కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా
మెరిసే గోదారిలో విరబూసిన నురగలా
నవ్వులారబోసే పడుచున్నది
కలువపూవు వేయి రేకులతో విచ్చుకున్నది
పున్నమి ఎపుడెపుడా అని వేచి యున్నది ..ఆఅ..
కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా
మెరిసే గోదారిలో ఎగసిపడే తరగలా
నాజూకు నెలబాలుడున్నాడు నవమి నాడే పున్నమి అని చెబుతున్నాడు
పున్నమి ఇపుడిపుడే అనిపిస్తున్నాడు ||కురిసే||
ఈ వెండి వెన్నెల్లో ఏమిటి ఈ ఎరుపు
ఎరుపా అది కాదు నీ అరికాళ్ళ మెరుపు
ఆ కాలి ఎరుపు కెంపులుగా
ఆ చిరునవ్వులే మువ్వలుగా
ఆ మేని పసిమి పసిడిగా
అందాల వడ్డాణం అమరించాలి
అని తలచానే గాని ఆ నడుమేది
అది ఉన్నట్ట మరి లేనట్టా
నడుము ఉనట్టా మరి లేనట్టా
పైట చెంగు అలలు తాకి అలల పై ఉరికే పొంగులు దాటి
ఏటికి ఎదురీది ఈది ఎటుతోచక నేనుంటే
మెరుపులాంటి ఎరుపేదో కళ్ళకు మిరమిట్లు గొలిపింది ఏవిటది..
ఎవరమ్మా ఇతగాడు ఎంతకు అంతు పట్టని వాడు చెంతకు చేరుకున్నాడు ఆహా ఎవరమ్మా ఇతగాడు
పాల వెన్నెల లోనా బాల గొదారిలా చెంగు చెంగున వచ్చి చేయి పట్టబోయాడు.. అంతేనా..
తిరగట్లో ఒరుసుకునే వరద గొదారిలా పరుగు పరుగున వచ్చి పైట చెంగు లాగాడు ... ఆ పైన..
అతను చెయ్యి పట్టబోతుంటే పైట చెంగు లాగబోతుంటే ఉరిమి చూసి ఉరిమి చూసి తరిమి కొట్టబోయాను
కాని ..
చల్ల చల్లగా సాగే గోదారిలా శాంత గోదారిలా నిలువెల్లా నిండుగా దోచాడు పులకించే గుండెనే దోచాడు.. ఎవరమ్మా ఇతగాడెవరమ్మ...

No comments:
Post a Comment