Wednesday, 15 January 2014

Samveda Part-5

ఇంతలో ఫోన్ మోగింది.  ఫోన్ చేసింది ఎవరో కూడా చూడకుండా ఎత్తి "హలో" అంది. ఆమెలో ఉన్న కోపం చిరాకు అంత ఆ ఒక్క హలో అనే పదం లోనే అర్ధం అయిపోతుంది . ఆ పిలుపు వినగానే అడిగింది కస్తూరి "ఎంటే  అంత కోపం గా ఉన్నావు ఏమైంది?"

"ఓ కస్తూరి నువ్వా ఎం లేదులే చెప్పు"

"ఎం లేదని అంటావెంటే అంత చిరాకులే ఉండి"

"ఎం లేదలే మూడ్ కొంచం పాడయింది అంతే చెప్పు"

"ఏం లేదే మీ పని అమ్మాయి 3 రోజులు సెలవు పెట్టింది గా డిన్నర్ కి ఇక్కడికి వచ్చెసెయ్యి "

"వోద్దె నాకు ఇప్పుడు అంతగా ఆకలి వెయ్యట్లేదు అంత కావాలంటే ఇంట్లో పండ్లు ఉన్నాయి లే ఇవాల్టికి అవి తింటాను ఇప్పుడు రాలేనే సారీ"

"సరే మరి నీ ఇష్టం ఆకలేస్తే మాత్రం వచ్చేసేయ్యి "

"సరే"

"ఓకే మరి బై"

"ఓకే బై"

చ అసలు ఇందాక ఆ అమ్మాయికి ఎదురు పడకుండా ఉంటె పోయేది స్నానం చేసి కొంచం సేపు పైన వెన్నెలలో కూర్చుంటే కొంచం మనసు ప్రశాంతంగా నైన ఉంటుంది అని అనుకుని స్నానం చేయడానికి బాత్రూం కి వెళ్ళింది.


                           కైలాష్ వాళ్ళందరూ భోజనాలు ముగించి బయట కూర్చున్నారు అది వాళ్ళ రోజు దినచర్య సాయత్రం అయ్యేటప్పటికి భోజనాలు ముగించి కొంచం  సేపు వాకిట్లో చల్లగాలికి కూర్చొని కబుర్లు చెప్పుకొని అప్పుడు నిద్ర పోతారు అలానే ఆ రోజు కూడా భోజనాలు అయ్యాక ఆరు బయట కూర్చున్నారు. వాళ్ళు అలా బయటకి వచేటప్పుడు వేద మేడ మీదకి వెళ్లడాని చూసింది చందన అదే విషయం వాళ్ళ అన్నయతో చెప్పింది.

"అన్నయ్య ఇప్పుడే వొదిన మేడ మీదకి వెళ్ళింది"

"ఎప్పుడు ? నువ్వు చూసావా?"

"హ చూసాను అన్నయ్య ఇంతకుముందే వెళ్ళింది"

"సరేలే అమ్మ నేను ఒకసారి మేడ మీదకి వెళ్లి వస్తా" అన్నాడు వాళ్ళ అమ్మతో

"సరే జాగర్త" అంది వాళ్ళ అమ్మ

మేడ మీద దిబ్బప్పై కూర్చొని వెన్నెలని చూస్తూ తన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడాని ప్రయత్నం చేస్తోంది వేద.

ఆమె నైట్ డ్రెస్ లో ఉంది. ఆమెను అలా చూడగానే కైలాష్ కి ఒక్క నిమిషం తన మనసు చెదిరింది అమ్మాయి చాల అందంగా ఉందనిపించింది. ఆ అమ్మాయి పలకరించలనిపించిన్ది కాని పలకరిస్తే ఆ అమ్మాయి రియాక్షన్ ఏంటో తెలుసు ఐన ధైర్యం చేసి "హలో" అన్నాడు.

ఆ పిలుపుకే ఆమె సీరియస్ గా చూసి తల తిప్పుకుంది

"హాయ్ భోజనం ఐందా అని అడిగాడు"

ఆ అమ్మాయి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఐన మళ్ళి అడిగాడు ఈసారి కూడా  అంటే ఆ అమ్మాయి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.ఎం మాట్లాడకుండా కిందకి దిగి వెళ్ళిపోయింది.

తనికి ఎం చేయాలో తోచలేదు ఆ అమ్మాయి వెళ్ళిపోయినా వైపే చూస్తూ నిట్టూర్చాడు. అప్పటికి ఆ అమ్మాయి ఆ ఇంటికి వచ్చి రెండు నెలలు ఐపోయింది ఇంకో పది నెలలు మాత్రమే తను ఇక్కడ ఉంటుంది ఈలోపు ఆ అమ్మాయి కోపం తగ్గకపోతే ఎం చెయ్యాలో అతనికి అర్ధం కావట్లేదు

కైలాష్ కి ఆ అమ్మాయంటే చాల ఇష్టం. అతను ఆ అమ్మాయితో ఒక సంవత్సరం క్రితం చాలా దురుసుగా ప్రవర్తించాడు అప్పుడు తెలియలేదు ఆ అమ్మాయి అమాయకురాలని. చెప్పుడు మాటలు విని ఆ అమ్మాయిని అపార్ధం చేసుకొని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఆ అమ్మాయి గురించి పూర్తిగా  తెలిసాక తన తప్పుని తెలుసుకున్నాడు. తను చేసింది అంత చిన్న తప్పు కాదు క్షమించు అనగానే మాసి పోవడానికి. ఎలాగైనా తనకి క్షమార్పణలు చెప్పి తన వల జరిగిన తప్పుకి ప్రాయశ్చితం చేసుకోవాలనుకున్నాడు. కాని ఆ అమ్మాయి గురించి పూర్థిగ తెలిసాక ఆ అమ్మాయి అంటే నెమ్మదిగా ఇష్టం మొదలైంది. ఆ ఇష్టం ఎప్పుడు ప్రేమగా మారిందో అతనికే తెలియదు. ఇప్పుడు ఆ అమ్మాయి లేకపోతె తన జీవితం లో పెద్ద వెలతి గా అనిపిస్తోంది. ఆ అమ్మాయిని ఎలాగైనా తన జీవితం లోకి తెచ్చుకోవడానికి, ఎలాగైనా ఆ అమ్మాయిని ఒప్పించి ఆ ఇంటి కోడలిగా తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తున్నాడు కాని ఆ అమ్మాయి అతనితో మాట్లాడడానికి కూడా ఇష్ట పడడం లేదు అతనికి ఎం చేయాలో అర్ధం కావట్లేదు అలా ఆ రాత్రి కొంచం సేపు అలోచించి ఎప్పటికో కిందకి వచాడు 

No comments:

Post a Comment