Tuesday, 9 September 2014

Samveda - 24

వేద ఇంకా పడుకునే ఉండేసరికి కైలాష్ మళ్ళి కిందకి వెళ్లి ఒక పాల ప్యాకెట్ ఇంకా కొన్ని పండ్లు తీసుకొని పైకి వచ్చాడు. అన్ని ఎక్కడివక్కడ సర్దాడు. కొంచం సేపు హాల్ లోకి వెళ్లి టి.వి పెట్టుకున్నాడు. ఇంతలో ఏదో అలికిడి అవ్వటంతో లేచి వెళ్లి చూసాడు. వేద అప్పుడే లేచినట్లు ఉంది.

"గుడ్మోర్నింగ్" అన్నాడు

వేద కి ముందు అతనక్కడ ఎందుకు ఉన్నాడో అర్ధం కాలేదు. తర్వాత మెల్లగా అంత గుర్తొచ్చింది.

"గుడ్మోర్నింగ్. నువ్వు ఇవాళ హాస్పిటల్ కి వెళ్ళలేదా" అని అడిగింది. వేద కి ఇంకా కైలాష్ సహాయం తీసుకోవడం ఇష్టం లేదు. ఇప్పటికే మూడు రోజులనుండి చూసుకుంటున్నాడు. అప్పుడంటే తనకి స్పృహ లేదు ఇప్పుడు స్పృహ వచాక కూడా తన సహాయం తీసుకోవాలంటే మనసోప్పుకోవడం లేదు.ఇలా తన నుండి సహాయం పొందుతూ ఉంటే తనకి రుణ పడిపోతుంది. అది ఆమెకి ఇష్టం లేదు. అసలు ఇద్దరి మధ్య పరిచయం పెరగడమే ఇష్టం లేదు అలాంటిది సహాయం దాక వచిందంటే కొంచం కష్టం గా ఉంది. ఇలాంటప్పుడు తన అయిష్టాన్ని స్పష్టంగా పూర్తిగా వ్యక్తం చేయలేదు తను చేసిన సహాయం అది వ్యక్తం చేయనీయకుండా అడ్డుగా నిలుస్తుంది. అది ఆమెకి అస్సలు ఇష్టం లేదు. అందుకే ఇంకా ఇక్కడితో తన నుండి సహాయం తీసుకోవడం ఆపేద్దమనుకుంది అందుకే అలా అడిగింది.

"అదేంటి అలా అడిగావ్?"

"అంటే ఇవ్వాళ శనివారం కదా నీకు హాస్పిటల్ ఉంటుందని తెలుసు. అందుకని. నువ్వు ఇంకా అనవసరంగా శ్రమ తీసుకోకు. ఐ యాం ఫైన్."

"అంటే నన్ను పరోక్షంగా ఇక్కడనుండి వెళ్ళిపో అని చెప్తున్నావన్నమాట" అన్నాడు నవ్వుతూ

ఆ మాటకి కొంచం తడబడ్డా వెంటనే అంది "అదేం కాదు కస్తూరి వస్తుంది కదా నీకెందుకు శ్రమ అని"

"నాకేం శ్రమ లేదు గాని నీకో బాడ్ న్యూస్ ఇవ్వాళ కస్తూరి రాదు సాయంత్రం దాక నువ్వు నా మొహం చూడక తప్పదు"

"రాదా ఎందుకు"

"తన పెళ్లి కార్డ్స్ పంచుతోంది ఫ్రెండ్స్ కి ఇందాక ఇంటికి వచ్చింది అప్పటికి నువ్వింకా లేవలేదు. కుదిరితే సాయంత్రం వస్తా అంది లేకపోతె రేపు సాయంత్రం అయిన వస్తుందంట" అంటూ వేద ని ఎత్తుకున్నాడు.

"ఏంటిది దింపు నన్ను"

"ఊరికే కంగారు పడకు నేనేం అంత చెడ్డవాడిని కానులె కొంచం మంచివాడినే" అంటూ తీసుకెళ్ళి రెస్త్ రూం లో దింపాడు. "స్నానం చేయకు మొహం మాత్రం కడుక్కో మళ్ళి చలి వేస్తుంది" అని చెప్పి వెనుతిరిగాడు.

ఇందాక తెచిన పాల ప్యాకెట్ తీసి స్టవ్ మీద పెట్టాడు. పాలు కాగాక కొంచం హార్లిక్స్ కలిపాడు.

ఈలోపు వేద తలుపు చప్పుడు చేయడంతో వెళ్లి తలుపు తీసి వేద ని మంచం మీద కూర్చోపెట్టాడు.

