Monday, 10 November 2014

Samveda - 25

జావ తయారు చేసి ఒక గ్లాస్ లో పోసి తీసుకొచ్చి ఇచ్చాడు వేద కి. వేడి వేడి జావ  తాగేసరికి కొంచం ఓపిక వచ్చింది వేద కి.

"వేద ఈ టాబ్లెట్స్ వేసుకొని ఇంకా పడుకో ఇప్పటికే పది దాటింది. ఇంకా ఎక్కువ సేపు మేలుకోవడం మంచిది కాదు." అని వేద వేసుకోవాల్సిన టాబ్లెట్స్, మంచి నీళ్ళు తెచ్చి ఆమెకి ఇచ్చాడు.

వేద ఆ టాబ్లెట్స్ వేసుకుంది మంచి నీళ్ళు తాగేసి కైలాష్ కి ఇచ్చింది. టాబ్లెట్స్ వేసుకోవడం వల్లనో లేక అలసట వల్లనో కాని వేద కి ఒక అరగంట లో గాఢమైన నిద్ర పట్టేసింది. వేద నిద్ర పోయిన తరువాత కైలాష్ డిన్నర్ చేసి అక్కడ సోఫా లో పడుకున్నాడు.

               ఫోన్ రింగ్ అవ్వడంతో కైలాష్ కి మేలుకు వచ్చింది. ఫోన్ తీసి చూసాడు అది ఎక్కడనుండి వస్తోందా అని. ఆ ఫోన్ హాస్పిటల్ వాళ్ళు చేసారు. కైలాష్ ఫోన్ లిఫ్ట్ చేసాడు. రిసెప్షనిస్ట్ మాట్లాడుతోంది ఆ రోజు సాయింత్రం ఎవరో పేషెంట్ ని తీసుకొని వచ్చారంట. పేషెంట్ హార్ట్ కండిషన్ అసలు బాలేదు. రేపు పొద్దున్న దాకా ఆగి రేపు పొద్దున్న కైలాష్ కి ఫోన్ చేద్దామనుకున్నారు గాని పరిస్థితి మరీ విషమించడం తో వెంటనే కైలాష్ కి ఫోన్ చేసారు వెంటనే హాస్పిటల్ కి రమ్మని. కైలాష్ కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు. వేదని ఈ పరిస్థితుల్లో వదిలి వెళ్ళడం కైలాష్ కి ఇష్టం లేదు. అది కాక ఇప్పుడు రాధా వాళ్ళు కూడా ఇంట్లో లేరు తనని చూసుకోవడానికి అందుకే తటపటాయిస్తున్నాడు. రిసెప్షనిస్ట్ ఇంకా లైన్ లోనే ఉంది. "హలో కైలాష్ గారు మీరు వెంటనే హాస్పిటల్ కి రండి. హలో కైలాష్ గారు ఉన్నారా..."

"ఆ హలో.  చెప్పండి"

"మీరు వెంటనే హాస్పిటల్ కి రావాలి"

"సరే మీరు డాక్టర్ శారద కి, రవి కి కూడా ఇన్ఫొర్మ్ చేయండి నేను ఒక అరగంట లో వస్తాను ఈలోపు నర్స్ ని అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పండి. ఇంకో విషయం ఇప్పుడు నైట్ డ్యూటీ చేసే నర్స్ లలో నర్స్ రమ ఉన్నారా?"

"ఉన్నారు డాక్టర్"

"అయితే ఒకసారి పిలవండి నేను మాట్లాడాలి"

"అలాగే" రిసెప్షనిస్ట్ రమ ని పిలిచి ఫోన్ ఇచ్చింది మాట్లాడమని డాక్టర్ కైలాష్ లైన్ లో ఉన్నారని చెప్పింది.

 "హలో డాక్టర్ చెప్పండి"

"రమ మీ హెల్ప్ కావాలి ఒకసారి ఇంటికి రాగలరా నేను మీకు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తాను ఇంటికి రావడానికి.ఇంటికి వచ్చాక వివరాలు మాట్లాడుకుందాం"

"ఓకే డాక్టర్ ఇప్పుడే వస్తాను."

"థాంక్స్" అని చెప్పి కైలాష్ ఫోన్ పెట్టేసాడు.

కిందకి వెళ్లి మొహం కడుక్కొని ఫ్రెష్ అయ్యాడు. ఇంతలో హాస్పిటల్ నుండి మల్లి ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేసి "హలో" అన్నాడు.

"హలో డాక్టర్. డాక్టర్ శారద అవైలబుల్ లో లేరు డాక్టర్ చహ్నవి ఉన్నారు ఇవ్వాళ నైట్ డ్యూటీ లో"

"బట్ చహ్నవి కి అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఐ డోనట్ థింక్ షి కెన్ మేక్ ఇట్. ఇంకెవరైనా డాక్టర్స్ టీం ఉన్నారా . రవి ఉన్నారా అవైలబుల్ లో"

"ఉన్నారు డాక్టర్"

 "ఓకే ఫైన్ అయితే రవి కి చాహ్నవికి ఇంఫోరం చేయండి."

