Thursday, 19 December 2013

Samveda Part-2

వాళిద్దరూ ఆఫీసు కి చేరుకునేసరికి తొమ్మిది అయింది. ఆఫీసు కి వెళ్ళంగానే వేద తన మీటింగ్  లో బిజీ గ ఉండిపోయింది. అది అయ్యేసరికి రెండు గంటలు పట్టింది. మీటింగ్ ఐపోగానే కస్తూరి తో కలిసి కాంటీన్ కి వచ్చింది ఏమైనా టిఫిన్ తిందామని. టిఫిన్ తీస్కుంటుంటే వేద అడిగింది కస్తూరి ని "ఎంతవరకు వచ్చింది నీ పెళ్లి చూపుల విషయం. పెళ్లి వాళ్ళు ఎమన్నా ఫోన్ చేసారా"

"ఆ చేసారు"

"ఏంటి చేసారా. మరి చేస్తే ఇంట ఆలస్యంగాన చెప్పేది. ఫోన్ చేసినవెంటనే చెప్పాలి గాని"

"సారీ నే కుదరలేదు నిన్న రాత్రికి ఫోన్ చేసారు పొద్దునే నీకు చెప్దామంటే మీటింగ్  గొడవలో బిజీ గా ఉండి కుదరలేదు"

"సరేలే ఈ సరికి క్షమించేస్తున్న ఇంతకీ ఏమన్నారు"

"వాళ్ళకి నేను నచ్చాను అంట రేపు ఒకసారి అమ్మ వాళ్ళని రామన్నారు మిగితా విషయాలు మాట్లాడడానికి"

"వాళ్ళకి నచ్చావు సరే మరి నీ సంగతేంది నీకు అబ్బాయి నచ్చాడా?"

"చూడడానికి బానే ఉన్నాడే, అంతగా వంకలు పెట్టడానికి ఏమి లేదు అందుకే నేను కూడా ఓకే చెప్పేసా"

"కంగ్రాట్స్"

"థాంక్స్"

"సరే పద ఇప్పటికే లేట్ ఐంది చాల వర్క్ పెండింగ్ లో ఉండిపోయింది"




నగరం లో ఆశ హాస్పిటల్ చాల పేరు ఉన్న హాస్పిటల్. ఆ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కోసం చాల పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు గుండెకి సంబంధించిన జబ్బులని నయం చేయడం లో మంచి పేరుంది. అక్కడే కైలాష్ పని చేసేది. కైలాష్ కి 28 ఏళ్ళు ఉంటాయి చూడడానికి బాగుంటాడు. ఆ హాస్పిటల్ లో సంవత్సరం నుంచి పని చేస్తున్నాడు. ఇప్పుడిప్పుడే హార్ట్ స్పెషలిస్ట్ గా మంచి పేరు వస్తోంది. 

1 comment: