Thursday, 21 August 2014

Samveda - 23

వేద పడుకొని గంట గడిచిందో లేదో వేద కి మేలుకు వచ్చింది. గాజు పెంక లోపలికి గుచుకుందేమో  గుచ్చుకున్న చోట ఇంకా నొప్పి తగ్గలేదు. ఆ నొప్పికి కాలు సలుపుతోంది. రెండు రోజుల నుండి ఏమి తినలేదేమో ఆకలేస్తోంది. ఇందాక తాగిన పాలు ఆకలిని తగ్గించక పోయిన పెంచినట్టు అయ్యింది. వేద కి వేడిగా ఏమైనా తాగాలనిపిస్తోంది. ఆకలికి ఎంత ప్రయత్నించిన నిద్ర రావట్లేదు.ఆకలికి తోడు దాహం కూడా వేస్తోంది. ఎదురుగా సోఫా లో కైలాష్ కనిపించాడు. ఆ మొహం లో అలసట స్పష్టం గా కనిపిస్తోంది వేద కి. మొదటిసారిగా కైలాష్ గురించి  "పాపం" అనిపించింది. కాని ఆ భావాన్ని మనసు అంగీకరించట్లేదు, ఎదురుతిరుగుతోంది. ఆమె మొహం పక్కకి తిప్పేసుకుంది. పక్కన నీళ్ళ గ్లాస్ కనిపించింది.ఇందాక కొంచం తాగి అక్కడ పెట్టింది. కొంచం తాగుదామని గ్లాస్ తీసుకోపోయింది. గ్లాస్ కొంచం దూరం లో ఉండడం తో అందలేదు వేద మంచానికి ఇటు వైపుకి జరిగాదానికి ప్రయత్నిచింది.కాని కాలు కడపలేకపోయింది. ఆ ప్రయత్ననికే కాలు సలుపుతోంది. ఆమె ముందుకు ఒంగి చేయి చాచింది కాలు కదపకుండా చేయి గ్లాస్ కి తగిలి గ్లాస్ కింద పడింది. ఆ చప్పుడికి కైలాష్ కి మేలుకు వచ్చింది.బద్ధకంగా కళ్ళు తెరిచాడు. వేద మంచం మీద కూర్చొని ఉండడం చూసాడు.

"దాహం వేస్తోందా?"

వేద ఔనని తల ఆడించింది.

కైలాష్ వెళ్లి ఒక గ్లాస్ లో నీళ్ళు తెచ్చిచాడు.

వేద నీళ్ళు తాగి గ్లాస్ కైలాష్ చేతికి ఇచ్చింది.

"ఇంక పడుకో" అని చెప్పి గ్లాస్ సింక్ లో వేయడానికి వెళ్ళాడు.

గ్లాస్ సింక్ లో వేసి తిరిగి వచ్చాక కూడా వేద మేలుకొని ఉండడం చూసి అడిగాడు.

"ఏంటి ఇంకేమైనా కావాలా?"

ఏమి వొద్దని వేద తలాడించింది.

"మరి ఇంకేంటి పడుకో" అని చెప్పి సోఫా దగ్గరికి వెళ్లి పడుకున్నాడు.

ఒక పది నిమిషాలయ్యాక చూసాడు ఇంక అప్పటికి వేద మేలుకునే ఉంది. కైలాష్ కి అర్ధం కాలేదు.

"ఏంటి వేద ఏమైనా కావాలా" ఎంతో అనునయంగా అడిగాడు.

ఏమి వొద్దని వేద తలాడించింది ఇందాకటిలాగే.

"మరి పడుకో ఇంక కొంచం రెస్ట్ అవసరం నీకు."

"నిద్ర రావట్లేదు"

"నిద్ర రావట్లేదా. ఓహ్ కాలు సలపదం వల్ల అయ్యుంటుంది ఉండు ఏదైనా టాబ్లెట్ ఇస్తాను వేసుకొని పడుకున్డువు గాని"

"వొద్దు"

వేద రెస్ట్ రూం కి వెళ్ళాలి ఆ విషయం ఎలా చెప్పాలో అర్ధం కావట్లేదు. అది కాక కాలు చాల నొప్పి పెడుతోంది వెళ్ళడం ఎలాగో కూడా అర్ధం కావట్లేదు.

కైలాష్ సోఫా మీద నుండి లేచి మంచ దగ్గరికి వెళ్ళాడు. వేద ఎదురుగా కూర్చున్నాడు.

"ఎం కావాలో చెప్పు"

"ఎం లేదు"

కైలాష్ కి అనుమానమోచింది ఇంత సేపు అడిగిన చెప్పకపోయేసరికి చెప్పలేకపోతోన్దనిపించింది అందుకే తనే అడిగాడు.