"ఓకే డాక్టర్"

ఇంతలో రమ వచ్చింది ఇంటికి.

"హలో డాక్టర్"

"హాయ్ ప్లీజ్ కం. థాంక్స్ ఫర్ కమింగ్. రండి పైకి వెళ్దాం" అని చెప్పి రమ ని పైకి తీసుకెళ్ళాడు. వేద గురించి చెప్పాడు.

"ఇందాకే టాబ్లెట్స్ ఇచ్చాను. ఇప్పుడప్పుడే నిద్ర లేవదు. మీకేం ప్రాబ్లం ఉండదు. జస్ట్ నేను వొచ్చే వరకు కొంచం చూసుకోండి."

"ష్యూర్ డాక్టర్ నో ప్రాబ్లం"

వేద ని రమ కి అప్పచెప్పి కైలాష్ హాస్పిటల్ కి వెళ్ళాడు. అక్కడ ఆపరేషన్ పూర్తయ్యేసరికి ఉదయం 4 దాటింది . ఆపరేషన్ అయిపోగానే పేషెంట్ బంధువులకి తీసుకోవాల్సిన జాగ్రతలు చెప్పి తన రూం లో కి వచ్చాడు.అప్పటికే ఉదయం 5:30 అయ్యింది. తనతో పాటే చాహ్నవి, రవి కూడా కైలాష్ రూంకి వచ్చారు. కాంపౌన్డర్ కి చెప్పి రవి టీ తెప్పించాడు.టీ తాగేసరికి కొంచం అలసట తీరింది ముగ్గురికి.

"ఓకే ఐ విల్ మాక్ అ మూవ్. ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకుంటే తప్ప కొంచం రిలీఫ్ గా ఉండదు.మళ్ళి ఇవాళ కూడా నైట్ డ్యూటీ ఉంది. విల్ సి యు లేటర్" అని అక్కడనుండి ఇంటికి బయలుదేరాడు రవి.

"డాక్టర్ ఇందాక రమ అంటోంది తను మీ ఇంటికి వెళ్తునట్టు. ఏమైనా ప్రాబ్లం ఉందా?" అంది చాహ్నవి.

"ప్రాబ్లం ఎం లేదు. వేద తెలుసు కదా ఆ రోజు రెస్టారెంట్ లో పరిచయం అయ్యింది"

"హా అవును గుర్తుంది"

"ఆ అమ్మాయికి ఒంట్లో బాలేదు. అయిదు రోజుల నుండి వైరల్ ఫీవర్ ఉంది."

 "ఓహ్ ఇప్పుడెలా ఉంది?"

 నిన్న మార్నింగ్ నుండి కొంచం పర్వాలేదు టెంపరేచర్ తగ్గింది. ఇప్పుడు ఇంట్లో అమ్మ వాళ్ళు కూడా లేరు తనని అసిస్ట్ చేయడానికి. నేను కూడా ఇక్కడికి రావాల్సి వచ్చింది అందుకే రమ ని నేను వచ్చే వరకు ఉండమని చెప్పాను."

"ఓహ్.."

"ఓకే చహ్నవి నేను ఇంటికి వెళ్తాను ఏమైనా అవసరం ఉంటె కాల్ చెయి"

"డాక్టర్ నేను కూడా మీతో రావచ్చా ఒకసారి వేద ని చూసి వెళ్తాను"

"నో ప్రాబ్లం కాని ఇంత పొద్దునే తను ఇంకా నిద్ర లేచి ఉండదు. నువ్వు ఈవెనింగ్ వస్తే చూడడానికి ఉంటుంది"

"పర్వాలేదు డాక్టర్ వేద లేచే వరకు వెయిట్ చేస్తాను  ఈవెనింగ్ కుదరకపొవచు ఈ 3 డేస్ నైట్ డ్యూటీ ఉంది"

"ఓహ్ ఔనా ఓకే రండి వెళ్దాం" అని చెప్పి ఇద్దరు కైలాష్ వాళ్ళ ఇంటికి బయలుదేరారు.

ఇంటికి రాగానే రమ ని అడిగాడు "రాత్రి ఏమైనా లేచిందా"

"లేదు డాక్టర్ రాత్రంతా పడుకునే ఉన్నారు"

"ఓకే శ్రమ అనుకోకుండా వచ్చినందుకు థాంక్స్. ఇంక పర్వాలేదు మీరు వెళ్ళండి నేను ఉంటాను " అని చెప్పి కాబ్ బుక్ చేసాడు.

"ఓకే డాక్టర్" అని చెప్పి రమ కాబ్ రాగానే కాబ్ లో వెళ్ళిపోయింది.