"కాలు నొప్పి తగ్గిందా"

"ఆ నిన్నటి తో పోల్చుకుంటే చాలా వరకు తగ్గింది. ఒకసారి నడిచి చూసేదా"

"వొద్దు ఈ రోజు పోనీ రేపు నడుద్ధువు గాని" అని చెప్పి వెళ్లి ఇందాక కలిపిన హార్లిక్స్ తెచ్చాడు.

"ఇందా కొంచం హార్లిక్స్ తాగు"

"వద్దు నాకిప్పుడెం తాగాలని లేదు."

"అదేంటి. ఇందాక పొద్దున్న మూడింటికి ఆకలేస్తోందన్నావ్. నేను సూప్ కూడా కొంచమే ఇచ్చాను. ఇప్పుడు ఇది తాగు"

"నాకేం వద్దు"

"మళ్ళి మొదటికి వచ్చావా. వేద నీకెన్నిసార్లు చెప్పను నా మీద ఉన్న కోపాన్ని తీర్చుకోవడానికి ఇది సమయం కాదని ముందు నువ్వు కోలుకుంటే ఆ తరువాత నీ ఇష్టం."

"ఇప్పుడు నేను బాగానే ఉన్నాను"

"ఓహో అది చెప్పాల్సింది నేను నువ్వు కాదు. తాగు"

"నాకొద్దు. ఇప్పటికే నువ్వు చాలా చేసావు ఇంక చాలు. ఇంకా నీ దగ్గర సహాయం పొందడం నాకు ఇష్టం లేదు"

"నీకు ఇష్టం ఉండాలని నేనేం చేయటం లేదు. ఒంట్లో బాలేదని చేస్తున్నాను నీకు తగ్గిన తరువాత నువ్వు సహాయం చేయమన్నా చేయను. ఇప్పుడు నువ్వు మానమన్న మానను. ఇంకా ఆ టాపిక్ వదిలేసి ఈ హార్లిక్స్ తాగు"

వేద కి చాలా అసహనంగా ఉంది. సహాయం పొందడం తప్పని పరిస్థితి అటు గట్టిగా కాదని తిరస్కరించడానికి లేదు అలాగని అవునని ఒప్పుకోవాలని అనిపించడంలేదు.  ఏం చేయాలో అసలు తోచడం లేదు.

వేద పరిస్థితి అతనికి అర్ధం అవుతోంది. ఇలా చేయించుకోవడం ఆమెకి ఎంత మాత్రం ఇష్టం లేదని తెలుస్తూనే ఉంది. కాని అతను ఇన్ని రోజులు తనకి దగ్గరుండి చూసుకున్నందువల ఏమి గట్టిగా అనలేకపోతోంది.ఇలాంటి సమయం లోనే వేద కి దగ్గర కాగలదు. అతనికి తెలుసు ఇలాంటి అవకాశం మళ్ళి రాదనీ. దీన్ని చేయి జారనీయకుండా చూసుకోవాలి.

"ఏంటి ఆలోచిస్తున్నావ్ తాగు"

"హోర్లిక్సా వొద్దు. ఏదైనా సూప్ ఉందా"

"ఏంటి మళ్ళి సూపా రాత్రేగా తాగావ్. ఇప్పుడు మళ్ళి వొద్దు. ఈ హార్లిక్స్ తాగు"

వేద హార్లిక్స్ తీసుకొని తాగింది. గ్లాస్ ఇచ్చేసి చెప్పింది

"థాంక్స్" చెప్పింది.

"దేనికి"

"అదే హార్లిక్స్ ఇచ్చినందుకు"

"ఓహ్ అందుకా అయితే ఓకే నేనింకా నిన్ను కాలు కింద పెట్టకుండా చుసుకున్తున్నందుకు థాంక్స్ చెప్పవేమో అనుకున్నాను"

వేద చురుగా చూసింది.

"అలా చూడకు నాకు దిష్టి తగుల్తుంది"

అతనన్న తీరుకి నవ్వు వచ్చింది.

ఇంతలో కైలాష్ ఫోన్ మోగడంతో బయటకి వెళ్ళాడు మాట్లాడడానికి. మాట్లాడి లోపలి వచ్చేసరికి వేద రూం లో దేని కోసమో చూస్తోంది.

"ఏంటి చూస్తున్నావ్"

"ఏం లేదు నా ఫోన్ ఎక్కడుంది"

"అదా నిన్న అది స్విచ్ ఆఫ్ అయిపొయింది దాంట్లో ఛార్జింగ్ లేదు"

"ఛార్జింగ్ లేదా అదేంటి ఛార్జ్ పెట్టలేదా?"