"రెస్ట్ రూం కి వెళ్ళాలా?" అన్నాడు

అవునని తలాడించింది తల దించుకొనే. ఆమెకి ఈ విషయం అతని దగ్గర ఒప్పుకోవడం ఎలాగో ఉంది.

"లేచి నడవగలవా" అని అడిగాడు.

తలాడించింది నడవలేననట్టు.

"పోనీ నేను ఎత్తుకొని తీసుకు వెళ్ళనా?" అని అడిగాడు.

సర్రని కోపంగా తల పైకెత్తింది.

"అంత కోపమెందుకు నేనేం తీసుకు వెళ్ళను లే కాని నువ్వే వెళ్ళు అన్నాడు." అని చిన్నగా నవ్వి వెళ్లి సోఫా లో కూర్చున్నాడు.

ఆమె కదలలేదు. కదలదని కైలాష్ కి తెలుసు కాలిలో గాజుపెంక చాల లోతుకి దిగింది కనీసం ఒక రోజైన ఆమె లేవకుండా ఉంటె తప్ప నొప్పి తగ్గదు. అతనికి ఈ విషయం తెలుసు అందుకే మళ్ళి అడిగాడు.

"ఏంటి తీసుకొని వెళ్ళనా?"

ఈసారి వేద కి కోపం రాలేదు తనకి తెలుసు ఈ నొప్పి తో తను లేవలేదని అందుకే సరే అనట్టు తల ఆడించింది.కైలాష్ మంచం దగ్గరికి వెళ్ళాడు. వేద ని రెండు చేతుల మధ్య ఎత్తుకొన్నాడు.

"ఇదేదో ఇందాకే ఒప్పుకొవచు కదా ఏదైనా బతిమాలించుకుంటే గాని నచ్చదే" అన్నాడు

ఆమె ఏమి మాట్లాడలేదు. ఏమి మాట్లాడాలని లేదు కూడా.

ఆమెని తీసుకెళ్ళి రెస్ట్ రూం తలుపు తీసి లోపల దింపి బయటకి వచ్చి తలుపు దగ్గర వేసి డోర్ బోల్ట్ పెట్టాడు.

వేద గోడ సహాయం తీసుకొని నెమ్మదిగా వెళ్లి వచ్చి తలుపు కొట్టింది.

కైలాష్ తలుపు తీసి వేద ని ఎత్తుకొని మళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు ఆ కొంచం నడిచినందుకే ఆమెకి కాలు నొప్పి పెట్టింది.

"సరే ఇంక పడుకో" అన్నాడు.

"నాకు ఆకలేస్తోంది. నిద్ర రావట్లేదు" అంది

"ఏంటి ఆకలేస్తోందా. అయితే నేనిచిన మందులు పని చేసయన్న మాట. తొందరగానే తగ్గిపోయింది. రేపు మధ్యాహ్నానికల్లా ఆకలేస్తున్దనుకున్నాను. పర్వాలేదు తొందరగానే తగ్గిపోయింది. ఇప్పటికి పడుకో  పొద్దున్నే ఏమైనా తిందువు గాని ఇప్పుడు మూడు అయ్యింది ఇంకో మూడు గంటల్లో తెల్లవారుతుంది అప్పుడు ఏమైనా తిందువు గాని " అన్నాడు.

కాని ఆమె అంత సేపు ఆగలేదు ఆమెకి చాలా ఆకలిగా ఉంది  ఏదైనా వేడి వేడిగా తాగాలనిపిస్తోంది. 

"నాకు చాలా ఆకలేస్తోంది" అంది.

ఆమె చెప్పకుండానే అతనికి ఆ విషయం అర్ధం అయ్యింది . ఆమె మాటల్లో చాలా నీరసం ఉంది.

"సరే ఇందాక ఇచ్చిన పాలు ఇంక కొన్ని ఉన్నాయి తీసుకొని వస్తా ఉండు"

"నాకు పాలు వొద్దు"

"పోనీ ఇంట్లో బ్రెడ్ ఉందా"

"లేదు"

"సరే ఉండు నేను వెళ్లి బ్రెడ్ తీసుకొని వస్తాను"

"నాకు బ్రెడ్ వొద్దు"

"పాలు వొద్దు బ్రెడ్ వొద్దు మరి ఇంకేం కావాలి?"

"నాకు వేడిగా ఏమైనా తాగాలనిపిస్తోంది"

"అయితే మరి ఇప్పుడు ఏమైనా చేయమంటావా ఏంటి కొంపదీసి" అన్నాడు

అవును అనట్టు తలాడించింది. ఆమెకి ఈ వూహ బావుంది. తను నాకు చేసిన దానికి కనీసం ఇలాగైన  బుద్ధి చెప్పాలి అనుకుంది. ఎలాగో తను ఇంకో ఎనిమిది నెలలో ఇక్కడనుండి వెళ్ళిపోతుంది. కనీసం ఈలోపు ఇలాంటి చిన్న చిన్న అవకాశాలు ఉపయోగిన్చుకున్దామనుకుంది.