కైలాష్ అన్నాడు చహ్నవి తో

"ఒక 10 మినిట్స్ కూర్చో ఫ్రెష్ అయ్యి వచేస్తాను మీరు ఫ్రెష్ కావాలనుకుంటే బయట ఇంకో వాష్ రూం ఉంది అక్కడ ఫ్రెష్ అవ్వోచు"

"మీరు వచాక వెళ్తాను"

"ఓకే" అన్నాడు. చెప్పినట్టు గానే పది నిమిషాలలో ఫ్రెష్ అయ్యి వచాడు కైలాష్.

కైలాష్ రాగానే చహ్నవి కూడా ఫ్రెష్ అయ్యింది.చహ్నవి కూడా ఫ్రెష్ అయ్యి రాగానే కింద ఇంటికి తాళం వేసి పైకి వెళ్లారు.వెళ్తూ వెళ్తూ పాల ప్యాకెట్ తీసుకొని వెళ్ళాడు.

"రా చహ్నవి. కూర్చో"

"వేద ఎక్కడుంది"

"లోపల బెడ్ రూం లో"

"వెళ్లి చూడోచా"

"హా కాని తన నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా చూడు. నేను ఇప్పుడే వస్తాను" అని చెప్పి లోపల కిచెన్ లో కి వెళ్లి పాలు తీసి కాచాడు. డికాషన్ వేసి ఉంచాడు. రెండు గ్లాస్లలో కాఫీ కలిపి తీసుకొచాడు.

"ఇంద తీసుకో" అన్నాడు.

"అయ్యో మీకెందుకు శ్రమ ఇందాకే టీ తాగంగా"

"పర్వాలేదు లే తీసుకో"

చహ్నవి కాఫీ కప్ అందుకుంటూ అడిగింది "అంత సడన్ గా వైరల్ ఫీవర్ ఎందుకు వచ్చింది"

"అంతకు ముందు రెండు రోజులు అసలు రెస్ట్ లేకుండా పనిచేసింది. డైట్ సరిగ్గా లేదు అందుకే బాగా ఎఫెక్ట్ చేసింది. మూడు రోజులు పట్టింది కోలుకోవడానికి"

"ఇప్పుడు పరవాలేదా?"

"హా ఇప్పుడు పర్వాలేదు కొంచం తగ్గింది" అన్నాడు కైలాష్.

కైలాష్ చెప్పేది వింటూ కాఫీ ఒక సిప్ నోట్లో పెట్టుకుంది. కాఫీ లో చక్కర లేనట్టు ఉంది కాఫీ చేదు గా అనిపించింది. ఆమె మొహం చూసి అడిగాడు కైలాష్ "ఏమైంది కాఫీ బాలేదా?"

"కాఫీలో చక్కర లేదండి"

"ఓహ్ సారీ చూసావా చక్కర వేయడం మరిచిపోయినట్టు ఉన్నాను ఇటివ్వు కలిపి తీసుకొస్తాను"

"మళ్ళి మీకెందుకు శ్రమ పంచదార ఎక్కడుందో చూపించండి నేను కలిపి తీసుకువస్తాను"

"పర్వాలేదు ఇటివ్వు నేను కలుపుకు వస్తాను" అని చెప్పి కాఫీ గ్లాస్ తీసుకొని వెళ్ళాడు.చాహ్నవి కైలాష్ వెళ్ళిన వైపు చూస్తూ కూర్చుంది

ఈలోగా వేద కి మేలుకు వచ్చింది.కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా చహ్నవి కనిపించింది. అక్కడ తన రూం లో చహ్నవి ని చూడగానే వేద ఆశ్చర్య పోయింది.అది కలో నిజమో అర్ధం కాలేదు. "ఈ అమ్మాయి మొన్న కైలాష్ రెస్టారెంట్ లో పరిచయం చేసిన అమ్మాయి కదు. ఆ అమ్మాయేనా లేక ఇంకెవరైనానా లేక నిన్న కైలాష్ చెప్పినదాని వల నాకలా అనిపిస్తోందా.. అనుకోని మళ్ళి కళ్ళు మూసి తెరిచి చూసింది.. తను భ్రమ పడటం లేదు ఆ అమ్మాయే.. మరి తనేంటి ఇక్కడుంది. ఇక్కడికెందుకు వచ్చింది. అసలు ఇక్కడేం చేస్తోంది.కొంపదీసి కైలాష్ తో మాట్లాడడానికి వచ్చిందా? మరీ ఇంత పొద్దునే.. మరీ ఇంత పొద్దునే మాట్లాడాల్సిన అవసరం ఏముంది. కొంచం సేపయ్యాక రావోచు కదా " అనుకుంది.ఎందుకో ఆ అమ్మాయిని అక్కడ అంత పొద్దునే చూడడం వేద కి నచలేదు. అది ఎందుకనేది కూడా వేద కి అర్ధం కాలేదు.

ఇంతలో చహ్నవి చూసింది వేద కి మేలుకు రావడం.

"హాయ్ " అంది.

