడాలి నాకా అవసరం లేదు. నాకు ఆఫీసు కి టైం అవుతోంది బండి తీస్తే వెళ్తాను"

ఇంకా ఎక్కువ సేపు ఆపితే బాగుండదని కార్ తీసాడు పక్కకి. కార్ తీయగానే వేద బండి మీద వెళ్ళిపోయింది . 

వేద వెళ్ళిన 5 నిమిషాలకు వచ్చింది చందన.

"ఏంటి ఏమైంది ఎందుకు పిలిచింది అమ్మ" అన్నాడు కైలాష్ 

"ఎం లేదు టిఫిన్ బాక్స్ మర్చిపోయాను అందుకని" 

"సరే వెళ్దామా "

"ఆ. వొదిన వెళ్లిపోయిందా ?"

"హ వెళ్ళిపోయింది"

కైలాష్ చందన ని ఆఫీసు దగ్గర దింపి తను హాస్పిటల్ కి వెళ్ళిపోయాడు.

ఆఫీసు కి రాగానే వేదని, కస్తూరి ని విష్ చేసింది చందన . తనకి తెలుసు వేద ఇంట్లో మాట్లాడకపోయినా ఇక్కడ ఖచితంగా మాట్లాడుతుందని.

"హాయ్ మార్నింగ్. ఇవాళ కాల అయిపోగే ట్రైనింగ్ స్టార్ట్ చేస్తా. ఒకే నా " అంది కస్తూరి 

"హా ఓకే "

"ఈలోపు కొన్ని మెటీరియల్స్ పంపిస్తాను చుస్తూ ఉండు" అని వేద వైపు తిరిగి "వేద తనకి ఆ మెటీరియల్స్ ఉన్న మెయిల్ ఫార్వర్డ్ చెయ్యవే" అంది.

వేద చందన ని అడిగింది "నీ మెయిల్ అయిడి చెప్పు"

చందన చెప్పిన మెయిల్ కి మెసేజ్ ఫార్వర్డ్ చేసింది. తర్వాత కాల్ టైం అవ్వడం తో కాల్ లో బిజీ అయిపోయారు.వాళ్ళు ఆ రోజు చేయాల్సిన పని అంత ఆ కాల్ లోనే చెప్తారు. ఏ రోజు పని ఆ రోజే చేయాలి. ఏ రోజు పని ఆ రోజే ఇస్తారు. ఒకవేళ ఆ రోజు పని లేకపోతె 2 గంటలకి వెళ్ళిపోయినా ఎవరు అడగరు. పని ఉంటె మాత్రం 11 అయిన ఉండాల్సిందే.

కాల్ అయిపోయేసరికి 11:30 అయింది. కాల్ అయిపోగానే కస్తూరి అంది 

"బాబోయి ఏంటే ఇవాళ ఇంత వర్క్ వచ్చింది." 

"అవును చాల ఉంది పద కాంటీన్ కి వెళ్లి రాగానే మొదలు పెడదాం" అంది వేద 

"సరే పద. చందన నువ్వు కూడా వస్తావా మాతో కాంటీన్ కి"

ఇప్పుడు కాంటీన్ కి చందన ఎందుకు? దీనికి అసలు బుద్ధి లేదు. ఈ రోజు నుంచి రోజు లంచ్ కి కాంటీన్ కి కలిసి వస్తుందేమో.ఎలా వద్దని చెప్పడం. వద్దంటే ఏదైనా కారణం చెప్పాలి. ఏముందని చెప్పడానికి. ఇంక అంతే కలిసి వెళ్ళాల్సిందే చేసేదేం లేదు అనుకుంది వేద 

కాంటీన్ కి వెళ్లి టిఫిన్ చేసింది వేద. కస్తూరి, చందన కాఫీ తాగారు. వేద కాంటీన్ లో టిఫిన్ చేస్తుంటే అడిగింది చందన "మార్నింగ్ మీరు టిఫిన్ చేయలేదా" అని

