మూడో రోజుకి జ్వరం తగ్గింది.రాధా, కైలాష్, హంస ఎవరికీ వీలుంటే వాళ్ళు వేద పక్కన ఉంటున్నారు. వేద ని ఒక్కక్షణం కూడా ఒంటరి గా వదలలేదు. ఎక్కువ సేపు కైలశే ఉన్నాడు కైలాష్ రెండు రోజుల నుండి రాత్రంతా అక్కడే ఉంటున్నాడు. రెండో రోజు రాత్రి ఎప్పుడు నిద్ర పట్టిందో కైలాష్ కి తెలిదు. కుర్చీ లో కుర్చున్నవాడు అలానే నిద్ర పోయాడు. మేలుకు వచేసరికి ఉదయం 7 అయ్యింది. నిద్ర పోయి లేచినందు వల్ల కొంచం ఫ్రెష్ గా అనిపించింది. వేద నుదుటి మీద చెయ్యి వేసి చూసాడు. ఒంట్లో వేడి తగ్గినట్టు తెలిసింది.కిందకి వెళ్లి ఫ్రెష్ అయ్యి స్నానం చేసి కాఫీ తాగి వచ్చాడు. వచ్చి టెంపరెచర్ చూసాడు. 104 నుండి 100 కి వచ్చింది. వేద ఇంకా స్పృహ లోకి రాలేదు. థర్మామీటర్ క్లీన్ చేయడానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళాడు. ఈలోగా కస్తూరి వచ్చింది అక్కడికి.
"హాయ్ కైలాష్ గారు"
"హాయ్ రండి"
కస్తూరి వెళ్లి వేద నుదుటి మీద చెయ్యి వేసి చూసింది ఈలోగా కైలాష్ అన్నాడు
"జ్వరం తగ్గిందండి, టెంపరెచర్ కూడా కొంచం తగ్గింది చాలా వరకు ఇవ్వాళ సాయంత్రానికల్లా స్పృహ వచ్చేస్తుంది." అన్నాడు నవ్వుతూ.
"మీకు థాంక్స్ ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు.రెండు రోజుల నుంచి మా వేద ని శ్రమనుకోకుండా చూసుకున్నందుకు"
"మీరు భలే వారే ఇందులో శ్రమేం ఉందండి. నాకు తెలియని విద్య కాదు గా. మీరు అలా భావించకండి. అది కాక వేద మాకు పరాయి అమ్మాయెం కాదు.మాకు చాలా కావాల్సిన అమ్మాయి"
"ఔను మీ పెళ్లి పనులు ఎక్కడదాక వచ్చాయి" అని అడిగాడు మళ్ళి తనే.
"చాలా వరకు అయిపోయాయి అండి. ఇంకా అందరికి కార్డ్స్ పంచాలి. ఈ శని, ఆదివారం వెళ్దామనుకుంటున్నా. మీరు తప్పకుండా రావాలి. ఎలాగో కార్డు ఇచ్చి పిలుస్తా అనుకోండి. అయిన ఇప్పుడు కూడా చెప్తున్నా"
"తప్పకుండా వస్తాను"
"ఈలోగా వేద కి జ్వరం తగ్గిపోతుంది కదా"
"చాలా వరకు తగ్గిపోయిందండి. ఇంకో రెండు రోజుల కల్లా పూర్తిగా కోలుకుంటుంది"
ఈలోపు అక్కడికి చందన వచ్చింది
"ఎలా ఉందన్నయ్య"
"టెంపరెచర్ తగ్గింది. సాయంత్రానికల్లా స్పృహ రావొచ్చు." అన్నాడు.
"మీరు ఇవ్వాళ హాస్పిటల్ కి వెళ్ళండి నేనుంటాను రెండు రోజుల నుంచి మీరే ఉంటున్నారు గా"
"పర్వాలేదండి ఇవ్వాళ జ్వరం తగ్గింది గా సో అంత భయపడాల్సింది ఏం లేదు. అమ్మ ఉంటుంది కొంచం సేపు నేను ఒకసారి హాస్పిటల్ కి వెళ్లి మళ్ళి సాయంత్రానికల్లా వచేస్తాను ఒక ఇంపార్టెంట్ కేసు వచ్చిందంట. హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేసారు రమ్మని. అందుకే ఒకసారి వెళ్లి వచేస్తాను. మీరు వెళ్ళండి ఆఫీసు కి మళ్ళి పెళ్ళికి ఎలాగో సెలవలు పెడ్తున్నారు కదా ఇప్పుడు అప్పుడు అంటే కష్టం అవుతుంది."
"ఓకే. చందన రెడీ అయ్యావా. వెళ్ళిపోదామా?"
"హా" రెండు రోజుల నుండి కైలాష్ వేద దగ్గరే ఉండడం తో చందన కస్తూరి తో వెళ్ళిపోతోంది. ఎలాగో కస్తూరి వేద ని చూడడానికి పొద్దున్న సాయంత్రం వస్తూనే ఉంది కాబట్టి చందన కస్తూరి తో వెళ్లి వస్తోంది.
కస్తూరి, చందన ఇద్దరు ఆఫీసు కి వెళ్ళిపోయారు.