వేద ఇంక అయోమయం గా చూస్తూనే ఉంది. అయోమయంగా లేచి కూర్చుంది.

"హాయ్ ఏంటలా చూస్తున్నారు నన్ను గుర్తు పట్టలేదా? నేను చహ్నవి ఒకసారి మనం రెస్టారెంట్ లో కలిసాం... గుర్తుందా... మీకు ఒంట్లో బాలేదని కైలాష్ చెప్తే చూసి వెళ్దాం అని వచ్చాను"

వేద కి ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు అలా చూస్తూ ఉండిపోయింది.

ఇంతలో కైలాష్ వచ్చాడు. చాహ్నవి కి కాఫీ కప్ ఇచ్చాడు.
"మాటలు వినిపిస్తున్నాయి ఎవరితో మాట్లాడుతున్నావ్"

"వేద లేచింది" అంది

"ఓహ్ లేచిందా" అని వెనక్కి తిరిగి చూసాడు.

"హాయ్ గుడ్ మార్నింగ్. ఎలా ఉందిప్పుడు"

"ఫైన్ బానే ఉంది."

"తను చాహ్నవి నీకు తెలుసుగా. అదే నిన్న నీకు  చెప్పాను... నీకు బాలేదంటే చూడడానికి వచ్చింది"
వేద భావాలు చూసిన కైలాష్ కి చాలా ఆనందం వేసింది. తను అనుకున్నదానికన్నా వేద రియాక్షన్ చాలా ఎక్కువగా ఉంది. అది చాలు తనకి వేద ని తన వైపు తిప్పుకోవడానికి. చాహ్నవి ని తీసుకొని రావడం మంచిదే అయ్యింది అనుకున్నాడు.

"ఇంత పొద్దునా" అంది ఇంకేం అనాలో తెలియక.

"అదా నిన్న అర్ధరాత్రి హాస్పిటల్ లో ఒక ఇంపార్టెంట్ కేసు వచ్చింది అది అటెండ్ అయ్యాక మాటల మధ్యలో నీకు ఒంట్లో బాలేదని చెప్తే చూడడానికి వచ్చింది. మళ్ళి తనకి రాత్రికి కుదరదు నైట్ డ్యూటీ ఉంది. అందుకని ఇప్పుడే వచ్చింది."

"ఓహ్ హాయ్" అంది వేద  ఆ పలకరింపు చాలా మాములుగా ఉంది.

ఆ విషయం గమనిచాడు కైలాష్

"హాయ్" అంది చాహ్నవి.

ఈలోగా చహ్నవికి ఫోన్ రావడం తో "ఎక్స్క్యూస్ మీ" అని చెప్పి మాట్లాడడానికి బయటకి వెళ్ళింది.

ఇదే మంచి సమయం అనుకున్నాడు కైలాష్. అందుకే అన్నాడు "అదీ కాక నిన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో సంబంధం తెచ్చారంట. పెళ్లి చూపులు ఏర్పాటు చేసారు అది ఆ అమ్మాయికి అసలు ఇష్టం లేదు.అందుకే ఎలాగైనా ఈ సంబంధం తప్పిపోవడానికి ఏమైనా సలహా ఇవ్వమని అడిగితే ఆ విషయం మాట్లాడదామని రమ్మన్నా. ఎందుకంటే తను ఆ విషయం చెప్పినప్పటినుంది చాహ్నవి కి పెళ్లి చుపులంటే నాకు కూడా బాధగానే ఉంది. ఎలాగైనా ఈ సంబంధం తప్పిపోవాలని నేను కోరుకుంటున్నా. అలా అని నా విషయం ఇప్పుడే చెప్పెయలేను ఎందుకంటే నాకు కొంచం టైం కావాలి నీకు రాత్రి చెప్పను కదా. అందుకే ఏదో ఒకటి అలోచిదామని రమన్నా" చెప్పేటప్పుడు కైలాష్ జాగ్రతగా వేద ని ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు.

ఎందుకో తెలిదు కాని అతను చెప్పిన విషయం వింటుంటే వేద కి ఎలాగో అనిపించింది.

ఈలోగా చాహ్నవి వచ్చింది "సారీ మమ్మీ ఫోన్ చేసింది. ఇంకా ఇంటికి రాలేదేంటి నైట్ డ్యూటీ అయిపోలేదా అని. వేద కి ఒంట్లో బాలేదన్న విషయం చెప్పి తనని చూడడానికి వచాను ఒక 2 గంటల్లో ఇంటికి వచేస్తానని చెప్పాను" అంది. 

"ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను" అని చెప్పి వాష్ రూం కి వెళ్ళడానికి లేచింది.

"వేద జాగ్రత హెల్ప్ చేయనా?"

"ఒద్దు. పర్వాలేదు" అంటూ లేవబోయింది.

