Friday, 4 April 2014

Samveda - 6

ఆ మరుసటి రోజు ఆఫీసు అయిపోయిన వెంటనే వేద, కస్తూరి షాపింగ్ కి వెళ్లారు నిశితార్ధం కి బట్టలు కొనడానికి. అంతకు ముందు రోజే వాళ్ళ అమ్మ వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్లారు మాటలకి. అక్కడే పెట్టుపోతల గురించి, నిశితార్ధం గురించి, పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. నిశితార్ధం ఇంకో పది రోజులలో పెట్టుకున్నారు. నిశితర్ధం అయ్యాక పెళ్ళికి 1 నెల గడువు ఉంది. ఆ రోజు ఆఫీసు లో పని తక్కువ ఉంది అందుకే సాయత్రం 4 గంటలకే బయలు దేరి నిశితార్ధం కి కావాల్సిన బట్టలు అవి కొనడానికి ఆ రోజు షాపింగ్ కి వెళ్లారు. ఆ రోజు బట్టల షాపింగ్ అయిపోతే శని ఆదివారాలలో బంగారం కొందామని అనుకుంది కస్తూరి. కస్తూరికి 3 చీరలు తీస్కుంది. వేద కూడా ఒక గాగ్ర తీసుకుంది నిశితార్ధం రోజుకి. అది చూసి అంది కస్తూరి "గాగ్ర ఏంటే ఏదన్న మంచి చీర తీసుకో"

"వోద్దె నాకు ఈ ఎరుపు రంగు గాగ్ర బాగా నచ్చింది"

"నీకు ఆ రంగు బ్బగా నప్పుతుంది కాని ఆ రోజుకి చీర కట్టుకోవే"

"అమ్మో చీరె వోద్దె అసలే మనకి కట్టుకోడం రాదు, పైగా అది అంట కంఫర్ట్ గ ఉండదు నీ పెళ్ళికి చూద్దాం లే"

"చూద్దాం కాదు పెళ్ళికి తప్పకుండ చీరె కట్టాలి అప్పుడు ఇల్లాంటి కుంటి సాకులు చెప్పకు"

"అలాగేలే"

                          కైలాష్ శైలేష్ ఇంటికి వచేసరికి 7 అయింది. ఆ రోజు చందన వి బి.టెక్ ఆఖరి సంవత్సరం రిజల్ట్స్ వచ్చాయి. ఇంటికి వచ్చిన వెంటనే అడిగాడి కైలాష్ చెల్లిని

"చందన ఇవ్వాళా రిజల్ట్స్ వచ్చాయి గా ఎంతోచింది"

"ఫస్ట్ క్లాసు వచ్చింది అన్నయ."

"నిజంగానా. కంగ్రాట్స్"

"థాంక్స్ రా అన్నయ్యలు . అమ్మ అందరి కోసం పాయసం చేసింది."

ఇంతలో రాధా వచ్చింది అక్కడికి.

"ఏ రా ఇప్పుడే వచ్చావా?"

"ఔనమ్మ. రిజల్ట్స్ వచ్చాయి కదా"

"ఔను రా అది ఫస్ట్ క్లాసు లో పాస్ ఐంది అందుకే ఇవ్వాళా పాయసం చేశాను కాళ్ళు కడుక్కొని రండి భోంచేద్దాం"

"అలాగే"

అందరి భోజనాలు అయ్యేసరికి తొమ్మిది అయ్యింది . రాధా , హంస వంటిల్లు సర్ది ఆరు బయటకి వచేసరికి అందరు కుర్చీలు వేసుకొని కూర్చుని చందన భవిషత్తు గురించి మాట్లాడుకుంటున్నారు.

కైలాష్ అన్నాడు "ఇప్పుడు ఎం చేద్దాం అనుకుంటున్నావ్ చందన. పి . జి . కి కడతావా లేకపోతె ఏదైనా జాబు చేస్తావా?"

"జాబు చేద్దామనుకుంటున్న అన్నయ్య. ఒక సంవత్సరం జాబు చేసి ఆ తరువాత పి.జి. కి కదదామనుకుంటున్న"

"ఆ ఆలోచన కూడా బాగానే ఉంది రా. ఈలోగా దానికి కూడా కొచం ఆత్మా స్తైర్యం వస్తుంది. అల నలుగురి లోకి కలిసి వెళుతుంటే." అంది రాధా

"సరే ఐతే నేను నా ఫ్రెండ్స్ ని అడిగి చూస్తాను" అన్నారు కైలాష్, శైలేష్ ఇద్దరు.

"సరే ఇప్పటికే పది దాటింది వెళ్లి పడుకోండి అందరు మళ్ళి పొద్దునే లేవాలి" అంది రాధా.


అందరు లేచి వెళ్తూ ఉండగా కైలాష్ ఒక్కసారి పై గదిలోకి చూసాడు ఆ గదిలో ఇంకా ఇప్పటిదాకా లైట్ వెలగలేదు అదే అన్నాడు రాధా తో


"అమ్మ ఇందాకటి నుంచి చూస్తున్న వేద గదిలో ఇంకా లైట్ వెలగలేదు తను ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్లిందో అర్ధం కావట్లేదు"


"అదేంట్ర ఇంకా అమ్మాయి రాలేదా పది దాటింది గా అప్పుడే"


"అదే నాకు అర్ధం కావట్లేదమ్మ"


"ఒకసారి తనకి ఫోన్ చెయ్యి"


"వొదిన ఫోన్ నెంబర్ మన దగ్గర లేదు కాదమ్మా అంది చందన

 "ఔను కదా ఆ విషయమే మర్చిపోయాను. ఆ అమ్మాయి తో పాటు ఎప్పుడు ఇంకో అమ్మాయి ఉంటుందే ఆ అమ్మాయి నెంబర్ ఐన తెలుసా"

"లేదమ్మా తెలిదు"


"ఇప్పుడెల రా అమ్మాయి ఎక్కడుందో ఎలా తెలుస్తుంది. ఎవ్వరిని అడగడానికి కూడా లేదు ఎక్కడికి వెళ్ళింది?"


"అదే అర్ధం కావట్లేదు. రెండు నెలలనుంచి ఎప్పుడు ఇలా జరగలేదు" అన్నాడు కైలాష్