కైలాష్ కొంచం సేపు అక్కడే వేద పక్కన కూర్చున్నాడు. రెండు రోజుల నుంచి వేద ని ఇలా చూస్తుంటే అతనికి చాలా బాధ గా ఉంది. ఎప్పుడు ఉల్లాసంగా, నవ్వుతూ వేద తిరిగే రూపమే కనిపిస్తోంది. ఆ రోజు ఇంకో అరగంట అయ్యుంటే వేద బయటకి వెళ్ళేదేమో. బయట స్పృహ తిరిగి పడిపోయుంటే ఆ విషయం ఆలోచించడానికే భయం వేసింది.అది కాక తను ఆ రోజు హాస్పిటల్ నుండి తొందరగా వచేసాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏం జరిగేదో ఊహించడానికి భయం వేసింది. అమ్మ, వొదిన బాగా కంగారు పడేవారు. లాభం లేదు ఇలా ఆరోగ్యం విషయం లో ఏం పట్టనట్టు ఉంటె చాలా కష్టం దీన్ని గురించి ఏమైనా ఆలోచించాలి కస్తూరి తో కలిసి అనుకున్నాడు. వేద కప్పుకున్న బెడ్శీట్ పక్కకి జరగడంతో లేచి బెడ్శీట్ జరుపి సరిగ్గా కప్పుతున్నాడు. ఇంతలో పక్కన ఏదో మెరుస్తున్దడంతో ఎంట అని చూసాడు. వేద సెల్ ఫోన్ మోగుతోంది అది సైలెంట్ మోడ్ లో ఉంది. కాలర్ అయిడి మీద పేరు చూసాడు. ఆ ఫోన్ హరి చేస్తున్నాడు. రెండు రోజుల నుండి ఫోన్ ఛార్జింగ్ చేయలేదేమో ఛార్జింగ్ అయిపోవచింది. ఫోన్ లిఫ్ట్ చేసి "హలో " అన్నాడు.
"హలో ఎవరు"
"హరి గారు నేను కైలాష్, ఆ రోజు రెస్టారెంట్ లో కలిసాం"
"ఓహ్ అవును మీరా. ఎలా ఉన్నారు?"
"బావున్నానండి. మీరు "
"నేను బానే ఉన్నాను. అవును వేద ఫోన్ మీరు ఎత్తారెంటి. వేద అక్కడే ఉందా? రెండు రోజులనుండి వేద తో మాట్లాడదామని ఫోన్ చేస్తుంటే ఎవరు లిఫ్ట్ చేయడమే లేదు. నాకు చాలా కంగారుగా ఉంది. వేద ఎలా ఉంది"
"వేద మా ఇంటి పైనే ఉంటుంది. రెండు రోజుల నుండి జ్వరం వచ్చింది. వైరల్ ఫీవర్ వచ్చింది ".
"అయ్యో ఔనా. ఇప్పుడు ఎలా ఉంది?"
"ఇవ్వాళే కొంచం నయం ఇప్పుడు పర్వాలేదు. జ్వరం తగ్గింది స్పృహ రావడానికి ఇంకా కొంచం టైం పడుతుంది."
"అయ్యో! అదే నేను అనుకుంటున్నా రెండు రోజుల నుండి ఫోన్ చేస్తూనే ఉన్నాను ఎటువంటి రిప్లై లేదు. బిజీ గా ఉంటె కనీసం మెసేజ్ ఐన పెడుతుంది బిజీ గా ఉన్నానని అదేమీ లేకపోయేసరికి భయం వేసింది. ఇంకో రెండు సార్లు ఫోన్ చేసి చూసి నేనే వద్దామనుకుంటున్న ఇంటికి. ఇల్లు బంజారా హిల్స్ అని తెలుసు గాని ఎక్కడో తెలీదు. కొంచం అడ్రస్ చెప్పండి నేను, మాలతీ వచ్చి ఒకసారి వేదని చూస్తాం . ఎప్పుడు వేద రావడమే గాని మేము ఒక్కసారి కూడా అక్కడికి రాలేదు."
కైలాష్ వాళ్ళకి అడ్రస్ చెప్పాడు. "నేను ఇంకో గంట లో హాస్పిటల్ కి వెళ్తున్నానండి. ఒక ఇంపార్టెంట్ ఆపరేషన్ ఉంది. అది అయిపోగానే వచ్చేస్తాను.ఈలోపు మా అమ్మగారు ఉంటారు వేద దగ్గర. మీరు ఎప్పటివరకు వస్తారు?"
"మేము ఇంకో అరగంట లో బయలుదేరుతాం, ఇంకో గంటలో అక్కడ ఉంటాం"
"అలాగే నండి నేను మా అమ్మగారితో చెప్తాను. ఉంటానండి"
"సరే" అని చెప్పి హరి ఫోన్ పెట్టేసాడు.
చందన, కస్తూరి ఆఫీసు కి వెళ్లేసరికి పది అయ్యింది. ఆఫీసు కి వెళ్లి కాల్ అటెండ్ అయ్యారు. కాల్ అయిపోయేసరికి పదకొండు అయ్యింది. కాల్ అయిపోగానే గిరి వచ్చాడు వీళ్ళ డెస్క్ దగ్గరికి.
"హాయ్ గుడ్ మార్నింగ్"
"గుడ్ మార్నింగ్ గిరి" అని విష్ చేసారు కస్తూరి, చందన.
"వేద కెలా ఉంది"
"ఇవ్వాళ టెంపరెచర్ కొంచం తగ్గింది గిరి కాని ఇంకా స్పృహ లోకి రాలేదు. సాయంత్రం వరకు స్పృహ రావచంటున్నారు"
"ఓకే. స్పృహ వచ్చాక కూడా ఒక 1 వీక్ రెస్ట్ తీసుకో మని చెప్పు. ఆ తరువాత రావచ్చు ఆఫీసు కి. నేను ఆల్రెడీ క్లైంట్ కి చెప్పను తనకి ఒంట్లో బాలేదని సో ప్రాబ్లం లేదు."
"ట్రైనింగ్ ఎక్కడదాక అయ్యింది"
"అయిపోవచింది గిరి. ఇంకో టూ డేస్ లో మొత్తం అయిపోతుంది"
"ఓకే. చందన మీరు కూడా ఒకసారి చెప్పినది మొత్తం కొన్ని శాంపిల్ వర్క్ ఐటమ్స్ తీసుకొని ట్రై చెయ్యండి. ఏమైనా డౌట్స్ ఉంటె ఇప్పుడే క్లారిఫయ్ చేసుకోండి"
"ఓకే గిరి"
హరి వేద వాళ్ళ ఇంటికొచ్చేసరికి పన్నెండు అయ్యింది. కార్ పార్క్ చేసి వచ్చారు. గుమ్మం లో హంస ఎదురయ్యింది.
"ఎవరు" అని అడిగింది.
"నమస్తే నా పేరు హరి, తను మా ఆవిడ మాలతి. వేద కి ఒంట్లో బాలేదని తెలిసింది. వేద ఎక్కడుంది"
"ఓహ్ మీరేనా రండి. పొద్దున్న కైలాష్ చెప్పాడు మీ గురించి మీరు వస్తారని. వేద పైన ఉంది. అత్తయ్య గారు ఉన్నారు వేద దగ్గర. రండి పైకి వెళ్దాం" అని హంస హరి వాళ్ళని పైకి తీసుకెళ్ళింది.
"రండి" అంది రాధ.
"నమస్తే బావున్నారా"
"బావున్నానండి."
"రండి కూర్చోండి."
"జ్వరం ఎప్పుడు వచ్చింది"
"మూడు రోజులు అయ్యింది. ఎక్కడికో బయటకి వెళ్తునట్టు ఉంది. ఇల్లు తాళం పెట్టి బయటకి వచ్చిందో లేదో కళ్ళు తిరిగినట్టు ఉన్నాయి మెట్ల మీద నుండి కింద పడిపోయింది."
"దెబ్బలెమైన తగిలాయా"
"కొంచం , ఫస్ట్ ఎయిడ్ చేసాడు మా అబ్బాయి. వాడు అప్పుడే వచినట్టు ఉన్నాడు. రెండు రోజుల నుండి సెలైన్ మీదే ఉంది. ముందు రోజు ఏమి తినట్టు లేదు చాలా నీరసంగా ఉంది"
"మీరు కూర్చోండి నేను ఇప్పుడే వస్తా అని రాధ, హంస కిందకి వెళ్లారు" వాళ్ళకి కొంచం సేపు వేద దగ్గర కూర్చునట్టు ఉంటుందని కిందకి వెళ్లారు.
మాలతీ అంది హరి తో "ఏమండి అనవసరంగా వాళ్ళకి శ్రమ అవుతోందో ఏమో. మనం వేద ని మన ఇంటికి తీసుకొని వెళ్దామా . నేను ఉంటాను కాబట్టి నేను చూసుకుంటాను" అంది. ఇంటిగల వాళ్ళకి ఎందుకు శ్రమ ఇవ్వాలి వేద ని చూసుకోవడానికి హరి ఉన్నాడు కదా అని ఆమె ఉద్దేశ్యం.
హరి కి కూడా ఈ ఆలోచన నచ్చింది. వేద గురించి వీళని శ్రమ పెట్టడం భావ్యం కాదనుకున్నాడు. అన్నయ్య లాంటి వాడు తను ఉండగా వేద ని అక్కడ వదిలి వెళ్ళడం అంత మంచిగా అనిపించలేదు. ఇప్పటిదాకా వేద రానని పట్టుబడడంతో ఊరుకున్నాడు.ఇప్పుడు వేద కి బాలేనప్పుడు ఇక్కడ ఎందుకు తన దగ్గరికి తీసుకొని వెళ్దాం అనుకున్నాడు. అందుకే అన్నాడు మాలతీ తో
"సరే నేను మాట్లాడతాను" అని
హరి, మాలతీ కొంచం సేపు అక్కడ కూర్చున్నారు. రాధ వాళ్ళని అక్కడే భోజనం చేయమని చెప్పింది కాని మాలతీ వంట చేసేయడంతో ఇంటికి వెళ్ళిపోతాం అన్నారు. వెళ్ళే ముందు హరి అడిగాడు.
"నేను వేద ని ఇంటికి తీసుకెళ్తాను. నాకు ఈ విషయం తెలియదు లేకపోతే అప్పుడే వచేవాడిని. అనవసరం గా మీకు శ్రమ అవుతోంది. మాలతీ ఎలాగో ఇంట్లో ఉంటుంది తను చూసుకుంటుంది".
"అయ్యో మీరు మరోలా భావించకండి మాకేం శ్రమ లేదు. తను మీతో మీ చెల్లెలి లాగ ఎలా కలిసిపోయిందో మాతో కూడా మా ఇంట్లో అమ్మాయి లాగా కలిసిపోయింది. మీరు అలా ఏమి అనుకోకండి. ఇక్కడే ఉంటె కైలాష్ ఉన్నాడు కాబట్టి ట్రీట్మెంట్ కి అంత ప్రాబ్లం రాదు. మాకేం ఇబ్బంది లేదు." అంది రాధ.
రాధ అంతగా చెప్పేసరికి కాదనలేకపోయాడు.
"సరే మీ ఇష్టం. మేము మళ్ళి రేపు వస్తాం" అని చెప్పి వెళ్ళిపోయారు
కైలాష్ హాస్పిటల్ కి వెళ్లేసరికి పదకొండు అయ్యింది. వెళ్ళగానే పేషెంట్ పరిస్థితి చూసాడు. ఆపరేషన్ కి కావాల్సిన అరెంజ్మేన్త్స్ అన్ని చూడామణి చెప్దామని నర్స్ ని పిలిచాడు.