"బావుంది ఒక పక్క నీకు జ్వరం తో ఒళ్ళు తెలియకుండా ఉన్నావని నేను ఆదుర్దా పడుతుంటే దాన్ని వదిలేసి ఫోన్ ఛార్జింగ్ పెట్టలేదా అని అడుగుతున్నావ్. పోనిలే ఏం చేస్తాం మంచికి రోజులు కావు. అయిన నీ ఫోన్ చార్జర్ ఎక్కడుందో నాకేం తెలుసు. అప్పటికి నీ హ్యాండ్ బాగ్ లో ఉందేమో అని నీ హ్యాండ్ బాగ్ వెతికా అందులో దొరకలేదు. ఇంకా ఎక్కడుందో నాకేం తెలుసు"

"నా హ్యాండ్ బాగ్ వెతికావా లేడీస్ హ్యాండ్ బాగ్ వాళ్ళ పర్మిషన్ లేకుండా ముట్టుకోకుడదని తెలిదా" అంది కోపం గా

"ఎందుకు తెలిదు. అందుకనే నేను ఎప్పుడు ఎవరి బాగ్ ముట్టుకోను తెలుసా"

"మరి నా బాగ్ ఎందుకు ముట్టుకున్నావ్"

"నేను ముట్టుకోను అన్నది లేడీస్ హ్యాండ్ బాగ్ నీది కాదు"

"అంటే.."

"అంటే నీకు అర్ధం కాదులే కాని చార్జర్ ఎక్కడుందో చెప్తే ఛార్జ్ చేస్తాను"

"అది మొన్న ఆఫీసు లో పెట్టి వచినట్టు ఉన్న. ఆఫీసు లోనే ఉండి ఉంటుంది"

"మరి చార్జర్ ఆఫీసు లో పెట్టుకొని ఫోన్ కి ఛార్జ్ పెట్టలేదని గోల చేస్తే ఎలా? పోనిలే దానికి ఒక రెండు రోజులు విముక్తి"

"నేనేం గోల చెయ్యట్లేదు. అయిన ఏమైనా ఇంపార్టెంట్ కాల్స్ వస్తే మిస్ అవుతాయి"

"అయితే ఒక పని చేయి నీ సిం తీసి నా ఫోన్ లో పెట్టుకొని వాడుకో నా దగ్గర వేరే ఫోన్ ఉంది."

"ఏం వొద్దు. అయినా నాది మైక్రో సిం నీ ఫోన్ లో అది పని చేయదు"

"అయితే ఇంకా నేనేం చేయలేను"

ఇంతలో డోర్ బెల్ మోగడంతో కైలాష్ బయటకి వచ్చాడు. ఎదురుగా కాంపౌన్డర్ భోజనం పట్టుకొచ్చాడు. కైలాష్ అతనికి ఇందాక ఫోన్ చేసి చెప్పాడు మధ్యాహ్నం ఇంటికి భోజనం తీసుకొని రమ్మని అందుకే తీసుకొచ్చాడు. అతను భోజనం తీసుకొని కాంపౌన్డర్ ని పంపించేసి లోపలికి వచ్చాడు. వంట రూం కి వెళ్లి రెండు కంచాలు తీసుకొని వచ్చాడు. భోజనాని దాంట్లో సర్దాడు. వేద కి ఇంకా తగ్గకపోవడం వల్ల ఒక్క చారు అన్నం మాత్రమె పెట్టాడు . మిగితాది తన కంచం లో పెట్టుకున్నాడు. వేద ప్లేట్ తీసుకొని పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి టేబుల్ ని మంచం దగ్గరకి జరిపాడు.

అప్పటిదాకా అతను చేస్తున్నదంతా వేద గమనిస్తూనే ఉంది. 

"ఏంటి ఇది"

"ఎంటేంటి భోజనం కనిపించట్లేద?"

"కనిపిస్తోంది కాని నేను అడిగానా?"

"నువ్వు అడిగావని నేను తేలేదు. ఇంద తిను"

"ఎలా కనిపిస్తున్నాను నీకు ఎన్నని తింటాను నాకొద్దు ఇందాకే గ్లాసుడు పాలు తాగాను ఇప్పుడు నాకు ఆకలి లేదు."

"పర్వాలేదు ఇప్పుడు కొంచం తిను మూడు రోజుల నుండి ఒంట్లో అన్నసారం లేదు. ఇది తింటే కొంచం ఓపిక వస్తుంది. ఇప్పుడు వొద్దు తినను అని మారాం చేయకుండా బుద్ధిగా తిను. చూడు నాకు ఆకలి వేస్తోంది పొద్దున్న ఎప్పుడో టిఫిన్ తిన్నాను. నువ్వు తింటే నీతో పాటు నేను తినేయొచ్చు లేకపోతే నేను కూడా ఆగాల్సి వస్తుంది అసలే నాకు తెగ ఆకలి గా ఉంది."

వేద ఏమనుకుందో ఏమో చారు అన్నం తినడం మొదలు పెట్టింది.  వాళ్ళు భోజనం ముగించేసరికి సాయంత్రం నాలుగు అయ్యింది. తినేసాక ప్లేట్లు అవి అన్ని తీసేసి సింక్ లో పడేసాడు కైలాష్.

