ఎంగేజ్మెంట్ కి కావాల్సిన చీరలు నగలు తీసుకునేసరికే రాత్రి 9:30 దాటింది. అక్కడ నుంచి హోటల్ కి వెళ్లారు భోజనం చెయ్యడానికి. అది ఒక ఫైవ్ స్టార్ హోటల్ బయటనుండి చూడడానికి ఎంత అందం గా ఉంటుందో లోపలికి అడుగు పెడితే ఇంకా అందం గా ఉంటుంది. ఆ హోటల్ లో స్విమ్మింగ్ పూల్ లాంటిది ఏర్పాటు చేసారు. దాని పక్కనే డిన్నర్ కి టేబుల్స్ వేసారు. ఆ వాతావరణం చుపరులకి చాల ఆహ్లాదాని కలిగిస్తుంది. మనసులో ఉన్న చికాకులు అవి వెంటనే తీరిపోతాయి. ఆ హోటల్ లో నీళ్ళకి దగ్గరలో కుర్చీలో కూర్చున్నారు వేద, కస్తూరి ఇద్దరు. ఆ వాతావరణం చాల ప్రశాంతం గా ఉంది. అప్పటిదాకా షాపింగ్ చేసినందుకు కలిగిన అలసటని తీర్చేసింది.ఇంతలో బేరర్ వచ్చాడు అక్కడికి ఆర్డర్ తీసుకోవడానికి.వాళ్ళకి కావాల్సినవన్నీ ఆర్డర్ ఇచ్చి మాటలలో పడ్డారు. నిశ్చితార్ధం ఆదివారం అయింది. కస్తూరి చెప్పింది వెదకి
"వేద రేపు ఆఫీసు ఐపోయాక అటునుండి ఆటే ఇంటికి వెల్లిపోదాం "
"రేపా. అంట తొందరగా ఎందుకే. నీ నిశ్చితార్ధం ఆదివారం కదా. రేపు శుక్రవారమే. ఎల్లుండికి వస్తాను"
"వోద్దె . రేపే వెల్లిపోదాం నాకు కూడా కొంచం తోడు ఉనట్టు ఉంటుంది.మళ్లీ ఆదివారినికి అన్ని చూసుకోవాలి కదా నువ్వు కూడా ఉంటె కొంచం సాయంగా ఉంటుంది అమ్మ వాళ్ళకి "
"అది కాదే...."
"ఇంకా నువ్వు నాకేం చెప్పకు రేపు వెళ్తున్నాం అంతే. అంతగా కావాలంటే నీ నిస్చితార్ధనికి నేను వారం రోజుల ముందు వస్తానులే." అంది కస్తూరి
ఆ మాట అన్నప్పుడు కస్తూరి వేద మొహం చూడలేదు గాని చూసి ఉంటె ఆ మొహం లో విషాద ఛాయలు కనిపించేవి. వేద ఏమి మాట్లాడకపోవడం తో తిరిగి కస్తూరె అంది
"ఏంటే ఎం మాట్లాడావ్?"
"ఏం లేదులే ఏదో ఆలోచిస్తున్న అంతే. వస్తాలే రేపు సాయంత్రం"
వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే భోజనం వచ్చింది. కస్తూరి బాగా ఆకలి మీద ఉండడం వల తొందరగా తింటోంది కాని ఇందాక కస్తూరి అన్న మాటలతో వేద మనసు చాల బాధ పడింది. భోజనం వచిందన్నమాటే గాని దాని తిన్నలనే ధ్యాస లేదు. ఒక్కసారిగా గతం లోకి వెళ్ళిపోయింది. ఆ రోజు తన ప్రమేయం లేకుండా జరిగిన పెళ్లి మీద తనకి చాల కోపం గా ఉంది. ఆ పని చేసిన కైలాష్ మీద పీకిల దాక కోపం వచ్చింది . "ఛీ ఛీ వాళ్ళకి అసలు బుద్ధి లేదు చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు మాత్రం వొదిన అంటూ, మా ఇంటి కోడలు అంటూ తెగ సతాఇస్తున్నరు. వాళ్ళు తనకి చేసిన అన్యాయం వాళ్ళు మర్చిపోయిన అది తను మర్చిపోగాలదా . అంత పెద్ద తప్పు చేసి ఏమి తెలియనట్టు ప్రవర్తిస్తున్నారు. అదే ఆరోజు వాడు అంత ఆవేశం తెచుకోకపోయి ఉంది తను చేపదలుచుకున్న మాటలు విని ఉంటె ఈరోజు తను కూడా తన పెళ్లి గురించి ఎన్నో కళలు కనేది . తనకి నచిన వాళ్ళని చేసుకునేది అనుకుంది ".
భోజనం తినకుండా ఆలోచిస్తున్న వేదని చూసి అడిగింది కస్తూరి "ఏమైందే ఇంకా మొదలు పెట్టలేదు ఇందాకటి దాక ఆకలేస్తోందన్నావ్ ఇంతలో ఏమైంది"
కస్తూరి పిలుపుతో ఈలోకం లోకి వచ్చింది వేద "ఏమి లేదే"
"తొందరగా తిను ఇప్పటికే 10:30 దాటింది"