"ఎస్ డాక్టర్"
"సిస్టర్ వార్డ్ నెంబర్ 3 లో ఉన్న పేషెంట్ కి ఆపరేషన్ చెయ్యాలి. దానికి కావాల్సిన అరెంజ్మేన్త్స్ అన్ని చేయండి. అన్ని అరేంజ్ చేసాక ఒకసారి వచ్చి చెప్పండి ఆపరేషన్ స్టార్ట్ చేస్తాను. ఒకసారి డాక్టర్స్ టీం కి ఇంటిమేట్ చేయండి. డాక్టర్ శారద కి , డాక్టర్ రవి కి ఇంటిమేట్ చేయండి, ఇంకో అరగంట లో ఆపరేషన్ ఉంటుందని"
"ఓకే డాక్టర్"
నర్స్ ఆ అరెంజ్మేన్త్స్ చూడడానికి ఆపరేషన్ థియేటర్ కి వెళ్తోంది. ఈలోపు దారిలో చాహ్నవి పిలిచింది నర్స్ ని
"సిస్టర్ వార్డ్ నెంబర్ 3 పేషెంట్ కి ఆపరేషన్ చెయ్యాలేమో కదా. ఎవరు చేస్తున్నారు"
"డాక్టర్ కైలాష్ వచ్చారు ఇందాకే. ఆపరేషన్ కి అరెంజ్మేన్త్స్ చేయమని చెప్పారు. ఇంకో హాఫ్ అన్ అవర్ లో ఆపరేషన్ స్టార్ట్ చేస్తారంట"
"ఓహ్ ఓకే" అని చెప్పి కైలాష్ రూం కి వెళ్ళింది.
"హాయ్ డాక్టర్"
"హాయ్ రండి"
"ఇవ్వాళ వార్డ్ నెంబర్ 3 పేషెంట్ కి ఆపరేషన్ ఉంది కదా డాక్టర్ శారద నన్ను కూడా మీకు అసిస్ట్ చేయమని చెప్పారు "
"ఓహ్ ఓకే ఫైన్ నో ప్రాబ్లం"
"మీరు 2 డేస్ లీవ్ లో ఉనట్టున్నారు"
"ఔను"
"ఏదైనా ప్రాబ్లమా"
"ఏం లేదే. కొంచెం పని ఉంది లీవ్ పెట్టా"
"అవునా"
ఈలోపు నర్స్ వచ్చి చెప్పింది అన్ని అరెంజ్మేన్త్స్ అయిపోయాయని. కైలాష్, చాహ్నవి ఆపరేషన్ ధియేటర్ కి వెళ్లారు.ఆపరేషన్ అయిపోయేసరికి సాయంత్రం 5 అయ్యింది. పేషెంట్ కి ఇంకా స్పృహ రాలేదు. తీసుకోవాల్సిన జాగ్రతలు అవి చెప్పి ఇంటికి వచ్చాడు. వచ్చేసరికి 6 దాటింది. రాగానే ఫ్రెష్ అయి హంస పెట్టిన టిఫిన్ తిని కాఫీ తాగి పైకి వచ్చాడు.
రాగానే అడిగాడు రాధ ని "ఎలా ఉందమ్మా. ఏమైనా కలవరించిందా పొద్దుటినుండి"
"రా రా, కలవరింతలు తగ్గాయి. వేడి కూడా కొంచం తగ్గింది"
"ఔనా సరే, నువ్వు కిందకి వెళ్ళమ్మా నేను ఉంటాను ఇంక. పోద్దుతినుంది ఇక్కడే ఉనట్టు ఉన్నావ్ అలసిపోయున్టావ్"
"సరే నేను కిందకి వెళ్తాను. జాగ్రత్త "
"అలాగే"
సాయంత్రానికల్లా స్పృహ వస్తుందనుకున్నాడు గాని ఇంక రాలేదు. అందుకే మరో ఇంజక్షన్ ఇచ్చాడు. రాత్రి ఇంటికెళ్ళేటప్పుడు కస్తూరి వచ్చి చూసి వెళ్ళింది. గుమ్మం లోనే కైలాష్ ఎదురుపడ్డాడు.
"రండి"
"ఎలా ఉంది ఇప్పుడు స్పృహ వచ్చిందా?"
"ఇంకా లేదు సాయంత్రనికలా వచేస్తున్దనుకున్న కాని ఇంకా రాలేదు, ఆహారం సరిగ్గా లేకపోవడంతో మందులు పనిచేయడానికి కొంచం ఆలస్యం అవుతోంది. ఇందాకే ఇంకో ఇంజక్షన్ ఇచ్చాను. ఇంకో 5 గంటల్లో స్పృహ రావొచ్చు"
"ఓహ్ పోనీ నేను రాత్రి ఇక్కడ ఉంటాను"
"అవసరం లేదండి. రేపు పొద్దున్న రండి అప్పటికి స్పృహ వస్తుంది"
"సరే అలాగే. మరి నేను వెళ్ళొస్తా"
"ఓకే బై"
"బై"
అర్ధరాత్రి పన్నెండు దాటింది.కైలాష్ పదింటి దాకా మేలుకునేవాడు. పొద్దుటి నుండి అలసిపోవడంతో కునికి పాట్లు పడుతున్నాడు. దాహం అని వినిపించడంతో మేలుకు వచ్చింది.పక్కనే ఉన్న బాటిల్ నుండి గ్లాస్ లో నీళు పోసి వేద పెదాల దగ్గర పెట్టాడు. వేద నెమ్మదిగా నీళ్ళు తాగుతోంది. చల్లని నీళ్ళు గొంతులో పడుతుంటే నెమ్మదిగా స్పృహ లోకి వస్తోంది."చాలు" అంది.
కైలాష్ గ్లాస్ తీసి పక్కన పెట్టాడు. వేద కి నెమ్మదిగా స్పృహ వస్తోంది. తలంతా నొప్పిగ్గా ఉంది.