వేద కి సమాధానం చెప్పడం ఇష్టం లేదు. కాని తప్పదు "లేదు " అంది 

చందన అడిగింది కస్తూరి ని "పెళ్లి పనులు మొదలు పెట్టార అండి"

"హ మొదలు పెట్టారు అవుతున్నాయి ఇంకా ఈ వరం కాకా రెండు వారలే ఉన్నాయ్. వచ్చే వారం కాకా ఆ పైన వచ్చే శుక్రవారమే పెళ్లి అందుకే చాల తొందరగా చేస్తున్నారు" అని చందన తో అని వేద తో అనింది 

"వేద మనం షాపింగ్ కి వెళ్ళాలి వే. పెళ్ళికి కనీసం 6 చీరలన్న కొనాలి. మళ్ళి వాటికి మాచింగ్ సెట్స్ అన్ని కొనాలి ఇంకా కొంచం బంగారం కూడా కొనాలి. మళ్ళి బ్లౌసెస్ స్టిచింగ్ కి ఇవ్వాలి. ముంది షాపింగ్ కి ఎప్పుడు వెళ్దాం చెప్పు. ఇంకా రెండు వారలే ఉంది గా."

"ఈ శనివారం వెళ్దాం లే అప్పుడే అన్ని చెరలు తీసుకుందాం ముందు చీరలు తీసుకొని బ్లౌసెస్ స్టిచింగ్ కి ఇచెస్తె ఆ వచ్చే వారం బంగారం కొనొచు. ఈ లోపు ఎప్పుడన్నా 2 రోజులు ముందు వెళ్లి మాచింగ్ సెట్స్ తీసుకుందాం అన్నింటికీ" అండి వేద

"సరే మరి అయితే ఈ శనివారం పొద్దున్న మీ ఇంటికి వస్తాను అక్కడనుండి వెళ్దాం ఓకే న"

"హ ఓకే"

అప్పటికే వాళ్ళు వచ్చి అరగంట అవడం తో తిరిగి క్యుబికల్ కి వెళ్లారు. క్యుబికల్ కి వెళ్ళగానే కస్తూరి చందన కి ట్రైనింగ్ స్త్రాట్ చేసింది. మధ్యాహ్నం 2 వరకు చెప్పింది.

మధ్యాహ్నం 2 గంటలయ్యింది పొద్దున్న టిఫిన్ లేట్ అవ్వడం తో వాళ్ళు భోజనాలు కూడా లేట్ గానే చేస్తారు అందుకే కస్తూరి అనింది చందన తో "చందన మేము లంచ్ కి వెళ్లేసరికి 3 దాటుతుంది నీకు ఆకలి వేస్తె నువ్వు కుంచ చేసేయి"

"పర్వాలేదు నేను ఉంటాను నాకు ఇప్పుడెం ఆకలి లేదు"

"సరే నీ ఇష్టం " అని ఇంకా పని మొదలు పెట్టింది కస్తూరి.

వాళ్ళు లంచ్ చేసేసరికి సాయంత్రం 4 అయింది. లంచ్ కి చందన కూడా వాళ్ళతో వెళ్ళింది . ఇలా అయితేనే వేద తో మాట్లాడడానికి కుదురుతుందని చందనకి అర్ధం అయ్యింది అందుకే లంచ్ కి, బ్రేక్స్ కి వాళ్ళ తోనే వెళ్తోంది.

ఆ రోజు పని చాల ఉంది . చందన ఇంకా ఫ్రెషర్ కాబట్టి తనకేం వర్క్ లేదు కాబట్టి సాయత్రం 6 గంటలకే కైలాష్ వస్తే వెళ్ళిపోయింది.

అప్పుడు అడిగాడు కైలాష్ వేద రాదా అని 

"లేదు అన్నయ్య వాళ్ళకి ఇవాళ చాల పని ఉందంట ఇప్పుడు రాదేమో మరి"

"సరే పద" అని ఇద్దరు కలిసి ఇంటికి వెళ్లారు.