"చాహ్నవి కొంచం హెల్ప్ చేయి మొన్నతన కాలికి దెబ్బ తగిలింది. కొంచం సాయం పట్టుకో"

చాహ్నవి కాఫీ కప్ అక్కడ టేబుల్ మీద పెట్టి వెళ్లి వేద చేయి పట్టుకొని నడిపించింది.  కాలి నొప్పి తగ్గినట్టు ఉంది అంతగా బాధ పెట్టడం లేదు ఇప్పుడు తన కాలు. నెమ్మదిగా వాష్ రూం కి వెళ్ళింది.

"ఏంటి ఏమైంది తనకి .ఎందుకు ఇలా అయిపోతున్నాను? నిన్ననెగా ఈ విషయం గురించి ఆలోచించకూడదనుకుంది మళ్ళి పొద్దున్న ఆ అమ్మాయిని చూసేసరికి ఎందుకు ఇంత అలజడికి గురి అయ్యాను . ఈ రెండు రోజులోనే ఏమైంది?  దీనికి కారణం ఏంటి? ఇదంతా తను ఆ అమ్మాయిని ఇష్ట పడుతున్నాడు అని చెప్పినందుకా? మొన్నటి దాక అసలు అతని గురించి ఆలోచనే లేదు, అతని పేరు విన్నా కూడా పిచ్చి  కోపం వచ్చేసేది. ఇప్పుడు సడన్ గా ఏమయింది ఈ రెండు రోజులలో. అతన్ని ఇంట్లో చూస్తున్న కూడా అంత అసహ్యం వేయటం లేదు ఎందుకు? అంటే అతని మీద అసహ్యం పోయిందా? కోపం కూడా పోయిందా? ఇంత తొందరగా... అలా ఎలా అతను నన్ను అంత బాధ పెట్టాడు మరి నాకు ఎందుకు అతని మీద అసహ్యం తగ్గింది? అంత బాధ పెట్టిన మనిషి రెండు రోజులు నాకు జ్వరం గా ఉందని నాకు చేసిన సహాయానికి రుణ పడిపోయానా ? లేక అతను నన్ను అపురూపం గా చూడడం నచ్చుతోందా? అసలేం జరుగుతోంది...ఇన్ని రోజులుగా నేను పడిన బాధంతా మర్చిపోయానా? అది అతను రెండు రోజులు తన దగ్గరుండి చూసుకున్నందుకా... నా జీవితంతో ఆడుకున్నవాడిని రెండు రోజుల అతను చేసిన సహాయానికి క్షమించేసానా? అంటే అంత బలహీనమయిందా నా వ్యక్తిత్వం? నాకు చేసిన అన్యాయం సరే మరి అమ్మొమ్మ.. అమ్మొమ్మ విషయం కూడా మరిచిపోయానా? అంత ముసలి వయసులో, బాధ్యతలన్నీ తీరిపోయి ప్రశాంతంగా గడపాల్సిన వయసులో అమ్మ నాన్న చనిపోయారని మా బాధ్యతని నెత్తిన వేసుకొని మమల్ని పెంచినందుకు ఆవిడకి మిగిలింది ఏంటి మనశాంతి లేకపోవడం... ఆమె చివరి దశలో ప్రశాంతంగా జీవించాల్సిన ఆమెను ఆమె ప్రశాంతతకి భంగం కలిగించి అంతలా బాధపడేలా చేసిన వాడిని ఎలా వదిలేయడం... ఇప్పటికి ఆవిడ మనశాంతి కోసం నేనేం చేయలేదు. అతని తొందరపాటుతనానికి, విచాక్షనారహిత పనులకి నేను బాధితురాలినయ్యను.కనీసం అతనెవరో కూడా తెలియని నాకు అంత పెద్ద అన్యాయం చేసి ఆ తరువాత అలా ఏమి పట్టనట్టు నా మట్టుకు నన్ను వదిలేసి వెల్లిపోయినవాడిని, కనీసం తన ఉనికిని కూడా తెలియ పరచనివాడిని నేనింతవరకు ఏమి చేయలేకపోయాను, కనీసం బుద్ధి కూడా చెప్పలేకపోయాను. ఎంతో కష్టపడి జరిగిందంతా మరిచిపోయి నా అంతకు నేను బతుకుతుంటే మల్లి నా లైఫ్ లోకి వచాడు తనంతట తనే అది తనకి కావాల్సిన సహాయం కోసం. అలాంటివాడిని నేను అంత తొందరగా క్షమించేసానా! అతనికి బుద్ధి చెప్పే అవకాశం, అతని మీద తన కోపాన్ని ప్రదర్శించే అవకాశం తను తీసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. తన దారిన జరిగింది మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ బతుకుతుంటే వాళ్ళే తనని వెతుకుంటూ వచ్చారు. వాళ్లకి కావాల్సింది అడిగారు. వాళ్ళకి సహాయం చేయడం ఇష్టం లేకపోయినా తన మనసు మార్చుకొని వాళ్ళు అడిగిన దానికి ఒప్పుకుంది. ఎందుకు అతను చేసిన పనికి అతని జీవితం తో ముడిపడిన తను దాని నుండి తప్పుకోవాలని. కాని తన మనసులో చిన్న కోరిక ఎలాగైనా తనకి బుద్ది చెప్పాలని.. జీవితం విలువ తెలియ చేయాలని అక్కడికి వోచిన కొత్తలో అనుకుంది. కాని దానికి కూడా అతని గురించి ఆలోచించాలి అది తనకి ఇష్టం లేదు ఈ చేస్తున్న సహాయమే చాలా ఎక్కువ ఇంకా అతని గురించి తను అలోచించి తన లైఫ్ లో ఒక్క నిమిషం కూడా వృధా చేయడం ఆమెకి ఇష్టం లేదు. అందుకే మానుకుంది వాళ్ళు ఎలా పోయిన తనకి అనవసరం అనుకుంది. అతని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దల్సింది వాళ్ళ తల్లి దండ్రులు మధ్యలో తనకేం అవసరం అని ఊరుకుంది. తను మాట్లాడకపోయినా అతను, వాళ్ళ కుటుంబ సభ్యులు తన తో పని కల్పించుకుని మాట్లాడుతుంటే మరీ కోపం వచ్చేసేది. మరి అలాంటిది ఇంతలా అతని గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు.  అతను ఎలా పోయినా సరే నా జీవితం లోకి అడుగు పెట్టడానికి మాత్రం నేను ఒప్పుకోను.ముందు నా మనసుని కంట్రోల్ లోకి తెచుకోవాలి.నాకు తెలుసు ఇది ప్రేమ కాదని. కాని ఇంకేదో సానుకూల స్పందన ఏర్పడుతోంది. అది జరగనివ్వకుడదు. ఈ ద్వంద్వ ప్రవర్తి మానుకోవాలి.తన ఆరోగ్యం కుదుటపడితే ఇది సర్దుకుంటుంది. తనకి బాలేదనే కదా అతని సహాయం తీసుకోవాల్సి వస్తోంది. ఇంకా ఇలా జరగకూడదు. తను తన ఆరోగ్య విషయం లో కూడా చాలా జాగ్రతగా ఉండాలి. అప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవదు.అప్పుడు కాని నేను సరిగ్గా అలోచిన్చలేను.  చాలా దృడం గా అనుకున్నాక ఆమె మనసు కుదుటపడింది. "  మొహం కడుక్కొని బయటకి వచ్చి మంచం మీద కూర్చుంది. ఈలోగా కైలాష్ పాలు కలిపి తెచ్చాడు.

