Tuesday, 30 August 2016

Kurise Vennalo Song Lyrics from Andaala Raamudu(1973)

కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా 
మెరిసే గోదారిలో విరబూసిన నురగలా 
నవ్వులారబోసే పడుచున్నది 
కలువపూవు వేయి రేకులతో విచ్చుకున్నది 
పున్నమి ఎపుడెపుడా అని వేచి యున్నది ..ఆఅ..

కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా 
మెరిసే గోదారిలో ఎగసిపడే తరగలా 
నాజూకు నెలబాలుడున్నాడు నవమి నాడే పున్నమి అని చెబుతున్నాడు
పున్నమి ఇపుడిపుడే అనిపిస్తున్నాడు ||కురిసే||  

ఈ వెండి వెన్నెల్లో  ఏమిటి  ఈ ఎరుపు 
ఎరుపా అది కాదు నీ అరికాళ్ళ మెరుపు
ఆ కాలి ఎరుపు కెంపులుగా 
ఆ చిరునవ్వులే మువ్వలుగా
ఆ మేని పసిమి పసిడిగా 
అందాల వడ్డాణం అమరించాలి 
అని తలచానే గాని ఆ నడుమేది 
అది ఉన్నట్ట మరి లేనట్టా
నడుము ఉనట్టా మరి లేనట్టా
పైట చెంగు అలలు తాకి అలల పై ఉరికే పొంగులు దాటి
ఏటికి ఎదురీది ఈది ఎటుతోచక నేనుంటే 
మెరుపులాంటి ఎరుపేదో కళ్ళకు మిరమిట్లు గొలిపింది ఏవిటది..    

ఎవరమ్మా ఇతగాడు ఎంతకు అంతు పట్టని వాడు చెంతకు చేరుకున్నాడు ఆహా ఎవరమ్మా ఇతగాడు
పాల వెన్నెల లోనా బాల గొదారిలా చెంగు చెంగున వచ్చి చేయి పట్టబోయాడు.. అంతేనా..
తిరగట్లో ఒరుసుకునే వరద గొదారిలా పరుగు పరుగున వచ్చి పైట చెంగు లాగాడు ... ఆ పైన..  
అతను చెయ్యి పట్టబోతుంటే పైట చెంగు లాగబోతుంటే ఉరిమి చూసి ఉరిమి చూసి తరిమి కొట్టబోయాను
కాని .. 
చల్ల చల్లగా సాగే గోదారిలా శాంత గోదారిలా నిలువెల్లా నిండుగా దోచాడు పులకించే గుండెనే  దోచాడు.. ఎవరమ్మా ఇతగాడెవరమ్మ...   

Veena Venuvaina Sarigama Song Lyrics from Intiti Ramayanam Movie

Veena Venuvaina sarigama vinnavaa
Oo..Teega raagamaina madhurima kannavaa
Tanuvu tahataha Ladaala
chelaregaala.. cheli Vugaala
Vuyyaala Ee Velalo...

Veena venuvaina sarigama vinnavaa
Oo..Teega raagamaina madhurima kannavaa..

Oopiri tagilina vela
nee vompulu tirigina vela
naa veenalo nee venuve
palike raagamaala..
Aa..aaaa.. la la laa..Aaa...
Choopulu ragilina vela
Aa chukkalu veligina vela
Naa tanuvuna anuvanuvunaa
jarige raasaleela..Aaa

Veena venuvaina sarigama vinnavaa
Oo..Teega raagamaina madhurima kannavaa..

Yedhalo andam Eduta
yedute valachina vanita
nee raakato naa thota lo
velase vana devataa
Aa..aaa.. la la la..Aaa...
kadile andam kavitha
adi kougilikoste yuvataa
naa paatalo nee pallave
navataa navya mamatha..aaa

Veena venuvaina sarigama vinnavaa
Oo..Teega raagamaina madhurima kannavaa..
Tanuvu tahataha Ladaala
chelaregaala.. cheli Vugaala
Vuyaala Ee Velalo

Veena venuvaina sarigama vinnavaa
Oo..Teega raagamaina madhurima kannavaa..

Oo.. Laa la laala lalala la la la la Laa....

By Jawaharlal Nehru

Time is not measured by the passing of years but by what one does, what one feels, and what one achieves.

Tuesday, 16 August 2016

Samveda - 27

కైలాష్ హరి వాళ్ళని పంపించడానికి కిందకి వచ్చాడు.

హరి బయలుదేరుతూ అన్నాడు కైలాష్ తో  "మీరు  శ్రమ అనుకోకుండా వేద ని చూసుకుంటున్నందుకు చాలా థాంక్స్."

"పర్వాలేదండి ఇందులో శ్రమేం ఉంది అయినా మీరు ఇన్నిసార్లు థాంక్స్ చెప్పడం ఏం బాలేదు"

హరి చిన్నగా నవ్వాడు. కైలాష్ తో అన్నాడు "ఎందుకో తెలీదు గానీ  వేద ఇక్కడే ఉండడానికి ఇష్టపడుతోంది. ఎన్నిసార్లు అడిగినా అదే మాట చెప్తోంది. కారణం అడిగితే  "అదీ ఇదీ" అని ఏదేదో  చెప్తోంది కాని అసలు విషయం మాత్రం చెప్పట్లేదు. ఎందుకో తెలీదు కాని అసలు విషయం చెప్పడానికి ఇష్టపడడం లేదు అని అర్ధం అయ్యింది . అందుకే మేము కూడా ఎక్కువ బలవంతపెట్టలేదు. ఏమైనా అవసరం ఉంటే కబురు చేయండి."

"తప్పకుండా."

"సరే, మరి ఇంక వస్తామండి" అన్నాడు హరి.

"అలాగే"

"అంకుల్ బై"

"బై రేవ"

హరి వాళ్ళని పంపించేసి వస్తుండగా కైలాష్ కి ఫోన్ వచ్చింది రాధ ఫోన్ చేసింది వాళ్ళు బయలుదేరుతున్నట్టు. రాధతో మాట్లాడి కైలాష్ పైకి వచ్చాడు.

కైలాష్ పైకి వచ్చేటప్పటికి వేద రూం లో నడవడానికి ప్రయత్నిస్తోంది.

అది చూసి కైలాష్ అన్నాడు "అరే ఒక పది నిమిషాలు ఆగొచ్చు కదా వాళ్ళని పంపించి వచ్చేలొపే తొందరా"

కైలాష్ మాట వినపడడంతో వెనక్కి తిరిగి చూసింది వేద.

"అదేం లేదు కాలి నొప్పి తగ్గింది అందుకే ఒక సారి చూస్తున్నా నడవడానికి వస్తోందా లేదా అని"

"ఎలా ఉంది ఇప్పుడు నడుస్తుంటే కాలి నొప్పి తెలుస్తోందా"

"లేదు అంతగా తెలియట్లేదు. పర్వాలేదు నడవగలుగుతున్నా"

"సరే కాలుని ఎక్కువ శ్రమ పెట్టకు కొంచం సేపు నడిచి రెస్ట్ తీసుకో. రాత్రికి డిన్నర్ తినేసి టాబ్లేట్స్ వేసుకుని పడుకున్నావంటే రేపు పొద్దున్న కల్లా జ్వరం తగ్గిపోతుంది. ఆ ఇంకో విషయం రేపు కూడా ఆఫీస్ కి లీవ్ పెట్టి రెస్ట్ తీసుకో, ఎల్లుండి వరకు నీరసం తగ్గిపోతుంది."