"అవును పనమ్మాయి రావట్లేదేంటి. ఈ మూడు రోజులనుండి చూస్తున్నాను ఒక్క రోజు కూడా రాలేదు"

"వాళ్ళ అబ్బాయికి ఒంట్లో బాలేదని సెలవు పెట్టింది. ఎలా ఉందొ ఏమో మరి తెలిదు."

"అలాగ"

ఇంతలో కైలాష్ ఫోన్ మోగింది. ఒక్కనిమిషం అని చెప్పి బయటకి వెళ్ళాడు.

"హలో.. ఆ చాహ్నవి చెప్పు" అన్నాడు

అక్కడే వరకే వినిపించింది వేద కి. ఒక పది నిమిషాలయ్యాక తిరిగి వచ్చాడు.

వేద కి ఏమని అడగాలో, ఎలా అడగాలో తెలియలేదు. అయినా అడిగింది

"చాహ్నవి ఎవరు"

ఆమె అలా అడిగేసరికి ఆమెకేసి చూసాడు ఎందుకో ఆమెని ఏడిపిద్దాం అనిపించింది. అది గాక ఆమె తన గురించి ఏమనుకుంటుందో తెలుసుకునే అవకాశం అందుకే దీన్ని వదలదలుచుకోలేదు.

"ఏంటి?" అన్నాడు వినపడినా.

"అదే ఇప్పుడు ఫోన్ చేసింది కదా చహ్నవి ఎవరు"

"నా కొలీగ్. అయినా అదేంటి అలా అడిగావ్"

"ఏం లేదు ఊరికే"

"ఊరికేనా నేనింక నీకు చాహ్నవి అంటే జెలసి వచిందేమో అందుకే అడిగావనుకున్నాను"

"జెలసినా నాకెందుకు జెలసి ఊరికే అడిగాను అంతే"

"ఓహ్ అయినా నువ్వు మర్చిపోయినట్టు ఉన్నావు ఆ అమ్మాయిని నువ్వు ఒకసారి చూసావ్ గుర్తు లేదా?"

"నేను చూసానా ఎప్పుడు?"

"అదే ఒక రెండు వారాల క్రితం అనుకుంట ఆమెని నీకు పరిచయం చేసాగా రెస్టారెంట్లో"

"హా గుర్తుంది"

"గుర్తొచ్చిందా హమయ్య అవును ఒక విషయం అడుగుతాను చెప్తావా?"

"ఏంటి"

"ఆ అమ్మాయి మొహం నీకు గుర్తుంది కదా"

"హా గుర్తుంది"

"ఎలా ఉంది ఆ అమ్మాయి చూడడానికి"

"బావుంది"