"ఎలా ఉంది" అని అడిగాడు కైలాష్.
"తల... తల చాలా నొప్పిగ్గా ఉంది" అంది, ఆ గొంతు చాలా నీరసంగా ఉంది.
"తగ్గిపోతుంది లే."
వేద కి పూర్తిగా స్పృహ వచ్చింది. వేద నెమ్మదిగా లేచింది. కాళ్ళు దగ్గరగా ముడుచుకొని చేతులు కాళ్ళ చుట్టూ వేసుకొని కూర్చుంది.
"ఇంద కొంచం ఈ పాలు తాగు నీరసం తగ్గుతుంది"
ఆ గొంతు వినేసరికి ఉలిక్కి పడింది. తలెత్తి చూసింది. కాళ్ళ ముందు కైలాష్ కనిపించాడు.
"ఊ ఈ పాలు తాగు"
"నువ్వు.. నువ్విక్కడెం చేస్తున్నావ్?" ఆ గొంతు నీరసంగా ఉన్న అందులో కోపం స్పష్టం గా వినిపిస్తోంది.
"వేద అవన్నీ తరువాత మాట్లాడుకుందాం ముందు ఈ పాలు తాగు కొంచం నీరసం తగ్గుతుంది"
"నాకు వొద్దు. నువ్వు ముందు ఇక్కడనుంచి వెళ్ళు" నీరసంగా అన్న ఆ గొంతు చాలా స్థిరం గా ఉంది
"వెళ్తాను నువ్వు ముందు ఈ పాలు తాగు ఆ తరువాత వెళ్తాను" అంటూ గ్లాస్ ని వేద కి దగ్గరగా ఇచ్చాడు.
"వొద్దు.. నాకు వొద్దని చెప్పట్లేదా" అంటూ గ్లాస్ ని విసురుగా తోసింది. అది వెళ్లి గోడని కొట్టుకుంది గ్లాస్ లో ఉన్న పాలన్నీ కింద పడిపోయాయి.అది గాజు గ్లాస్ అవ్వడం తో గ్లాస్ కూడా ముక్కలయ్యింది.
కైలాష్ కి కోపం వచ్చింది "వేద ఏంటి నువ్వు చేసిన పని."
"నువ్వు.. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో నాకు నీ మొహం చూడాలని లేదు. ఈ ఇంట్లో ఉండాలని అస్సలు లేదు. నేను ఇంక ఇక్కడ ఉండలేను. ఇంకో ఎనిమిది నెలలు నిన్ను చూస్తూ నేను ఈ ఇంట్లో ఉండలేను" వేద కి దుఖం వస్తోంది
ఎంత ఆపుకున్దామనుకున్న ఆగకుండా కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయి. వేద కి అతడి ముందు ఏడవడం ఇష్టం లేదు. అందుకే మొహం పక్కకి తిప్పుకుంది.
ఆమెని అలా చూసేసరికి కైలాష్ కి వచ్చిన కోపం పోయింది.
వేద దగ్గరగా వెళ్ళాడు. వేద భుజం మీద చెయ్యి వేసి నెమ్మదిగా పిలిచాడు.
"వేద ప్లీజ్ బాధపడకు. ఇప్పుడు నువ్వంత బాధ పడడం అంత మంచిది కాదు నువ్వింకా పూర్తిగా కోలుకోలేదు."
వేద భుజం మీద ఉన్న చేతిని విసురుగా తోసేసింది. మొహం పక్కకు తిప్పుకుంది.
ఆ చర్యకి అతని మనసు బాధపడింది.
మంచం మీద ఆమెకి ఎదురుగా కూర్చుని అన్నాడు "వేద జరిగిన దానికి నన్ను క్షమించు.నిజమే అప్పుడు నీ పట్ల నా ప్రవర్తన చాలా దురుసుగా ఉంది. కాని అది కావాలని చేసింది కాదు..."
"క్షమించాలా.. హు ఇంత చిన్న మాటతో నువ్వు చేసినదంత మాసిపోతుందనే అనుకుంటున్నావా? ఎంత తేలికగా అన్నావ్ క్షమించమని..నీకు ఏది అనిపిస్తే అది చేసేయొచ్చు ఎందుకంటే చాలా తేలికగా అనెయొచు కదా క్షమించు అని..చేసేది ఎంత పెద్ద తప్పయినా, ఎదుటివాళ్ళను ఎంత బాధపెట్టిన పర్వాలేదు ఈ ఒక్క మాట చెప్పేస్తే సరిపోతుంది... ఏమన్నావ్ కావాలని చేసింది కాదు అనా? నీకు ఎవరిమీదో ఉన్న కోపాన్ని నా మీద చూపించావ్?ఆ రోజు ఎంత నచచేప్పడానికి ప్రయత్నించాను నేను వేద ని అని, విన్నావా లేదు..నీ కోపం, నీ ఆవేశం అంత నా మీద చూపించావ్..నువ్వు చేసిన దానికి నా జీవితం అతలాకుతలం అయిపొయింది. ఒక గమ్యం అనేది లేకుండా చేసావ్.. మా అమ్మొమ్మ అన్యాయంగా మానసిక బాధ అనుభవించేలా చేసావ్. ఆవిడ నా మీద అపోహ తోనే, నేను ఆవిడని మోసం చేశాననే అనుకుంది..ఆవిడ చనిపోయేవరకు అదే అపోహ తో ఉంది , మనశాంతి లేకుండా పోయింది , ఆవిడ చివరి రోజుల్లో కూడా ఆవిడ నాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు, కనీసం నా మొహం చూడడానికి ఇష్టపడలేదు. నాకు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? నేను నీకేం ద్రోహం చేసానని. చివరికి నువ్వెవరో కూడా నాకు తెలిదే..నీ తొందరపాటు చర్యకి శిక్ష నేను అనుభవిస్తున్నాను." వేద కి చాలా బాధగా ఉంది. ఎంత ఆపుకున్దామనుకున్న ఏడుపు ఆపుకోలేకపోతోంది.