ఆ రోజు పని అయిపోయేసరికి రాత్రి 9 అయ్యింది. ఎలాగో 9 అయ్యింది కదా అని కాంటీన్ లో నే తినేసి ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్లేసరికి 10 అయ్యింది.అప్పటికే చాల అలసిపోవడం తో ఇంటికి వెళ్ళగానే పడుకుంది పోయింది.

  అలానే ఇంకో మూడు రోజులు గడిచిపోయాయి. ఈ మూడు రోజులు కైలాష్ కి వేద ని చూడడమే కుదరలేదు. తనకి హాస్పిటల్ లో ఇద్దరు ఇంపార్టెంట్ పేషన్ట్స్ ఉండడంతో చందన ని డ్రాప్ చేయడానికి కూడా కుదరలేదు . ఆ మూడు రోజులు శైలేశే తీసుకెళ్ళి, తీసుకోచాడు.  పేషన్ట్స్ ఇద్దరికీ బాగయ్యేవరకు హాస్పిటల్ లోనే ఉన్నాడు. బుధవారం పొద్దున్న వెళ్ళిన అతను మళ్ళి శుక్రవారం రాత్రి 11 గంటలకి ఇంటికి వచ్చాడు. ఇంకా ఆ మరుసటి రోజు హాస్పిటల్ కి రానని చెప్పాడు . ఎలాగో తరువాత రోజు ఆదివారం కాబట్టి రెండు రోజులు సెలవు కలిసి వచ్చింది. కాని ఏదైనా ఎమర్జెన్సీ కేసు ఉంటె మాత్రం వెళ్ళాలి.శైలేష్ శుక్రవారం చందన ని తీసుకొని రాగానే కేసు విషయమై ఊరుకి వెళ్ళాలని చెప్పి వూరెళ్ళాడు రావడానికి వారమన్న పడుతుంది  అని చెప్పాడు .

 ఈ మూడు రోజులలో చందన కి కస్తూరి తో చనువు పెరిగిందనే చెప్పాలి, వేద తో మాట్లాడుతోంది గాని ఆ మాటలు చాల పొడిగా ఉంటున్నాయి, ఎంత ప్రయత్నించిన మామూలు సంభాషణ జరగటం లేదు. కాని కస్తూరి తో అలా కాదు. పరిచయం బాగానే పెరిగింది .

  ఆ రోజు శనివారం. వేద వాళ్ళకి ఆఫీసు ఉండదు. అనుకునట్టు గానే కస్తూరి ఉదయం పదిన్నర  వరకు వేద వాళ్ళ ఇంటికి వచ్చింది.అక్కడ నుండి షాపింగ్ కి వెళ్దాం అనుకున్నారు. ఉదయం పదకొండు గంటలకి షాపులు తెరుస్తారు కాబట్టి పెళ్ళికి కావాల్సిన చీరలన్ని కొందాం అనుకున్నారు . కుదిరితే అన్ని ఇవాలే కొనేటట్టు లేకపోతే ఇవాళ కొన్ని రేపు కొన్ని కొనేటట్టు ప్లాన్ చేసుకున్నారు. కస్తూరి వెళ్ళేటప్పటికి  చందన బయటే ఉంది. కస్తూరిని చూడగానే "హాయ్ " అంది

"ఓహ్ హాయ్" అంది కస్తూరి.

"ఏంటి ఇక్కడ బయట" అంది కస్తూరి

"ఎం లేదు ఊరికే తల స్నానం చేశాను గా అందుకే జుట్టు ఆరబెట్టుకున్దామని"

"ఓహ్..."

"ఏంటి షాపింగ్ క "

"ఆ అవును. పదకొండింటికి షాపులు తెరుస్తారు గా ఇంకా వాటి మీద దాడి చెయ్యాలి . తప్పదు" అని నవ్వింది 

దాంతో చందన కి కూడా నవ్వు వచ్చింది 

"మీరు ఏమి అనుకోకపోతే ఒకసారి మా ఇంటికి వస్తారా"

"ఇందులో అనుకోవడానికి ఏముంది తప్పకుండ. పద" అంది కస్తూరి.

