ఆ రోజు ముఖ్యమైన రోగులు లేనందువల్ల కైలాష్ పని పూర్తిచేసుకొని సాయంత్రం 6 కలా ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్లేసరికి చందన మేడ మెట్ల మీద కూర్చుని ఏదో నోట్స్ రాసుకుంటోంది. చందన కైలాష్ కి చెల్లెలు. కైలాష్ కి ఒక అన్న ఒక చెల్లి ఉన్నారు. అన్నయకి పెళ్లి అయ్యి నాలుగు సంవత్సరాలవుతోంది. కైలాష్ వాళ్ళ వొదిన పేరు హంస. చాలా నెమ్మదస్తురాలు. ఆ ఇంటిని ఆ ఇంట్లో మనుషులకు బాగా అలవాటు ఐపోయింది. కైలాష్ వాళ్ళ అమ్మ పేరు రాధా. రెండు సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఆ ఇంట్లో కైలాష్ వాళ్ళ అమ్మగారు, అన్న వొదిన, చెల్లెలు ఉంటారు. కార్ హార్న్ వినగానే అన్నయ్య దగ్గరకి వచ్చింది చందన.
" హాయ్ అన్నయ్య. నేనడిగిన టెక్స్ట్ బుక్ తెచ్చావా?"
"హ తెచ్చాను. చూడు ఇదేనా"
"హా ఇదే థాంక్స్ అన్నయ్య"
"సరేలే తీసుకో" అంటూ ఇంట్లోకి వెళ్ళాడు.
"అమ్మ అన్నయ్య వచ్చాడా"
"ఇంకా లేదురా ఇంకో గంట ఐన అవుతుందేమో"
"సరే ఈలోగా నేను స్నానం చేసి వస్తాను"
"సరే"
రాత్రి 8 అయ్యింది . మేడ మీద ఉన్న ఆరిన బట్టలు తీసుకొని కిందకి వస్తోంది చందన. ఇంతలో గేటు చప్పుడయ్యింది. ఎదురుగా వేద బైక్ మీద వస్తూ కనిపించింది. వేదని చూడగానే అంది చందన
"హాయ్ వొదిన"
అంతే ఆ పిలుపు విని వేద కోపంగా చూసింది చందన వైపు
"చందన నీకు ఇప్పటికి లక్ష సార్లు చప్పను అలా పిలవొద్దు అని. ఒకసారి చెప్తే నీకు ఎందుకు అర్ధం కాదో నాకు తెలియట్లేదు ఇంకో సారి నన్ను అల పిలిచావంటే నేను ఊరుకోను. దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది ఇంకోసారి అల పిలిచి నా సహనాన్ని పరీక్షా చేయకు."
"అది కాదు ఒకసారి నేను చెప్పేది విను ప్లీజ్" అంది చందన
"నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు నేను వినాల్సిన అవసరం లేదు అర్ధం అయ్యిందా ఇంకా నువ్వు నాకు అడ్డం తప్పుకుంటే నేను పైకి వెళ్తాను"
చందన బట్టలు తీస్కొని కిందకి వచ్చేసింది. వేద పైకి తన రూం లో కి వెళ్ళింది.
చందన బట్టలు తెచ్చి హాల్ లో సోఫా లో వేసి పక్కన కూర్చుంది. రాధా కైలాష్ హంస అంత హాల్ లో టీవీ చూస్తూ శైలేష్ కోసం ఎదురు చూస్తున్నారు.
చందన ని చూసి అంది రాధా
"ఏంటి చందన ఏవో మాటలు గట్టిగ వినిపిస్తున్నాయి ఎవరితో మాట్లాడుతున్నావు" అని అడిగింది.
"ఏం లేదు అమ్మ"
"నువ్వు ఏం లేదు అనడం తోనే అర్ధం అవుతోంది ఏదో ఉంది అని"
"వొదిన తో ఎమన్నా మాట్లాడావా" అంది రాధ
Good going
ReplyDelete