"ఇంద తాగు" అన్నాడు పాల గ్లాస్ ఆమె చేతికిస్తూ ఇంకొకసారి చెప్పించుకోకుండా తాగేసింది.

చాహ్నవి అక్కడే కుర్చీ లో కూర్చుంది.చాహ్నవిని వేద తో మాట్లుడుతూ ఉండమని చెప్పి ఇందాక ఆపరేట్ చేసిన పేషెంట్ కి ఎలా ఉందొ కనుకోవడానికి హాస్పిటల్ కి ఫోన్ చేసాడు కైలాష్.

చాహ్నవి వేద తో మామూలు విషయాలు మాట్లాడుతోంది. ముందు ముభావంగా ఉన్న ఆ తరువాత మాములుగానే మాట్లాడింది వేద.ఆ కొద్దిసేపటిలోనే చాహ్నవి మాట తీరు అవి వేద కి బాగా నచ్చాయి. "మంచి అమ్మాయి" అని అనుకోకుండా ఉండలేకపోయింది. కైలాష్ ఫోన్ మాట్లాడి తను కూడా వచ్చి వాళ్ళతో మాటలు కలిపాడు. అప్పుడే 9 దాటింది. చాహ్నవి వచ్చి 3 గంటలయ్యింది. ఇంకా బయలుదేరతానని లేచింది.

"కైలాష్ ఇఫ్ యు డోంట్ మైండ్ కొంచం నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా ప్లీజ్" అని అడిగింది చాహ్నవి.

"బట్ వేద పరిస్థితి" అన్నాడు

"ఇట్స్ ఓకే పర్వాలేదు దింపేసి రండి. ఐ కాన్ మేనేజ్. ఇప్పుడు నాకు చాలా వరకు తగ్గిపోయింది" అంది వేద.

ఒక్కసారి వేద మొహం లోకి చూసాడు కైలాష్. ఆమె అన్న మాటలు నిజంగానే అందా లేక చాహ్నవి దిమ్పమంతోంది కాబట్టి అందా అని కాని తనకి ఏం అర్ధం కాలేదు. అందుకే అన్నాడు వేద తో

"వేద నేను చాహ్నవి ని దింపేసి వస్తాను ఒక అరగంట లో వచేస్తాను జాగ్రత్త ఏదైనా కావాలంటే ఫోన్ చెయ్యి." అని

"సరే" అన్నట్టు తలాడించింది.
అంతలో కైలాష్ కి గుర్తోచింది వేద ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందని. "అవును నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టు ఉంది కదా. మరి ఎలా?"