కస్తూరి ని లోపాలకి తీసుకొని వెళ్ళింది చందన.

"రండి కూర్చోండి" అని "అమ్మా" అంటూ లోపలికి వెళ్ళింది.

రాధ, హంస, కైలాష్ వచారు.

"మా అమ్మ" అంటూ రాధ ని, "మా వొదిన" అంటూ హంస ని, "మా అన్నయ్య" అంటూ కైలాష్ ని పరిచయం చేసింది చందన.

అందికి నమస్కారం పెట్టింది కస్తూరి.

"అమ్మ తను కస్తూరి అని మా కొలీగ్ మా ప్రాజెక్టే"

"అలాగ. మంచినీళ్ళు కావాలా?" అంటూ అడిగింది రాధ

"వొద్దు "

"అన్నయ్య తనకి మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది ఇంకో 10 డేస్ లో నే పెళ్లి"

"ఓహ్.. కంగ్రాట్స్. మొన్న మీ అన్నయ్య ని కలిసినప్పుడు ఒకసారి చెప్పారు, మీ ఎంగేజ్మెంట్ కి పిలిచారు గాని రాలేకపోయాను సారీ" అన్నాడు కైలాష్.

"పర్వాలేదు"

"ఎలా జరుగుతున్నయమ్మ పెళ్లి పనులు" అంది రాధ .

"బానే జరుగుతున్నయండి . ఇవ్వాళా నేను, వేద షాపింగ్ కి వెళ్ళాలని అనుకున్నాము. నాకు చీరలు అవి తీసుకోవడానికి." అని అంది .

అలా అంటూండగానే కస్తూరి ఫోన్ మోగింది.

"చెప్పు వేద"

"పదింటికల్లా వస్తా అన్నావ్. పది దాటింది పదకొండు కూడా దాటింది ఎక్కడున్నావ్. మళ్ళి మనకి లేట్ అయిపోతుంది. తొందరగా రా"

"ఆల్రెడీ వచేసానే ఇక్కడ చందన వాళ్ళ ఇంట్లో ఉన్న. మళ్ళి నేను పైకి రావడం ఎందుకు నువ్వే చందన వాళ్ళ ఇంటికి రా కలిసి వెళ్ళిపోదాం" అంది 

ఇది కింద ఉందా చ అనవసరంగా ఫోన్ చేశా. చందన విషయమే మర్చిపోయ ఇప్పుడు కస్తూరి కూడా తనకు తెలుసు కదా . ఇప్పుడు కిందకి రమ్మంటోంది. వెళ్ళకపోతే బాగుండదు ఎం సాకు చెప్పాలి తప్పించుకోవడానికి తప్పకుండ వెళ్ళాల్సిందే. అయిన ఇంకో సరి ట్రై చేద్దాం నో చెప్పడానికి అనుకుంది.

"మాట్లాడేసి నువ్వే పైకి రా వెళ్ళిపోదాం" అంది వేద

"నీకేమైనా పిచ్చి పట్టిందా మళ్ళి నేను పయికి రావడం, మనం కిందకి రావడం దేనికి నువ్వే ఏకంగా కిందకి రా" అంది

"ఇంకా చేసేదేం లేక సరే" అంది 

కిందకి వెళ్ళగానే కస్తూరి పిలిచింది వేదని లోపలకి రమ్మని. వెళ్లి ఒక పది నిమిషాలు కూర్చుంది పిలిచింది కాబట్టి "వెళ్దామా ఇప్పటికే లేట్ అయ్యింది " అంది వేద

"సరే పద" అని చెప్పి ఇద్దరు బయలుదేరారు.

1 comment:

  1. Hi, I like the story of Samveda. Can you please post the rest of the parts??? waiting eagerly... :)

    ReplyDelete