"బావుందా. ఒట్టి బావుందని అంత నెమ్మదిగా అంటావేంటి. చాలా బావుంటుంది ఎంత అందంగా ఉంటుందో తెలుసా. ఆమెని ఒక్కసారి చూస్తే ఎవరు మర్చిపోలేరు. అంత బావుంటుంది. నీకొక విషయం తెలుసా ఆమెకి నేను ప్రొపోజ్ చేద్దామనుకుంటున్న. అంటే ఇప్పుడు కాదనుకో ఇంకా కొన్ని రోజులు అయ్యాక అదే మనకి ఇంకా ఎనిమిది నెలల వరకు టైం ఉంది కదా అప్పటిదాకా ఆగి ఆ తరువాత చెప్దామనుకుంటున్న ఎందుకంటే ఇప్పుడు చెప్పాననుకో మళ్ళి ఆమెని పెళ్లి చేసుకోవడానికి ఈ ఎనిమిది నెలలు ఆగమనాల్సి వస్తుంది ఆమె కారణం అడిగిన్దనుకో మన గురించి చెప్పాల్సి వస్తుంది. అప్పుడు మన గురించి చెప్పాననుకో ఆమెకి కూడా నా మీద సదభిప్రాయం కలగదు నీలాగా. ఆ అమ్మాయి కూడా నేను దుర్మార్గుడిని అని అనుకుంటుంది అది నాకు అవసరమా చెప్పు . అందుకే ఆగుతున్నా. ఈ ఎనిమిది నేలలయ్యాక ఆమెకి చెప్పేస్తా . నాకు తెలిసి ఆ అమ్మాయికి కూడా నన్ను ఇష్టపడుతోంది అనుకుంట. సో ఆ అమ్మాయి తరపు నుంచి అంతగా అబ్యంతరం ఉండకపోవచు. ఆ తరువాత మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. నేను చెప్పిందంతా విన్నావు కదా ఏమంటావ్ నేను చేస్తోంది కరెక్టే కదా. నిజంగా అయితే అసలు నిన్నే మా కోడలి గా తీసుకేల్దామనుకున్న కానీ నీకు అసలు నేనంటే సదిభిప్రాయం లేదని ఈ మూడు రోజులలో నాకర్ధమయ్యింది. అబ్బ ఎంత తిట్టుకున్నావ్ తెలుసా నన్ను నువ్వు నీకు స్పృహ లేనప్పుడు. ఇన్ని రోజులు నీలో ఎప్పుడో అప్పుడు మార్పు వస్తుందేమో నన్ను ఇష్టపదతావేమో అని అనుకున్నా. నిన్నటి వరకు కూడా అదే అభిప్రాయం తో ఉన్నా కానీ రాత్రి నీతో మాట్లాడాక  కానీ నా అభిప్రాయం ఎంత తప్పో అర్ధం కాలేదు. నిన్ను అనవసరంగా బాధ పెడుతున్నాననిపించింది. అందుకే నా మూర్ఖత్వం వదిలి ఆ అమ్మాయిని చేసుకున్దామనుకుంటున్న. నువ్వేమంటావ్ నేను చేస్తోంది కరెక్టే కదా. ఇంకా ఈ విషయం ఎవరితోనూ చెప్పలేదు. ఇవ్వాళా పొద్దుటి నుండి అలోచించి ఈ నిర్ణయానికి వచ్చా. ఆ నిర్ణయానికి  రాగానే చాహ్నవి గొంతు వినాలనిపించింది అందుకే కాల్ చేశా తను బిజీ గా ఉనట్టుంది అప్పుడు తు కాల్ కట్ చేసింది. అందుకే ఇందాక చేసి మాట్లాడింది." అన్నాడు. ఇదంతా చెప్తునప్పుడు గమనించాడు ఆ అమ్మాయి మొహం లో మార్పులని తను ఊహించినంత ఎక్కువగా లేకపోయినా ఆ మొహం లో చిన్న బాధా వీచికని కనిపెట్టగాలిగాడు అది చాలా చిన్నదే అయినా, చాలా తక్కువ సేపే ఉన్నా అతనికి ఆనందం అనిపించింది.

వేద అతను చెప్పింది వింటోంది. అతను చెప్తోన్దేంతో ముందు అర్ధం కాలేదు. అర్ధం కాగానే ముందు ఒక్క క్షణం బాధ అనిపించింది. కానీ అది ఒక్క క్షణమే ఆ భావం రాగానే దాన్ని కోపం అధిగమించింది. అతను చెప్పిన విషయం విని బాధపడినందుకు తనని తాను తిట్టుకుంది "అయినా నేనెందుకు బాధ పడాలి అతని లైఫ్ అతనిష్టం. నేనేం ఇక్కడ శాశ్వతంగా ఉండాలని రాలేదే మరి ఇంకెందుకు బాధపడడం. అంటే నాకు తెలియకుండానే అతని గురించి ఆలోచించడం మొదలుపెట్టానా. ఎక్కడో లోపల నేను కూడా ఇష్టపడుతున్నానా... నో. నేవ్వేర్. అయినా అదెలా సాధ్యం. నన్ను ఇంత బాధ పెట్టిన వాడిని నేను ఇష్టపడడం ఏంటి. అలా జరగదు. మరి అట్లాంటప్పుడు అతను వేరే వాళ్ళని చేసుకుంటే నేనెందుకు బాధపడాలి. అయినా అసలు తను ఎవరితో ఫోన్లో మాట్లాడితే తనకెందుకు, ఏం మాట్లాడితే తనకెందుకు. అసలు ఎందుకు అడిగాను అతన్ని. ఎందుకు తెలుసు కోవాలనుకున్నాను. అయినా మొన్నటిదాకా అక్కని ప్రేమించానన్నాడు, ఆ తరువాత నన్ను ప్రేమించానన్నాడు, మరి ఇప్పుడేంటి ఇలా అంటున్నాడు, నన్ను ఈ ఇంటి కోడలిగా చేసుకుంటా అని నిన్న నే గా ప్రతిజ్ఞ చేసినట్టు చెప్పాడు. మళ్ళి ఈలోపే నిర్ణయం మార్చుకున్నాడా. మార్చుకున్నడా ఏంటి నేను నా నిర్ణయం మార్చుకున్నాను మొర్రో అంటున్నా కూడా ఇంకా నమ్మలేనట్టు ఈ ఆలోచనలేంటి. చ. అయినా ఇవేం ఆలోచనలు . ఇందులో తప్పేమ లేదే అయినా ఇది అతడిష్టం. మరి ఇంకా నేనెందుకు ఆలోచించడం.  అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది. కొంపదీసి నా మనసు అదుపు తప్పుతోందా. అహ అలా జరగడానికి వీలేదు. నేను చాలా జర్తగా ఉండాలి " అనుకుంది 

"ఏంటి ఏం మాట్లాడావ్. ఏమైనా ఆలోచిస్తున్నవా ఏంటి"

ఆ మాటలతో తన ఆలోచనలని ఆపింది.