"ఏంటి అవునా" అన్నాడు.

"అవును నాకు సూప్ తాగాలని ఉంది"

"హు బావుంది. సరే ఇంట్లో సూప్ ప్యాకెట్ ఉందా ?"

"ఉంది ఫ్రిడ్జ్ లో "

"సరే ఉండు ఇప్పుడే వస్తా" అని వెళ్ళాడు.

పది నిమిషాలో సూప్ చేసి ఒక చిన్న బౌల్ లో వేసి తీసుకొచ్చాడు.

"ఇందా తీసుకో. నెమ్మదిగా తాగు వేడిగా ఉంది"

ఆమె ఆ సూప్ చేతిలోకి తీసుకుంది. ఆమెకి కూర్చోవడానికి కుదరట్లేదు కాలు కదిపితే నొప్పి వస్తోంది.అది గమనించి అడిగాడు.

"తాగగలవా? తాగించనా?"

"అవసరం లేదు నేనే తాగుతా"

"సరే నీ ఇష్టం. ఇప్పుడు ఇలాగే అంటావు తరువాత కొంచం సేపటికి మళ్ళి అది నేనే తాగించాల్సి వస్తుంది ఇందాకటి నుంచి అదే గా జరుగుతోంది ముందు వోద్దనడం తరువాత సరే అనడం"

"ఈసారి అలా ఏం అవదు నేనే తాగుతాను"

"సరే తాగు"

ఆమె కాళ్ళు రెండు చాపుకొని మంచానికి అనుకోను కూర్చుంది నెమ్మదిగా ఒక సిప్ తాగింది. వేడి సూప్ లోపలికి వెళ్లేసరికి ప్రాణం లేచి వచినట్టు అయ్యింది. నెమ్మదిగా కొంచం కొంచం తాగుతోంది. ఒక అయిదు స్పూన్లు తాగిందో లేదో చేయి కొంచం పట్టు తప్పి సూప్ ఒంటి మీద పడింది. వేడి సూప్ మీద పడగానే "అమ్మా" అంది అనుకోకుండా.

"ఏమైంది"

"ఏం లేదు"

"సూప్ పడేసుకున్నావా అందుకే అన్నా నేను తాగిస్తా అని విన్నావా లేదు. ఇప్పుడు చూడు వేడి సూప్ ఒంటి మీద పడింది" అని చెప్పి సూప్ తీసుకున్నాడు. అది పక్కన టేబుల్ మీద పెట్టి లోపలికి వెళ్లి తడి గుడ్డ తెచ్చాడు. తేచి మంచం మీద కూర్చున్నాడు.

"ఇటివ్వు నేనే తుడుచుకుంట"

"ఈసారైన సరిగ్గా చేస్తావ లేకపోతే మళ్ళి ఈ పని కూడా నేనే చెయ్యాల్సి వస్తుందా" అన్నాడు అతనికి నవ్వు వస్తోంది వేద మొండితనం చూస్తుంటే. పళ్ళ దిగువున నవ్వుతున్నాడు.

వేద కి ఆ నవ్వు చూసి కోపం వచ్చింది. "అవసరం లేదు ఒక రెండు నిమిషాలు హాల్ లోకి వెళ్తావా?"

"సరే కాని. నీకు రాకపోతే పిలువు సిగ్గుపడకు" అంటూ నవ్వుకుంటూ బయటకి వెళ్ళిపోయాడు.

అతను వెళ్ళిపోయాక నెమ్మదిగా ఒంటి మీద పడిన సూప్ ని తడి గుడ్డ తో తుడిచింది. కాని ఈ డ్రెస్ తోటే ఉండాలంటే చిరాగ్గా ఉంది. డ్రెస్ మార్చుకుంటే బెటర్ అని అనిపించింది. కాని డ్రెస్ కావాలంటే మళ్ళి అతనినే అడగాలి షెల్ఫ్ లో నుండి తీసివ్వమని. అది ఆమెకి ఇష్టం లేదు. అందుకే ఆలోచిస్తోంది. పది నిమిషాలయిన ఆమె పిలవకపొయెసరికి తనే లోపలికి వచాడు.

"ఏంటి అయ్యిందా" అని అడిగాడు.

"అదేంటి డ్రెస్ అంత తడిసిపోయింది. ఉండు వేరే డ్రెస్ ఇస్తా మార్చుకుందువు గాని ఇలాగే ఉంటె తగ్గుతున్న జ్వరం మళ్ళి తిరగబెడుతుంది." అన్నాడు మళ్ళి తనే.