"అలాగే"

"రాత్రి డిన్నర్ లోకి ఇవ్వాళ కూడా లైట్ ఫుడ్ తీసుకుందువుగాని. రాత్రికి అమ్మ వాళ్ళు వచ్చేస్తారు. అమ్మకి చెప్తాను."

"అహ వొద్దు"

"వేద మళ్ళి మొదటికి వచ్చావా?"

"అది కాదు అసలే ఆంటీ వాళ్ళు తిరిగి తిరిగి చాలా అలసట మీద వస్తారు అప్పుడు మళ్ళీ వాళ్ళని కష్టపెట్టడం ఎందుకు ఎలాగో మధ్యాహ్నం వొదిన చేసిన అన్నం రసం అలాగే ఉన్నాయి. నాకవి చాలు. వాటిని వేడి చెసుకుంటే సరిపోతుంది."

వేద చెప్పింది కూడా సబబే అనిపించింది కైలాష్ కి అందుకే అన్నాడు "సరే నీ ఇష్టం" అని, తను అనుకున్నాడు రాత్రికి అమ్మా వాళ్ళకి డిన్నర్ తెప్పిస్తే బావుంటుందని ఎలాగో వాళ్ళు వచ్చేటప్పటికి ఎంత కాదన్న ఎనిమిది దాటుతుంది. అంత అలసట మీద మళ్ళి వంట పని అంటే అమ్మా వాళ్ళకి కష్టం అవుతుంది.  ఆ ఏర్పాట్లు చూడడానికి వేద తో చెప్పి బయటకి వెళ్ళాడు.

కైలాష్ వెళ్ళిన తరువాత వేద ఒక పావు గంట వరకు నడిచింది . నడుస్తుంటె కాలు నొప్పి తెలుస్తున్నా అది మరీ అంత కష్టమనిపించడంలేదు. ఒక పావు గంట నడిచి ఆ తరువాత మంచం మీద వచ్చి పడుకుంది. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీకుండానే పడుకుంది. మెలుకువ వచ్చేసరికి తన ఎదురుగా రాధ కూర్చుని ఉంది.అప్పటికి రాధా వాళ్ళు వచ్చి గంట అయ్యింది. కొంచెం సేపు ఫ్రెష్ అయ్యి వేద కి ఎలా ఉందో చూద్దామని పైకి వచ్చింది. వేద పడుకుని వుండేసరికి ఒక అరగంట చూసి లేస్తే పలకరిద్దాం అనుకుని అక్కడ సొఫాలో కూర్చుంది.వేద కళ్ళు తెరిచి తనని చూడగానే చిరునవ్వు నవ్వింది.

"ఏమ్మా ఎలా ఉంది ఇప్పుడు ఒంట్లో?"

ఆవిడని చుడగానే వేద లేచి కూర్చోబోయింది.

"పర్వాలేదమ్మ పడుకో"

ఆవిడ పర్వాలేదంటున్నా బావుండదని వేద లేచి కూర్చుంది.

"ఎలా ఉందమ్మా ఇప్పుడు ఒంట్లో"

"బానే ఉందండి జ్వరం తగ్గిపొయింది."

ఇంతలో చందన, హంస వచ్చారు.  వేదని పలకరించారు.

చందన మామూలుగా అడిగింది "ఎలా ఉంది వొదినా వొంట్లో. జ్వరం తగ్గిందా?" అని

వొదిన అన్న పిలుపు వినబడేసరికి వేద తలెత్తి చూసింది అంత అలసటలోను స్థిరంగా చెప్పింది "చందన కావాలంటే వేద అని పిలు అంతే గాని వొదినా అని వరస మాత్రం కలపకు."

వేద ఆ మాట చెప్పగానే చందన రాధ వంక చూసింది

వేద చూడకుండా రాధ చందన చెయి పట్టుకుంది ఆ విషయం ఇక్కడితో వదిలేయి పొడిగించ వద్దు అని, ఆ భావం చందన కి అర్ధం అయ్యింది.

అంతలో వేద చందన అడిగిన దానికి జవాబు చెబుతునట్టుగా అంది "ఇప్పుడు పర్వాలేదు బానే ఉంది."

"ఏమ్మా భోజనం అయ్యిందా?" అడిగింది రాధ

"ఇంకా లేదండి సాయంత్రం పడుకొని ఇప్పుడే లేచాను ఒక అరగంట ఆగి తింటాను"

హంస ని అడిగింది వేద "మీ నాన్నగారికి ఎలా ఉందండి"

"తగ్గింది. ఇప్పుడు బానే ఉన్నారు. నన్ను చూడగానే బాగ కోలుకున్నరు."

వేద నవ్వింది ఇంక అంతకుమించి ఏం మాట్లాడాలో తెలియలేదు.

ఇంతలో హంస అంది "భోజనం పంపిస్తానంటే వద్దన్నావట కద ఇందాక అబ్బాయి చెప్తున్నాడు"

"అవునండి మా వొదిన మధ్యహ్నం చేసినవి ఉన్నాయి అందుకని"

"అవి ఎప్పుడో చల్లారిపోయి ఉంటాయి. ఒక రెండు నిమిషాలాగు నెను ఏదైన చేసి పంపిస్తాను"

ఆ మాటతో వేద కంగారు పడింది వెంటనే అంది "వొద్దండి పర్వాలేదు"

"అలా అంటే ఎలా అసలే ఒంట్లొ బాలేదు చల్లారినవి తింటావా. పోని అవి వెడి చేస్తా ఉండు"

"వొద్దండి"

"నువ్వు ఇంకేం మాట్లాడకు ఎంతసేపు ఒక పదినిమషాలు అంతే" అంటూ లేచి వంటింట్లోకెళ్ళింది.

వేదకి ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు.వేదకి మొహమాటంగా ఆవిడ చేత చేయించుకొవడం నచ్చలేదు. అలా అని ఆవిడ చెయకుండా ఆపనూ లేదు .

రాధ  మధ్యహ్నం చేసినవి అన్ని వేడి చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి వచ్చింది.

"అన్ని వేడి చేసాను చల్లారకుండానే తినేసెయి"

"అలాగే. థాంక్స్"

కొంచంసేపు కూర్చుని వాళ్ళు వెళ్ళారు.

వాళ్ళు వెళ్ళిపొయాక నెమ్మదిగా లేచి నడిచి వచ్చి హాల్లో కూర్చుంది. ఊరికే పడుకోవాలంటే బోర్ కొడుతోంది. ఫోన్ లో చార్జింగ్ లేకపొవడం వల్ల అది స్విచ్ ఆఫ్ అయిపోయింది. రేపు ఆఫిస్ నుండి వచ్చేటప్పుడు చార్జర్ తీసుకొని రమ్మనమని చెప్పాలి కస్తూరి కి .కస్తూరి పెళ్ళికి ఇంకా ఎక్కువ రోజులు కూడా లేదు. పెళ్ళి పనులు ఎక్కడ దాక వచ్చాయో. ఈపాటికి అన్ని అయిపొయి ఉంటాయి. ఇవ్వాళ పొద్దున్న చూసినప్పుడు దాని మొహం లో ఎంత కళ ఉందో. పెళ్ళి దగ్గరకొస్తుంటే అంతేనెమో. ఎందుకో మనసులో మళ్ళీ దిగులుగా అనిపిస్తోంది. తనకి ఆ అవకాశం లేదు. అదీ కైలాష్ వల్ల. అంతకు మించి ఆలోచనలు ముందుకు వెళ్ళనీయడం లేదు. తనకి తెలుసు ఇంక ముందుకు వెళితే వాళ్ళని అసహ్యించుకుంటుంది. వేద తల విదిలించింది. ఏంటి ఈ పరిస్థితి. లాభం లేదు ఇంకా ఎక్కువ రోజులు ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఇంక నాలుగు నెలలే గడిచాయి. ఎనిమిది నెలలు ఎలా గడుస్తాయో ఏంటో. ఇలాంటి పరిస్థితి ఇంకెప్పుడు రాకుండా జాగ్రత్త పడాలి. ఆలోచనలు మనసుని కుదురుగా ఉండనీయడం లేదు అందుకే హాల్లో కొచ్చి టి.వి. పెట్టుకుంది. అయినా మనసు టి.వి మీద నిలవడంలేదు. టి.వి చూస్తోందన్నమాటే గాని ఏం చూస్తొందో వేద కి అర్ధం కావట్లేదు. తనకి తెలియకుండానే కైలాష్ కోసం ఎదురు చూస్తోంది . కైలాష్ కొసం చాలా సేపు చూసింది గాని అతను మళ్ళీ రాలేదు. అతను ఎందుకు రాలేదో వేద కి అర్ధం కాలేదు. రాధ వాళ్ళని ఈ విషయం అడుగుదామనుకుంది గాని అడగలేకపొయింది. అసలు తను కైలాష్ కోసం ఎందుకు ఎదురు చూస్తోందో తనకే అర్ధం కావడంలేదు ఆ ఎదురు చూపు తనకే ఆశ్చర్యంగా ఉంది. క్షణం ముందు ఆలోచలనలకి క్షణం తరువాత ఆలోచనలకి అసలు పొంతనే ఉండడంలేదు. బలవంతంగా ఆ ఆలోచనలనుంచి బయటపడి టి.వి. చుస్తూ కూర్చుంది. కొంచం సేపు టి.వి చూసి, డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఇందాక రాధ వేడి చేసిన  అన్నంలో కొంచం రసం వేసుకొని తినింది. టాబ్లెట్స్ వేసుకొని పడుకొంది.  

కైలాష్ అప్పుడనగా వెళ్ళాడు. ఆ తరువాత అతనికి రావడానికి మళ్ళీ కుదరలేదు, రాధ వాళ్ళకి భొజనానికి ఏర్పాట్లు చేసాడు. వాళ్ళు వచ్చాక కొంచం సేపు వాళ్ళతో కూర్చుని కబుర్లు చెప్పాడు. హంస ని  కనుక్కున్నాడు వాళ్ళ నాన్నగారికి ఎలా ఉంది అని.ఇంతలో అర్జెంట్ అని హాస్పిటల్ నుండి ఫోన్ వస్తే  అక్కడికి వెళ్ళాడు. వెళ్ళే ముందు వేదకి చెప్పి వెళ్దామనుకుని పైకి వచ్చాడు .కాని వేద పడుకొని ఉండేసరికి వెళ్ళిపోయాడు . అతనికి ఆ రాత్రంతా ఇంటికి రావడానికి కుదరలేదు.

ఉదయం వేద లేచేసరికి ఎనిమిది దాటింది. చాలా వరకు ఒంట్లో తేలికగా ఉంది. జ్వరం పూర్తిగా తగ్గిపొయింది. కొంచం నీరసంగా ఉంది అంతే. కాలి నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయింది. వేద మొహం కడుక్కుందామని వెళ్ళబోయింది ఇంతలో డోర్ బెల్ మోగింది. వేద వెళ్ళి తలుపు తీసింది పనమ్మాయి నిలుచిని ఉంది అక్కడ.

"గౌరీ నువ్వా రా ఎలా ఉంది మీ అబ్బాయికి"

"తగ్గిపొయిందమ్మా మీకు ఒంట్లో బాగలేదంట కద నాకు తెలీదు, సమయానికి నేను కూడా లేను మీకేమైనా అవస్థ అయ్యిందా? "

"అదేం లేదులే అయినా నాకు ఒంట్లో  బాలేదని నీకు ఎవరు చెప్పారు?"

"కింద ఉండే  అమ్మగారు చెప్పారు. ఇప్పుడు ఎలా ఉంది?"

"బానే ఉంది"

"మీరు ఇప్పుడే  లేచినట్టు ఉన్నారు, వెళ్ళి మొహం కడుక్కుని రండి వేడి వేడిగా పాలు ఇస్తాను."

"అలాగే"

వేద మొహం కడుక్కుని వచ్చేసరికి గౌరి చెప్పినట్టుగా వేడి పాలు ఇచ్చింది. టిఫిన్ చేసింది.

వేద టిఫిన్ తిని పాలు తాగి సోఫా లో కూర్చొని టి.వి చూస్తోంది.

అయిదు రోజుల నుండి ఇంటిని పట్టించుకోకపోవడంతో ఇంటిని సద్దడానికి గౌరి కి చాలా సమయమే పట్టింది. ఒక గంటలో పని ముగించుకుంది గౌరి.

వేద తో అంది "అమ్మా పని అయిపోయింది. నేను మళ్ళీ మధ్యహ్నం వచ్చి వంట చేస్తాను వేడిగా తిందురుగాని. ఇవాళ మీరు ఆఫీస్ కి వెళ్తారా?"

"లేదు గౌరి ఇవ్వాళ సెలవు పెట్టాను నువ్వు మధ్యహ్నం రా"

"అలాగె" అంటూ వెళ్ళిపొయింది గౌరి వేద వెళ్ళి తలుపు వేసుకొని వచ్చింది.

అప్పటికే తొమ్మిది దాటింది కైలాష్ నిన్న సాయంత్రం అనగా వెళ్ళాడు మళ్ళి కనిపించలేదు ఎందుకో తెలీదు అనుకుంది వేద. తనకి జ్వరం తగ్గిపోయింది కాబట్టి రాలేదేమో అనుకుంది. మళ్ళీ తల పట్టుకుంది ఈ ఆలోచనలేంటి అసలు ఎప్పుడు కైలాష్ చుట్టూనే తిరుగుతున్నాయి తనకి నిజంగా పిచ్చి పట్టింది లేకపొతే నిన్న సాయంత్రం నుండి ఏ మాత్రం ఒంటరిగా ఉన్న ఈ ఆలోచనలన్ని ఎందుకు ఇలా చుట్టుముడుతున్నాయి.

తలుపు చప్పుడయ్యేసరికి ఉలిక్కిపడింది.వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా చందన ఉంది.

వేద కి ఆ అమ్మాయిని లోపలకి రమ్మనాలో లెదో అర్ధం కాలేదు.

గుడ్మోర్నింగ్ వొదినా ఎలా ఉంది ఇప్పుడు? అన్న పిలుపు నొటిదాకా వచ్చింది కాని పిలడానికి భయపడింది రాత్రి జరిగింది గుర్తు వచ్చింది. అందుకే మామూలుగా అంది "గుడ్మోర్నింగ్  ఎలా ఉంది ఇప్పుడు?" ఎంత అనుకున్నా వేద అని పెరు పెట్టి పిలవడానికి మనస్కరించలేదు, ఆఫిస్ లో అయితే ఎమో గాని ఇంట్లో అలా పిలవాలంటే మాత్రం  మనస్కరించడంలేదు.

"పర్వాలేదు బాగానే ఉంది" వేద తటపటాయిస్తూనె ఆ అమ్మాయి లొపలికి రావడానికి వీలుగా గుమ్మం లొంచి పక్కకి జరిగి "రా" అంది.

చందన లోపలకి వస్తూ అంది "కస్తూరి ఫోన్ చెసింది నీతో మాట్లాడాలని, నీ ఫోన్ స్విఛాఫ్ వస్తొందంట కదా."

"ఔను"

"అందుకే నాకు చేసింది. నీతో మాట్లాడాలంట ఒక 5 నిమిషాలలో ఫోన్ చెస్తానంది" చందన చెప్తుండగానే ఫోన్ మోగింది.చందన వేద కి ఫోన్ ఇచ్చింది.

"హలో వేద ఎలా ఉన్నావ్?"

"బావున్నానే కాని ఇవాళ్ళ ఆఫీస్ కి రాను నువ్వు గిరితో చెప్పు"

"నేను అది చెప్దామనే ఫోన్ చేసాను ఇవ్వాళ నువ్వు రెస్ట్ తీసుకో. గిరికి నేను చెప్తాలే, ఇవ్వాళ  లేట్ అయిపొయిందే నేను డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్ళిపోతున్నా సాయంత్రం ఇంటికి వెళ్ళెటప్పుడు వస్తా"

"సరే, వచ్చేటప్పుడు చార్జెర్ తీసుకొని రా"

"సరే, ఉంటాను"

వేద ఫోన్ చందనకి ఇచ్చేసింది.

చందన ఫోన్ తీసుకొని అడిగింది "టిఫిన్ చేసావా" అని

చేసాను అన్నట్టు తలాడించింది. "ఆఫిస్ కి టైం అవుతోంది వస్తాను" అంది చందన

"సరే"

చందన వెళ్ళడానికి వెనక్కి తిరిగింది.

ఇంతలో వేద పిలిచింది చందన ని

చందన వెళ్ళబోతున్నదల్లా ఆగి వెనక్కి తిరిగి చూసింది "ఏంటి" అని

"ఏంలేదు"

"సరే" అని వెళ్ళబోయింది చందన.

వేద అడగలేకపోయింది కాని అడగకుండా కూడా ఉండలేకపోయింది మళ్ళి పిలిచింది చందనని.

చందనకి విషయం అర్ధం కాలేదు వేద ఇంతగా ఎందుకు తటపటాయిస్తొందో "ఏంటిది" అంది మళ్ళి.

వేద అడగలేక అడిగింది "కైలాష్ లేడా" అని.తనకెందుకో నమ్మకంగా అనిపిస్తొంది కైలాష్ ఇంట్లొనే ఉంతే తనకి చుడడానికి వస్తాడని అందుకే ఇంట్లో లెడా అని అడిగింది.

ఆ మాటకి చందన వేద వైపు ఆశ్చర్యంగా చూసింది.

ఆ చూపుకి వేద కలవరపడింది.      

Friday, 10 June 2016

Ninnu Koriii iii varnam Song Lyrics from Gharshana(Old)

Ninnu kori... varnam varnam
Sari sari kalisene nayanam nayanam

Urikina vaagalle,
Tholakari kavithalleee,
Thalapulu kadhilene,
Cheli madhi Virisene,
Ravikula raghu raamaa..
Anudhinamu.. Ninnu kori.... varnam Varnam
Sari sari kalisene nayanam nayanam

Udikinche chilakammaa...Ninnoorinche,
Valikinche andhaale... Aaalaapinche,
Muthyaalaa bandhaale... Neekandhinche,
Achatlu muchatlu... Thaanaasinche,

Mojullonaa chinnadheee,
Neeve thaanu annadhi,
Kalale vindhu chesene,
Neetho pondhu korene,
Vundaaalaniiii ii ii ii,
neethodu cherindhi le.. eenaadu sarasaku

Ninnu kori....  varnam varnam
Sari sari kalisene nayanam nayanam

Urikina vaagalle,
Tholakari kavithalleee,
Thalapulu kadhilene,
Cheli madhi Virisene,
Ravikula raghu raamaa..
Anudhinamu.. Ninnu kori.... varnam Varnam
Sari sari kalisene nayanam nayanam

Eee veenaa meetedhi.. neevenantaa
Naa thalapu.. naa valapu.. Needhenantaa
Paruvaala paradhaalu.. Theese pootaa,
Kalavaali.. karagaali.. Neeelonantaa,
Palikinchaali swaagatham,
pandinchaali jeevitham,
neeku naaku e kshanam,
Kaani raaga sangamam,
Nee jnaapakammmmm... 
Naa lona saagenu le ee vela sarasaku,

Ninnu koriiii iiii iiii  varnam varnam
Sari sari kalisene nayanam nayanam

Urikina vaagalle,
Tholakari kavithalleee,
Thalapulu kadhilene,
Cheli madhi Virisene,
Ravikula raghu raamaa..
Anudhinamu.. Ninnu korii iiii iii iii varnam Varnam
Sari sari kalisene nayanam nayanam

Tuesday, 3 May 2016

Samveda - All Episodes


Samveda - All Episodes at a place

Samveda - Part - 1

Samveda - Part - 2

Samveda - Part - 3

Samveda - Part - 4

Samveda - Part - 5

Samveda - Part - 6

Samveda - Part - 7

Samveda - Part - 8

Samveda - Part - 9

Samveda - Part - 10

Samveda - Part - 11

Samveda - Part - 12

Samveda - Part - 13

Samveda - Part - 14

Samveda - Part - 15

Samveda - Part - 16

Samveda - Part - 17

Samveda - Part - 18

Samveda - Part - 19

Samveda - Part - 20

Samveda - Part - 21

Samveda - Part - 22

Samveda - Part - 23

Samveda - Part - 24

Samveda - Part - 25

Samveda - Part - 26

Samveda - Part - 27

Thursday, 3 March 2016

Janaki Kalaganaledu Song lyrics from Rajakumar

Janaki kalaganaledu ramuni sathi kagalanani yenadu…
Ramudu anukoledu janaki pathi kagalanani aanadu
Aanadu yevaru anukonidi eenadu manaku nijaminadi
Aa ramayanam mana jeevana parayanam (ramudu)

Cheli manase siva dhanusinadi tholi chupula vashaminadi
Valapu swayamvaramaiappudu geluvanidi yedi
Oka banam oka bharyannadi sriramuni sirayasaminadi
Srivaru aa varamisthe sirulanni naavi
Tholi chukkavu neeve chukkanivi neeve
Thudi daaka neeve marujanmaku neeve

Sahavasam manaku nivasam sarihaddu neelakasam
Prathipoddu pranayavesam pedavulapai hasam
Sumasaram mana samsaram
Maniharam mana mamakaram
Prathiroju oka srikaram pravasha srungaram
Gathamante neeve kadhakanidi neeve
Kalalanni neeve kalakalam neeve

Wednesday, 2 March 2016

Samveda - 26

కస్తూరితో పాటు కైలాష్  కూడా  కింది వరకు వెళ్ళాడు. కస్తూరితో అన్నాడు " చాలా థ్యాంక్స్ కస్తూరి అనుకోకుండా బయటకి వెళాల్సి వచ్చింది "

" ఇందులో థ్యాంక్స్ ఎందుకు ఈసారి మీరేదైన అనుకోని పని మీద వెళ్ళాల్సి వస్తే నాకు ఫొన్ చేయండి నేను వస్తాను"

"తప్పకుండా"

"మరి నేను వెళ్ళొస్తాను . వేద కి చెప్పండి కుదిరితే సాయంకాలం వస్తాను లేకపొతే రేపు పొద్దున్న ఆఫీస్ కి వెళ్ళేముందు కలుస్తాను"

"సరే చెప్తాను" 

కస్తూరి వెళ్ళంగానే కైలాష్ మేడ మీదకి వచ్చాడు. తను వచ్చేసరికి వేద పరధ్యానంగా ఉండడాన్ని గమనించాడు.

"వేద ఇప్పుడెలా ఉంది ఒంట్లో"

"ఇప్పుడు కొంచం పర్వాలేదు. చాలా వరకు నీరసం తగ్గింది."

"సరే నేను ఇడ్లి తెచ్చాను. ప్లేట్ లో పెట్టి తీసుకొని వస్తాను తిందువుగాని"

"నాకిప్పుడేం వద్దు కైలాష్ కస్తూరితో పాటు మళ్ళీ ఇంకో  గ్లాసు పాలు తాగాను. నాకు ఆకలిగా లేదు ఇప్పుడేమి తినలేను అక్కడ టబుల్ మేద పెట్టి వెళ్ళు నేను తరువాత తింటాను"

"తరువాత అంటే కాదు ఇప్పుడు టిఫిన్ తిని టాబ్లెట్ వేసుకోవాలి. ఇప్పుడిప్పుడే జ్వరం తగ్గుమొఖం పడుతోంది నువ్వు మళ్ళి ఇలా మొండికేసావంటే తిరగబెడుతుంది. కాబట్టి నా మాట విని ఇప్పుడు టిఫిన్ తిను. అంతగా ఆకలి లేకపొతే ఒక ఇడ్లీ అన్న తిని టాబ్లెట్ వేసుకో." 

వేద ఏం మాట్లాడకపోయేసరికి మళ్ళీ కైలాష్ అడిగాడు "ఏంటి సరేనా"

"సరే"   

       వేద మాట్లాడిన తీరు కైలాష్ ని కలవరపెట్టింది. ఆమె మాటలు చాలా ముభావంగా ఉన్నాయి. ఆ విషయం చాలా స్పష్టంగా అర్ధం అయిపోతోంది. నిన్నంతా బానే మాట్లాడింది మళ్లీ ఈరోజు పొద్దున్నే ఏమయింది. చాహ్నవి ని చూసేసరికి అలా రియాక్ట్ అయిందా ఏంటి? అయిన సరే తను ఇప్పుడు వేద ముభావంగా ఉందని వదిలేస్తే తను ఇంతవరకు పడిన శ్రమ అంతా వృధా అయిపోతుంది. ఎలాగైనా తన మూడ్ ని మార్చాలి అనుకున్నాడు.

 కైలాష్ టిఫిన్  ప్లేట్లో పెట్టి తీసుకొచ్చాడు.ప్లేట్ వేద కిస్తూ అన్నాడు ఇది తినేసి టబ్లెట్ వెసుకున్నావంటే మళ్ళి మధ్యాహ్నం దాక పర్వాలేదు తీస్కొ.వేద ప్లేట్ తీసుకుంది నెమ్మదిగా తింటోంది.

ఇంతలో కైలష్  ఫోన్ రింగ్ అవడంతో తీసి చూసాడు. వాళ్ల అమ్మ దగ్గర నుండి వచ్చిన ఫోన్ అది. తలుపు దగ్గరకేసి బయటకి వెళ్లాడు మాట్లాడడానికి.

          వేద టిఫిన్ తింటోందన్న మాటే గాని కస్తూరి అన్న మాటల గురించే తీవ్రంగా ఆలోచిస్తోంది. కస్తూరి అన్నదాంట్లో తనకి తప్పేమీ కనిపించట్లేదు . కానీ కస్తూరి కి విషయం తెలియడం వేద కి ఇష్టం లేదు. కస్తూరికనే కాదు ఎవరికి తెలియడం ఇష్టం లేదు. ఎలాగో కొన్ని రోజులలో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది తను ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది అలాంటప్పుడు ఈ విషయాలన్ని బయటకి రావడం అనవసరం. ఈ విషయం చర్చనీయాంశం కాకుండా తను జాగ్రత్త పడాలి. కస్తూరి అనే కాదు కైలాష్ తనని చూసుకునే విధానం చూస్తే ఎవరికైనా అనుమానం తెప్పిస్తుంది అది అంత మంచిది కాదు. కైలాష్ ని స్వీకరించడానికి మనసు అంగీకరించనప్పుడు అందరికి ఈ విధంగా అటెన్షన్ కలిగించడం అనవసరం. ఇంక ఇప్పటినుండి కొంచం జాగ్రత్తగానే ఉండాలి.వేద మనసు చాలా అలజడికి గురి అవుతోంది. ఇంతలో ఫోన్ మాట్లాడి వచ్చాడు కైలాష్. వస్తూనే చూసాడు వేదని. ఏదో చాలా దీర్ఘంగా ఆలోచిస్తోంది కనీసం తను వచ్చింది కూడ గమనించలేదు అంతే కాదు ప్లేట్లో పెట్టిన ఇడ్లీ పెట్టినట్టే ఉంది ఒక్కటి కుడ తినలేదు.

"ఏంటి టిఫిన్ తినకుండా అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావ్? ఇందాక నేను కస్తూరి ని పంపించి వచ్చినప్పుడు కూడా గమనించాను అప్పుడు కూడా ఏదో ఆలొచిస్తునట్టున్నావ్ అంత దీర్ఘం గా ఆలొచించడానికి ఏముంది? "

అతని మాట వినిపించగానే తలెత్తి చూసింది. అతనన్నదేంటో పుర్తిగా వినలేదు "ఏంటి"

"టిఫిన్ తినకుండా అంత దీర్ఘంగా దెని గురించి ఆలొచిస్తున్నావ్ అంటున్నా"

"ఏంలేదు"

"సరే త్వరగా తిను మళ్ళీ చల్లారిపోతుంది"

వేద టిఫిన్ తినగానే కైలష్ ప్లేట్ తీసేసాడు మంచి నీళ్ళతో పాటు టాబ్లెట్ కూడా తెచి ఇచ్చాడు.

"ఇది వేసుకొని మంచి నీళ్ళూ తాగు"

వేద టాబ్లెట్ వేసుకుంది.

 "ఇంక ఆలొచనలన్నీ మానేసి కొంచం సేపు కళ్ళు మూసుకొని పడుకో. నిద్ర పోకు ఊరికే రిలాక్స్ అవ్వు. నేను కిందకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఒక అరగంటలో వస్తాను. సరేనా"

వేద అలాగే అనట్టు తల ఊపింది. కైలష్ కిందకి వెళ్ళగానే కళ్ళు మూసుకొని పడుకుంది.

హాస్పిటల్ నుండి వచ్చి చాలా సేపయింది. ఇంత వరకు స్నానం చెయలేదు. కైలష్ కి చిరాగ్గా ఉంది అందుకే స్నానం చేసి ఫ్రెష్ అవుదామని కిందకి వచ్చాడు. ఇందాక వాళ్ళ అమ్మ ఫోన్ చేసినప్పుడు చెప్పింది ఇవాళ సాయంత్రానికి బయలు దేరి వస్తునట్టు. కాబట్టి ఇవాళ మధ్యహ్నం లంచ్ తెప్పించుకుంటే సరిపోతుంది అనుకున్నాడు. 

కైలష్ చెప్పినట్టుగానే వేద ఒక పదిహేను నిమిషాల వరకు కళ్ళు మూసుకొని పడుకుంది. అప్పటికే చాలా సేపయినట్టు అనిపించింది. ఇంక ఎక్కువ సేపు పడుకోలేకపోయింది. అలా ఊరికే పడుకొవడం చాలా బోర్ గా ఉంది. నిన్నటి నుండి సెల్ స్విచ్ ఆఫ్ అయిపొవడంతో ఏం తొచట్లేదు. పక్కనే ఏదో పుస్తకం ఉంటే తిరగేస్తోంది.పుస్తకం పట్టుకున్నా తనని ఆలోచనలు అసలు వదలడం లేదు. తనకి స్ప్రుహ వచ్చినప్పటి నుండి చూస్తోంది. కైలాష్ తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు . ఇప్పటికే ఇలా అయిదు రోజులు అయ్యింది. ఇంకా ఇంకా తన సాయం పొందడానికి మనసు అంగీకరించట్లేదు.  కైలాష్ కి వొద్దని చెప్పిన కూడా పెద్ద ప్రయోజనం కనిపించట్లేదు. ఆ విషయం తనకి నిన్ననే అర్ధం అయ్యింది. వేద కి తెలుసు తను ఎలాంటి పరిస్తితి లో కూడా కైలాష్ ని క్షమించదని. అలాంటప్పుడు వీళ్ళ దగ్గర సహాయం తీసుకోవడం అనవసరం. అసలు ఇలాంటి పరిస్దితి తెచ్చుకునందుకు తనని అనాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి పరిస్దితి వస్తుందని తను అసలు ఊహించలేదు. ఇక మీదట ఆరొగ్యం విషయం లో చాలా జాగ్రత్త గా ఉండాలి. 
ఈలోగా కైలాష్ ఫ్రెష్ అయ్యి వచ్చాడు. వస్తూనే వేదని చూస్తూ అడిగాడు "ఏంటి పడుకోమంటే ఏదో పుస్తకం ముందు పెట్టుకుని కూర్చున్నావ్"

కైలష్ ని చూస్తూ అంది "ఏం లేదు ఊరికే బోర్ కొడ్తోంది అందుకే"  
  
"సరే గాని ముందు ఆ కాలికి తగిలిన దెబ్బని చూడని ఎంతవరకు తగ్గిందో చూస్తాను. అవసరం అయితే ఇంకో కట్టు కడతాను లేకపోతే ఆది తీసేసి మందు రాస్తాను"

"ఏంటిది"

"కాలికి తగిలిన దెబ్బని చూడని ఎంతవరకు తగ్గిందో చూస్తాను. అవసరం అయితే ఇంకో కట్టు కడతాను లేకపోతే ఆది తీసేసి మందు రాస్తాను"

"నొప్పి తగ్గిపోయింది  ఇంకో కట్టు అవసరం లేదు"

"వేద అది నన్ను చెప్పని. తగ్గిపోతే నేను మాత్రం ఎందుకు కట్టు కడతాను"

వేద నెమ్మదిగా కాలు ముందుకి జరిపింది. కైలాష్ మంచం మీద కూర్చుని కాలికున్న కట్టు విప్పాడు. చాలా వరకు దెబ్బ తగ్గింది ఇంక కట్టు కట్టాల్సిన అవసరం లేదు ఆయంట్‌మెంట్ రాస్తే సరిపోతుంది అనుకున్నాడు .

వేద తో అన్నాడు "ఇంక కట్టు అవసరం లేదు ఆయంట్‌మెంట్ రాస్తాను సరిపోతుంది"

కాలు పక్కన పెట్టి ఆయింట్మెంట్ తీసుకొని రావడానికి వెళ్ళడు "కదలకుండా కుర్చో ఇప్పుడే వస్తా" అని చెప్పి వెళ్ళి ఆయింట్మెంట్ తెచ్చాడు. కైలాష్ వేద కాలికి ఆయంట్‌మెంట్ రాసాడు. "కొంచంసేపు ఎక్కడికి కదలకుండా కూర్చో".

కొంచం సేపయ్యక అడిగాడు " వేద జరిగిన పొరపాటుకి క్షమించలేవా? నీ విషయం లో నేను చేసింది తప్పే నేను కాదనను కాని అది తెలియకుండా జరిగిపోయింది. ఆ రోజు నేను మీ అక్క మీద ఉన్న కోపం నీ మీద చూపించాను .నువ్వేం చెప్తున్నా వినిపించుకోలేదు. కనీసం వినే ప్రయత్నం కూడా చేయలేదు. నిజమే ఒప్పుకుంటున్నాను నా వల్ల నువ్వు మానసికంగా చాల బాధ పడ్డావ్. నువ్వే కాదు నేను చేసిన తప్పు తెలుసుకున్నాక నేను కూడా చాలా బాధపడ్డాను. కాని నువ్వు ఎక్కడున్నావో తెలియకపోవడం వల్ల నిన్ను వెంటనే కలుసుకోలేకపోయాను. మీ అక్క వ్యక్తిత్వానికి నీ వ్యక్తిత్వానికి చాలా తేడ ఉంది.నీ గురించి తెలుసుకున్నాక నేను చేసిన పని తప్పు కాదని నాకు అనిపించింది. నీ లాంటి అమ్మాయి నా భార్య అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అది నేను మాటల్లో చెప్పలేను. జరిగినదాన్ని మనం ఎలాగో మార్చలేము దాని గురించె ఆలొచించి మనసు పాడు చెసుకునేకొంటే జరిగిన దాన్ని అంగీకరించి సరి అయిన నిర్ణయం తీసుకుంటే మన ఇద్దరం కొత్త జీవితం ప్రరంభించచ్చు."