"అహ ఏం లేదు."

"అయితే చెప్పు మరి నేను చెప్పిందంతా విన్నావు కదా ఏమంటావు నేను చేస్తోంది కరెక్టే కదా"

"ఇది బావుంది నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించుకోవాలి గాని  నన్ను అడుగుతావేంటి?"

"నువ్వు చెప్పింది కూడా కరెక్టే నేనే ఆలోచించుకోవాలి. సరేలే"

ఇంతలో డోర్ బెల్ మోగింది. కైలాష్ వెళ్లి చూసాడు.ఎదురుగా కస్తూరి ఉంది.

"హాయ్"

"హాయ్ రండి. ఎలా ఉంది వేద కి"

"ఫైన్. ఇప్పుడు బానే ఉంది."

"మేలుకునే ఉందా లేకపోతే పడుకుందా?"

"లేదు మేలుకొనే ఉంది రండి"

ఇద్దరు వేద రూం లో కి వెళ్లారు.

"హాయ్ ఎలా ఉన్నావ్"

"హాయ్ బావున్న నువ్వెలా ఉన్నావు"

"బావున్నాను. అబ్బ ఎంత హడాలిగోట్టేసావే. నేనేత భయపడ్డానో తెలుసా నిన్నలా చూడగానే. పాపం ఈయనే దగ్గరుండి చూసుకున్నారు ఈ మూడు రోజులు. కనీసం థాంక్స్ అయినా చెప్పావా?"

"అయ్యో పర్వాలేదు అయినా నేను డాక్టర్ ని నాకు తేలిన వైద్యం చేయడానికి కూడా ఇలాంటి ఫార్మాలిటీస్ ఏంటండి"

"నాకు తెలుసు ఇది చెప్పి ఉండదు దీని బదులు నేనే చెప్తాను మీకు. థాంక్స్. థాంక్స్ అ లాట్"

నవ్వి ఊరుకున్నాడు కైలాష్.

మళ్ళి కస్తూరి అంది అవును ఏంటి ఆంటీ వాళ్ళు ఇంట్లో లేరనుకుంటాను.

"అవును లేరు వొదిన వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాలేదంటే అక్కడికి వెళ్లారు ఎల్లుండి పొద్దున్నకల్లా వచేస్తారు."

"అయ్యో అవున్నా. ఇప్పుడు ఎలా ఉన్నారు."

"పర్వాలేదు బానే ఉన్నారు. మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను" అని చెప్పి బయటకి వెళ్ళాడు కైలాష్.


ఇద్దరు కబుర్లలో పడ్డారు. కస్తూరి పెళ్లి ఏర్పాట్ల గురించి చెప్తోంది. వేద వింటూ ఉండిపోయింది.ఒక గంట వరకు మాట్లాడుకుంటూనే ఉన్నారు. మాట్లాడుతూ ఉండగా చూసింది వేద కాలికున్న కట్టుని. అది చూసి అడిగింది.

"ఏమైంది కాలికి"

"ఏమైంది ఏం కాలేదే"

"ఏం కాకుండానే ఊరికే కాలికి కట్టు కడతారా ఎవరైనా"

"అబ్బా ఏం లేదు గాజు పెంక గుచ్చుకుంది"

"గాజుపెంకా ఎలా గుచ్చుకుంది?". 

"ఎలా గుచ్చుకోవడమేంటే నీ ప్రశ్న ఏడిచినట్టే ఉంది. కిందకి దిగబోయాను ఏదో గాజు వస్తువు పగిలినట్టు ఉంది గుచ్చుకుంది"

"అసలు గాజు వస్తువు ఎలా పగిలింది. నీకు మూడు రోజులనుండి స్పృహ లేదు కదా నిన్న రాత్రే వచ్చింది ఈలోపే గాజు వస్తువు పగలడం నీకు గాజుపెంక గుచ్చుకోవడం ఏంటి నాకేం అర్ధం కావట్లేదు. నీకసలు ఓపికే లేదు కదా నిన్నెవరు బెడ్ దిగమన్నారు. అసలు గాజు వస్తువు ఎలా పగిలింది."