వేద కైలాష్ ని అలానే చూస్తోంది. అతన్ని ఎలా అడుగుదామా అని ఇందాకటినుండి ఆలోచిస్తోంది. అడిగితే మళ్ళి ఏమంటాడో అని ఆలోచిస్తోంది.ఏమైనా ఛాన్స్ తీసుకున్తాదేమో అని అనుకుంది. బట్ తను చాలా సింపుల్ గా అడిగేసాడు తనే అనవసరంగా చాలా ఎక్కువ ఆలోచించింది. పోనిలే ఒక పెర్సెంట్ అయిన ఇతనిలో మంచి తనం ఉంది అనిపించింది. కాని మళ్ళి దాన్ని ఒప్పుకోవాలంటే ఒప్పుకోలేకపోతోంది.

"ఏంటి ఏం ఆలోచిస్తున్నావ్" అన్నాడు

"ఏం లేదు"

"డ్రెస్ తీసి ఇవ్వనా?"

"హా"

వేద చెప్పిన షెల్ఫ్ దగ్గరికి వెళ్లి తను అడిగిన నైట్ డ్రెస్ తీసుకొని వేదకి ఇచ్చాడు. ఇచ్చి హాల్ లోకి వెళ్ళాడు. వెళ్తూ అన్నాడు "డ్రెస్ మర్చుకోగానే పిలువు మళ్ళి ఆలోచనలో పడకు" మళ్ళి తనే అన్నాడు "కావాలంటే నేను సహాయం చేస్తాను"

"అవసరం లేదు"

"ఓకే నీ ఇష్టం" అనేసి బయటకి వెళ్ళిపోయాడు.

ఒక పదిహేను నిమిషాలయ్యాక పిలిచింది వేద అతన్ని.

"అయ్యిందా.ఇందా ఈ సూప్ తాగు"

"నేను తాగుతాను"

"ఎందుకు మళ్ళి మీద పదేసుకోవదానికా అవసరం లేదు. నేను తాగిస్తాను తాగు"

సూప్ తాగేసరికి కొంచం హాయిగా ఉంది.

కైలాష్ ఆ బౌల్ ని కిచెన్ లో సింక్ లో పడేసి వచ్చాడు.

"ఇప్పుడెలా ఉంది. నీరసం తగ్గిందా?"

"హా.. ఇప్పుడు కొంచం పర్వాలేదు"

"అవును నువ్వు రాత్రంతా ఇక్కడే ఉన్నావా?" అడగకూదదనుకుంటూనే అడిగింది.

"ఏంటి నీకు స్పృహ పోయింది ఇవాళ సాయంత్రం అనుకుంటున్నావా. నువ్విట్లా ఉంది 3 రోజులయ్యింది"

"ఏంటి 3 రోజులనుండి నాకు స్పృహ లేదా" ఆశ్చర్యంగా అడిగింది 

"అవును. ఇవాళ కొంచం పర్వాలేదు జ్వరం తగ్గింది"

ఆమెకింకా నమ్మబుద్ధి కావట్లేదు తను మూడు రోజులనుండి ఇలా స్పృహ తప్పిపోయి ఉన్న విషయం. అంటే ఇతను అప్పటినుండి నన్ను చూసుకుంతున్నాడా అనుకుంది. ఎందుకు ఆ ఊహ ఆమెకి నచ్చలేదు. ఛి ఛి ఇతను చూసుకోవడం ఏంటి. అయిన తను ఇట్లా మూడు రోజుల నుండి ఉంటె ఎవరు చూడడానికి రాలేదా? ఒకవేళ వస్తే వాళ్ళతో ఎందుకు పంపించలేదు

"ఏంటి ఏదో ఆలోచనలోపడ్డావ్?"

"నన్ను చూడడానికి కస్తూరి గాని హరి అన్నయ్య గాని రాలేదా?" 

"వచ్చారు" ఆమె ఇవన్ని ఎందుకడుగుతోందో అతనికి అర్ధం కాలేదు.

"మరి నన్ను వాళ్ళతో ఎందుకు పంపలేదు." సూటిగా అడిగింది 

ఆమె అడిగిన తీరుకి అతను తలెత్తి చూసాడు.

"అంటే" 

అతనలా సూటిగా అడిగేసరికి ఏం చెప్పాలో అర్ధం కాలేదు.

"ఏం లేదు ఊరికే అడిగా"

"పిచి పిచి ఆలోచనలు మనసులో రానీయకుండా పడుకో మనసు ప్రశాంతం గా ఉంటుంది." అనేసి సోఫా మీద పడుకున్నాడు.

ఇంతలో "అమ్మా" అని వినిపించడంతో కళ్ళు తెరిచి చూసాడు. 

వేద మొహం లో బాధ స్పష్టంగా కనిపిస్తోంది.

"ఏమైంది" అని అడిగాడు ఆదుర్దాగా.

"కాలు చాలా సలుపుతోంది. నొప్పిగా ఉంది."

"ఏది నన్ను చూడనీ"

"అమ్మా .. నొప్పిగా ఉంది"

"ఎం లేదులే ఇందాక కొంచం నడిచావుగా  స్ట్రెస్ పడింది కాలు మీద అంతే." అని చెప్పి కట్టు తీసి మళ్ళి ఏదో ఆయింట్మెంట్  రాసి కట్టు కడుతూ అన్నాడు.

"చూసావా అనవసరంగా తొందరపడి ఇంత దాకా తెచుకున్నావ్"

"నన్నంటావెంటి.. నేనేం తొందరపడలేదు.. నీకు దగ్గరగా ఉండడం ఇష్టం లేక హాల్ లోకి వెళదామనుకున్న"

అనాలోచితంగా వేద అన్నా మాటలు కైలాష్ ని బాధపెట్టాయి అయిన వేద ధోరణి తెలుసు కాబట్టి తను అంతగా పట్టించుకోలేదు.

"కాని చూసావా ఇప్పుడు ఇంక దగ్గరున్దాల్సి వస్తోంది. అందుకే అనేది నాకు దూరంగా ఉండాలని నువ్వు అనుకోవడం మానేసేయి. ఎందుకో తెలుసా నువ్వెంత దూరంగా ఉండాలని ప్రయత్నిస్తే నేను అంత దగ్గరగా వస్తా కాబట్టి"

అతనన్న మాటలకి సూటిగా చూసింది.

"ఎంతలా చూస్తున్నావ్. నేనన్నది అర్ధం కాలేదా"

"అర్ధం అయ్యింది కాని అది జరగని విషయం అని నీకే తెలియట్లేదు"

"సరేలే ఇందాకంత దాని గురించే కొట్టుకున్నాం గా మళ్ళి ఇప్పుడెందుకు. ఆ విషయం వొదిలెయి. చూడు ఇందాకటినుండి నీ మొహం లో కోపం లేకుండా ఎంత బాగా మాట్లాడుతున్నావో. ఇలా ఉంటె ఎంత బావుంది. కాని మనం ఉంటామా! ఉండం. ఎప్పుడు కాళికా దేవి లాగా ఇంత కోపం ఉంటుంది ముక్కు మీద ఎప్పుడెప్పుడు బయటకి వద్దామా అని చూస్తూ" అన్నాడు తమాషాగా.

అతనన్న తీరుకి ఆమెకి నవ్వు వచ్చింది గాని బయటకి నవ్వలేదు. ఆమెకి ఆ విషయం చిత్రం గానే ఉంది. అలా అని అతని మీద కోపం పోయిందా అంటే అది లేదు. అలా అని అతని సహాయం పూర్తిగా నిరసించటం లేదు. ఈ సంగతే ఆమెకి అర్ధం కావట్లేదు.

"ఏంటి ఆలోచిస్తున్నావ్."

"ఏం లేదు"

ఇంతలో కట్టు కట్టడం పూర్తి అయ్యింది. ఇంకొన్ని గంటల వరకు ఆ కాలికి శ్రమ ఇవ్వకు. ఇచ్హావంటే మళ్ళి బ్లీడింగ్ అవుతుంది. కాలు కదపకుండా పడుకో.

"పర్వాలేదు కొంచం సేపు కూర్చుంటా నాకు నిద్ర రావట్లేదు"

"ఔను కస్తూరి వచ్హిందా ఇక్కడికి" అంది మళ్ళి తనే

"ఆ విషయం ఇప్పుడెందుకు మళ్ళి నిన్ను కస్తూరితో ఎందుకు పంపించలేదు అని గొడవపెట్టుకోవదానికా"

"కాదు దాని పెళ్లి పనులు ఎక్కడ దాకా వచాయో అని. నేను దానికి సాయం చేయలేకపోయాను ఇంకో వారం లో దాని పెళ్లి."

"బావుంది ఇక్కడ నీకు జ్వరం వచ్చింది ముందు నీ జ్వరం తగ్గించుకో అంటే అది వొదిలేసి కస్తూరి పెళ్లి పనుల గురించి ఆలోచిస్తున్నావా. ఇప్పుడు స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పనా. ఇలాంటి ఆలోచనలు మానేయి"

"ఏమి ఆలోచించకుండా ఎలా కూర్చుంటాను"

"అందుకే నాతో సరదాగా ఏమైనా మాట్లాడు"

"నీతోనా"

"అదేంటి ఒక్క కస్తూరి తోనే మాట్లాడతావా ఏంటి. నాతో కూడా మాట్లడోచు"

"నాకు నిద్ర వస్తోంది"

"ఏంటి నాతో మాట్లడమంటేనే" చిన్నగా నవ్వుతూ అన్నాడు.