కైలాష్ వేద ని అలా చూడలేకపోతున్నాడు.వేద అడిగిన దాంట్లో ఒక్క ప్రశ్నకి కూడా కైలాష్ దగ్గర సమాధానం లేదు.
"వేద నువ్వంది నిజమే ఎవరో, ఏదో చేసిన దానికి నా తొందరపాటు కారణంగా నీ పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించాను. నేను చేసిన దానికి క్షమించు అన్న మాట చాలా చిన్నది. వేద జరిగిపోయినదానిని నేను ఎలాగో ఏమి చేయలేను దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం తప్ప....."
"నీ ప్రాయశ్చిత్తం ఇక్కడేవ్వరికి అవసరం లేదు." చాలా వెటకారంగా అంది.
"వేద ప్లీజ్. ఒక్కసారి నేను చెప్పేది విను"
వేద మొహం తిప్పేసుకుంది.
"వేద జరిగింది తొందరపాటే. కాని ఆ తొందరపాటు చర్య ఇప్పుడు నాకెంతో ఇష్టమైనది. అవును వేద నేను నిన్ను ఇష్టపడుతున్నాను. నేను చేసిన తప్పు తెలిసాక నీకు క్షమాపణలు చెప్పడానికి మీ ఊరు వచ్చాను. నాకు తెలుసు అది అంత తేలిక కాదని నువ్వు క్షమించిన తరువాతే మీ ఊరు నుండి ఇక్కడికి వద్దమనుకున్నాను. అందుకే మీ ఊరు వచ్చాను అప్పుడు నాకు నీ మీద ఎలాంటి అభిప్రాయం లేదు కేవలం నా తొందరపాటుకి గురయ్యావనే అనే బాధ తప్ప.కాని మీ ఊరు వచ్చాక నేను నీ గురించి చాలా తెలుసుకున్నాను,. నీ గురించి నీ వ్యక్తిత్వం గురించి, నీ మంచితనం గురించి తెలుసుకున్నాక నేను చేసిన పనికి నాకే సిగ్గేసింది. నీ మీదకి నా ఆలోచనలు ఎప్పుడు మళ్ళాయో నాకు తెలిదు.కాని కొన్ని రోజులకే నా ఆలోచనలనిండా, నా ఊహల నిండా నువ్వే ఉన్నావ్. నువ్వెక్కడ ఉంటావో తెలుసుకుందామని ఎంతగానో ప్రయత్నిచాను కాని నా ప్రయత్నం సఫలం కాలేదు. చివరికి నిన్ను ఇక్కడ హైదరాబాద్ లో కలుసుకున్నాను. నిన్ను ఇక్కడ చుసిన రోజున నేను ఎంత ఆనందంగా ఉన్నానో నాకే తెలుసు దాన్ని మాటలలో చెప్పలేను అప్పుడే నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో అర్ధం అయ్యింది. నీకు ఈ విషయం చెప్పాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను కాని కుదరటం లేదు.వేద నిన్ను నేను మనస్పూర్తిగా ప్రేమిస్తున్నాను. నువ్వు ఒప్పుకుంటే ఈ ఇంటికి కోడలిగా నిన్ను తీసుకొని వద్దామనుకుంటున్నాను."
ఇందాకటి నుండి కైలాష్ చెప్పిన మాటలు వేద మీద ఎలా ప్రభావం చుపించాయో తెలియదు కాని చివర అన్న మాటలు మాత్రం చాలా కోపం తెప్పించాయి.
"ఏమన్నావ్ ప్రేమిస్తున్నావా. నీకసలు ముందు ప్రేమంటే ఏమిటో తెలుసా. ఒక మనిషిని నిజంగా మనస్పూర్తిగా ప్రేమిస్తే ఆ మనిషిని క్షమించే గుణం ప్రేమించిన మనిషిలో ఉండాలి. కాని నీలో అది లేదు. మా అక్కని ప్రేమించా అన్నావ్ ఆమె నిన్ను మోసం చేసిందని ఆమెని బలవంతంగా పెళ్లి చేసుకున్దామనుకున్నావ్. పెళ్లి చేసుకొని వదిలేద్దమనుకున్నావ్. ఇంత నీచంగా ఆలోచించడానికి వెనకాడని వాడివి నీకు ప్రేమించే గుణం ఉందంటే నేను నమ్మాలా. మా అక్క చేసిన మోసానికి ఆమెని క్షమించమని నేను అనట్లేదు, అమెది నిజమైన ప్రేమ కాదు, పోనీ నీది నిజమైన ప్రేమే కదా మరి అంత ప్రేమించిన అమ్మాయిని అంత తేలికగా ద్వేషిన్చగాలుగుతున్నవే, అంత తేలికగా శిక్షించాగాలుగుతున్నవే , అంత తేలికగా మరిచిపోయి వేరే అమ్మాయిని ప్రేమిచాగాలుగుతున్నవే..నీకు ప్రేమ గురించి తెలుసనీ ఎలా అనుకోమంటావ్, నీకు ప్రేమించే హృదయం ఉందని ఎలా అనుకోమంటావ్..హు నువ్వు చెప్పేది ఎంత హాస్యాస్పదంగా ఉందో చూడు.క్షమించే గుణం లేనివాడి దగ్గర ప్రేమించే గుణం ఉండదు." అంటూ ఆవేశంగా మంచం దిగింది.అక్కడే ఉండి కైలాష్తో మాట్లాడడం ఆమెకి ఇష్టం లేదు. పక్క రూం లోకి వెళ్దామని వెనక్కి తిరిగింది.