"ఎలా పగిలిందంటే నాకేం తెలుసు. పగిలింది"

ఈలోపు కైలాష్ వచ్చాడు. ఎలాగో కస్తూరి వచ్చింది కదా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు మధ్యలో తనెన్దుకని అలా బయటకి వెళ్ళాడు. ఒక రెండు గంటల వరకు అలా చల్లగాలికి పార్క్లో కూర్చొని వచ్చాడు. ఇందాక చహ్నవి గురించి వేద కి చెప్పినప్పుడు వేద నుండి వచ్చిన రియాక్షన్ అతనికి బాగా నచ్చింది. అతని మనసులో ఆశ చిగురించింది. తన ప్రయత్నం వృధా కాలేదు వేద పాజిటివ్ గా స్పందిస్తోంది. ఆ విషయం అతనికి చాలా ఊరట కలిగిస్తోంది. ఎలాగైనా వేద ని తన దాన్ని చేసుకోవాలి అనే భావం బలపడింది. వేద గురించి ఆలోచిస్తూ కూర్చున్న అతనికి టైం తెలియలేదు. అప్పుడే తను వచ్చి రెండు గంటలు దాటిపోయింది. కస్తూరి ఉందొ లేదో ఇంటికి వెళ్దాం అనుకున్నాడు.

కైలాష్ రాగానే అడిగింది కస్తూరి కైలాష్ ని.

"కైలాష్ గారు మీరసలు వేద చెప్పింది వినండి. అది చెప్పేది ఎంత తలా తోక లేకుండా ఉందొ మీకర్ధం అవుతుంది"

"ఏంటి ఏమైంది"

"ఏమయిందని అడుగుతున్నారా బావుంది. నిన్నటిదాకా ఇది స్పృహ లో లేదు నిన్న రాత్రే కదా అది  స్పృహ లోకి వచ్చింది . మరి ఈలోగా దానికి గాజుపెంక ఎప్పుడు గుచుకుంది. దీన్ని అడిగితే ఏదేదో చెప్తోంది అసలు ఒకదానికొకటి సంబంధం లేకుండా. ఏదో గాజు వస్తువు పగిలిన్దంతుంది. మంచం దిగితే చూసుకోకుండా గాజు పెంక గుచుకున్దంటుంది ఇది చెప్పెదేంతో నాకు ఒక్క ముక్క అర్ధం కావట్లేదు. అసలు గాజు పెంక ఎలా పగిలింది. మీకేమైనా తెలుసా?"

"నాకా భలే వారే. నాకు తెలీదండి. నేను రాత్రి నుండి అదే అడుగుతున్నాను అసలు గాజు పెంక ఎలా పగిలింది అని. పోనీ పగిలితే పగిలింది అసలే తనకి ఓపిక లేదు కదా తనని మంచం ఎవరి దిగమన్నారు అడగండి. మంచం దిగిన్దంతా అది గుచుకున్దంట. నాకు అలాగే చెప్తోంది కానీ నాకేం అర్ధం కావట్లేదు నేను వచేసరికి చూస్తే అసలు కింద పగిలిన గాజు ముక్కలు కూడా లేదు అంతే కాదు కాలికి రక్తం కారుతోంది. అదేంటి ఈ దెబ్బ ఎలా తగిలిందని అడిగితే నాకు కూడా మీకు చెప్పినట్టే చెప్తోంది. మీరే అసలు గట్టిగా అడగండి." అన్నాడు. అతనికి అసలు విషయం తెలిసిన కస్తూరి తో చెప్పలేదు వేద ఏం చెప్తుందా చుద్దమనుకున్నాడు అందుకే తనకి కూడా ఏమి తెలిదనట్టు చెప్పాడు కస్తూరి తో. 

కైలాష్ అలా అనడం తో వేద కి మండిపోయింది. కావాలని కస్తూరి దగ్గర తనని ఇరికించాడు. తనే ఏదో ఒకటి సర్ది చెప్పొచు గా. చాలా తెలివిగా తప్పించుకున్నాడు అనుకుంది.

"ఎంటే ఎం మాట్లాడవు"

"ఎంటిదే"

"చూసారా ఎంత తాపిగా అడుగుతోందో ఇక్కడ నేను ఇంత కంగారు పడుతుంటే."

"అబ్బ ఊరికే కంగారు పడకు నిన్న రాత్రి నాకు స్పృహ వచాక దాహం వేసింది మంచినీళ్ళు తాగుదామని గ్లాస్ తీయబోయాను అది చేయి జారి కింద పడింది. అది గాజు గ్లాస్ అనుకుంట అది పగిలింది. అది అక్కడే ఉంటె ఎవరికైనా గుచుకున్తుందేమో అని నెమ్మదిగా మంచం దిగి తీసేసాను అప్పుడే అది గుచుకుంది కాలిలో"

"ఏంటి అసలు నీకు నిన్న ఒపికేక్కడుంది ఇంత పని చేయడానికి"

"అబ్బ కష్టపడి తెచుకున్న లేవే"

"కైలాష్ గారు మీరేమంటారు తు చెప్పింది నిజమేనా అసలు తనకి అంత ఓపిక ఎలా వచిన్దంటారు"

"అబ్బ ఏదో చిన్న దెబ్బ లేవే వదిలేయి"


"చిన్న దెబ్బ నీకు అలానే ఉంటుంది. కైలాష్ గారు కొంచం మీరు దీన్ని కనిపెట్టుకుని ఉండండి. మనం ఎవ్వరం లేకపోతే ఇలాగే ఏదో ఒక పిచి పని చేస్తుంది"

"అలాగే మీరిప్పుడు చెప్పారుగా ఇంకా నేను ఇక్కడినుండి కదలను సరేనా" అన్నాడు అక్కడ సోఫా మీద కూర్చుంటూ. 