"అయితే నువ్వు లైఫ్ లాంగ్ ఇలాగే నిద్రపోతావా ఏంటి"

"లైఫ్ లాంగ్ ఎందుకు పడుకుంటాను"

"మరి నిన్ను నాతో మాట్లమంటే నిద్ర పోతానంటున్నావ్. రేపు నాతో కలిసున్నాక కూడా ఇలాగే నిద్రపోతే ఎలా చెప్పు.మనం కాపురం ఎలా చేస్తామో. మన కాపురం సంగతి గోవిందా" అన్నాడు కొంటెగా.

"ఏమన్నావ్"

"నేనేమన్నాను. నిద్రొస్తే నిద్రపో అన్నాను"

"అది కాదు ఇంకేదో అన్నావ్"

"నేనేమనలేదు"

"అన్నావంటే"

"సరే నువ్వే చెప్పు నేనేమన్నానో"

వేద మొహం పక్కకి తిప్పేసుకుంది.

"ఏంటి మళ్ళి కోపం వచ్చిందా?"

"నాకేం కోపం లేదు"

అప్పటికే ఉదయం 5 అయ్యింది. ఇంటి బయటనుండి పక్షుల కువకువలు, కోళ్ళ అరుపులు వినిపిస్తున్నాయి.

"అప్పుడే తెల్లారిపోయిందా" అంది వేద.

కైలాష్ వాచ్ చూసుకున్నాడు.

"వేద ఎలాగో తెల్లారింది కాబట్టి నువ్వు బ్రష్ చేసుకొని ఏమైనా తాగి పడుకో. నీకింకా కొంచం రెస్ట్ కావాలి. ఇవ్వాళా రేపు ఎక్కడికి వేళ్ళకు. రేపు సాయంత్రానికల్లా కాలు నొప్పి తగ్గుతుంది అప్పుడు చూడొచు"

"ఇప్పుడేగా సూప్ తాగింది ఇప్పుడు నాకేం వొద్దు" అలా కైలాష్ తో మాములుగా మాట్లాడడం వెదకి చాలా చిత్రం గా ఉంది.

"సరే అయితే ఇంక కొంచం సేపు పడుకో. నేను మళ్ళి కొంచం సేపు అయ్యాక వచ్చి లేపుతాను"

"ఏం అవసరం లేదు ఇప్పుడు నాకు బానే ఉంది" అంది ముభావంగా.

"వేద మళ్ళి మొదటికి వచావా. ఇక్కడ డాక్టర్ నువ్వు కాదు నేను. నీకు నా మీద కోపం ఉంటె అది తర్వాతా తీర్చుకున్డువు గాని . ఇప్పుడు ఆ కోపం తీర్చుకోవడానికి శక్తిని సంపాదించు. అది సంపాదిచాలంటే నేను చెప్పినట్టు వినాలి. అర్ధం అయ్యిందా"

"ఇప్పుడు నాకు నిద్ర రావట్లేదు కొంచం సేపయ్యాక పడుకుంటాను"

"సరే అయితే నేను నిద్ర రావడానికి ఇంజక్షన్ ఇస్తాను. నీకు తొందరగా నిద్ర వచేస్తుంది"

"ఇంజక్షన్ ఆ వద్దు"

"వద్దంటే ఎలా నీకు రెస్ట్ కావాలని చెప్పానా. నువ్వు మేలుకుంటే నిద్ర మాట దేవుడెరుగు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావ్. అందుకే ఒక్క ఇంజక్షన్ ఇస్తే నిద్ర వస్తుంది."

"వొద్దొద్దు నేను పడుకుంటాను" వేద కి ఇంజక్షన్ అంటే భయం. స్పృహ లేనప్పుదేమో గాని ఇప్పుడు స్పృహ వచాక ఇంజక్షన్ తీసుకోవాలంటే భయం గా ఉంది.అందుకే వెంటనే కూర్చునే స్థితి నుంచి కిందకి జరిగి కళ్ళు మూసుకొని పడుకుంది.

కైలాష్ నెమ్మదిగా వేద మంచం దగ్గరికి వచ్చాడు. 

కళ్ళు తెరిచి "ఏంటి" అని అడిగింది కంగారుగా.

"ఎంటేంటి"

"ఏం కావాలి"

"ఏం వొద్దు"

"మరి..." అంది దగ్గరికి వస్తున్న కైలాష్ ని చూసి ఇంకేం అనాలో తెలియక.

