Saturday, 25 June 2011

Samveda Part-I

బంజారా హిల్స్..

అది రెండంతస్తుల మేడ . ఆ ఇంట్లో 8 గంటల సమయంలో సూర్యుడి నుండి వచ్చే కిరణాల వెచ్చని తాకిడికి మంచం మీద పడుకున్న వేద కి మెలుకువ వచ్చింది. మేలుకు వచ్చింది గాని కళ్ళు తెరవడానికి ఇంకా బధకంగా అనిపించి మంచం మీదే ఇంకా అటు ఇటు దొర్లుతూ ఉంది. సరిగ్గా అప్పుడే "ఏ దివిలో విరిసిన పారిజాతమో ..." అంటూ సెల్ మోగడంతో బధకంగా సెల్ ని తీస్కొని లిఫ్ట్ చేసింది.

"హలో.." అంటూ

"హలో ఏంటే ఇంకా నిద్ర లేవలేదా ఆల్రెడీ 8 ఐంది యివాళ 9 కి మీటింగ్ ఉంది మరచిపోయావా?"అంది కస్తూరి

వేద, కస్తూరి మంచి స్నేహితులు. వేద ఆఫీసు లో చేరి 1 సంవత్సరం అవుతోంది, అప్పటి నుండి వేద కస్తూరి పరిచయం పెరిగి స్నేహం గా మారింది. అప్పటినుండి వాళ్ళిద్దరూ ఆఫీసు కి వీలైనప్పుడల్లా కలిసే వెళుతుంటారు. ఎప్పుడైనా పని ఎక్కువ ఉండి గాని లేకపోతె ఇద్దర్లో ఒకరికి పని తొందరగా అయిపోయిన ఎవరికీ వారు విడిగా వాళ్ళ బండి మీద వెళ్ళిపోతారు.

"ఓహ్ అవును కదా సారీ నే మర్చిపోయాను.. ఒక 30 మినిట్స్ లో రెడీ అయిపోతాను నువ్వు ఈలోపు ఇంటికి వచ్చేయి వెళ్ళిపోదాం." అంది
"సరే.. తొందరగా రెడీ అవ్వు నేను ఒక 30 మినిట్స్ లో వస్తాను. బై" అంది
"ఓకే బై"

చెప్పినట్టుగానే ఒక అరగంట లో రెడీ ఐంది వేద. వాళ్ళ ఇంటి నుండి ఆఫీసు కి వెళ్ళాలంటే కనీసం అర గంట పడ్తుంది . అందుకే ఇద్దరు అరగంట కన్నా ముందే బయలు దేరారు ఆఫీసు కి.

2 comments:

  1. Cool... Continue...

    ReplyDelete
  2. Nice to read novel in Telugu
    Thankyou
    Saiarpita

    ReplyDelete