ఆ మాటకి కస్తూరి నవ్వేసింది.

"అబ్బ నువ్వు మరి భయపడుతున్నావ్" అంది వేద.

"అది సరే గాని ఇంద పెళ్లి కార్డు డిజైన్ చూసు చెప్పు ఎలా ఉందో" అంటూ మాట మార్చింది కస్తూరి.

"ఏది ఇటివ్వు. చాలా బావుందే. ఔను మొన్న షాపింగ్ అని లీవ్ పెట్టావు గా ఏమైంది షాపింగ్ అయిపోయిందా"

"హా అన్ని షాపింగ్ అయిపోయాయి ఇంక పెండింగ్ ఏమి లేవు"

"పోనిలే"

అప్పటికే రాత్రి తొమ్మిది అయ్యింది.

"అమ్మో అప్పుడే తొమ్మిది అయ్యింది సరే మరి నేను వెళ్తాను. రేపు కుదిరితే వస్తాను లేకపోతే లేదు. సరేనా"

"సరే బాయ్"

"వస్తానండి" అంది కస్తూరి కైలాష్ తో

"అలాగే"

తను వెళ్ళిపోయాక అడిగాడు కైలాష్ వేద ని

"ఏంటి నిన్న నువ్వు నీళ్ళు తాగుతుంటే గ్లాస్ కింద పది పగిలిందా. ఆహా ఎంత చక్కగా అబద్ధం చెప్పవొ తెలుసా"

"అవును మరి నువ్వు మాత్రం నీకేమి తెలీదని తప్పించుకోలేదు."

"నువ్వే ఏదో ఒకటి చెప్తావు కదా అని ఊరుకున్న"

"చెప్పను కదా"

"ఆ చెప్పావ్ నీ ఫ్రెండ్ కాబట్టి ఏదో నమ్మేసింది లేకపోతే నీ ఓపికకి నువ్వు ఆ గాజుపెంకులు తీసి సర్దడం కూడానా"

"ఏదో ఆ టైం లో అలా తోచింది నువ్వు మాత్రం నేను ఒచెసరికి ఒక్క గాజు పెంక కూడా లేదని చెప్పావ్. మరి ఏం చేయను ఏదో ఒకటి చెప్పాలి కదా"

"అంతే గా మరి"

"సరే కానీ రాత్రి డిన్నర్ కి ఏంటి"

"నాకు వంకాయ కూర, పప్పు, రసం వండి పెట్టు "

"ఏంటి ఇప్పుడా.. నేనా"

"ఔను ఇప్పుడే.. నువ్వే.."

"బావుంది ఇవి చాలా ఇంక ఏమైనా కావాలా "

"ప్రస్తుతానికి చాలు కావాలంటే ఐస్ క్రీం కూడా చేస్తానంటే నీ ఇష్టం నాకేం అభ్యంతరం లేదు"

"ఆ చేసేవాల్లున్దాలే గాని అవన్నీ బానే చేయిన్చుకున్తావ్. ఇప్పటికి అవి తిని అరిగించుకునే శక్తి నీకింకా రాలేదు గాని జావ చేస్తాను తాగు"

"ఏంటది జావ నాకు వొద్దు"

"పోద్దుటినుంది చూస్తున్నా నేనేదైనా చెప్తే వెంటనే వొద్దు అనేయడం నీకు అలవాట ఏంటి"

"అదేం కాదు. నువ్వన్ని నాకిష్టం లేనివే చెప్తావ్"

"మరి సరిగ్గా తిండి తినక జ్వరం ఎవరు తెచుకోమన్నారు"

"అందుకే గా ఇప్పుడు తింటా అని చెప్తున్నా" వేద మాట్లాడుతూ ఉండగానే కైలాష్ జావ చేయడానికి కావాల్సిన వస్తువులు సర్దుతున్నాడు.

"బోర్ కొడుతే చెప్పు హాల్ లో కుర్చోపెదత టి. వి చూస్తూ కుర్చోవాచు"

"ఎం లేదు నాకిక్కడ బానే ఉంది"


"సరే" అనిచెప్పి కైలాష్ జావ చేయడానికి వంటింట్లోకి వెళ్ళాడు.





No comments:

Post a Comment