"ఏంటి మరి"

"ఏమైనా కావాలా?" అంది చిన్నగా 

"అవును"

"ఏంటి"

"ముద్దు" అన్నాడు వస్తున్న నవ్వుని దాచుకుంటూ.

"ఏంటి" అంది గట్టిగా తను విన్నది నిజమో కాదో అర్ధం కాక.

"ఔను మరి నువ్వెంత ముద్దోస్తున్నావో తెలుసా" అతను నవ్వుని దాచుకోవడానికి చాలా కస్తపదాల్సి వచ్చింది.

"నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా" అని వేద అంటూండగానే కైలాష్ వేద పక్కన ఉన్న ఇంకో దిండుని తీసుకొని నెమ్మదిగా వేద కాలిని ఎత్తి కాలి కింద పెట్టాడు.

"కంగారు పడకు ఏదో సరదాగా అన్నాను. ప్రశాంతంగా పడుకో"

చ అనవసరంగా ఏదేదో అనుకోని భయపడ్డాను.

"ఏంటి ఆలోచిస్తున్నావ్ పడుకో"

వేద కళ్ళు మూసుకుంది ఒక అరగంట అయ్యాక తనకి నిద్రపట్టింది.

వేద నిద్రపోయేవరకు అక్కడే ఉన్నాడు. అప్పటికి ఇంక అయిదున్నరే అయ్యింది. కింద పడుకున్న వాళ్ళు అప్పుడే నిద్ర లేవరని కైలాష్ కి తెలుసు వాళ్ళని లేపడం ఇష్టం లేక మళ్ళి వెళ్లి సోఫా లో పడుకున్నాడు.

అలా ఎంత సేపు పడుకున్నాడో మెలుకువ వచేసరికి చూస్తే ఉదయం 10 దాటింది.బద్ధకంగా లేచాడు. వేద కేసి చూసాడు ఆమె ఇంక పడుకొనే ఉంది ఆమెని లేపడం ఇష్టం లేక కిందకి వెళ్ళాడు.

ఆ రోజు శనివారం అవ్వడంతో చందన కి ఆఫీసు లేదు అందుకే తను కూడా ఇంక ఇంట్లోనే ఉంది.కైలాష్ ని చూడగానే విష్ చేసింది.

"గుడ్మోర్నింగ్ అన్నయ్య"

"గుడ్మోర్నింగ్"

"ఎలా ఉంది రా అమ్మాయికి"

"పర్వాలేదమ్మ చాలా వరకు తగ్గింది. రాత్రి పన్నెండింటికి స్పృహ వచ్చింది. ఆకలేస్తోందంటే సూప్ ఇచ్చాను అది తాగి పడుకుంది" అని చెప్పాడు క్లుప్తంగా.

"ఇప్పుడు లేచిందా"

"ఇంకా లేదు కొంచం సేపయ్యాక నేను వెళ్లి లేపుతాను. అమ్మా నాకు కొంచం కాఫీ కావాలి"

"సరే నువ్వు ఫ్రెష్ అయ్యి రా ఇస్తాను" అంటూ లోపలికి వెళ్ళింది.

కైలాష్ అరగంటలో స్నానం చేసి వచాడు. వేడి వేడిగా కాఫీ తాగాడు. ఇప్పుడు కొంచం రిలీఫ్ గా ఉంది.అతను టిఫిన్ తినేసరికి 11 దాటింది. కైలాష్ టిఫిన్ చేస్తుండగా రాధా అంది.

"కైలాష్ నేను, చందన ఒకసారి హంస వాళ్ళ ఇంటికి వెళ్లి వద్దామనుకుంటున్నాం"

"వొదిన వాళ్ళ ఇంటికా ఎందుకు?"

"వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాలేదంట. పొద్దున్నే వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసారు. హంస కోసం కలవరిస్తున్నారంట. ఇప్పుడు ఊళ్ళో అన్నయ్య కూడా లేదు తను ఒక్కతే ఏం వెళ్తుంది అందుకే మేము కూడా వేల్లాలనుకున్తున్నాం."

"ఒంట్లో బాలేదా ఏమయ్యింది?"

"నిన్న బి పి పెరిగిందంట. రెండు మూడు రోజుల నుండి ఒంట్లో కూడా బాలేదు. వాళ్ళకున్నది ఒక్కగానొక్క పిల్లేమో హంస కోసం కలవరిస్తున్నారు. అందుకే ఒకసారి వేల్దామనుకున్తున్నాం"

"కాని నాకు రావడానికి వీలుపడదు గా.."