"అరగంటే కదా పర్వాలేదు. ఇందాకే పాలు తాగాను కాబట్టి ఇప్పుడే ఆకలి లేదు"

"సరే" అని చెప్పి చాహ్నవి ని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు.కైలాష్ వెళ్ళగానే వేద నెమ్మదిగా లేచి డోర్ వేసి వచ్చి పడుకుంది.

                కస్తూరి వేద తో మాట్లాడదామని పొద్దున్న 8 నుండి ఫోన్ ట్రై చేస్తోంది ఎన్ని సార్లు ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ వస్తోంది. కస్తూరికి ఏమయిందో అర్ధం కాలేదు. ఒకసారి వెళ్లి వేద ని చుద్దామనుకుంది. ఇవ్వాళ మధ్యాహ్నం  తను లంచ్ కి వెళ్తోంది అందుకే వేద ని సాయంత్రం కలుద్దామనుకుంది కాని పోద్దుటినుంది వేద ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం తో ఒకసారి వేద ని కలిసి అటునుండి అటు లంచ్ కి వెళ్దాం అనుకుంది. అందుకే పొద్దున్న 10 కాకుండానే ఇంటి నుండి బయలుదేరింది.

           డోర్ బెల్ రింగ్ అవ్వడంతో లేచి వచ్చి తలుపు తీసింది.ఎదురుగా కస్తూరిని చూడంగానే వేద మొహం లోకి నవ్వు వచ్చింది.

"హమయ్య ఇప్పుడు నిన్ను చూసాక ప్రశాంతంగా ఉంది" అంది కస్తూరి

"ఏంటి ఏమైయింది" అంది వేద

"ఏమయిందా నీ ఫోన్ ఏదే? ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్..స్విచ్ ఆఫ్.. స్విచ్ ఆఫ్.. దాంతో భయమేసి నువ్వెలా ఉన్నవో చూద్దామని వచ్చాను."

"ఓహ్ అదా ఫోన్ ని 3 డేస్ వరకు ఛార్జ్ చేయలేదు అది నిన్న స్విచ్ ఆఫ్ అయిపొయింది."

"ఛార్జ్ చేయలేదా ఎందుకు?"

"చార్జర్ ఆఫీసు లో ఉంది అక్కడే మర్చిపోయాను"

"నీకసలు బుద్ధి లేదు చూడు నన్ను ఎంత టెన్షన్ పెట్టావో. సరేలే  నాకు ఆకలేస్తోంది నీకేమయిందో అన్న టెన్షన్ తో టిఫిన్ కూడా తినకుండా వచాను. ఏమైనా ఉన్నాయా ఇంట్లో"

"ఏది నిజం చెప్పు నాకేమైనా అయిందా అని టెన్షన్ తో నా లేకపోతే లంచ్ కి వెళ్తున్నావన్న ఆనందం తోనా"

"అబ్బ అదేమ లేదులేవే "

"ఆ ఆ అనడం లో నే తెలుస్తోంది"

"సరేలే ఆకలేస్తోందే ఏదైనా ఉందా ఇంట్లో"

"పాలు ఉన్నట్టున్నాయి చూడు"

"ఔనా సరే ఉండు ఇప్పుడే వస్తా" అని చెప్పి రెండు గ్లాస్ లలో హార్లిక్స్ కలిపి తీసుకోచింది.

"ఇంద తాగు" అని ఒక గ్లాస్ వేద కి ఇచ్చింది.

"నాకా నేను తాగి ఇంకా 1 గంట   కుడా కాలేదు మళ్ళి ఆ నా వల్ల కాదు"

"అబ్బ ఏం కాదు లే కొంచమెగా తాగు" అని గ్లాస్ వేద కి ఇచ్చింది.

"అవును ఇందాకటినుండి చూస్తున్నా కైలాష్ ఏరి కనిపించడం లేదు. నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్లారు"

"అదేంటి అలా అడుగుతున్నావ్. అతనికి ఇంక వేరే పనులేం ఉండవా?"