వెళ్తున్న వేద ని కైలాష్ చేయి పట్టుకొని ఆపాడు.వేద ఆ చేతిని విసిరి కొట్టింది. అయినా కైలాష్ చేతిని వదలలేదు. వదలకుండానే అన్నాడు "వేదా నువ్వు నన్ను చాలా తప్పుగా అర్ధం చేసుకున్నావ్. నిజమే మీ అక్క మోసం చేసిందని తెలియగానే నాకు చాలా కోపం వచ్చింది. మొదట మీ అక్కని చంపేద్దాం అన్నంత ఆవేశం వచ్చింది. కాని ఆమెని ప్రేమించినందుకు ఆ పని చేయలేకపోయాను. ఆమె మానాన ఆమెని వదిలేద్దమనుకున్నాను.నాకు కోలుకోవడానికి నెల రోజులు పట్టింది. నాకు బంగళూరు లో ఒక ఆపరేషన్ ఉందని బంగళూరు వెళ్ళాను. అక్కడ నా ఫ్రెండ్ ఒకడిని కలిసాను. వాణ్ని కూడా వాడు మనస్పూర్తిగా ప్రేమించిన అమ్మాయి మోసం చేసింది.ఆ సంఘటన జరిగి అప్పటికి రెండు సంవత్సరాలు కావస్తోంది. వాడు దానికి తట్టుకోలేకపోయాడు. ప్రేమ అనే పదాన్నే నమ్మడం మానేసాడు. అనుకోకుండా నేను వాడిని ఒకరోజు రోడ్ మీద కలిసాను. నన్ను వాడి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ కొంచం సేపు కూర్చున్నాను.నా ఫ్రెండ్ ఏదైనా కూల్ డ్రింక్ తీసుకొస్తా అని లోపలి వెళ్ళాడు ఈలోపు నా పెన్ కింద పడిపోతే తీసుకోవడానికి వొంగాను అప్పుడు సోఫా కింద ఏదో ఫోటో లాగ కనిపించింది అది ఎంటా అని తీసి చూసాను. అది అంజలి ఫోటో. అదిక్కడేందుకు ఉందో నాకు అర్ధం కాలేదు. ఈలోపు నా ఫ్రెండ్ కూల్ డ్రింక్ తీసుకొని వచ్చాడు ఒకటి నాకిచి ఒకటి తను తీసుకున్నాడు. వాడు రాగానే వాడిని అడిగాను ఈ ఫోటో ఎవరిదని. వాడు ఆ ఫోటో ని తీసుకొని నలిపేసి ముక్కలు ముక్కలుగా చిమ్పెసాడు. నాకేం అర్ధం కాలేదు. ఏంట్రా అని అడిగితె అప్పుడు చెప్పాడు ఆ అమ్మాయి వల్లనే అతడు మోసపోయాడని. మా వాడికి చాలా ఆస్థి ఉంది కాని అదంతా కోర్ట్ లో ఉంది. తీర్పు వీడికి అనుకూలంగానే వస్తుందని వాళ్ళ లాయర్ చాలా నమ్మకంగా చెప్పాడు కాని అది అలా జరగలేదు. ఆస్తి అంతా దాయాదుల పాలు అయ్యింది అది తెలిసిన రెండో రోజుకి ఆ అమ్మాయి వీడిని వదిలేసి వెళ్ళిపోయింది. అదేంటని అడిగితే నువ్వంటే నాకిష్టం లేదు అని చాలా విసురుగా మాట్లాడిందంత. నాకర్ధం అయ్యింది ఆస్తి లేదని ఆ అమ్మాయి వీడిని వదిలేసిందని. దానితో మానుతున్న గాయం మల్లి రేగినట్టయ్యింది. ఎందుకో ఆ అమ్మాయిని క్షమించి చాలా పెద్ద తప్పు చేశా అనిపించింది. ఎలాగైనా ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాలనుకున్నాను. అందుకే ఆ నిర్ణయానికి వచ్చాను. ఎప్పుడైతే మీ అక్క ప్రేమ మోసం అని తెలిసిందో అప్పుడే మీ అక్కని మరిచిపోయాను. జీవితం లో ఒక పెద్ద గుణపాటం నేర్చుకున్నాను. మనుష్యుల గురించి, మనసుల గురించి చాలా నేర్చుకున్నాను. అంతే గాని ప్రేమ విలువ తెలియక కాదు. అయిన ఇదంతా నీకు అర్ధం కావడానికి చెప్పాను. కాని నీ విషయం లో అలా కాదు నిజంగానే నీ విషయం లో నా వల్ల పెద్ద పొరపాటు జరిగింది. అది సరిదిద్దుకోవదానికే నా ప్రయత్నం. దానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. ఒక్కటి మాత్రం చెప్పగలను మీ అక్క విషయం లో నా ఎన్నిక తప్పు కావచ్చు కాని నీ విషయంలో కాదు. నాకెప్పుడు అనిపిస్తుంది ఆ దేవుడు నిన్ను అనుకోకుండా నా భార్యగా చేసి నేను ఆయనకీ ఎప్పుడు కృతజ్ఞతలు చెప్తూనే ఉంటాను."
"నాకు అనిపిస్తుంది ఆ దేవుడు నా జీవితం తో ఆడుకుంటున్నాడని. నిన్నే కాదు ఆ దేవుణ్ణి కూడా నేను క్షమించను. మా అమ్మొమ్మ విషయం లో నువ్వు చేసిన దానికి నిన్నేప్పటికి క్షమించలేను. ఆవిడ దృష్టిలో నన్ను దోషిగా నిలబెట్టిన నిన్ను నేను ఎప్పటికి క్షమించలేను. ఆవిడ మరణానికి నువ్వు కారణం అని తెలిసి కూడా నేను నిన్నేమి చేయలేకపోతున్నాను. ఆవిడ చివరి రోజులలో ఆవిడకి మనశాంతి లేకుండా చేసావ్. నా భవిష్యత్తు కలలన్ని నాశనం చేసావ్. ఎలా క్షమించమంతావ్ నిన్ను. నాకు అంత ఉదార హృదయం లేదు. నిన్ను చూడడమే నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడెప్పుడు 8 నెలలు అయిపోతాయ ఎప్పుడెప్పుడు ఇక్కడనుంచి వెళ్ళిపోదామా అని నేను చూస్తున్నాను. అలాంటిది మీ ఇంటికి రావడమా అది ఎప్పటికి జరగదు" చాలా ఆవేశం గా చెప్పింది
"వేద నువ్వింకా పూర్తిగా కోలుకోలేదు ఎక్కువ గా ఆవేశపడకు.నువ్వంటే నాకే కాదు మా ఇంట్లో అందరికి ఇష్టమే. నిన్ను కోడలిగా మా ఇంటికి తీసుకువస్తా అని మా అమ్మకి మాటిచ్చాను దాన్ని తప్పకుండా నేరవేర్చుకుంటాను"
"నేను దానికి ఎప్పటికి ఒప్పుకోను. నా ఇష్టా ఇష్టాలతో సంబంధం లేకుండా నా మేడలో తాళి కట్టినంత మాత్రాన మీ ఇంటికి నేను కోడలిగా రావడం కల్ల"
"నీ ఇష్టా ఇష్టాలతో సంబంధం లేకుండా ఎందుకు తీసుకొని వెళ్తాను. నేను తీసుకొని వెళ్ళినా నువ్వెలా వస్తావ్ చెప్పు. అందుకే నీ ఇష్టం తోనే తీసుకొని వెళ్తాను"
"అది ఎప్పటికి జరగదు"
"ఎందుకు జరగదు తప్పకుండా జరుగుతుంది. అది జరిగేంత వరకు నా ప్రయత్నం నేను చేస్తాను"
"అది వృధా ప్రయత్నమే అవుతుంది"
"అది చూద్దాం ఇప్పుడే ఎలా చెప్తాం"
"నా మీద నాకు చాలా నమ్మకం"
"నాకు కూడా నా మీద చాలా నమ్మకం తప్పకుండా నిన్ను మన ఇంటికి తీసుకొని వెళ్తాను".
వేద విసురుగా చేయి విదిలించుకొని ముందుకు రెండు అడుగులు వేసిందో లేదో "అమ్మా" అని అరిచింది. ఇందాక పగిలిన గ్లాస్ యొక్క గాజు పెంక వేద కాలిలో గుచ్చుకుంది.
"ఏమైంది" అంటూ వేద దగ్గరికి వచ్చాడు.
"ఏం లేదు" ఇంకా నీరసం పూర్తిగా తగ్గకపోవడం తో కళ్ళు తిరుగుతునట్టు అయ్యింది. పక్కన ఉన్న గోడని ఆసరాగా పట్టుకుంది.
"ఏది కాలు చూడనివ్వు. గాజుపెంక గుచ్చుకునట్టు ఉంది"
"ఏం లేదు అని చెప్తున్నాను కదా."
కైలాష్ వేద చెప్పేది వినిపించుకోలేదు. ఎత్తుకొని తీసుకోచి మంచం మీద పడుకోబెట్టాడు. "కాలు చూపించడానికి ఏమయినిది నీకు. ఆ గాజు పెంకని తీయనీయవా అలాగే కాలిలో పెట్టుకొని తిరుగుతావా. నేను డాక్టర్ నే ఆ గాజు పెంక ఎంత లోతుకో దిగిందో చూడని."
కాలు బాగా నొప్పి పెడుతుండడంతో ఏం మాట్లాడలేకపోయింది. కైలాష్ గాజుపెంక తీసి గాయానికి మందు రాసి కాలికి కట్టు కట్టాడు.
వేదని కదలకుండా కూర్చోమని చెప్పి ఇంకో గ్లాస్ లో పాలు తీసుకొని వచ్చాడు.
"ఊ.. ఈ పాలు తాగు"
"నాకొద్దు"
"ఒద్దు..ఒద్దు అంటూ ఉంటె ఆ నీరసం తగ్గదు. ఇప్పటికే ఒంట్లో ఓపిక చాలా తక్కువ ఉంది.నువ్విలా ఏం ఇచినా వొద్దు వొద్దు అన్నావంటే ఇంకా నీరసం ఎక్కువ అవుతుంది అప్పుడు ఇంకా నువ్వెక్కడికి వెళ్ళాలన్న నేనే నిన్ను ఎత్తుకొని తీసుకెళ్ళాలి.నీకడే కావాలంటే చెప్పు నేను రెడీ"
వేద లేచి చప్పున గ్లాస్ తీసుకొని పాలు తాగింది.
"అది ఈ పనేదో ముందే చేసి ఉంటే ఈ బాధ ఉండదు కదా. చెప్తే వినవు కదా . సర్లే ఇంకా కళ్ళు మూసుకొని పడుకో"
వేద నెమ్మదిగా కళ్ళు మూసుకుంది. ఎప్పుడు నిద్ర పట్టిందో ఏమో నిద్రపోయింది.
కైలాష్ అక్కడ పడ్డ గాజుపెంకలన్ని ఎరిసి డస్ట్ బిన్ లో పడేసాడు. పడేసి వచ్చి అక్కడే సోఫా లో పడుకున్నాడు.

No comments:
Post a Comment