"తెలుసురా వేద ని ఇలా వదిలేసి నిన్నెలా రామంటాం నువ్వు కాబ్ బుక్ చేయి మేము దాంట్లో వెళ్తాం ఎంత సేపు ఇక్కడనుండి ఒక గంటన్నర సేపేగా పర్వాలేదు. నువ్వేలాగో వేద దగ్గర ఉంటావ్ కాబట్టి ఇబ్బంది లేదు. కాకపోతే భోజనానికే కొంచం ఇబ్బంది పడాలి"

"అదేమ పర్వాలేదమ్మ. నేను బయటనున్దయినా తెప్పించుకుంటాను. కాని ఇప్పుడు మీరు వెళ్ళడం ఎలా అని. పోనీ నేను దిగబెట్టి వచేయనా"

"ఎందుకు వొద్దు మళ్ళి వేద కి మేలుకు వస్తే కష్టం కాబ్ బుక్ చేయి చాలు మేము వెళ్తాం"

"సరే మళ్ళి ఎప్పుడు వస్తారు"

"అక్కడికి వెళ్ళాక పరిస్థితిని బట్టి ఫోన్ చేసి చెప్తాను"

"సరే" అని చెప్పి కైలాష్ వాళ్ళు వెళ్ళడానికి కాబ్ బుక్ చేసాడు. 

ఇంతలో కస్తూరి వచ్చింది.

"నమస్తే అంటీ"

"రామ్మరా"

"హలో కైలాష్ గారు మీరు కూడా ఇక్కడే ఉన్నారా. ఎలా ఉంది వేద కి"

"పర్వాలేదు బానే ఉంది. నిన్న రాత్రి స్పృహ వచ్చింది"

"అవునా అయితే నేను వెళ్లి పలకరించి వెళ్తాను"

"ఇప్పుడా..ఇప్పుడు వొద్దు తను పడుకుంది. కొంచం సేపు రెస్ట్ కావాలి తనకి అందుకే ఇప్పుడు దిస్తుర్బ్ చేయకండి"

"అలాగా సరే. తనకి తగ్గిపోయింది గా నాకదే చాలు ఆ అన్నట్టు ఆంటీ మిమ్మల్ని పెళ్ళికి పిలుద్దామని కార్డు ఇవ్వడానికి వచాను. మీరందరూ తప్పకుండా నా పెళ్ళికి రావాలి" అంటూ కార్డు ఇచింది.

"తప్పకుండా"

"అన్నట్టు కైలాష్ గారు మీరు కూడా రండి మొన్న ఎంగేజ్మెంట్ కి ఎగ్గోట్టినట్టు ఎగ్గోట్టకండి.మళ్ళి పిలవలేదనుకోకండి. రేపు మళ్ళి కుడుర్తుందో లేదో అని ఇప్పుడే పిలుస్తున్నా"

"అదేంటి"

"అవునాంటి రేపు తనని కలవడానికి వెళ్తున్నాను అందుకే కుదరదని ..." అంటూ నసిగింది.

"ఓహ్ అర్ధం అయ్యింది లే"

"కైలాష్ గారు వేద కి చెప్పండి ఒకవేళ కారడ పంచడం అయిపోతే ఇవాళ సాయంత్రం వచ్చి కలుస్తానని లేకపోతె రేపు సాయంత్రం తప్పకుండా వస్తానని"

"అలాగే తప్పకుండ. తను లేవగానే చెప్తాను"

"ఒకే ఆంటీ వెళ్లొస్తాను"

"అలాగే" అని హంస చేత బొట్టు పెట్టి పంపించారు.

రాధా వాళ్ళకి వేద ని చూద్దామని ఉంది కాని తను ఇంకా నిద్ర లేవలేదు. ఇప్పుడు వెళ్లి డిస్తుర్బ్ చేయడం ఎందుకని ఆగిపోయారు. ఇంతలో కాబ్ వచ్చింది రాధా వాళ్ళు కాబ్ లో బయలుదేరారు. ఎప్పుడు వచేసి అక్కడ పరిస్థితి ని బట్టి ఫోన్ చేసి చెప్తా అంది రాధా.

"సరే అమ్మా వెళ్ళగానే మామయ్యగారికి ఎలా ఉందొ ఫోన్ చేసి చెప్పు"

"అలాగే" అని చెప్పి డ్రైవర్ ని పోనీయమన్నారు.

అప్పటికి పన్నెండు అయ్యింది. రాధా వాళ్ళు వెళ్ళాక కైలాష్ కొంచం సేపు కిందనే ఉన్నాడు. తన హాస్పిటల్ కి ఫోన్ చేసి నిన్న ఆపరేట్ చేసిన పేషెంట్ గురించి కనుక్కున్నాడు. అతనికి బానే ఉందని తెలిసింది.వేద లేచిందో లేదో చూద్దామని పైకి వెళ్ళాడు.తను పైకి వెళ్లేసరికి వేద ఇంకా పడుకొనే ఉంది.


No comments:

Post a Comment