వేద మొహం తిప్పుకుంది . వేదకి కైలష్ ఆ టాపిక్ ఎత్తడం నచ్చలేదు. కైలాష్ ఎంత చెప్పిన, ఎన్ని సార్లు క్షమించమని అడిగిన తను జరిగిందంతా మరచిపోయి తనని క్షమించడానికి  సిద్దం గా లేదు.  మొన్న రాత్రంతా ఈ విషయం మీద ఘర్షన జరిగింది. మళ్ళీ మళ్ళీ ఆ విషయం మాట్లాడడం తనకి ఇష్టం లేదు. తనకి తెలుసు ఆ విషయం ఎత్తితే తన మాటలు చాల పరుషంగా ఉంటాయి. ఈ అయిదు రోజుల నుండి తనను చాలా జగ్రత్తగా చూసుకుంటున్నాడు . ఇప్పుడు వేద పరిస్తితి ఎలా ఉందంటే తనతో కోపంగా మాట్లాడగలిగినా పరుషంగా మాట్లాడలేదు. దీని గురించే తను మొదటినుండి భయపడింది వీళ్ళ సాయం తీసుకోవడానికి . కాని తనకి తెలియకుండా అంతా జరిగిపొయింది. కైలాష్ ని క్షమించడం అంటూ ఎలాగో జరగదు. తను క్షమించలేదు కూడా. ఇప్పుడు మళ్ళీ విషయం పొడిగిస్తే  గొడవ పడడం తప్ప ఏం ప్రయొజనం ఉండదు. ఈ విషయం పొడిగించకుండా ముందు టాపిక్ మార్చాలి అనుకుంది.వేదకి తెలుసు కైలాష్ చాహ్నవి గురించి నిన్న చెప్పిందంతా అబద్ధమని. అదే నిజమైతే మళ్ళీ మళ్ళీ ఈ టాపిక్ తన దగ్గర తీసుకొని రాడు.అయినా టాపిక్ మార్చడానికి అంది.

"అయినా ఇప్పుడు ఈ విషయాలు అన్ని ఎందుకు  . నువ్వు ఎలాగో చాహ్నవి కి ఇంకో ఎనిమిది నెలలలో ప్రపోజ్ చెస్తా అన్నావు గా. మళ్ళి ఈ టాపిక్ ఎందుకు. నువ్వు చాహ్నవి కి ప్రొపోజ్ చెస్తూ మళ్ళి నా దగ్గర ఈ విషయాలు మాట్లాడితే ఏం బాగుంటుంది చెప్పు "

వేద అలా అడిగెసరికి కైలాష్ కి ఎమనాలొ అర్ధం కాలేదు. "వేదా.."

"అవును నువ్వే చెప్పావు గా నీకు చాహ్నవి  అంటె ఇష్టమని. నువ్వు తనకి ప్రపోజ్ చేస్తానని. మరి నేనన్నదాంట్లో తప్పేముంది. అదీ గాక మీ ఇద్దరి జంట చూడడానికి బావుంటుంది. సో మీరిద్దరు హాపీ గా పెళ్ళి చేసుకోండి"

కైలాష్ కి ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. "నిన్నంటే ఏదో వేదని సరదాగ ఏడిపిద్దామని అది గాక తను అసలు తన గురించి ఏమనుకుంటుందో తెలుస్తుందని ఆ విషయం ఎత్తాడు. వేదలో మార్పు చూసి సంతోషించాడు. ఆ విషయం అక్కడితో వదిలేసాడు. అసలు చాహ్నవి సంగతే మర్చిపొయాడు. కాని ఇవ్వాళ ఈ విషయం ఎత్తగానే వేద దాని గురించి మాట్లడుతుందని ఊహించలేకపొయాడు. తనకి అర్ధం అయ్యింది వేద తనని ఇరకాటం లొ పెట్టిందని. చాహ్నవి గురించి తను చెప్పింది నమ్మలేదని. తనన్న మాటలు తనకే తిప్పి కొడుతోందని, ఎంత తొందరగ వీలైతే అంత తొందరగ చాహ్నవి విషయంలో స్పష్టత వస్తే గాని వేద ఈ విషయం ముందుకి సాగనివ్వదని అందుకే అన్నాడు

"సరే నీకు అర్ధం అయ్యిందని నాకు అర్ధం అయ్యింది. నిన్న నేను చాహ్నవి గురించి చెప్పింది అంతా అబద్ధం. చాహ్నవి నాకు ఒక కొలిగ్ మాత్రమే"

"అబద్దమా అదేంటి నేను నిజమనుకున్నానే. అయినా నువ్వంత సిన్సియర్ గా చెప్పావ్ అది అబద్ధం ఎలా అయింది.అంటే మీరిద్దరు  పెళ్ళి చెసుకోరా ?"

"వేద.."

"చెప్పు కైలష్..."

కైలాష్ కి ఏం చెప్పాలో అర్దం కాలేదు. వేద కి కైలాష్ తడబాటు చూస్తుంటే నవ్వు వస్తోంది. దాచుకొవడానికి ప్రయత్నిస్తోంది.

"నాకు తెలుసు. నువ్వు చెప్పింది అబద్ధం అని. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి. నీ అబద్ధం అతకలేదు సరి కద నమ్మేటట్టు లేదు కూడ"

"ఏదో ట్రై చేసాను వర్క్ ఔట్ అవలేదు వొదిలెయ్"

"సరే గాని చాహ్నవి ని దించావా"

"హా దించాను. ఇప్పటికే లేట్ అయ్యింది కదా మళ్ళి ఇవాళ నైట్ డ్యూటీ ఉంది ఇప్పుడు పడుకుంటే కాని రాత్రి పని చేయలేదు. ఇంకోసారి వీలుంటే నిన్ను కలుస్తానని చెప్పమంది "

"పరవాలేదులే. తనకి కుదిరితేనే రమ్మను."

వేద సడెన్ గా టాపిక్ మార్చడంతో కైలాష్ అడిగినదాని ప్రతిస్పందన రాలేదు. మళ్ళీ ఈ విషయం ఎలా మొదలెట్టాలో అర్ధం కాలేదు.

ఇంతలో వేద అంది "నిన్నొక విషయం అడగనా?"

వేద ఏమడుగుతుందా అని కైలాష్ ఆసక్తి గా చూస్తున్నాడు.

వేద ఎమడిగేదో గాని కాలింగ్ బెల్ వినిపించెసరికి అనింది కైలష్ తో

"ఎవరో వచ్చినట్టు ఉన్నారు "

"నేను చుస్తానుండు" అని కైలాష్ వెళ్ళాడు.