"అది కాదే నా ఉద్దేశం మొన్న 5 రోజుల నుండి అతను ఒక్కక్షణం కూడా నిన్ను వదలలేదు. ఎక్కడికి  కదలకుండా నీకు స్పృహ వచేవరకు ఇక్కడే ఉన్నాడు హాస్పిటల్ కి కూడా వెళ్ళలేదు. ఏదో ఇంపార్టెంట్ కేసు వచ్చిందని హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేస్తే ఒక్కసారి వెళ్ళాడు అంతే. నీకు ఒంట్లో బాలేదన్న దానికే అతను బాగా డిస్టర్బ్  అయ్యాడు. పొద్దున్నా రాత్రి కూడా ఇక్కడే ఉన్నాడు.నిజం చెప్తున్నా నీకు సొంత వాళ్ళు ఉన్నా కూడా అంత బాగా చూసుకోరేమో. అందుకే ఇందాకటినుండి కనపడకపోయేసరికి ఎక్కడికి వెళ్ళారా అని అడుగుతున్నా"

"ఇందాక వాళ్ళ హాస్పిటల్ కొలీగ్ ఎవరో ఒక అమ్మాయి నన్ను చూడడానికి వచ్చింది ఆ అమ్మాయిని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు"

"నువ్వు కోపదననంటే నీకో విషయం చెప్తా"

"చెప్పు అందులో కోపడేది ఏముంది"

"అతనికి నువ్వంటే ఇష్టం ఏమోనే. ఎంత డాక్టర్ అయిన ఎంత ఎమర్జెన్సీ కేసు అయిన పేషెంట్ దగ్గర అన్ని రోజులు కదలకుండా ఉండడం చూసావా నువ్వు ఎప్పుడైనా. కాని అతను నిన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు. నాకెందుకో అతనికి నువ్వంటే ఇష్టం ఏమో అని అనిపిస్తోంది. అగొ అలా కోపంగా చూడకు అందుకే ముందే చెప్పా కోపడకూడదని ముందా పాలు తాగు"

"ఒక మాటడుగుతాను చెప్పు నీ మీద ఎంత ఇష్టం లేకపోతే నిన్ను అంత బాగా చూసుకుంటారు చెప్పు."

"ఏమో నాకు తెలీదు"

"అందుకే నేను చెప్పేది విను. నాకెందుకో అలా అనిపిస్తోంది. అతనికి నువ్వంటే ఇష్టమని ఈ అయిదు రోజుల నుండి చూస్తున్నా కదా నా అంచనా తప్పు కాదు. కోపం తగ్గించుకొని ఒకసారి నేను చెప్పింది ఆలోచించి చూడవే నీకే తెలుస్తుంది."

"నాకలా ఏం అనిపించటంలేదు. వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి, అది కాక తను డాక్టర్ కాబట్టి నాకు ఒంట్లో బాగాలేకపోతే కొంచం చూసుకున్నదనిపిస్తోంది అంతే"

"ఒసేయ్ ఎందుకే అబద్ధాలు చెప్తావ్ ఆ కాస్తకే ఇంత చేసాడంటే నేను నమ్మను, నేనే కాదు ఎవ్వరు నమ్మరు. ఆ విషయం నీకు కుడా తెలుసు కాని ఎందుకో నువ్వు దానికి ఒప్పుకోవటం లేదు. దానికి కారణం ఏంటో నీకే తెలియాలి. కాని ఒకటి మాత్రం చెప్పగలను అతనికి నువ్వంటే చాలా ఇష్టం. అది నువ్వు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. నువ్వు ఒకసారి ఆలోచించుకో మళ్ళి"  అంది కస్తూరి

"సరేగాని ముందు ఆ పాలు తాగు" అంది కస్తూరి.

వేద ఆ పాలు తాగేసి గ్లాస్ కస్తూరికి ఇస్తూ అంది "పిచి వాగుడు వాగకు"

"అబ్బా సరేలే నాకు చెప్పాలనిపించింది చెప్పాను తరువాత నీ ఇష్టం ఈ మధ్య నీకు  మరీ ముక్కు మీదే ఉంటుంది కోపం పిలవగానే వచేయడానికి" అంటూ ఆ రెండు గ్లాస్ లు సింక్ లో పడేయడానికి వెళ్ళింది. ఈలోగా డోర్ బెల్ మోగితే వేద లేవబోయింది దిగడానికి.

"ఎందుకే అంత తొందర నేను ఉన్న కదా ఇంట్లోనే నేను తీస్తా కద"

"సరే నువ్వే తీయి"

కస్తూరి వెళ్లి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా కైలాష్ ఉన్నాడు.

"హాయ్ మీరేంటి ఇలా ఇవాళ రారనుకున్నాను" అతనే ముందు పలకరించాడు.

"పోద్దుతినుంది దాని ఫోన్ కి చేసి చేసి అలసిపోయాను ఎన్ని సార్లు చేసిన స్విచ్ ఆఫ్ అనే వస్తోంది ఇంకా ఇలా కాదని అసలేమయిందో కనుక్కుందామని వచాను"

"ఓహ్ రండి అనట్టు టిఫిన్ చేసారా.నేను ఎలాగో వేద కి తీసుకొని వచాను"

"హా ఇందాకే పాలు తాగాను. ఇంక ఇప్పుడెం వద్దు ఎలాగో లంచ్ కి వెళ్తున్నాను గా అక్కడ తింటాను"

"ఓహ్ ఓకే"

"సరే మరి నేను వెళ్తాను మల్లి కలుస్తా" అని కైలాష్ కి వేద కి చెప్పి వెళ్ళిపోయింది.