కైలాష్ కి చాలా నిరాశ గా అనిపించింది. వేద ఏమడిగేదో ఎంత ఆలోచించినా అర్ధం కాలేదు. ఆ వచ్చిన వాళ్ళెవరో కొంచం సేపయ్యాక రాకూడదా అనుకున్నడు తలుపు తీస్తూ .

గుమ్మం లొ హరి వాళ్ళు ఉన్నారు.

"మీరా రండి"

"ఎలా ఉంది ఇప్పుడు వేద కి"

"తగ్గింది స్ప్రుహ వచ్చింది"

"హాయి అంకుల్" అంది రేవ

"హాయి" అంటూ రేవ ని ఎత్తుకున్నాడు. "రండి లొపలికి మరి గుమ్మంలో నిలబెట్టి మాట్లడేస్తున్నాను"

"పర్వాలేదు. వేద ఎక్కడ ఉంది?"

"వేద లోపల రూంలో ఉంది"

హరి, మాలతి బెడ్ రూం లోకి వెళ్ళారు. కైలాష్ కూడా రేవ ని తీసుకొని వెళ్ళాడు.

వేద ని చూస్తూనే అదిగాడు హరి "ఎలా ఉంది వేద?"

"రా అన్నయ్య. ఇప్పుడు బానే ఉంది చాలా వరకు తగ్గింది" పక్కన ఉన్న కుర్చీని చూపించి చెప్పింది హరితో "కుర్చో అన్నయ్య"

ఇంతలో రేవ కైలాష్ నుండి కిందకి దిగి వేద దగ్గరికి వచ్చింది "నీకు జ్వరం వచ్చింది కద తగ్గిపొయిందా"

"ఓ ఎప్పుడో తగ్గిపొయింది"

కైలాష్ అన్నాడు "మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను" అంటూ కైలష్ కిందకి వెళ్ళాడు. వాళ్ళ అన్నయ్య కి ఫోన్ చేసాడు. అతను రావడానికి ఇంకో వారం రొజులన్నా పడుతుందని చెప్పాడు. హంస వాళ్ళ నాన్న ఆరొగ్యం గురించి అడిగాడు.

"ఇందాకే అమ్మ ఫోన్ చేసింది మామాయ్యకి బాగానే ఉందంట వాళ్ళు ఇవాళ్ళ సాయంత్రం బయలుదేరి వస్తామన్నారు"

"సరే ఏమైన అవసరం అయితే ఫోన్ చేయి. నేను ఇక్కడ ఒక  కేస్ విషయం లో కొంచం బిజీ గా ఉన్నాను. ఒకవేళ నీ ఫోన్ లిఫ్ట్ చేయకపొతే కంగారు పడకు ఫ్రీ అయినప్పుడు నేనే చెస్తా"

"అలాగే"

"నువ్వు ఎప్పుడు వస్తున్నావ్?"

"ఇంక తెలీదు. ఈ కేస్ విషయం తేలేవరకు ఏం చెప్పలేను ఇంకో పది రొజులు పట్టొచు. అమ్మకి చెప్పు" 

"సరే అన్నయ్య ఉంటాను మరి"

"సరే" 

ఎలాగో హరి వాళ్ళు ఉన్నారు కదా అని తను హల్లో టి.వి చూస్తూ కూర్చున్నాడు కొంచం సేపయ్యాక వెళ్ళొచని.

"వేద నా మాట విను నిన్ను ఎన్ని సార్లు మాతో ఉండమని చెప్పిన నువ్వు వినిపించుకోలేదు కనీసం ఇప్పుడన్నా మాతో రా"

"ఎందుకన్నయ్యా నీకు అనవసరమైన శ్రమ నాకు ఇప్పుడు బాగానే ఉంది చాలా వరకు తగ్గిపొయింది."

"అంటే రానంటావ్?"

"అన్నయ్యా ప్లీజ్ తప్పు గా అనుకోకు నాకు ఎందుకో ఎక్కడికి వెళ్ళాలని లేదు."

"సరే నీ ఇష్టం కాని నీకు తెలుసుగా నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావొచ్చు"

"ఆ విషయం నువ్వు చెప్పాలా"

"అవును ఎన్ని సార్లు ఫోన్ చేసిన నీ ఫోన్ ఎంటి స్విచ్ ఆఫ్ అని వస్తుంది"

"అదా ఫోన్ లో చార్జింగ్ అయిపోయింది చార్జెర్ ఆఫిస్ లొ ఉండిపోయింది రేపు వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి"

"పొని నేను వేరే చార్జెర్ కొనుక్కుని రానా" 

"ఎందుకన్నయ్యా ఎంత కాదన్నా ఈ ఫోన్ కంపని చార్జెర్ రెండు వేల దాక ఉంటుంది బయట పిచివి దొరుకుతాయి గాని అవి వాడడం నాకు ఇష్టం లేదు. రెపు నేను వెళ్ళగలిగితే నేనే తెచుకుంటా లెకపొతే కస్తూరి ని ఇంటికి వెళ్ళెటప్పుడు చార్జెర్ తెచ్చివమని చెప్తాను"

"సరే"  

అప్పటికే మధ్యాహ్నం అయ్యింది. కైలాష్ హరి వాళ్ళని కూడా అడిగి లంచ్ తెప్పిద్దామనుకున్నాడు. అందుకె టి.వి బంద్ చెసి పైకి వెళ్ళాడు.

"హరి గారు నేను లంచ్ తెప్పిస్తున్నాను మీకు కూడా తెప్పించమంటారా"

ఇంతలో మాలతి అంది "బయటనుండి తెప్పించడం ఎందుకు మీకు అభ్యంతరం లెకపొతే నేను ఒక అరగంట లో వండేస్తాను"

"ఎందుకొదినా నీకు అనవసరమైన శ్రమ"

"శ్రమ లేదు ఏం లేదు మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఒక అరగంటలో వంట చేసేస్తాను."

మాలతి ఆ మాట అనడంతో కైలాష్ కూడా అక్కడె ఉండిపొయాడు.
         
వేద కోసమని మిరియాలతో రసం పెట్టింది. వాళ్ళూ భొజనం చేసేసరికి రెండు అయ్యింది. 

సాయంత్రం ఆరింటి వరకు కూర్చుని బయలుదేరారు హరి వాళ్ళు. వాళ్ళు బయలుదేరుతుంటే వేద కూడా వాళ్ళతో పాటు గుమ్మం దాక వెళ్దామని మంచం దిగడానికి ప్రయత్నిస్తోంది . అది గమనించి అడిగాడు కైలాష్ "ఇప్పుడు మంచం దిగడం దేనికి బయట చలిగాలి ఉంది. వాళ్ళని నేను పంపించేసి వస్తాను "

"గుమ్మం వరకు వస్తాను. కొంచం నడిచినట్టు ఉంటుంది." 

"ఇప్పుడు వద్దు వాళ్ళు వెళ్ళిన తరువాత నడుద్దువుగాని. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు గమనిచారంటే దాని గురించి వివరాలు అడుగుతారు తరువాత నీ ఇష్టం"

ఆ మాట తొ వేద ఆగిపొయింది కైలాష్ చెప్పింది కూడా నిజమే అనిపించింది.